నా ప్రియ సహోదరీ, సహోదరులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 56:3వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించు చున్నాను'' ప్రకారము మనకు భయము సంభవించు సమయములలో మనము దేవుని మాత్రమే ఆశ్రయించాలి. అందుకే పై వచనములో చెప్పబడినట్లుగానే, దావీదు కలిగియున్న భయము ఏమై యున్నది? అని మనము బైబిల్ నుండి కీర్తనలు 56:1-2వ వచనములలో చూచినట్లయితే, " దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగవలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నా కొరకు పొంచియున్నవారు నన్ను మ్రింగవలెనని యున్నారు'' అని దావీదు దేవునికి మొఱ్ఱపెట్టాడు. అయితే, సమస్యలన్నిటి మధ్యలో కూడా దావీదు భక్తుడు ఏమి చేశాడు చూడండి. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 56:4 వ వచనములో చూచినట్లయితే, "దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?'' ప్రకారము నా ప్రియ స్నేహితులారా, శ్రమలను మనము ఎదుర్కొన్నప్పుడు మనము మన స్వంత జ్ఞానముపై ఆధారపడకూడదు. మీ భారములన్నిటిని కూడా ప్రభువు పాద సన్నిధిలో వేయండి. ఎందుకంటే, ఆయన మీ పట్ల జాగ్రత్త వహించుచున్న దేవుడు. ఆయన మిమ్మును రక్షించగలడు మరియు కాపాడగలడు. కనుకనే, కీర్తనాకారుడైన దావీదు అదే కార్యమును చేసియున్నాడు. అతనికి శ్రమలు సంభవించినప్పుడు, అతడు భయపడినప్పుడు, ప్రభువును వెదకియున్నాడు. కాబట్టి, బైబిల్ నుండి కీర్తనలు 34:4వ వచనములో చూచినట్లయితే, " నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను '' అని చెప్పబడిన ప్రకారము దావీదు దేవునికి మొఱ్ఱపెట్టినప్పుడు, దేవుడు దావీదునకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి అతనిని తప్పించాడు. ఇది ఎంత అద్భుతమైన జీవితము కదా!
నా ప్రియ స్నేహితులారా, తన భవిష్యత్తును గురించినటువంటి భయమును కలిగి ప్రభువును వెదకినటువంటి ప్రియ సహోదరి జెబసెల్విని గురించిన సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. సహోదరుడు మేషేకుగారితో ఆమెకు వివాహము జరిగినది. తన వివాహ జీవితము చక్కగా కొనసాగచుండెను. అంతమాత్రమే కాదు, ఒక బిడ్డ కూడా వారికి జన్మించాడు. అయితే, వారు ఆర్థికముగా సరిగ్గా లేరు, వారు ఎంతో కొరత కలిగియుండెను. కాబట్టి, వారు ఆ బిడ్డకు పాలు కూడా పట్టించలేకపోయారు. కేవలము గంజినీళ్లు మాత్రమే ఆ బిడ్డకు ఆహారముగా పెట్టేవారు. అటువంటి అనిశ్చితమైన పరిస్థితులలో కూడా, ఆ రోజులలో కూడా మా కుమార్తె స్టెల్లా రమోలా మరియు డానియేలు డేవిడ్‌సన్ ఇద్దరు కలిసి పాడినటువంటి పాటను వినేవారు. మా పిల్లలు, ఆదికాండము 12:2వ వచనమును ఆధారముగా చేసుకొని పాడినటువంటి పాటను గురించి వారు కూడా పాడారు. వారి చిన్న