నా ప్రియమైన స్నేహితులారా, ప్రభువు ఎల్లవేళల మనతో కూడా ఉన్నాడు. ఆయన బిడ్డలు కూడా ఆయనను వెదకుటకు వచ్చియున్నారు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 30:21వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, "మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును'' అని చెప్పబడినట్లుగానే, దేవుని స్వరమును ఆ విధముగా ఆలకించుట ఎంత అద్భుతముగా ఉంటుంది కదా. మీరు ఆయన స్వరమును వినెదరు. మీరు దానిని వినడాన్ని ఆనందించెదరు. మీరు దానిని ఆలకిస్తూ, స్వీకరించెదరు. దేవుడు ఈ రోజున నా ప్రియ స్నేహితులారా, అటువంటి కృపను మీకును అనుగ్రహించబోవుచున్నాడు. కనుకనే, భయపడకండి.
బైబిల్ నుండి ప్రవక్తయైన ఏలీయా ఆ యొక్క దేశములో కరువును ఎదుర్కొంటు ఉండియున్న కాలములో, పరిసర ప్రాంతములంతట కరువు ఉన్నది. ఆ చుట్టు ప్రక్కల ఎక్కడ ఆహారము లేదు, ప్రజలు ఎంతగానో బాధపడుచుండెను. అటువంటి పరిస్థితులలో, దేవుడు, ఏలీయాతో, 'నీవు ఒక విధవరాలి యింటికి వెళ్లుము, నేను నీకు పోషణ ఇస్తాను.' ఇది మహా అద్భుతమైనది. అతడు ఆ గృహమునకు వెళ్లినప్పుడు, ఆమె తినడానికి వారికి అదియే ఆఖరి భోజనముగా ఆ తదుపరి మరణమే అన్నట్లుగా వారు ఉండి యుండెను. ఇట్టి పరిస్థితులలో మధ్యలోనే తన కోసమై ఆ భోజనమును అతడు అడుగునట్లుగా ఆయన చేసియున్నాడు. నా స్నేహితులారా, మీరు గమనించండి, ఒక విధవరాలి ద్వారా దేవుడు ఏలీయాను పోషించాలని కోరుకున్నాడు. తద్వారా, విధవరాలికి ఒక అద్భుతము చేయాలని ఆమె పట్ల కోరుకున్నాడు.
అవును నా ప్రియులారా, ఆమె కూడా దేవుని సేవకుని మాటల యందు నమ్మిక యుంచి, ఆ ఆహారము అతనికి ఇచ్చియుండగా, మహా అద్భుతంగా ఆమె భోజనము, ఎప్పుడు కూడా తరిగిపోలేదు. ఆ యొక్క పిండిగానీ, నూనె గానీ, ఎప్పుడు కూడా తరిగిపోకుండా ఉండిపోయినది. ప్రభువు ఆమెకు ఎంతటి అద్భుత కార్యము చేసియుండెను కదా. నా ప్రియులారా, మనకును కూడా జరిగిస్తాడు. మన వ్యాపారములో కరువు వచ్చినట్లుగా ఉండియున్నప్పుడు, అందరు కూడా వ్యాపార రంగములో శ్రమపడుచున్నప్పటికిని, అందరు కూడా భూభాగములో కొదువ చేత భాపడుచున్నప్పటికిని, కానీ, స్నేహితులారా, మీ కొరకు మరియు నా కొరకు ఒక స్వరము ఉంటుంది, ' ఇదియే త్రోవ, ఇందులో నడువుడి, 'అని ఒక త్రోవను చూపిస్తాడు. దేవుడు ఒక విధవరాలిని ఆశీర్వదింపబడుట కొరకు ఏలీయాను ఉంచియున్నాడు. ఆలాగుననే, నా ప్రియులారా, మన కొరకు ఆయన ఒక విధవరాలిని చూపిస్తాడు. ఊహించని పరిస్థితులలోనికి మనలను నడిపించడానికి కూడా ఆయన ఒక మార్గమును చూపిస్తాడు. ఊహాకందని వారి ద్వారా ఆయన మనకు పోషించడానికి ఆయన ఆ రీతిగా మనలను నడిపిస్తాడు. ఇంకను వారి కొరకు కూడా దేవుడు మనలను దీవెనకరముగా ఉంచుతాడు. ఇది మహా అద్భుతముగా ఉంటుంది. నా ప్రియులారా, గొప్ప కరువు, కోదువ మధ్యలో ఆ స్వరము మనలను నడిపిస్తుంది. మనము ఈ రోజు ఆ స్వరమును పొందుకుందామా? ఆలాగైతే, రండి ప్రార్థించుకుందాము. నా ప్రియ స్నేహితులారా, దేనికిని చింతించకండి. ఆటంకముల ద్వారా మిమ్మును ఒక స్వరము క్షేమము వైపు నడిపిస్తుంది. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ స్వరము ద్వారా మా జీవితములో అద్భుతమైన మార్గములను తెరవజేయుము. ప్రభువా, మా చుట్టు ఉన్నవన్నియు ఎండిపోవుచున్నప్పటికిని, నీవు మాకు మార్గమును చూపుము. దేవా, మా చెవులలోను, మా ఆత్మతోను నీవు మాట్లాడుము. ప్రభువా, నీవు మాకు సరైన మార్గములో నడుచుటకు మాకు నీ యొక్క మార్గమును చూపించుము. దేవా, నీవు మమ్మును అనాధులగా విడువకుండా, నీ స్వరమును మేము వెండించునట్లుగా నీవు మాతో ఉండుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీవు మమ్మును పోషించుటకు మార్గమును దయచేయుము. దేవా, నీ స్వరాన్ని స్పష్టంగా వినడానికి మా చెవులను తెరువుము. ప్రభువా, మా యొక్క గందరగోళ పరిస్థితులలో ఉన్న ప్రతి క్షణంలో, నీ నడిపింపును మేము గుర్తించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మాకు ఏదియు అర్థం కానప్పుడు కూడా, నిన్ను వెంబడించడానికి మాకు విశ్వాసాన్ని దయచేయుము. ప్రభువా, నీ పరిపూర్ణ చిత్తంలోకి మమ్మును నడిపించు మరియు మా ప్రతి అడుగుకు మార్గనిర్దేశం చేయుము. దేవా, మా కొరత సమయాలలో, నీ దైవీక ఏర్పాటును మాకు చూపించుము. ప్రభువా, నీవు మమ్మును దీవించినట్లుగానే, మేము ఇతరులకు దీవెనగా ఉండునట్లుగా చేయుము. దేవా, నీ పరిపూర్ణ చిత్తంలోకి మమ్మును నడిపించుము మరియు మా ప్రతి అడుగుకు మార్గనిర్దేశం చేయుము. ప్రభువా, నీవు చూపించే మార్గంలో మేము నడవాలని నేను ఎంచుకుంటున్నాము, మేము అదే మార్గములో స్థిరంగా నడుచుటకు మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


