నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 44:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, " నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేనాశీర్వదించెదను'' అని చెప్పబడినట్లుగానే, దేవుని మన తరతరములను కలిగియుండడము మనకు ఎంత గొప్ప ఆశీర్వాదకరము కదా! అందుకే బైబిల్‌లో మనము చూచినట్లయితే, " అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పెను '' అని చెప్పబడిన రీతిగానే, తరతరములన్నిటిని ఆశీర్వదించాలని ప్రభువు మీ పట్ల ఆశించుచున్నాడు. ప్రభువు మన మీద మరియు మన తరముల తన పరిశుద్ధాత్మను ఉంచి, మనలను దీవిస్తాడు. అందుకొరకు మనము దేవుని కొరకు ఆశ కలిగియున్నాడు. కీర్తనకారుడైన దావీదు భక్తుడు ఆ విధంగానే ఆశ గొనియున్నాడు. ఆలాగుననే, బైబిల్ నుండి కీర్తనలు 42:1వ వచనమును చూచినట్లయితే, "దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, అరణ్యములో దుప్పి నీటి కొరకు అటుఇటు పరుగెడుతూ వెళ్లుతుంది. నీళ్ల కొరకు దప్పికగొని, ఎంతగానో ఆశించుచున్నది. అదేవిధముగా, 'ప్రభువా, నీ మాకు కావాలి,' మనము కూడా ఆయన కొరకు వెదకాలి. మనము దేవుని కొరకు అటువంటి దప్పికను కలిగియుండాలి. అందుకే బైబిల్‌లో మనము చూచినట్లయితే, " నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడు దురు'' అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కనుకనే, మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగియుండవలెనని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు.
అందుకే బైబిల్ నుండి యోహాను 4:14వ వచనమును చూచినట్లయితే, " నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను'' ప్రకారముగా ప్రభువు మనకు సమృద్ధినివ్వాలని మన పట్ల వాంఛకలిగియున్నాడు. దేవుడు అబ్రాహామును చూచి, "నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు'' అని ఆయన అతనిని ఆశీర్వదించియున్నాడు. మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే, మనము పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలని ప్రభువు మన పట్ల కోరుకుంటున్నాడు. అందుకే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ Äౌవనులు దర్శనములు చూతురు.'' మీ మీద మాత్రమే కాదు, ఆ దినములలో నేను పని వారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును'' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నీటి కాలువలు ఊటలు మన యొక్క తరతరములు కూడా ప్రవహిస్తూనే ఉంటాయి. అవి చిన్న ధారలు కాదుగానీ, జీవమునిచ్చు నీటి ఊటలు ప్రవహిస్తాయి. అవి ఎల్లప్పుడు ఉబుకుచుండు నీటి వలె ప్రవహిస్తూ ఉంటాయి.
మొదటగా దేవుడు నా భర్తగారి యొక్క తల్లిదండ్రులను నింపియున్నాడు. ఆ తర్వాత నా భర్తగారు పరిశుద్ధాత్మను పొందుకొనియున్నారు. వారిని చూస్తూ, నేను కూడా నా హృదయములో ఒక గొప్ప ఆశతో పరిశుద్ధాత్మను కోరియున్నాను. నా ప్రార్థనలకు జవాబుగా, నన్ను కూడ పరిశుద్ధాత్మతో నింపియున్నాడు. నా తర్వాత, మా బిడ్డలైన, శ్యామ్, షారోన్, స్వీటీ కూడా ప్రభువు యొక్క దీవెన కొరకు వారు మొఱ్ఱపెట్టియున్నారు. ఈ రోజు వారు దీవెనకరముగా ఉన్నారు. అది ఇంకను కొనసాగుతూనే ఉన్నది. ప్రభువు మా యొక్క ముగ్గురు మనవరాళ్లు, మనవడిని కూడా దీవించియున్నాడు. ఈ రోజు వారిపైన మరి ఎక్కువైన దేవుని కృపను చూడగలుగుచున్నాను. తల్లిదండ్రులైన మనము దేవుని కొరకు ఆశ కలిగియున్నప్పుడు మనతో పాటు ప్రభువు మన పిల్లల పిల్లలను ఆశీర్వదిస్తాడు. అంతమాత్రమే కాదు, మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా మారుతాము. మా చిన్న కుమార్తెయైన స్వీటీ టి.వి. చిన్న పిల్లల కధలను చెబుతూ ఉన్నప్పుడు, ఒక ముసలావిడ ఈ విధంగా చెప్పారు. చిన్న కుమార్తె కనబడగానే, నాకు ఎంతో సంతోషము కలుగుతుంది అని ఆమె చెప్పెను. అవును, మన పిల్లలు అటువంటి ఆశీర్వాదమును కలిగియుంటారు. మన పిల్లలు కూడా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అవును, ప్రభువు ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాడు మరియు మన సంతతి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. మనకు పుట్టినవారిని ప్రభువు ఆశీర్వదిస్తాడు. ఇది ఎంత గొప్ప దీవెన కదా! ప్రభువు మన జీవితములో కూడా ఆశీర్వాదములన్నిటి కూడా ఎంతో ధారళముగా కుమ్మరించు దేవుడై యున్నాడు. మన సంతతిని, మన బిడ్డలను ఆశీర్వదించినట్లయితే, మన జీవితములో మరి ఎక్కువగా సంతోషిస్తాము అని ప్రభువుకు తెలుసు. కనుకనే, మన జీవితములో మనము కలిగియుండు తృప్తి మన పిల్లల దీవెనలు కదా, ఈ రోజు ప్రభువు యొక్క కృప మరియు దీవెనలు మీ పిల్లలపైన మరియు మీపైన, ఇంకను మీ సంతతి మీద కూడా దిగివచ్చును గాక. నేటి వాగ్దానము నుండి ప్రభువు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నీ వాక్యము చొప్పుననే, మేము నీ కొరకు ఆశకొనియుండగా, ప్రవాహ జలములు మా మీద కుమ్మరించునట్లుగా చేయుము, మా గిన్నె నిండి పొంగిపొర్లునట్లుగా చేయుము. దేవా, మా సంతతి మరియు పిల్లల మీద కూడా పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, మా తరతరముల మీద పొంగిపొర్లునట్లుగా చేయుము. ప్రభువా, నీ ఆశీర్వాదములు తరము వెంబడి తరములు కొనసాగునట్లుగా చేయుము. దేవా, మేము మునుపటికంటే, మేము వర్థిల్లునట్లుగా చేయము. ప్రభువా, ఈ నీ పట్ల మాలో ఎన్నటికిని, తరగని తీవ్రమైన దాహాన్ని కలిగించుము. దేవా, నీటి వాగుల కొరకు దుప్పి ఎలా ఆశపడుతుందో, అలాగే మా ఆత్మ నీ కొరకు ఆశపడునట్లుగా చేయుము. దేవా, నీ సన్నిధితో మేము పొంగిపొర్లునంత వరకు నీ పరిశుద్ధాత్మతో మమ్మును మరియు మా కుటుంబమంతటిని నింపుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి ఎండిన దేశములో నీ జీవజలాన్ని కుమ్మరించుము. దేవా, నీ ఆశీర్వాదాలు మా ద్వారా మరియు మా పిల్లలకు మరియు తరతరాలకు ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, నీ మహిమను ప్రతిబింబించే, నీటితో సమృద్ధిగా ఉన్న తోటగా మా జీవితాన్ని మార్చుము. ప్రభువా, నీ యొక్క సమృద్ధి మరియు కృప మా కుటుంబంపై నిలిచియుండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


