నా ప్రియమైన స్నేహితులారా, నేడు అద్భుతమైన వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:22 వ వచనమును తీసుకొనబడియున్నది. ఆ వచనము, "ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై యుండుటకు కట్టబడుచున్నారు'' అని చెప్పబడినట్లుగానే, దేవుని యొక్క రాజభవనము వలె మనము నిర్మించబడుచున్నాము. ఆలాగుననే, బైబిల్ నుండి ఎఫెసీయులకు 2:21వ వచనములో చూచినట్లయితే, "ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది'' అని చెప్పబడిన ప్రకారము ఇది నిరంతరముగా కొనసాగుచున్న ఒక ప్రక్రియయై యున్నది. ప్రభువు మనలను నిర్మించుట మాత్రమే కాదు గానీ, ఆయన పరిశుద్ధ దేవాలయమగుటకు ఆయన మనలను వృద్ధిపొందించుచున్నాడు. కనుకనే, దేవునితో మనము ఎంత ఎక్కువగా సహవాసము కలిగియుంటామో, అంత అధికముగా ఆయనలో మనము వృద్ధి నొందుతాము. ఆలాగుననే, మన సహోద్యోగులతో మనము సహవాసము కలిగియున్నప్పుడు, దైవజనులతో మనము సహవాసము కలిగియున్నప్పుడు, ప్రభువు మనలను తన పరిశుద్ధమైన దేవాలయము వలె మనలను వృద్ధినొందిస్తాడు. అందుకే బైబిల్ నుండి గలతీయులకు 2:20వ వచనములో చూచినట్లయితే, " నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను'' అని చెప్పబడిన ప్రకారముగానే, క్రీస్తుతో కూడ మనము సిలువ వేయబడినప్పుడు, క్రీస్తే మనయందు జీవించును.
నా ప్రియులారా, దేవునిచేత నిర్మించబడడానికి మనలను మనము ఆయనకు అనుమతి ఇచ్చినప్పుడు దేవుని మహిమ మన మీదికి దిగివస్తుంది. అది ఎంతగానో వృద్ధి చెందుతుంది. అంతమాత్రమే కాదు, దేవుని రూపములోనికి మనము రూపాంతరపరచబడతాము. అందుకే బైబిల్ నుండి 1 పేతురు 2:5వ వచనములో చూచినట్లయితే, "యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు'' అని చెప్పబడిన ప్రకారముగా మనము ప్రతి ఒక్కరము సజీవమైన రాళ్లవలె ఉంటున్నాము. ఇంకను దేవుని మందిరముగా మనము కట్టబడుచున్నాము. దేవుని మందిరములో మనము సజీవమైన రాళ్లవలె ఉన్నాము. కాబట్టి, ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేకమైన వరమును అనుగ్రహించి దీవిస్తాడు. ఒకే గృహములో ఉంటున్న కుటుంబ సభ్యులు ఒకరి నుంచి ఒకరు వ్యత్యాసములు కలిగియుంటారు కదా!
మా కుటుంబ జీవితములో చూచినట్లయితే, నా భర్తతో నిశ్చితార్థము జరిగి, నాకు ఇంకా వివాహముకాక ముందు, నేను నా కళాశాలకు వెళ్లినప్పుడు, నేను సహోదరులు పాల్ దినకరన్‌తో నాకు వివాహము నిశ్చయమైనదని తెలియక నా స్నేహితురాలు, నన్ను ఒక ప్రశ్న అడిగింది. దినకరన్ కుటుంబమును గురించి తను అపహాస్యము చేయుచుండెను. 'ఒకే కుటుంబములో, ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కుమారుడు అందరు కలిసి ఎలాగున పరిచర్య చేస్తారు? అని అడిగింది. ఇది సత్యము కానేకాదు, ఇది జరగడము అసాధ్యము, అని చెప్పింది.' అప్పుడు నాలో నేను నవ్వుకున్నాను. అందుకు వెంటనే, నేను, 'దేవుడు కుటుంబమునంతటిని కూడా ఎందుకు పరిచర్యలో వాడుకొనకూడదు. కుటుంబమంతటిని కూడా ప్రభువు తన పరిచర్యలో వాడుకోవడము అస్సలు ఎందుకు అసాధ్యము అని చెప్పినది.' తను ఎంతో అమాయకత్వముతో ఆ ప్రశ్న అడిగింది