నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 28:3వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు'' ప్రకారం దేవుడు మిమ్మును ఎక్కడ ఉంచినను, ఆయన అక్కడనే మిమ్మును దీవించుటకు మీ పట్ల కోరుచున్నాడు. మీకు ఆశీర్వాదమును అనుగ్రహించునది, మీరు నివాసము ఉంటున్న స్థలము కాదు. కొన్ని సందర్భాలలో ప్రజలు నేను ఫలానా ప్రాంతాలలో నివాసముంటున్నాను. కానీ, నా పరిసర ప్రాంతాలలో ఇలాంటి విధానాలు ఉన్నాయి, ఇక్కడ నేను దీవించబడతానా? అని అడుగుతుంటారు. కానీ, మీ హృదయాలలో మీరు యేసును కలిగి ఉండాలి. అందుకే ఆయన, "నేను మీ హృదయాన్ని, మీ దేహాన్ని నా ఆలయముగా చేసుకుంటాను' అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు ఎక్కడ ఉన్నను సరే, అక్కడ మీరు ఆశీర్వాదముగా ఉండునట్లుగా దేవుడు మిమ్మును మారుస్తాడు.
నా ప్రియులారా, ఇంకను ఆయన, " మీ హృదయమను తలుపు యొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. మీరు యేసు అను నా యొక్క స్వరమును ఆలకించి, రమ్మని ఆహ్వానించినట్లయితే, నేను మీలోపలికి వచ్చెదను. నేను మీతో కలిసి భోజనము చేయుదును'' అని అంటున్నాడు. అవును, అది యేసు హృదయమై యున్నది. ఆయన మీ జీవితములోను, మీ కుటుంబములోను మరియు మీ వ్యక్తిగత జీవితములోను ప్రతి కోణములోను జోక్యమును కలిగియుండాలని మీ పట్ల కోరుచున్నాడు. యేసు అక్కడ ఉండి యున్నప్పుడు, ఆయన ఆశీర్వాదము ఆయన కృప ఎల్లవేళల మీతో కూడా ఉంటుంది. మీరు చేయునదంత యు ఆశీర్వదింపబడును. మీరు కలిగియున్నదంతయు కూడా ఆశీర్వదింపబడును. మీతో కూడా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడుదురు. దేవుడు ఓబేదెదోమును మరియు అతడు కలిగియున్న సమస్తమును కూడా ఆశీర్వదించాడని బైబిల్ తెలియజేయుచున్నది. దేవుడు అతని కుటుంబములో ప్రతిఒక్కరిని ఆశీర్వదించియున్నాడు. రాజు ఈ సంగతిని ఆలకించియున్నాడు. నా ప్రియులారా, ఆ రీతిగానే మీ కుటుంబము కూడా ఉంటుంది. అవును, ప్రభువే మీలోనికి వచ్చి, సమస్తమును చేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రభువు మీకు సంబంధించిన సమస్తమును పరిపూర్ణము చేయును. అవును, మీరు పట్టణములోను మరియు పొలములోను, దేశములోను మీరు దీవించబడుదురు. దేవుడు మీ కుటుంబ సభ్యులను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తును. అందుకోసమై ఆయన పరిశుద్ధాత్మ వర్షమును కుమ్మరించుచుండగా, మీరు ఆ పరిశుద్ధాత్మ వర్షమును స్వీకరించండి.
సహోదరి కవి ప్రియ యొక్క అద్భుతమైన సాక్ష్యమును ఆలకించుదామా? ఆమె చిన్న బిడ్డగా ఉన్నప్పు డే, తండ్రి చనిపోయాడు. తల్లిగారు ఆమె కోసం జాగ్రత్త వహించి పెంచారు. ఆమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆమె ఒక గ్రామములో నివసించుచుండెను. తల్లిగారు ఆమెను ఒక వసతి గృహమునకు పంపించారు. కుటుంబములో ఉన్న వారందరు కూడా ఆమెను వివర్శించేవారు. అటువంటి సమయములో ఆమె యేసు పిలుచుచున్నాడు కూటములకు పాల్గొన్నారు. నేను విద్యార్థుల కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఆ పాప యొక్క బామగారు, ఆ పాపను యౌవన భాగస్థుల పధకములో భాగస్థురాలినిగా చేర్చారు. పరీక్షల సమయము ఆసన్నమైనది. పరీక్షలలో ఆమెకు 500/447 మార్కులను పొందుకొనెను. తన స్కూలులో మొదటి స్థానములో నిలిచెను. ఆమె తన యొక్క 12వ తరగతి విద్యను కూడా పూర్తి చేసుకొనెను. ఆ తర్వాత, బి.ఎ., మరియు ఎమ్.ఎ., పూర్తి చేసుకొనెను. బంగారు పథకముతో ఆమె తన విద్యను పూర్తి చేసుకొనెను. ఇప్పుడు ఆమె ్రపైవేట్ కంపెనీలో ఉద్యోగమును చేయుచున్నారు. అవును నా స్నేహితులారా, ఏమి లేని శూన్యము నుండి ఆమెను లేవనెత్తి యున్నాడు. పట్టణములోను ఆశీర్వదించాడు మరియు గ్రామములోను ఆశీర్వదించాడు. ఈ రోజున ఆమె తన గ్రామములో అనేకమంది బిడ్డలకు కూడా ఆశీర్వాదకరముగా ఉండియున్న్నది. ఆలాగుననే, ప్రియులారా, నేడు దేవుడు మిమ్మును కూడా ఆశీర్వాదకరముగా చేస్తాడు. మీరు ఎక్కడ ఉన్నను, అక్కడ మిమ్మును వర్థిల్లింపజేస్తాడు. "అల్పులైన వారు వేయిమందియగును'' అని చెప్పబడినట్లుగానే, మీరు వేయిమందియగునట్లుగా దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. కాబట్టి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసయ్యా, మా హృదయములోనికి రమ్ము, మేము నగరంలోను ఆశీర్వదించబడునట్లుగాను మరియు దేశంలో ఆశీర్వదించబడునట్లుగాను మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, మా ఆశీర్వాదాలు మేము ఉన్న పరిసరాలతో పరిమితికాకుండా, మా జీవితంలో నీ సన్నిధితో ముడిపడి ఉన్నాయని మేము ఆనందించునట్లుగా చేయుము. ప్రభువైన యేసయ్యా, ఈ రోజు నిన్ను మా హృదయంలోనికి ఆహ్వానించుచున్నాము. దేవా, నీవు మా సర్వస్వంగా ఉండుము, మాలో నివసించుము మరియు నీ అనుగ్రహం మమ్మును కేడెము వలె చుట్టుముట్టనిమ్ము. ప్రభువా, మేము ప్రస్తుతం ఉన్న చోట పరిమితి కాదని, నీ మహిమ ఎక్కడైన ప్రకాశిస్తుంది అని నమ్మడానికి దయచేసి మాకు సహాయం చేయుము. దేవా, మాకు సంబంధించిన ప్రతిదానిని పరిపూర్ణం చేసినందుకు మరియు మేము ఎక్కడ ఉన్నను, మేము అభివృద్ధి చెందుతామని నీవు వాగ్దానము ఇచ్చినందుకై నీకు వందనాలు. ఎందుకంటే, యేసయ్యా, నీవు మాతో కూడా ఉన్నావనియు మేము నిశ్చయముగా ఆశీర్వదింపబడతామని నమ్ముచున్నాము. యేసయ్యా, మేము నీ స్వరమును వినునట్లుగాను, మా హృదయములో నీకు చోటు ఇచ్చునట్లుగా నీ కృపను మాకు దయచేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు కృపగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.