నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 20:4వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే'' అని చెప్పబడినట్లుగానే, మీ శత్రువులకు విరోధముగాను, మీకు విజయమును అనుగ్రహించుటకై మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేయువాడు దేవుడే. ఆమేన్. నా ప్రియులారా, నేడు మనకు విజయమును ఇవ్వడాని కొరకే దేవుడు మనతో వచ్చుచున్నాడు. ఆయన మన నిమిత్తము పోరాడుటకు ఎలాగున వస్తాడు? అని మనము చూచినట్లయితే, బైబిల్ నుండి భక్తులైన యోబును మరియు పేతురును మీరు గమనించినట్లయితే, వారి జీవితములను నాశనము చేయుట కొరకై సాతాను ఎంతగానో పోరాడియున్నాడు. సాతాను యోబు మీద నేరారోపణ చేయుచూ, అంతము చేయవలెనన్న ప్రయత్నములను మనము చూడగలుగుతాము. యేసు, పేతురు చూచి, ' పేతురు అపవాది నిన్ను గోధుమల వలె జల్లించడానికి ప్రయత్నము చేయుచున్నదనియు మరియు నా యొద్ద అనుమతి అడిగియున్నాడు అనియు యేసుప్రభువు చెప్పినట్లుగా మనకు స్పష్టముగా తెలియజేయబడినది. అయినప్పటికిని, యేసయ్య చెప్పిన మాట, " పేతురు నేను నీ నిమిత్తము ప్రార్థించుచున్నాను'' అని సెలవిచ్చియున్నాడు. ప్రభువు మన పక్షమున ఏలాగున పోరాడుతాడు? అని మనము చూచినట్లయితే, అపవాది మనలను నాశనము చేయాలని ప్రయత్నించుచున్నప్పుడు, ఆయన మన పక్షమున పోరాడుతాడు. ఆయన మన కొరకు తన స్వంత ప్రాణమును ఇచ్చియున్నాడు. రక్తమును మన కొరకు చిందించియున్నాడు, అపవాది తీసుకొని వచ్చిన మరణమును సిలువలో ఆయన మ్రింగివేసియున్నాడు. అపవాది కార్యములను సిలువలో నాశనము చేసియున్నాడు. ఆయన దాని నుండి మనకు విడుదలను అనుగ్రహించుచున్నాడు. ఆయన మన నిమిత్తము విజయమును మనకు అనుగ్రహించియున్నాడు. కనుకనే, యేసు మన కొరకు చిందించిన రక్తము మన పక్షమున ఇంకను విజ్ఞాపనము చేయుచున్నది. కనుకనే, మీరు చింతించకండి. సిలువపై ఆయన పొందిన మరణం ద్వారా, ఆయన అపవాది కార్యాలను నశింపజేసి, వాని శక్తి నుండి మనకు విడుదలను కలిగించి, ఆయన మన కొరకు విజయమును పొందియున్నాడు.

నా ప్రియులారా, దేవుడు మనలో ఉంచియున్న పరిశుద్ధాత్మ మన కొరకు విజ్ఞాపనము చేయుచూ, మన పక్షమున పోరాడుచున్నది. ఆ రీతిగా మనము జీవించగలుగుచున్నాము. యేసు ప్రభువు పేతురుతో, "పేతురు నీవు బలపరచబడవలెననియు, నీ విశ్వాసము బలపరచబడవలెననియు, నీ నిమిత్తమై ప్రార్థన చేయగలుగుచున్నాను'' అని తెలియజేసియున్నాడు. అవును, నా స్నేహితులారా, ఈ లోక భూపరమైన పోరాటములలో అతి ప్రాముఖ్యమైనది మన యొక్క ఆత్మయే. మనకు సమస్యలను తీసుకొని రావడము ద్వారా, సాతాను మన ఆత్మను నాశనము చేయుటకు ప్రయత్నము చేస్తూ ఉంటాడు. కానీ, నా ప్రియులారా, యేసు ప్రార్థించి మన ఆత్మ నిమిత్తమై పోరాడుతాడు. నిరాంతరాయముగా ఆయనతో ఉండునట్లుగాను, నిరాంతరాయముగా విశ్వాసములో ఉండునట్లుగాను, ఆయన మన బలహీనతలలో మనకు సహాయము చేయుచున్నాడు. మన ఆత్మలు యేసునకు చెందిన పోరాటములలో విజయమును చేకూర్చుట కొరకు, మీ సమస్యల మధ్యలో మీ ఆత్మను యేసు చేతులకు అప్పగింపబడినట్లుగా ఉండియున్నప్పుడు, భూలోక సంబంధమైన సమస్యలన్నియు దేవుని ద్వారా చాలా సుళువుగా ఎంతో జాగ్రత్త వహించబడుచున్నవి.

