నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మలాకీ 3:18 వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "అప్పుడు నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు'' అని చెప్పబడిన ప్రకారము మీరు నీతిగలవారుగా జీవించండి. అవును, మీరు ఈ రోజు నీతిగలవారుగా జీవించుచున్నారా? ఎటువంటి శ్రమలను ఎదుర్కొంటున్నను కూడా మీరు నీతిగా జీవించడానికి ప్రా«ధాన్యతను ఇచ్చుచున్నారా? అయితే, మిమ్మును గొప్ప శిఖరాలకు లేవనెత్తుతాడని ప్రభువు మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు.

నా ప్రియులారా, అందుకే బైబిల్ నుండి సామెతలు 21:21వ వచనములో మనము చదివినట్లయితే, " నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును'' అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి, మీరు నీతిని కృపను వెంబడించినట్లయితే, జీవమును నీతిని ఘతను పొందుకుంటారు. తద్వారా, నా స్నేహితులారా, ప్రభువు మీ జీవితమును వర్ధిల్లింపజేయుచున్నాడు. అవును, మీ నీతి వలన మీరు వర్థిల్లుదురు గనుకనే, మీ యొక్క నీతి జీవితమునకు మరియు నీతిగా జీవించని వారి యొక్క జీవితానికి వ్యత్యాసమును మీరు చూచెదరు. మీ యొక్క ఇతర కుటుంబ సభ్యులందరు మరియు మీ చుట్టు ఉన్న వారందరు కూడా ఆశ్చర్యపోయి, తను నీతిమంతురాలుగాను మరియు నీతిమంతునిగా జీవించారు గనుకనే, ప్రభువు వారిని ఆశీర్వదించాడని చెబుతారు.

నా ప్రియులారా, బైబిల్ నుండి మత్తయి సువార్త 13:12వ వచనములో మనము చూచినట్లయితే, " కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసి వేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు'' అని వ్రాయబడిన ప్రకారము దేవుడు మీకిచ్చిన చిన్న చిన్న విషయాలలో కూడా మీరు నీతిగా ఉన్నప్పుడు ప్రభువు మీకు ఇంకా అత్యధికముగా అనుగ్రహిస్తాడు. అవును, నా ప్రియులారా, ప్రభువు ఈ రోజు అదే మీకు వాగ్దానము చేయుచున్నాడు. ఈ వర్థిల్లతతో పాటు దేవుడు మిమ్మును మరియు మీ కుటుంబ సభ్యుల యెదుట మరియు మీ స్నేహితుల మధ్య కూడా ప్రభువు మిమ్మును ఘనపరుస్తాడు. అవును, నా స్నేహితులారా, ఈ వాగ్దానమును మీరు విశ్వసించి, ఆయన యొద్ద నుండి మనము ఈ ఆశీర్వాదమును పొందుకుందామా? ఇంకను మీ కష్ట దినములు ఇక చాలు, కన్నీరు వేదనలతో నిండిన దినములు ఇక చాలు, ప్రజలు మిమ్మును అణిచి వేసిన దినములు ఇక చాలు, మిమ్మును నిరుత్సాహపరచిన దినములు ఇక చాలు. దేవుడు మీ నీతి జీవితమును చూచి మీకు స్వాస్థ్యమును మరియు ఘనతను అనుగ్రహించి మిమ్మును ఘనపరుస్తాడు. నేడు ఈ దీవెనలు మనము కలిసి ప్రార్థించి, పొందుకుందాము. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ సందేశమును చదువుచున్న మేము ఘనత వెంబడి ఘనతను పొందుకొనునట్లుగా చేయుము. దేవా, మా నీతిని బట్టి మా కుటుంబములు మరియు మా బిడ్డలు దీవించబడునట్లుగా చేయుము. ప్రభువా, మేము చేసిన పనికి తగినట్లుగా మాకు ఘనతను దయచేయుము. దేవా, మేము వేచియున్న ఉద్యోగము ఇప్పుడే మేము పొందుకొనునట్లుగా చేయుము. ప్రభువా, మాకు మరియు చదువుకుంటున్న మా పిల్లల పరీక్షలలో ఫలితాలు గొప్పగా వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మా వృత్తిలో మమ్మును విజయవంతులనుగా చేసి, అన్నిటిలోను మేము ఘనతను పొందుకొనునట్లుగా చేయుము. ప్రియమైన ప్రభువా, మేము నీ సన్నిధిలో నీతిమంతమైన జీవితాన్ని గడపాలని ఎంచుకున్నాము. కనుకనే, మా కష్టాలలో కూడా, నీతిమంతమైన జీవితాన్ని గడుపుటకు మాకు సహాయము చేయుము. దేవా, సమృద్ధిగా, శ్రేయస్సుతో మరియు ఘనతతో కూడిన జీవితాన్ని పొందుకొనుటకు మరియు మేము నీ యందు నమ్మికయుంచునట్లుగా చేయుము. యేసయ్యా, నీవు మాకు అప్పగించిన చిన్న చిన్న పనులను ఆశీర్వదించి, మేము దానికి ప్రతిఫలముగా అత్యధికముగా ఆశీర్వాదములను పొందుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా జీవితం ఎల్లప్పుడూ నీ యొక్క మంచితనం మరియు విశ్వాసాన్ని ప్రతిబింబించునట్లుగా చేయుము. ప్రభువా, మా కన్నీళ్లను ఆనందంగా మరియు మా అవమానాన్ని ఘనతగాను మార్చుము. దేవా, ఇతరులు మమ్మును ఎక్కడ అవమానపరిచారో, అక్కడ మమ్మును పైకిలేవనెత్తి ఘనపరచమని విశ్వాసంతో మేము నీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొనునట్లుగా కృపను మాకు అనుగ్రహించి, నీ కృప క్షేమములు మమ్మును వెంబడించునట్లుగా చేయుమని యేసు క్రీస్తను ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.