నా ప్రియ స్నేహితులారా, ఇది సంతోషభరితమైన రోజు, దేవుడు ఈ రోజు నూతనమైన కార్యమును అనుగ్రహించుచున్నాడు. అందుకే నేటి వాగ్దానము గా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 31:8వ వచనము ఇవ్వబడి యున్నది. ఆ వచనము, "నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరి యెదుట అతనితో చెప్పెను'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, మీ ముందర నడుచువాడు మన దేవుడైన యెహోవా. కనుకనే, మీరు భయపడకండి. ఆయన మీకు తోడుగా ఉండి, మిమ్మును సరైన మార్గములో నడిపిస్తాడు.

మా కుమార్తె క్యేటి, చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు, నేను ఎన్నో చిలిపి చేష్టలను చేస్తూ ఉంటాను. ఆలాగుననే, ఒకరోజున మేము థీమ్ పార్క్‌కు వెళ్లాము. మేము ఆ పార్క్‌లోనికి వెళ్తున్నప్పుడు, ఆ పార్క్‌లో తాను ఎన్నో వింత కార్యములను చూస్తూ, తాను చుట్టు ప్రక్కల ఉన్న కార్యములన్నిటిని పైకి మరియు క్రిందికి చూచి ఎంతగానో ఆశ్చర్యపడిపోయినది. ఇంకను తాను రైడ్‌ను మరియు అద్భుతమైన కార్యములను చూస్తూ, ఆశ్చర్యము చెందుతూ ఆనందించుండెను. ఆ పార్క్‌లో ఆమె ఆలాగున లీనమై పోయినది. అప్పుడు, 'నేను నా సతీమణితో, తనను మన ముందు ఆలాగున నడవనివ్వు, ఒంటరిగా విడిచిపెట్టు' అని చెప్పాను. అయితే, మేము మా కుమార్తె వెంబడి వెళ్లుచున్నామని గమనించుకొనకుండా, తను ఆలాగుననే, ఒంటరిగా వెళ్లుచుండెను. ఆమె వెనకకు తిరిగి చూచినప్పుడు, మేము దాక్కున్నాము. తల్లిదండ్రులు అక్కడ కనబడకుండా పోవడము చూడగానే, నా కుమార్తె ఎంతగానో భయమునొంది ఇటు అటు చూస్తూ ఉండిపోయినది. అప్పుడు దాక్కున్న మేము బయటకు వచ్చి, మేము ఇక్కడనే ఉన్నామని చెప్పినప్పుడు, తను వచ్చి, మమ్మును కౌగిలించుకొనెను.

నా ప్రియులారా, మీరు ఏమనుకుంటున్నారని నాకు తెలుసు. చిన్న పసిబిడ్డను విడిచిపెట్టి, మీరు ఏమి చేస్తున్నారని అనుకుంటుండవచ్చును. కానీ, నా స్నేహితులారా, దేవుడు కూడా ఆలాగుననే, అనుమతినిస్తాడు. కొన్ని ఫర్యాయములు మనము ప్రార్థన చేయకుండా ముందుకు సాగివెళ్తుంటాము. కానీ, 'మాతో కూడా రండి ప్రభువా,' అని మనము ఆయనను అడగము. అంతమాత్రమే కాదు, 'ప్రభువా, నీ చిత్తమును మాకు తెలియజేయుము' అని ఆయన చిత్తమును మనము అడగము. మన జీవితములో ఆయన చేసినవాటిని మనము గుర్తించకుండా, ఆయనను స్తుతించకుండా, రద్దీ జీవితములో ఆలాగుననే, మునుముందుకు వెళ్లిపోతుంటాము. ప్రభువు కూడా మనలను చూచి, 'సరే, మీరు వెళ్లండిలే,' అని అనుమతిస్తూ ఉంటాడు. ఇంకను, 'నేను లేకుండా నీవు ఎంత వరకు వెళ్తావు' అని మన వైపు చూస్తూ ఉంటాడు. అయితే, మనము ఈ లోక ప్రమాదములను చూడగానే, భయపడి, పరుగెత్తుకుంటూ ఆయన చెంతకు వస్తాము. కొన్నిసార్లు, ఆయన మనకు ఎంత అవసరమో మనము గుర్తించునట్లుగా చేయడానికి, మన సొంత బలము మీద ఆధారపడటం వలన కలుగు పరిణామములను అనుభవించునట్లుగా దేవుడు మనలను అనుమతిస్తాడు. కష్టాలు ఎదురైనప్పుడు, ప్రేమగలిగిన తల్లిదండ్రుల యొద్దకు ఒక చిన్నబిడ్డ సురక్షితంగా పరుగెత్తినట్లుగానే, మనము కూడా వెంటనే ఆయన వైపు పరుగెత్తుతాము. అందుకే, మనము నిత్యము ప్రభువును ఆశ్రయించడం ఎంతో ప్రాముఖ్యమైనది.

