నా ప్రియ స్నేహితులారా, దేవుడు మన కొరకు ఇవ్వబడిన వాగ్దానమును ఈరోజు మీతో పంచుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందముగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 16:11వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడిచేతిలో నిత్యము సుఖములు కలవు'' అని చెప్పబడినట్లుగానే, క్రీస్తును అనుసరించువారు విసుగును కలిగించు జీవితములను గడుపుచుండవలెనని కొందరు అంటుంటారు. కానీ, కూటము నిర్వహించు సమయములలో మనము నిశ్శబ్దంగా, కదలకుండా ఉండాలని, విందులకు పాల్గొనకూడదని, మనము చేయవలసిందల్లా సందేశములు వినడము, బైబిల్‌ను చదవడము, బాగా చదువుకోవడం, కష్టపడి పనిచేయడం మాత్రమేనని వారు అనుకుంటారు. కానీ, యేసును అనుసరించడము అనగా, ఎలాంటి ఆనందము లేకుండా ఎంతో కఠినమైన జీవితమును గడపడమేనని వారు ఊహించుకుంటారు. అయితే, అటువంటి కూటములలో మీరు చుట్టూ చూచినట్లయితే, ప్రజలు ఆనందబాష్పములను కార్చడము మనము గమనించవచ్చును. ఎందుకు? ఎందుకంటే, వారు నిజంగా యేసును వెంబడించుట ద్వారా పొందుకునే ఆనందముతో నింపబడతారు. అంతమాత్రమే కాదు, ఆయన వారి హృదయములను తెరచి, తన కుడిచేతిలో ఉన్న నిత్యసుఖములను వారు అనుభవించునట్లుగా చేస్తాడు.

యేసును అనుభవించడం వలన కలిగే ఆనందం ఈ లోకం అందించగల దేనితోనూ పోల్చలేనిది. ఆ ఆనందమును మాటలలో వివరించుటకు అసాధ్యమైనది. ఇది మన హృదయములకు పరిపూర్ణతను చేకూరుస్తుంది. కనుకనే, నేటి వాగ్దానములో చెప్పబడినట్లుగానే, నిజమైన, ఆనందభరితమైన జీవితము ఇదియే. అదేమనగా, " జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు'' అని చెప్పబడినట్లుగానే, మనము మన జీవితములను ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు ఈ ఆనందమును మనము పరిపూర్ణముగా పొందుకొనగలము. నా ప్రియులారా, ఈ లోకములో కూడా, మనకు ఏమియు కొదువకాకుండా ఆయన మనలన ఎంతో జాగ్రత్తగా చూచుకుంటాడు. పరిచర్య కూడికల నిమిత్తం మేము వివిధ దేశములకు ప్రయాణించేందుకు ఆయన మాకు వీలు కల్పిస్తాడు, అక్కడ ప్రజలు ప్రేమతో మమ్మల్ని అక్కడ ఉన్న ప్రాంతములను చూపించడానికి తీసుకువెళ్లి, ఉత్తమమైన ఆహారమును మాకు సమృద్ధిగా అందిస్తారు. ఆలాగుననే, నా ప్రియులారా, ఇవన్నీ ఆశీర్వాదములు, ఎందుకంటే మనము ప్రభువును సేవించుచున్నాము. కనుకనే, ఆయన తన హస్తముల నుండి వెలువడే మేలులను మనము అనుభవించునట్లుగా చేస్తాడు. ఈ లోకములో మనము ఆయన ఆశీర్వాదములను, ఆనందమును అనుభవించెదము; పరలోకములో కూడా మన కొరకు నిత్య సంతోషములు ఎదురు చూస్తున్నవి. కనుకనే, దేనికి మీరు భయపడకండి.

అందుకే బైబిల్ నుండి మగ్దలేనే మరియలో మనము ఇటువంటి భక్తిని చూడగలము. ఆమెను పీడించుచున్న ఏడు దయ్యముల నుండి యేసు ఆమెను విడిపించిన తర్వాత, ఆమె ఆయనను నమ్మకముగా వెంబడించినది. ఆమె ఆయన పాదముల చెంత కూర్చుని, ఆయన మాటలను వింటూ, ఆయన నుండి ఎక్కువ విషయములను పొందుకొనవలెనని కోరుకొనెను. యేసును వెంబడించుటలోగల ఉండే ఆనందమునకు ఎంత చక్కని దృశ్యం ఇది కదా! అవును, నా ప్రియులారా, మన హృదయములలో ఉన్న సంతోషము, జీవితములో మనము పొందుకొను మేలులు ఆయన నుండి మన మీది దిగివస్తాయి. ఆయన మనకు ఉత్తమమైనవాటన్నిటి అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో నిత్యము ఆనందించుచూ, ఆయన అనుగ్రహించు దీవెనలు అనుభవించండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్య, నీవు మాకు జీవ మార్గమును తెలియజేసినందుకును మరియు జీవితమును పరిపూర్ణముగా అనుభవించునట్లుగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు. ప్రభువా, నీవు మాకు ఉత్తమమైన జీవితమును అనుగ్రహించి, నీ యొక్క కుడిపార్శ్వంలో ఉన్న నిత్యసుఖములను నీవు మాకు దయచేయుము. దేవా, ఇప్పుడే, నీ యొక్క పరలోకపు ఆనందముతో, నీ సన్నిధిలో కలిగియున్న నిత్య సుఖములతోను, నీ మహిమతో నిండియుండు ఆనందంతో మమ్మును నింపుము. ప్రభువా, నీవు మమ్మును నీ సంపూర్ణమైన సమృద్ధితో అనుభవించునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, మా హృదయములను నీ యొక్క దైవీకమైన సమాధానముతో నింపుము. యేసయ్యా, నీవు అనుదినము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుచూ, మమ్మును సరైన మార్గములో నడిపించుము. దేవా, నీ వాక్యము ద్వారా నీ జీవము మాలోనికి ప్రవహించునట్లుగాను, నీ కుడి చేతిలో ఉన్న నిత్యసుఖములను కోరుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మమ్మును మంచి మార్గములలో నడిపించి, మా జీవితములను నీ యొక్క పరిపూర్ణమైన ఆనందంతో నింపుమని యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.