నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 22:9వ వచనమును మనము ధ్యానించకుందాము. ఈ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఆ వచనము, " దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అట్టివాడు దీవెననొందును'' అని చెప్పబడినట్లుగానే, ఔదార్యముగలవారిని ప్రేమించు దేవుడు నేడు మిమ్మును కూడ ఆశీర్వదించును. కాబట్టి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు కొనసాగండి!

నా ప్రియులారా, ఈ రోజు ప్రపంచం మొత్తం లాభాలు మరియు రాబడుల గురించి ప్రయత్నించుచున్నారు. అనేకమంది అనేక విషయాల కొరకు పెట్టుబడి వెచ్చిస్తుంటారు. ప్రజలు ఎక్కువ సమయం పరిశోధన చేస్తూ, గరిష్ట లాభాలు పొందేందుకు పెట్టుబడి పెట్టగల వివిధ అవకాశాలను వెదకుచున్నారు. 'నేను ఇక్కడ పెట్టుబడి పెట్టినట్లయితే, జీవితాంతం రాబడులు పొందగలను మరియు మంచి ప్రతిఫలములు వస్తాయి' అని భావిస్తుంటారు. లేదా నేను ఈ స్థలములో నా ధనమును భద్రము చేసుకున్నట్లయితే, దానిని భవిష్యత్ ప్రణాళిక కొరకు నేను వినియోగించుకొనవచ్చును అని ఇలాగున ఈ జాబితా కొనసాగుతూనే ఉంటుంది. అయితే, ఎవరికైన పేదలకు ఇవ్వడములో మంచి ఏమి జరుగుతుంది? ఆ విధంగా పెట్టుబడి పెట్టినట్లయితే, నాకు ప్రయోజనము ఏముంటుంది? అని భావిస్తారు. మరియు అవసరమైన వారికి లేదా దేవుని పరిచర్యకు ఇచ్చి పెట్టుబడి పెట్టినప్పుడు, నాకు ఏమి ప్రయోజనము? అందును బట్టి నాకు ఎటువంటి ప్రతిఫలము తిరిగి రాదు కదా! తద్వారా, నా ధనమంతయు తరిగిపోతుందని భావించి ప్రజలు వెనుకంజ వేయుచున్నారు. దేనికి ప్రయోజనము లేని దానికి నేను ఎందుకు నా ధనముంతయు పారవేయాలి అని అనుకుంటుండవచ్చును. కానీ నా స్నేహితులారా, మీరు మీ సమయమంతటిని మరొకరి దీవెన కొరకై సమర్పించియున్నారు. మీ కార్యాలయంలో కష్టపడి పని చేసినను కూడా, ఒక వ్యవస్థను, లేక ఒక సంస్థను నడిపించుచున్నప్పటికిని కూడా, ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు మీ సమయాన్ని కేటాయించి ఉండవచ్చును. బహుశా! మీరు విద్యార్థిగా ఉండవచ్చును, కానీ ఎవరికైనా సహాయం చేయడానికి మీరు మీ మిగిలిన సమయాన్ని మరొకరికి దీవెనకరముగా ఉండుట కొరకు వెచ్చించి ఉండవచ్చును. వారి ఆశీర్వాదము కొరకు మీ సమయాన్ని గడిపి ఉండవచ్చును. మీరు యేసును గురించి ఎవరితోనైనా పంచుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించి ఉండవచ్చును. మీరు ఇతరులకు ఇచ్చుటలో దాతృత్వముగలవారుగా ఉండవచ్చును! దాతృత్వము మరియు దయాదృష్టికలిగియున్నప్పటికిని ఏ ఫలితము ఉండదని కొందరు భావిస్తుంటారు. కానీ, దాతృత్వము మరియు దయాదృష్టికలిగియున్నవారు మనము వెచ్చించిన సమయం మరియు వనరులన్నియు వ్యర్థము అని ఈ లోకములోని ప్రజలు భావించుచుండవచ్చును. కానీ, ఇతరుల కొరకు మనము సేవ చేయుచున్నాము కనుకనే, "దాతృత్వము మరియు దయాదృష్టికలిగియున్నవారు దైవాశీర్వాదములను పొందుకుంటారు!'' ఆ యొక్క ప్రతిఫలములు లోకమిచ్చు వాటన్నిటికంటె మరి అత్యధికముగా ఉంటుంది.