నా ప్రియులారా, ఆ రీతిగా బైబిల్‌లో ప్రతి దినమున కూడా, దానియేలు మూడు ఫర్యాయములు ప్రార్థించాడు. ఆలాగుననే, మనము కూడా ఉదయకాలముననే, దేవుని వాక్యమును స్వతంత్రించుకొనుచూ, ఆయనను అడగవలెను. కనుకనే, ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేయవలెను. మనము ప్రతిరోజు ఒక దినములోనికి వెళ్లినప్పుడు, మనము ఆ దినము కొరకై ఇలాగున ప్రార్థన చేయాలి, 'ప్రభువా, నా పక్షమున ఉండి, ఇందులో నాకు సహాయము చేయము' అని అడగండి. ఇంకను ఆ దినమున జరిగించిన ప్రతి కార్యమును బట్టి, ఈ దినమును బట్టి, నీకు వందనములు అని ప్రభువును స్తుతించినప్పుడు ప్రభువు మన పట్ల ఎంతగానో ఆనందించి, ఆ తదుపరి దినమును కూడా ప్రభువు మనలను గొప్పగా ఆశీర్వదించును.

నా ప్రియులారా, నేటి వాగ్దానము ప్రకారము మీరు ప్రభువును మీకు ముందుగా వెళ్లనివ్వండి. ఆయన మనకు ముందుగా వెళ్తానని, మనతో కూడా ఉంటానని ప్రభువు మన పట్ల వాగ్దానము చేసియున్నాడు. ఆయన సరైన ద్వారములను తెరుస్తాడు, మీ ప్రతి అడుగుకు మీకు ముందుగా ఉండి, మరియు తన పరిపూర్ణ ప్రణాళికలో మిమ్మును నడిపిస్తాడు. మీరు ఒంటరివారు కాదు; ఆయన సన్నిధి మిమ్మును సంపూర్ణంగా బలపరచుచున్నది, కాపాడబడుతుంది మరియు మీకు విజయమును అనుగ్రహించుచున్నది. కాబట్టి, పూర్ణ హృదయంతో ఆయనను నమ్మండి. ఆయనను మిమ్మల్ని నడిపించనివ్వండి, అప్పుడు మీరు ఆయన శాంతిని మరియు సమృద్ధియైన ఆశీర్వాదాలను అనుభవిస్తారు. కనుకనే, మీరు దేనినిమిత్తము చింతించకండి. నేడు మిమ్మును మీరు ఆయనకు సమర్పించుకున్నప్పుడు, నిశ్చయముగా దేవుడు మీకు ముందుగా వెళ్లుచూ, మీకు తోడుగా ఉండి మిమ్మును సరైన మార్గములో నడిపించి, ఆశీర్వదించును. కనుకనే, నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును నేటి దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మమ్మును నీ యొక్క శక్తివంతమైన సాన్నిధ్యముతో నింపుచున్నందుకై నీకు వందనములు. దేవా, నీవు మాకు ముందుగా వెళ్లుచూ, మాకు సరైన మార్గమును చూపించుచున్నందుకు నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, ప్రతి విషయములో నీవు మా చేతులను పట్టుకొని ఉన్నందుకై నీకు వందనములు. యేసయ్య, మేము ఒంటరివారముగా ఉండకుండా, నీ సన్నిధిచేత మేము కదిలించబడకుండా చేయుము. దేవా, ప్రతిదానిలో మేము నిన్ను వెదకడానికి మాకు సహాయము చేయుము. యేసయ్యా, ఎళ్లవేళల నీవు మాతో ఉండునట్లుగా, ప్రతి విషయములో నిన్ను స్తుతించుటకు మాకు కృపను దయచేయుము. దేవా, నీవు మాకు ముందుగా వెళ్లి, మాకు ద్వారములను తెరువుము. రిపభువా, నీ మార్గములో మేము వాడబడుటకును, ఆ మార్గములో ఏము దీవించబడుటకు సరైన ద్వారములను మా జీవితములో ఇప్పుడే తెరవజేయుము. ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళినను నీవు మాకు ముందుగా వెళ్ళి, మా యొక్క ప్రతి అడుగులో మమ్మును నడిపించుము. దేవా, మేము నిర్ణయం తీసుకునే ముందుగా నీ చిత్తాన్ని వెదకడానికి మాకు సహాయం చేయుము. దేవా, నీ యొక్క పరిపూర్ణ ప్రణాళిక ప్రకారం సరైన ద్వారములను మా నిమిత్తము తెరవజేసి, మా మార్గంలోని ప్రతి ఆటంకములను తొలగించి, మేము చేయు ప్రతి పనిని స్థిరపరచుము. ప్రభువా, మేము ప్రతిరోజు నడుస్తున్నప్పుడు నీ యొక్క జ్ఞానము, ధైర్యమును మరియు సమాధానముతో మమ్మును నింపుము. దేవా, మేము నీకు సమీపముగా ఉండునట్లుగాను, మా విశ్వాసమును బలపరచి, ప్రతి పరిస్థితిలో నిన్ను సంపూర్ణముగా నమ్మడానికి మాకు సహాయము చేయుము. ప్రభువా, నీ సన్నిధి ఎల్లప్పుడూ మమ్మును ఆవరించి ఉండునట్లుగా చేసి, నీవు మా కొరకు సిద్ధపరచిన ఆశీర్వాదములోనికి మమ్మును నడిపించుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.