నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున మీకందరికి శుభములను తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కొలొస్సయులకు 2:10వ వచనములను ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములు, "...ఆయనయందు మీరును సంపూర్ణులైయున్నారు; ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సైయున్నాడు'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువునందు సంపూర్ణమైన జీవితమును కలిగియుండుట ఎంత దీవెనకరముగా ఉంటుంది కదా! ఎందుకనగా, ఆయన అందరికి శిరస్సైయున్నాడు.

అందుకే బైబిల్ నుండి సామెతలు 28:20వ వచనములో మనము చదివి చూచినట్లయితే, "నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు'' అని దేవుని వాక్యములో చెప్పబడినట్లుగానే, దేవుని యందు మనము నమ్మకముగా జీవించవలెను. అవును, నా ప్రియ స్నేహితులారా, మనము ఎంతో యథార్థంగా దేవుని వెంబడిస్తూ, ఆయన వాక్యమును చదువుతూ, ఆయన పట్ల నమ్మకముగా ఉండవలెను. ఇంకను వీటన్నింటిలోనూ మనము ఆయనను హృదయ పూర్వకంగా అనుసరించే విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు, అది మనము సంపూర్ణమైన జీవితమును అనుభవించనట్లుగా చేయుచున్నది.

ఆలాగుననే, బైబిల్ నుండి ఎఫెసీయులకు 3:16-19వ వచనములలో చూచినట్లయితే, ఈ విషయమును గురించి మనకు వివరించబడియున్నది. ఆ వచనములలో, "క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయ వలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమ యందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను'' అని చెప్పబడినట్లుగానే, నేడు మనము దేవుని యొక్క సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడవలెనని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు దేవుని వెంబడించినప్పుడు, మీరు ఆయన యొక్క సంపూర్ణతను పొందుకుంటారు.

మొట్టమొదటగా, మనము అంతరంగ పురుషుని యందు మనము పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపబడవలెను. నా ప్రియులారా, మీరు దేవుని యొక్క శక్తితో నింపబడినప్పుడు, మీరు దీవెనకరమైన జీవితమును కలిగియుంటా రు. రెండవదిగా, మీరు దేవుని యొక్క ప్రేమయందు వేరుపారి స్థిరపడి ఉం టారు. మూడవదిగా, సమస్త పరిశుద్ధులతో కూడా మీరు ఉంటారు అని దేవుని వాక్యము చెబుతుంది. చివరిగా, దేవుని యొక్క సంపూర్ణత అంతటితో కూడా నింపబడియుంటారు. ఇది క్రీస్తునందు సంపూర్ణమైన జీవితమైయున్నది.

నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి, మనము దేవుని అడిగి, మనందరి జీవితములలో కూడా పొందుకుందాము. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతయందు వీటన్నిటిని పొందుకొనునట్లుగా దేవుని అడుగుదాము. నా ప్రియులారా, ప్రభువునందు పరిపూర్ణమైన జీవితమును గడుపుట అనగా ఇదియే. ఈ వాగ్దానములను మీరు పొందుకొనుటకు మీరు కూడా దేవుని యందు యథార్ధంగాను, నమ్మకముగాను జీవించుటకు మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, మీ జీవితములో సర్వసంపూర్ణతను అనుగ్రహించి, మిమ్మును సంపూర్థులనుగా చేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మా ప్రశస్తమైన ప్రేమగల పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రశస్తమైన దేవా, నీ నామమున చేరి, ఈ వాగ్దానమును పొందుకొనుటకు నీవు మాకు కృపను దయచేయుము. ప్రభువా, నీ యొక్క శక్తితో నింపుము. యేసయ్యా, నీ యొక్క కొలతలేని ఆత్మను మరియు పరిశుద్ధాత్మ శక్తితో మాకు సమస్తమును కొలతలేకుండా అనుగ్రహించుము. దేవా, నీ యొక్క ఆశీర్వాదముల కొరకు వేచియున్న మమ్మును తాకి, మా జీవితములను నూతనపరచుము. ప్రభువా, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను మాకు దయచేయుము. దేవా, నీ యొక్క సమృద్ధి దీవెనలను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ యొక్క దీవెనల కొరకు మేము ఎదురుచూస్తున్నప్పుడు నీవు నీ యొక్క సంపూర్ణతను మాకు అనుగ్రహించి, మా జీవితమును నూతనపరచుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.