కుమారుడు కూడా ఆ పాటను పాడుచుండేవాడు. ఆ కష్ట దినములలో కూడా తన భర్త ప్రార్థన గోపురమునకు వెళ్లి, ప్రజల కొరకు స్వచ్ఛందముగా ప్రార్థన చేస్తుండేవారు. రాత్రి సమయములలో స్వచ్ఛందముగా ప్రభువు పరిచర్యలో పాల్గొంటుండేవారు. అటువంటి సమయములో, 'నీ భర్త అసలు ఏమి చేయుచున్నాడు' అని తన బంధువులందరు కూడా ఎగతాళి చేసేవారు. మరియు మీకే ఆర్థిక ఇబ్బందులు ఉండే సమయములో, మీ భర్త ప్రార్థన గోపురములో పరిచర్యకు వెళ్లి పరిచర్య చేయుట ద్వారా మీకు ఏమి లాభము వస్తుంది అనేవారు.' రోజులు గుడుస్తుండగా, అతడు ఒక చిన్న ఫ్రీలాన్సర్ పనిని చేయడము మొదలు పెట్టాడు. ఒకరోజులో కేవలం 150 లేక 200 రూపాయలు మాత్రమే అతడు సంపాదించుచుండేవాడు. ఏదో ఒక విధంగా వారి జీవనము సాగుచుండేది. అన్నానగర్ ప్రార్థన గోపురములో జరుగుచున్న ప్రార్థన కూడికలలో వారు తప్పకుండా పాల్గొనేవారు. ఒకానొక కూడికలో ఒక దైవజనుడు వారి కొరకు ఈ విధంగా ప్రార్థించాడు, ' ప్రభువు నీ ఉద్యోగము విషయములో ఒక మార్గమును తెరవబోవుచున్నాడు' అని చెప్పాడు. ఆ సహోదరుడు ఆ మాటను విశ్వసించాడు. అద్భుతవిధంగా, ఒక చక్కని ఉద్యోగమును అతడు పొందుకున్నాడు. ఆ తర్వాత వారు రెండవ బిడ్డను కూడా పొందుకున్నారు.
అయితే, భార్యభర్తల మధ్య ఏదో ఒక మనస్పర్థలు కలిగెను. కానీ, భార్య తన ఇద్దరు బిడ్డలను తీసుకొని యింటి నుండి తన తల్లిగారి యింటికి వెళ్లిపోయినది. ఆ తర్వాత ఆమె భర్త కోర్టుకు వెళ్లి విడాకుల కొరకు అప్లై చేసియున్నాడు. ఒకనెల రోజుల తర్వాత మీరు ఆ విడాకులను పొందుకుంటారు అని ఆ న్యాయమూర్తి చెప్పారు. ఆవిధంగా 7 సంవత్సరములు గడిచిపోయాయి. ఆ తర్వాత, వారిద్దరు కూడా విడాకులు తీసుకొనుటకు ఇష్టపడలేదు. వారిద్దరు కలిసి జీవించాలని కోరుకున్నారు. భార్య తన తల్లి యింటిలో ఉండగా, భర్త తన తల్లిదండ్రులతో ఉంటుండేవాడు. వారి వారి యిల్లకు దగ్గరలో ఉండే ప్రార్థన గోపురములకు వారిద్దరు వెళ్లి ప్రార్థించుకునేవారు. వారిద్దరు కూడా ప్రభువే వారిని తిరిగి ఐక్యపరుస్తాడు అని విశ్వసించారు. వారు ఒక బంధువుల వేడుకలలో వారిద్దరు కలుసుకున్నప్పుడు, ప్రభువు వారిద్దరిని అద్భుత రీతిగా ఐక్యపరచియున్నాడు. ఒకరితో ఒకరు కలుసుకొని మాట్లాడుకోవడము మొదలు పెట్టారు. ఆ కుటుంబములో మరియు వారి యింటిలో నవ్వు మరల కలిగినది. నెమ్మది, నెమ్మదిగా వారి కుటుంబ జీవితమును ఆశీర్వదించడము మొదలుపెట్టియున్నాడు. ఈ రోజు ఆర్థికంగా వారు ఎంతగానో బలమును నొందియున్నారు. భవిష్యత్తును గురించిన భయములన్నియు వారిని విడిచి వెళ్లిపోయినవి. వారు భయము నొందినప్పుడు ప్రభువును వారు వెదకియున్నారు. ప్రభువు ఒక గొప్ప అద్భుతమును వారి పట్ల జరిగించాడు. మనుష్యులు చేయలేనటువంటి ఒక గొప్ప కార్యమును ప్రభువు వారి కొరకు