మా కుటుంబ సమేతంగా మేము దానిని అనుభూతి చెందియున్నాము. మా కుటుంబ సభ్యులందరు కూడా ప్రజల పట్ల దయాదృష్టి కలిగియుండడము ఎలాగునని విభిన్నముగా చూపించియున్నారు. తద్వారా, ఈ తరమునకు దైవాశీర్వాదములను మా జీవితములో మేము అనుభూతి చెందగలుగుచున్నాము. దయాదృష్టిగలవారు స్వయముగా ఆశీర్వదింపబడతారు. అందుచేతనే యేసు ఒక యజమానుడు తన దాసులకు విభిన్న దశలలో తన ధనమును ఇచ్చిన కథను తెలియజేశాడు. (పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్పగించెను. అతడు ఒకనికి అయిదు తలాంతులను ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను. అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపాదించెను. ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను. అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు ఇచ్చెను. ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చి అయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియు గాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను. 'అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను.' తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి- అయ్యా, నీవు ఇచ్చినది తిరిగి తీసికొనుమని చెప్పెను. ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవానికియ్యుడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసి వేయబడునని చెప్పెను. కానీ, ఆ యొక్క యజమానుడు అయితే, ఏ దాసుడు తాను ఇచ్చిన మొత్తమును రెట్టింపు చేసుకొని తీసుకొని వచ్చియున్నాడో, ఆ దాసుని ఎంతగానో ప్రేమించినట్లుగా మనము చూడగలము. ఏ పని చేయకుండా తన ధనమును తీసుకొని వచ్చి, తిరిగి ఇచ్చిన దాసుని యొద్ద నుండి రెట్టింపు చేసిన దాసునికి ఇచ్చినట్లుగా మనము చూచుచున్నాము. 'నీవు నేనిచ్చినదానిలో కొంచెములోనే నీవు నమ్మకముగా ఉన్నావు గనుకనే, అనేకమైనవాటి మీద నిన్ను సమృద్ధిగలవానిగా చేయుదునని' బహుమానమిచ్చెను. మరి ఇంకా ఎక్కువ హెచ్చిస్తాను అని తెలియజేసెను. తద్వారా మీరు నాకు ఆశీర్వాదకరముగా ఉన్నారని వారికి తగిన బహుమానమిచ్చాడు. ఆలాగే, నా ప్రియ స్నేహితులారా, మీరు దయాదృష్టిగలవారుగా ఉంటూ, మరి ఎక్కువ మందికి దీవెనకరముగా ఉండు నిమిత్తము మరి ఎక్కువగా మీ సమయం, ఆర్థికంగాను మరియు తలాంతులను ఉపయోగించుటలో దాతృత్వముగలవారై ఉన్నారని మరియు ఇతరుల ఆశీర్వాదం కొరకు వాటిని వినియోగించియున్నారని ప్రభువునకు తెలుసు. కాబట్టి, మీరు ప్రభువు దృష్టిలో నమ్మకమైనవారుగాను మరియు మేలు చేసియున్నారు! కనుకనే, మీరు ఇతరులకు లేక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మరియు తరతరాల కు ప్రతిఫలంగా ఆయన దాతృత్వమును కలిగియున్న ఆశీర్వాదములను అనుభవించడానికి ఆయన మిమ్మును ఉన్నతంగా పైకి లేవనెత్తుతాడు. కాబట్టి, ధైర్యంగా ఉండండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీ దృష్టిలో దాతృత్వము కలిగి యుండాలనే ప్రాముఖ్యతను మాకు బోధించినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మమ్మును ఆశీర్వదించడానికి నీ దృష్టిని మా వైపు త్రిప్పినందుకు మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము ప్రార్థించుచున్నప్పుడు కూడా, మా ద్వారా ఎటువంటి ప్రతిఫలాన్ని లెక్కించకుండా ఉచితంగా మరియు ఉత్సాహముగా ఇచ్చువారి యొక్క దాతృత్వముగల మనస్సును మాకు అనుగ్రహించుము. దేవా, దరిద్రులకు మరియు నిరుపేదలకు మరియు నీ పరిచర్యకు ధారాళంగా ఇవ్వడానికి మరియు ఎటువంటి ఆటంకము రాకుండా మాకు దయాదృష్టిగల హృదయాన్ని దయచేయుము. దేవా, భూమ్యాకాశములను సృష్టించిన నీ యొద్ద నుండి మాకు ప్రతిఫలమును వస్తుందని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మేము దయాదృష్టిని కలిగి ఉండటానికి మమ్మును మేము నీకు చేతులకు సమర్పించుకుంటున్నాము. ప్రభువా, మమ్మును మరియు మా కుటుంబాన్ని మేము ఊహించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదిస్తావని నమ్ముచున్నాము. ప్రభువా, నీ దాతృత్వము ద్వారా మేము ఎటువంటి ప్రతిఫలమును ఆశించకుండా, మా సమయమును మరియు మాకు కలిగిన దానిని నీకును మరియు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా ఇచ్చుటకు మాకు సహాయము చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.