నా ప్రియులారా, ఒక ఫర్యాయము అన్నియు పరిష్కారము చేస్తాయి. మీ యొక్క భూలోకపరమైన పోరాటములలో మీ యొక్క ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. చింతించకండి మరియు దేవుని విడిచిపెట్టకండి. దేవునిని త్రోసివేయకండి. ఆయనతో విసుకు చెందకండి. కానీ, విశ్వాసములో నిలిచి ఉండండి. నా ప్రియులారా, ఈ రోజు దేవుని యొద్ద నుండి ఇట్టి విజయమును పొందుకుందామా? నేడు మీ సమస్యల మధ్యలో మీ ఆత్మను యేసుక్రీస్తుకు అప్పగించినప్పుడు, మీ లౌకిక పోరాటములన్నింటిని దేవుడే చూసుకుంటాడు. ఆయన వాటిని క్షణమాత్రంలో పరిష్కరించగలడు. కాబట్టి, ప్రతి లౌకిక పోరాటంలోనూ మీ ఆత్మ స్థితి అత్యంత ప్రాముఖ్యమైనదని గుర్తుంచుకోండి. చింతించకండి, నిరాశ చెందకండి, దేవుని దూరము చేసుకొనకండి, ఆయన పట్ల విసుగు చెందకండి. దానికి బదులుగా, విశ్వాసంలో స్థిరంగా ఉండండి. నేడు, దేవుడు మన కోసం సిద్ధపరచిన విజయమును పొందుకుందాము. ప్రభువు ఇలాగున సెలవిచ్చుచున్నాడ: 'ఊరక నిలిచి ఉండండి, మీ పక్షమున నేనే యుద్ధము చేసి, పోరాడుతాను.' ' ప్రభువైన యేసూ, నేటికి మా పక్షమున పోరాడుచున్నందుకు నీకు కృతజ్ఞతలు' అని చెప్పినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీ పక్షమున యుద్ధము చేసి, అపవాది మీద మీకు విజయమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమకలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, నీవు మా కొరకు నీ ప్రాణమును పెట్టి, నీ రక్తమును చిందించినందుకై నీకు వందనములు. యేసయ్యా, నీ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మా కోసం నీవు పొందిన విజయానికి మీకు వందనాలు. యేసయ్యా, నీ రక్తము ద్వారా మా పాపములను కడిగి మా పాపముల నుండి మాకు విడుదలను అనుగ్రహించుము. దేవా, మా జీవితములో మేము ఎదుర్కొంటున్న ఆటంకములన్నిటిని నుండి మాకు విడుదలను అనుగ్రహించుము, మా రోగముల నుండి మాకు స్వస్థతను అనుగ్రహించుము. దేవా, మేము అపవాది చేత అణిచివేయబడకుండా, అపవాది నుండి మమ్మును కాపాడుము. ప్రభువా, మా ఆత్మలో నీ యందు విశ్వాసముతో బలపరచబడునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, మా పోరాటములన్నిటి నుండి మా పక్షమున పోరాడి మాకు విజయమును అనుగ్రహించుము. దేవా, మా పిల్లల పక్షమున పోరాడి, వారి జీవితములలో ఉన్న పాపము, ప్రతి ఆటంకమును, అనారోగ్యమును మరియు కష్టాల నుండి వారిని విడిపించుము. దేవా, అన్నిటికంటే ముఖ్యంగా, మా ఆత్మలు అపవాదిచే పీడింపబడకుండా లేదా జయించబడకుండా కాపాడుము. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచి, మమ్మును నీకు సమీపముగా మరియు మా యొక్క ప్రతి పోరాటములో నిన్ను ప్రేమించడానికి, నమ్మడానికి మాకు సహాయము చేయుము. దేవా, మా జీవితంలోని ప్రతి రంగంలో నీ అద్భుతాలను మరియు విజయాన్ని మేము అనుభవించునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.