చేసియున్నాడు. వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చిన అదే దేవుడు, ప్రియమైన స్నేహితులారా, మీ కొరకు కూడా తప్పకుండా చేస్తాడు. భవిష్యత్తును గురించి భయం, కుటుంబ సమస్యలు లేదా ఆర్థిక భారం మరియు మీ హృదయాన్ని పట్టుకున్న భయం ఏదైనా, దేవునిపై నమ్మకం ఉంచండి. ఆయన మిమ్మల్ని విడిపించడానికి మరియు మీ ఇంటిని సమృద్ధిగా ఆశీర్వదించడానికి నమ్మదగినవాడై యున్నాడు. ఈ రోజు కూడా, ప్రభువు యొద్ద మొఱ్ఱపెట్టండి నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మీ జీవితములో కూడా అద్భుతమును జరిగిస్తాడు అని ఆయన యందు మీరు విశ్వాసముంచండి. ప్రభువు మిమ్మును దీవించును గాక, నిశ్చయముగా ముందు గతిరానైయున్నదన్న నిరీక్షణను మీరు కలిగియుంటారు. దేవుడే నేటి వాగ్దానము ద్వారా మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఒకవేళ మా జీవితాలలో విడాకులు పొందవలసిన పరిస్థితులలో ఉన్న మా పట్ల అద్భుత కార్యములను జరిగించుము. దేవా, మా జీవితములో ఎక్కడైతే, మనస్పర్థలు కలిగయున్నామో అక్కడ మాలో నుండి ఆ మనరస్పర్థలన్నిటిని ఇప్పుడే తొలగించుము. దేవా, మా కుటుంబములో ఉన్న ప్రతి ఒక్కరు ఐక్యముగా జీవించుటకు మాకు అట్టి కృపను దయచేయుము. ప్రభువా, మా ఆర్థిక పరిస్థితుల వలన మా కుటుంబు విడిపోయే పరిస్థితులో ఉన్నందున నీవు ఇప్పుడే, మా కుటుంబములోని అర్థిక పరిస్థితి తొలగించి, ఆశీర్వాదమును అనుగ్రహించుము. ప్రభువా, నీ సన్నిధితో మమ్మును మరియు మా కుటుంబ సభ్యులను నింపుము. మా కుటుంబములో సంతోష సమాధానములను కలుగజేయుము. ప్రభువా మా కుటుంబ మరియు వ్యక్తిగత జీవితములో ఉన్న భయములన్నిటిని తొలగించుము. దేవా, మా కోర్టు కేసు నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, మేము కార్చిన కన్నీరు అంతటికి బదులుగా రెండంతలుగా సంతోషమును మాకు కలుగజేసి, భయము ఇక వద్దు, రెండంతలుగా సంతోషమును మాకు దయయచేయుము. ప్రభువా, మా భవిష్యత్తు కొరకు మేము భయంతో నిండిన సమయాలలో, నీ శాంతితో మమ్మును ఆదరించుము. ప్రభువా, మా కుటుంబాన్ని బాగుచేయుము, ; విడిపోయిన హృదయాలను ఐక్యపరచుము. దేవా, నీ ఆత్మ శక్తి ద్వారా మా ఇంట్లో ప్రేమ మరియు అవగాహనను పునరుద్ధరించుము. ప్రభువా, మేము ఆర్థికంగా కష్టపడుతున్నప్పుడు మాకు సహాయం చేసి, ఆశీర్వాదపు నూతన ద్వారములను తెరువుము. ప్రభువా, మా కన్నీళ్లను తుడిచి, మా భయాన్ని విశ్వాసంతో నింపుము. యేసయ్య, మా గృహమును నీ సన్నిధితోను మరియు ఆనందంతో నింపుము. దేవా, మనుష్యుల జ్ఞానమునకు మించిన అద్భుతాలను మేము చూచునట్లుగా నీ కృపను మాకు దయచేయుము. ప్రభువా, నీవు మాకు ఇచ్చుచున్న ఆనందంలో రెండంత భాగాన్ని మేము పొందుకొనునట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


