హలో నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 రాజులు 3:14వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను...'' అని చెప్పబడినట్లుగానే, మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ప్రభువు మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, ఒకవేళ మీరు, 'ప్రభువా, అనేక సంవత్సరములుగా నీకు విధేయత చూపుచున్నాను,' అని మీలో అనేకులు ఈ రోజు అనుకుంటుండవచ్చును. ఇంకను, 'నీవు సెలవిచ్చిన వాటన్నిటిని నేను విధేయతను చూపియున్నాను. కానీ, నాకు ఎటువంటి ఆశీర్వాదము కూడా లేదు' అని అంటున్నారా? అయితే, దిగులుపడకండి, నేడు మీకు గొప్ప ఆశీర్వాదములను ఇస్తాను అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆ ఆశీర్వాదమేమనగా, 'మిమ్మును దీర్ఘాయుష్మంతులను దీవిస్తాను' అని అంటున్నాడు. నా ప్రియ స్నేహితులారా, మనము ఈ వాగ్దానమును విశ్వసించి పొందుకుందాము.
నా ప్రియులారా, ఈ దీర్ఘాయువు ఎందుకు ప్రాముఖ్యమైనది? మన చుట్టు ఉన్నవారికి మనము కూడా దీవెనకరముగా ఉండడానికి ఈ దీవెన ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. మా ప్రియ బామ్మగారైన సహోదరి స్టెల్లా దినకరన్‌గారిని గురించి మీకందరికి తెలుసు కదా! మేము ఎప్పుడు కూడా తనను చూడడానికి వెళ్లినప్పటికిని, తన బైబిల్ గ్రంథమును తెరచి ఉంటారు, ఇంకను దేవుని వాక్యమును చదువుచూ, ఏదో వ్రాస్తూ వుంటూ ఉంటారు. ఈ రోజుకు కూడా మా బామ్మగారు ఆలాగుననే ఉంటారు. వర్తమానములకు సిద్ధపడుతూ ఉంటారు. వేదిక మీద నిలువబడి వర్తమానములను అందిస్తూ ఉంటారు మరియు రికార్డింగు కొరకు సిద్ధపడుతుంటారు. చూడండి, మా బామ్మకు ఎంతటి గొప్ప ఆశీర్వాదము కదా! దేవునికే మహిమ కలుగును గాక.
నా ప్రియ స్నేహితులారా, మనం ఆయనకు హృదయపూర్వకంగా విధేయత చూపి, ఆయన నడిపింపును అనుసరించినప్పుడు, ఆయన మనకు దీర్ఘాయువును, విశ్వాసయుతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన మనలను కాపాడతాడు, నడిపిస్తాడు, మరియు ఇతరుల జీవితాలను ప్రభావితం చేయడానికి మనలను వాడుకుంటాడు. ఆలాగుననే, చీమలు తిన్నని వరుసగా వెళ్లడాన్ని మీరు చూచియున్నారా? నాయకుడు ఎక్కడికి వెళ్లతాడో, అవన్నియు కూడా వాటి యొక్క నాయకుని వెంబడిస్తాయి. అవి ఎటు కూడా వాటి దృష్టిని మర్చలవు. ఆ దిక్కు మరియు ఈ దిక్కు అని ఎటు చూడకుండా, వాటి నాయకుని వెంబడిస్తూ ఆలాగుననే చక్కగా వెళ్లతాయి. కనుకనే, ప్రభువు ఈ రోజు మిమ్మును కూడా వాడుకొనబోవుచున్నాడు. ప్రభువునకు మరియు మీ చుట్టు ఉన్నవారికందరికి మీరు దీవెనకరముగా ఉండునట్లుగా ఆయన మిమ్మును దీర్ఘాయుష్మంతులనుగా చేస్తాడు.
నా ప్రియులారా, ప్రభువు కూడా మన యొద్ద నుండి అటువంటి విధేయతను ఎదురు చూచుచున్నాడు. మనము అన్నిటిలో ఆయనకు విధేయులైనప్పుడు, ప్రభువు విశ్వాసనీయమైన దీర్ఘాయువుతో మిమ్మును దీవిస్తాడు. కనుకనే, ఈ రోజు మన జీవితమును యేసయ్యకు సమర్పించుకుందాము. ఈ రోజు మీలో అనేకులు, ' ప్రభువా, మేము నీకు విధేయత చూపియున్నాము కదా! అయితే, మా విధేయతకు తగిన ప్రతిఫలము నాకు దొరకలేదు' అని మీరు బాధపడుచున్నారేమో? ఇంకను అనేక సంవత్సరములుగా మేము ఎదుర్కొన్న వాటికి ప్రతిఫలము లేదు అని మీరు చింతించుచున్నారేమో? అయితే, నా ప్రియ స్నేహితులారా, ధైర్యం తెచ్చుకోండి. ప్రభువు ఇలా అంటున్నాడు, 'నేను మీకు దీర్ఘాయువును అనుగ్రహించెదను. ఆయన ప్రతి త్యాగాన్ని, ప్రతి విశ్వాసనీయమైన కార్యమును, మరియు విధేయతతో వేయుచున్న ప్రతి అడుగును చూచుచున్న దేవుడు దేనిని కూడా మరచిపోడు. కనుకనే మీరు కూడా అటువంటి పరిస్థితులలో ఉన్నట్లయితే, ప్రభువు మిమ్మును దీర్ఘాయువుతో దీవిస్తానని మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. కనుకనే, మీరు మీ వ్యాధుల నిమిత్తము బాధపడకండి. కానీ, మీరు దీవెనకరముగా లేరని చింతించకండి, మీరు మీ తండ్రియైన దేవుని యొక్క మార్గములలో నడచి, ఆయన కట్టడలకు విధేయతను చూపుతూ, ఆయన నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు మీరు నడచి వాటిని గైకొనిన యెడల ఆయన ఈ భూమి మీద మిమ్మును దీర్ఘాయుష్మంతునిగా చేసి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, ఈ సందేశమును చదువుచున్న మా జీవితములో కూడా మేము నీకు విధేయత కలిగి జీవించునట్లుగా మాకు కృపను చూపించుము. దేవా, నీ యొక్క ఆశీర్వాదములు మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ యొక్క ఆపుదల మా మీద మరియు మా కుటుంబము మీద ఉంటునట్లుగా కృపనిమ్ము. దేవా, మేము చూపిన విధేయతకు మాకు ప్రతిఫలముగా దీర్ఘాయువును మాకు అనుగ్రహించుము. యేసయ్యా, మేము మా చుట్టు ఉన్నవారికి దీవెనకరముగా ఉండునట్లుగా మమ్మును నీ మార్చుము. ప్రభువా, మా జీవితములను నీ హస్తములకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మును కాపాడుము, మేము ప్రయాణించుచున్నప్పుడు, పని చేయుచున్నప్పుడు మరియు మా యొక్క అనుదిన బాధ్యతలను నిర్వర్తించుచున్నప్పుడు, నీ భద్రతా హస్తము మా మీద మరియు మా వాహనముల మీద ఉండునట్లుగా చేసి, మా దీర్ఘాయువును బహుమానంగా అనుగ్రహించి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండి, నీ నామమునకు మహిమను తీసుకొని వచ్చు జీవితమును దయచేయుము. ప్రభువా, విధేయతతో నీ యొద్దకు వచ్చుచున్న మమ్మును నీకు విధేయులనుగా, విశ్వాసనీయులనుగా ఉండుటకు మాకు సహాయం చేయుము. దేవా, మేము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండుటకు మాకు అటువంటి కృపను దయచేయుమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


