నా ప్రియమైన స్నేహితులారా,ఈ రోజు మేము కోల్పోయిన మా దివంగత అత్తయ్య ఏంజల్ దినకరన్‌గారి యొక్క జన్మ దినమును జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ఆమె ఒక ఘోరమైన కారు ప్రమాదమునకు గురియగుట ద్వారా వెంటనే తన ప్రాణాలను కోల్పోయారు. ఆమె భూలోక ప్రయాణం అతి చిన్న వయస్సులోనే ముగించినప్పటికిని, ఆ ప్రాముఖ్యమైన తరుణము దేవుని శక్తివంతమైన ఉద్దేశము యొక్క దైవీక ప్రారంభం, కారుణ్య విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవము మరియు యేసు పిలుచుచున్నాడు పరిచర్య విస్తరింపబడుటకు కారణముగా ఉన్నది. దుఃఖం నుండి విత్తబడినందుననే ఈ దీవెనకరమైన ప్రతిఫలము. కాబట్టి, నేడు ఈ పరిచర్య కొరకు ప్రార్థించాలని కోరుచున్నాను. కనుకనే, ఈ దినమున మనము ఆమెను ప్రేమతో జ్ఞాపకము చేసుకుందాము. నేడు, మనం ఆమె జీవితాన్ని మరియు స్వాస్థ్యమును జ్ఞాపకం చేసుకుంటున్న సమయములో, దేవుడు బైబిల్ నుండి 2 కొరింథీయులకు 3:17 వ వచనము వాగ్దానముగా మనకు అనుగ్రహించియున్నాడు. ఆ వచనము, "ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ యెక్కడ నుండునో అక్కడ స్వాత్రంత్యము నుండును'' ప్రకారము పరిశుద్ధాత్మ నుండి వచ్చు స్వాతంత్య్రము ఈ లోక సంబంధమైన స్వాతంత్య్రము కాదు, కానీ అపరాధం, అవమానం మరియు పాపం నుండి విడిపించే పరలోక స్వాతంత్య్రము. తరచుగా, పాపం మన హృదయాలలో అబద్ధాలు సణగుడులు, మీరు అర్హులు కాదు. మీరు ఎప్పటికీ ఆశీర్వదించబడలేరు. మీరు దేవుని దగ్గరకు వెళ్ళలేరు అని అపవాది అపరాధభావముతో మిమ్మును ఉంచుతుంది. కానీ నా ప్రియులారా, పరిశుద్ధాత్మ ఆ స్వరాలను గద్దించాలని మనకు గుర్తుచేయుచున్నది. ఎందుకనగా, యేసు క్రీస్తు ఇదివరకే మన కొరకు సిలువలో క్రయధనమును చెల్లించాడు. ఆయన మనలను తన స్వరక్తమును ఇచ్చి, మనలను విలువపెట్టి కొనియున్నాడు. కనుకనే, నేడు మీ దోషారోపణ నుండి మీరు క్షమించబడియున్నారు, మీరు ప్రేమించబడియున్నారు మరియు మీరు స్వతంత్రులుగా మీ పాపము నుండి విడిపించబడియున్నారు. కాబట్టి, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నింపినప్పుడు, ఆయన మీ అపరాధభావాన్ని మీ నుండి తొలగించి, మీ పరలోకపు తండ్రి ఆశీర్వాదాలను ఆనందిండానికి కావలసిన మీరు పొందియున్న అర్హతలను పునరుద్ధరిస్తాడు.

మా కుటుంబ సభ్యులు తరచుగా జ్ఞాపకము చేసుకుంటున్న ఒక కథను నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అది జిమ్ మరియు హెన్రీ అనే ఇద్దరు చిన్న పిల్లల కథ. ఒక రోజు, వారిద్దరు ఒక కోళ్ల గూడు దగ్గర ఆడుకుంటున్నప్పుడు, జిమ్ విసిరిన ఒక చిన్న రాయి పొరపాటున ఒక కోడి మీద పడి చనిపోయింది. అది మంచి గుడ్లు పెట్టుచున్న ఒక కోడి. అయితే, ఆ విషయమును తన అన్నయైన హెన్రీ చూచాడు. కనుకనే, జిమ్ తన అన్నకు భయపడి, తన అన్నయ్య హెన్రీని తమ తల్లిదండ్రులకు చెప్పవద్దని అడిగాడు. హెన్రీ దానికి అంగీకరించాడు. కానీ, తన అన్నయైన హెన్రీ, తన తమ్ముడైన జిమ్ భయాన్ని ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. వారి తల్లిదండ్రులు హెన్రీని ఇంటి పనులు చేయమని అడిగినప్పుడల్లా, అతను, జిమ్, ఈ పని నువ్వు చెయ్యి, లేకపోతే నేను నాన్నకు, అమ్మకు కోడి గురించి చెబుతాను అని బెదిరించేవాడు. భయం మరియు దోషారోపణ భావనతో బంధించబడి, జిమ్ ప్రతిరోజు హెన్రీ భారాన్ని మోయుచుండెను. చివరికి, అతను ఇక భరించలేకపోయాడు. కన్నీళ్లతో, జిమ్ తన తండ్రి యొద్దకు వెళ్లి, తాను చేసిన కార్యములన్నిటిని ఒప్పుకున్నాడు. ఆ తండ్రి వెంటనే జిమ్ తన తప్పును ఒప్పుకున్నాడని గుర్తించి, వానిని క్షమించి, నా కుమారుడా, నీవు ఒక గుణపాఠం నేర్చుకున్నావు అని చెప్పాడు. ఆ సాయంత్రం, హెన్రీ తన పనిని చేయమని మరల జిమ్‌ని బలవంతం చేయడానికి ప్రయత్నించినప్పుడు, తండ్రి ఆ మాటలు విని హెన్రీని గద్దించాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ కథ పాపం మరియు అపరాధ భావం మనపై ఎలా ప్రభావం చూపుతాయో చూపిస్తుంది. అవి మనలను భయం మరియు అవమానము అనే బానిసలుగా మార్చివేస్తాయి. కానీ, మనం మన ప్రేమమయమైన తండ్రి దగ్గరకు వెళ్లి మన తప్పులను ఒప్పుకున్నప్పుడు, ఆయన మనలను ప్రతి భారం నుండి స్వతంత్రులనుగా చేసి, విడిపిస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క స్వరం ఈ రోజు మీతో మాట్లాడుతుంది, ప్రియ బిడ్డలారా, మీరు యేసు వద్దకు రండి, ఆయనకు మీ సమస్యలన్నియు తెలియజేయండి, విడుదలను పొందండి. ఆయన క్షమించలేని పాపం ఏదీయు లేదు, ఆయన కనికరము దేవునికి అతీతమైన లోతైన దోషము ఏదీయు లేదు. కనుకనే, మీరు ఉన్న పక్షమున దేవుని యొద్దకు రండి. ఆయన అనుగ్రహించు విడుదల అనుభవించండి.

