నా ప్రియమైన స్నేహితులారా, నేడు దేవుడు మనతో కూడా ఉండి మన పట్ల అద్భుతకార్యములను జరిగించుచున్నాడు. కనుకనే, మీరు విచారించకండి. ఆయన మాటలైన వాక్యమును మాత్రమే వినాలి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 18:10వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును'' అని చెప్పబడిన ప్రకారము మనతో కూడా ఉన్న దేవుని నామం ఒక బలమైన దుర్గం, స్నేహితులారా. ఆయన ఒక సురక్షితమైన దుర్గముగా ఉన్నాడు. అనగా, అది ఎంత పటిష్టంగా సురక్షితంగా ఉందంటే, ఎవరూ దానిలోకి ప్రవేశింపలేరు. ఆలాగుననే, నీతిమంతులు ఆయన నామములో సురక్షితంగా ఉంటారు. బేస్‌బాల్‌లో గానీ, క్రికెట్‌లో గానీ, క్రీడాకారులు బ్యాటర్ గీతను చేరుకున్నప్పుడు వారు సురక్షితంగా ఉండెదరు. ఆ విధంగానే, మనం కూడా ప్రభువు యొద్దకు పరుగెత్తుదాము.
నా ప్రియులారా, ప్రతిరోజు, దేవుని యొక్క అత్యంత శక్తివంతమైన ఒక సేవకుడు ఒక సమావేశాన్ని నిర్వహించుచుండెను. కానీ, ఆ కూటము ప్రారంభము కాగానే, భారీ వర్షం కురవడం మొదలైంది; అది అస్సలు ఆగలే దు. అయినప్పటికి, ప్రజలందరూ ఆ సమావేశంలోనే ఇంకా కూర్చుని ఉన్నారని చూసి, ఆ దేవుని సేవకుడు ఆశ్చర్యపోయాడు. గుడారం చాటున, వారు ఒక మూలన నిలువబడి దేవుని మాటలను వింటున్నారు. కొందరు ఒక బ్యానర్‌ను తీసుకుని వారిపై కప్పుకున్నారు, అలాగున వారు దేవుని వాక్యమును వింటున్నారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికిని, ప్రజలు దేవుని వాక్యమును స్వీకరించిన తీరు ఎంతో అద్భుతముగా ఉండియున్నది కదా! కనుకనే, నా ప్రియులారా, ప్రతిరోజు, మనం కూడా దేవుని వాక్యమును అలవర్చుకోవాల్సిన విధానము కూడా అదియే. అదే మనకు బలమైన, సురక్షితమైన దుర్గంగా ఉంటుంది.
నా ప్రియులారా, నీతిమంతులు దేవుని వాక్యం వైపు పరుగెత్తుతారు, మరియు ఆ వాక్యం మన జీవితములలో శక్తివంతంగా పనిచేయుచున్నది. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవుడు మన జీవితాలను కాపాడుతాడు. ఆయన కీడు నుండి మనలను కాపాడి సంరక్షించుచున్నాడు. కాబట్టి, స్నేహితులారా, మనము అనుదినము దేవుని వాక్యం వైపు పరుగెత్తాలి. అంతమాత్రమే కాదు, ప్రతిరోజు దాని సొంత కష్టాలను తీసుకువస్తుంది; అయితే, దేవుని వాక్యం ద్వారా, ఆ రోజుకు సంబంధించిన దేవుని నూతన వాత్సల్యతలు మన మీదికి వచ్చి, మన ప్రాణాలను సురక్షితంగా కాపాడతాయి. నా ప్రియులారా, మరియు మీకు మీరుగానే, దేవుని ఆత్మతో నింపబడినట్లు అనుభూతి చెందుతారు. దేవుడు అటువంటి కృపను మీకు అనుగ్రహించి, నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవే మా బలమైన కోటవు గనుక మేము నీ వద్దకు పరుగెత్తుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా యొక్క ప్రతి భయానకమైన మరియు బాధాకరమైన పరిస్థితిలో, మాకు ఆశ్రయంగా మరియు సురక్షితముగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి ప్రతిరోజు నీ వాక్యమును వెదకడానికి మాకు సహాయం చేయుము. యేసయ్య, నీ దివ్య సన్నిధితో మరియు నీ శాంతి సమాధానముతో మమ్మును నింపుము. ప్రభువా, సమస్త కీడు నుండియు మరియు ప్రమాదముల నుండియు మమ్మును భద్రంగా కాపాడుము. దేవా, నీ నామము మాకు ఒక బలమైన దుర్గముగాను మరియు ఆశ్రయముగాను ఉండునట్లుగా చేయుము. ప్రభువా, నిన్ను సంపూర్ణంగా విశ్వసించడం మాకు నేర్పించి, నీ బలమైన చేతి క్రింద మమ్మును సురక్షితంగా ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