అని నేను గుర్తించాను. ఆ తర్వాత, మాకు నిశ్చితార్థము జరిగిన విషయము తనకు తెలిసిన తర్వాత, పరిచర్యను గురించి మొత్తము ఆమె తెలుసుకుంది. ఆమె నా యొద్దకు తిరిగి వచ్చి, తనను క్షమించమని కోరింది. అవును, కుటుంబమంతటిని కూడా దేవుని రాజ్యములో పరిచర్య కొరకు వాడుకోవడము సాధ్యమే అని చెప్పెను. ప్రతి ఒక్కరు దేవుని యింటిలో సజీవమైన రాళ్లవలె ఉంటున్నారు. దేవునిని ఎవ్వరైతే, విశ్వసిస్తారో, ప్రభువు వారిని వాడుకుంటాడు. బైబిల్ నుండి 2 తిమోతికి 2:21వ వచనములో చూచినట్లయితే, " ఎవడైనను వీటిలో చేరక తన్నుతాను పవిత్రపరచుకొనిన యెడల వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయై యుండును'' అని చెప్పబడిన ప్రకారముగా మనలను మనము పవిత్రపరచుకొనిన యెడల దేవుడు అర్హమైన పాత్రగా మనము ఉండగలుగుతాము. ప్రతి ఒక్కరము దేవుని కొరకైన సజీవమైన రాళ్లవలె ఉన్నాము. ఇప్పుడు కూడా ప్రభువు సేవ కొరకు మిమ్మును మీరు సమర్పించుకుంటారా? అడగండి, 'దేవా, నీ హస్తములో అర్హమైన పాత్రగా మమ్మును వాడుకొనుము, నీ రాజ్యములో సజీవమైన రాళ్లవలె మేము కూడా ఉండునట్లుగా చేయుము, ప్రభువా, మా జీవితమును నిర్మించుము, ' అని అడగండి. మనము ఆలాగున ప్రభువును అడుగుదామా? ఆలాగున చేసి, మిమ్మును మీరు దేవునికి సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, ప్రభువు నేటి వాగ్దానము ద్వారా మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మాలో ప్రతి ఒక్కరిని నీ సహవాసములోనికి తీసుకొని వచ్చునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, నీ హస్తము మా మరియు మా కుటుంబము మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, మేమందరము నీ మందిరముగా సజీవమైన రాళ్లవలె కట్టబడుటకు మాకు నీ సహాయమును పంపించుము. యేసయ్య, మాలో ఉన్న ప్రతిఒక్కరికి ఒక ప్రత్యేకమైన వరమును అనుగ్రహించుము. ప్రభువా, నీ యొక్క వాక్యము చేత సమృద్ధియైన నీ కృపను మా మీదికి వచ్చునట్లుగాను, మమ్మును నిర్మించుము. దేవా, నీ కృపాహస్తం మా జీవితంపై వచ్చునట్లుగాను మరియు మమ్మును నీ ఆత్మకు ఆలయముగా కట్టుము. ప్రభువా, నీవు మా కొరకు సిద్ధపరచిన ప్రత్యేకమైన వరమును మాకు దయచేయుము, మరియు నీ సమృద్ధియైన కృప మా హృదయములోనికి ప్రవహించునట్లుగా చేయుము. దేవా, నీ చిత్తానుసారముగా మేము ప్రతి మంచి కార్యము చేయుటకు మమ్మును సిద్ధపరచుము. ప్రభువా, మా జీవితాన్ని నీ వాక్యము ప్రకారముగా కట్టుము. దేవా, నీ కృప మాలో అధికమగుట వలన మేము మహిమ వెంబడి మహిమకు ఎదుగుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా జీవితము ద్వారా ఈ లోకము నీ గొప్పతనమును తెలుసుకొనునట్లుగా మా పాత్ర నీ శక్తితో నింపబడునట్లుగా కృపను దయచేయుము. ప్రభువా, మాలో నీ వాగ్దానమును నెరవేర్చుము మరియు మా జీవితాన్ని నీ సన్నిధికి నివాస స్థలముగా తీర్చిదిద్దుము. దేవా, మా జీవితమునకు మూలరాయిగా ఉండి, మమ్మును నీ మీద స్థిరపరచుము. ప్రభువా, నీ మహిమ కొరకు మమ్మును ఒక అందమైన రాజ భవనముగా కట్టుమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