నా ప్రియులారా, కాబట్టి ఈ ప్రత్యేక జన్మ దినమున, మన హృదయాలను ప్రభువు యొక్క పరిశుద్ధాత్మకు తెరుద్దాము. మన కుటుంబానికి మేము కోల్పోయిన నష్టం తర్వాత మాకు ఆదరణ ఇచ్చిన అదే ఆత్మ మిమ్మల్ని కూడా ఆదరించడానికి మీ పక్షమున ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా భయం నుండి, అపరాధ భావన నుండి, పాప శాపాల నుండి విడుదలను అనుగ్రహిస్తుంది. యేసు రక్తం మిమ్మల్ని పరిపూర్ణంగా కడిగి శుద్ధులనుగా చేయుచున్నది. మరియు మీకు ఒక నూతన జీవితాన్ని దయచేయచున్నాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నింపినప్పుడు, ఆయన తండ్రి ఆశీర్వాదాలను మీ యొద్దకు తీసుకొని వస్తాడు. మీ దుఃఖములు ఆనందంగాను, మీ ఓటమిలు విజయంగా, మీ దుఃఖం నాట్యంగా మారుతాయి. మీరు తిరిగి లేచి విజయవంతంగా జీవించడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తుంది. ప్రియమైన స్నేహితులారా, మా అత్తయ్య ఏంజల్ దినకరన్ జీవితం పట్ల మనం దేవునికి కృతజ్ఞతలు తెలియజేసినట్లుగానే, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా వచ్చు స్వాతంత్య్రమును బట్టి కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయుదము. కనుకనే, ఇప్పుడే మీరు ఉన్న పక్షమున ఆయన యొద్ద వచ్చి, 'ప్రభువా, మమ్మును నీ పరిశుద్ధాత్మతో నింపుము. మమ్మును నిజంగా విడిపించి, స్వతంత్రులనుగా చేయుమని' చెప్పినప్పుడు, ఆయన మిమ్మును నిజంగా విడిపించి, స్వతంత్రులనుగా చేయును. మా కుటుంబంలో విషాదాన్ని విజయంగా మార్చిన ప్రభువు మీ జీవితంలోని ప్రతి బాధను మహిమకు సాక్ష్యంగా మారుస్తాడు. కనుకనే, నేటి వాగ్దానము నుండి ఈ ఆశీర్వాదాన్ని పొందండి.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువైన యేసు, నాకు విడుదలను ఇవ్వడానికి నీ పరిశుద్ధాత్మను పంపినందుకు నీకు కృతజ్ఞలు చెల్లించుచున్నాను. దేవా, మా యొక్క ప్రతి పాపాన్ని క్షమించి, మా అపరాధభావాన్ని మరియు భయాన్ని మా నుండి తొలగించుము. ప్రభువా, నీ ఆత్మ మా హృదయాన్ని శాంతి మరియు ఆనందంతో నింపుము. యేసయ్య, నీ యొక్క రక్తంతో మమ్మును శుద్ధులనుగా కడిగి మమ్మును నూతన సృష్టిగా మార్చుము. దేవా, మమ్మును ఏ అర్హత లేకుండా వెనుకకు ఉంచిన ప్రతి బంధకమును ఇప్పుడే యేసు నామమున బ్రద్ధలు చేసి, మమ్మును స్వతంత్రులనుగా చేయుము. ప్రభువా, మా ఇంట్లో మరియు కుటుంబంలో నీ యొక్క స్వతంత్రత ప్రవహించునట్లుగా చేయుము. యేసయ్యా, మా యొక్క ప్రతి దుఃఖాన్ని బాగుచేసి మరియు అది విరిగిపోయిన మా హృదయానికి ఆదరణను కలుగజేయుము. ఈ నూతన మాసములో నీ ఆశీర్వాదాలు మా మీద విస్తరించునట్లుగాను మరియు మా జీవితంలోని ప్రతి నష్టాన్ని దైవీకమైన ప్రణాళికగాను మరియు మహిమగాను మార్చుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.