నా ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన స్వరమును వినుడము ఎంత ఆనందకరము కదా! ఈ రోజు వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అందుకే నేటి వాగ్దానము బైబిల్ నుండి 2 తిమోతికి 1:7వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు'' అని చెప్పబడినట్లుగానే, ఆ దేవుని ఆత్మ మీ మీదిగి దిగివచ్చి, మీ జీవితంలోని ప్రతి భయాన్ని తొలగించును గాక. ఈ ఆత్మ ఎవరో కాదు, పరిశుద్ధాత్మయే. ఈ వచనములో చెప్పబడినట్లుగానే, పరిశుద్ధాత్మ మనలో మూడు విధములుగా పనిచేయుచున్నది. ఆయన మనకు శక్తిని అనుగ్రహించుచున్నాడు. బైబిల్ నుండి 1 కొరింథీయులకు 12:8-10వ వచనములలో చూచినట్లయితే, పరిశుద్ధాత్మ వరములను గురించి వివరించుచున్నవి: "ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి'' అని చెప్పబడినట్లుగానే, ఇవన్నియు కూడా మన అనుదిన జీవితములలో మన ద్వారా దేవుని శక్తిని బయలుపరచుచున్నవి.
ఆ తర్వాత, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను మన హృదయాలలో కుమ్మరించబడుతుంది. బైబిల్‌లో యేసు ప్రభువు, "నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించవలెనని'' అని సెలవిచ్చినట్లుగానే, దేవునిని ప్రేమించుటయు మరియు మన పొరుగువారిని ప్రేమించుటయు ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ అని చెప్పబడియున్నది. ఆయన మనలను ప్రేమించాలని కోరుకుంటున్నాడు; పరిశుద్ధాత్మ, మనకు కీడు చేసిన వారిని కూడా ప్రేమించడానికి మనకు సహాయము చేయుచుండెను. ఆయన వారందరిని దేవుని ప్రజలుగా మనము గుర్తెరుగునట్లుగా మనలను చేయుచున్నాడు, అలాగే వారికి మనము ఒక దీవెనకరంగా ఉండునట్లుగా చేస్తాడు. చివరగా, పరిశుద్ధాత్మ మనకు ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చుచున్నాడు. మనం శోధనలను ఎదుర్కొంటున్నప్పుడు, దురాలోచనలకు లోనవుచున్నప్పుడు, లేదా వంకర త్రోవలను మనము ఎంచుకోవాలని వాంఛకలిగియున్నప్పుడు, ఆయన మనకు దేవుని నీతిని మరియు దేవుని వాక్యమును గుర్తించునట్లుగా చేయుచున్నాడు. ఆయన మనలో దేవునియందు భయభక్తులను కలుగజేసి, ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాలని మనకు గుర్తుచేయుచున్నాడు.
కాలేజిలో నాకొక స్నేహితుడు ఉండేవాడు. అతడు ఎంతో గర్వంగాను మరియు గొడవపడే స్వభావం కలవాడు. అతను ఎప్పుడు కూడా ఒక ముఠాను నడిపించేవాడు, ఆ ముఠాకు అతనే నాయకుడు. ఎవరూ అతనిని ఎదిరించలేకపోయేవారు. అతడు ఒక భయంకరమైన వ్యక్తి అని అనుకునేవారు. అతడు అంటేనే చాలా భయము. కానీ, ఎలాగో ఒక వ్యక్తి అతనితో కలుకుని, అతనిని దేవుని మార్గములోనికి నడిపించాడు. తద్వారా, అతను తన హృదయమును దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. అప్పుడు అతడు పరిశుద్ధాత్మచేత నింపబడ్డాడు. ఆ తర్వాత, అతడు ఒక నూతన వ్యక్తిగా మారిపోయాడు. సరిగ్గా అదే కాలేజి ప్రాంగణంలో, అతడు సహవాస కూడికలన్నిటికి తాను నాయకత్వం వహించుచూ, ప్రజలను అక్కడికి తీసుకొనివచ్చేవాడు. అందరు వచ్చి ఆ కూటాలకు పాల్గొనునట్లుగా అతను శ్రద్ధవహించేవాడు, సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లన్నిటిని చేసేవాడు. అక్కడ ఉన్న తన సహోదర సహోదరీలందరిని ఎంతో జాగ్రత్తగా పరామర్శించేవాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఎటువంటి అద్భుతమైన రూపాంతరము కదా! కనుకనే, నా ప్రియులారా, అటువంటి దేవుని మనం కూడా స్వీకరిద్దామా?ఆలాగైతే, మన జీవితాలను ప్రభువునకు సమర్పించుకొని, పరిశుద్ధాత్మను మన హృదయములోనికి ఆహ్వానించినట్లయితే, నిశ్చయముగా దేవుడు నేటి వాగ్దానము నుండి మీకు శక్తియు, ఇంద్రియ నిగ్రహమును అనుగ్రహించి, మిమ్మును తన ఆత్మతో నింపి, మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మాకు నీ యొక్క పరిశుద్ధాత్మను అనుగ్రహించి, మాలో ఒక రూపాంతరమును కలుగజేయుము. దేవా, మాలోని ప్రతి భయమును తొలగించి, నీ యొక్క శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే మాకు అనుగ్రహించుము. ప్రభువా, ఈ లోకములో జీవించుచున్న మేము పరిశుద్ధతలో నడుచుకోవడానికి మరియు ప్రతిరోజూ నీ వాక్యమునకు విధేయులుగా ఉంటూ, పవిత్రమైన జీవితమును జీవించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మమ్మును శ్రమపెట్టిన వారిని కూడా ప్రేమించునట్లుగా మాకు నేర్పించుము మరియు ఇతరులకు మమ్మును దీవెనకరముగా మార్చుము. యేసయ్యా, నీ వలె మేము కూడా శోధనలను జయించడానికి మరియు జీవితంలో ఎన్నడూ వంకర త్రోవలను అనుసరించకుండా మమ్మును నీ ఆత్మతో బలపరచుము. దేవా, మా హృదయములను సంపూర్ణముగా నీకు సమర్పించుకొనుటకును మరియు పరిపూర్ణమైన మారుమనస్సును మాకు అనుగ్రహించి, నీ మహిమ కొరకు మమ్మును వాడుకొనుమని కోరుచున్నాము. దేవా, నీ యొక్క ఆత్మయ వరములను మరియు నీ సన్నిధిని మా జీవితంలో ప్రవహించునట్లుగా చేయుము. ప్రభువా, మేము వెళ్లుచున్న ప్రతిచోటా నీ పరిశుద్ధాత్మ శక్తికి సాక్షులనుగా మమ్మును మార్చుమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


