నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 1 సమూయేలు 2:30వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకార మొందుదురు'' అని చెప్పబడిన ప్రకారము దేవుని నామమును ఘనపరచువారిని ఆయన నిశ్చయముగా ఘనపరుస్తాడు. "ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును'' అని ప్రభువు వాగ్దానము ఇచ్చియున్నాడు. మన కొరకు ప్రభువు ఎంతగా వేచి ఉండి, ఆశిస్తాడు కదా! మనము ఆయన సన్నిధికి రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. కనుకనే మనలను మనము తగ్గించుకోవాలని ఎదురు చూస్తున్నాడు. కనుకనే, బైబిల్ నుండి మత్తయి సువార్త 23:12వ వచనములో చూచినట్లయితే, " తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడును'' అని చెప్పబడినట్లుగానే, మరొక అనువాదములో చూచినట్లయితే, "తన్నుతాను తగ్గించుకొనువాడు ఘనపరచబడడాని కొరకై లేవనెత్తబడును'' అని వ్రాయబడియున్నది. కనుకనే, మనము దేవుని ఘనపరచుట కొరకై సృష్టింపబడియున్నాము. యోసేపు అవమానించబడినప్పుడు, చెరసాలలో వేయబడినప్పటికిని కూడా దేవుని ఘనపరచుచూనే ఉండి యుండెను. చెరసాలలో ఉండి దేవునికి ప్రార్థన చేసియున్నాడు. అందుకొరకే ఐగుప్తురాజైన ఫరో యోసేపును ఉన్నత స్థానమునకు హెచ్చించియున్నాడు. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 41:38వ వచనములో చూచినట్లయితే, " అతడు తన సేవకులను చూచి, ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? అని యనెను.'' అవును, నా ప్రియులారా, దేవుని ఆత్మను కలిగియున్నటువంటి మనుష్యుని మనము కనుగొనజాలము. అవును, రాజ్యాధిపతులు మిమ్మల్ని ఘనపరచెదరు. కనుకనే, ప్రభువు యెదుట మిమ్మును మీరు తగ్గించుకొని, దేవునికి మనము గౌరవమును మరియు భయభక్తులను కనుపరచినట్లయితే, ఆయన మన యందు ఇష్టపడతాడు.

వేదనాయగం శాస్త్రియర్ అను ఒక దైవజనులు ఏ విధంగా దేవుని ఆరాధించేవారని మీకు తెలుసా? ఆయన తలక్రిందులుగా నిలుచుని, దేవునికి ఆరాధన చేయుచూ ఉండేవారు. ఆయన నేలపైన తన తలను పెట్టి, ఆకాశము వైపు తన పాదములను పెట్టి, ఎంతగానో దేవుని యందు భయభక్తులు కనుపరచి, ఆయనను ఘనపరచేవారు. ఇంకను దేవుని యందు గౌరవమును చూపించేవారు. అటువంటి ప్రార్థనలను దేవుడు ఎంతో విలువైనదిగా చూస్తున్నాడు. వారి యొక్క కుటుంబము ఈ రోజు ఎంతగానో ఆశీర్వదింపబడియున్నది. వారి కుటుంబములో అనేకులు దేవుని ఆరాధిస్తూనే ఉంటారు. వారందరికి దేవుడు అద్భుతమైన స్వరమును అనుగ్రహించియున్నాడు. ఆయన యొక్క పిల్లల పిల్లలు దేవుని కొరకై పాడుతూ ఉన్నారు. అందుకే ఆయన యందు భయభక్తులు కలిగియుండు వారు ఎలా ఉంటారో చెప్పబడియున్నది, "తన యెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది'' అని చెప్పబడిన ప్రకారము మనము దేవునిని భయభక్తులతో ఆరాధించినప్పుడు ఆయన దానిని ఎంతో విలువైనదిగా చూస్తాడు. అందుకే బైబిల్ నుండి సామెతలు 3:9-10వ వచనములలో మనము చూచినట్లయితే, "నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును'' అని చెప్పబడినట్లుగానే, మన రాబడి అంతటిలో ప్రథమఫలమును దేవునికి ఇచ్చి, ఆయనను ఘనపరచవలెనని వాక్యము అంటున్నది.

ఆ విధంగానే, దేవునికి తన రాబడిలో ఇచ్చి దేవుని ఘనపరచి ఆశీర్వదించబడియున్నదని మనము చూడగలము. సహోదరులు రుద్రమాచారి మరియు సహోదరి విజయలక్ష్మిగార్ల యొక్క సాక్ష్యమును ఈలాగున పంచుకొని యున్నారు. హనుమకొండ కాజిపేట సమీపముగా ఉన్న తరలపల్లి అను గ్రామము వారిది. వారు హనుమకొండ ప్రాంతము నుండి వచ్చి ఈలాగున చెప్పారు. 2019వ సంవత్సరములో వారు వ్యక్తిగతంగా యేసయ్యను తెలుసుకొనియున్నారు. సహోదరులు రుద్రమాచారిగారు ఇతర దేవుళ్లను ఆరాధించేవారు. తద్వారా, తన భార్యయైన సహోదరి విజయలక్ష్మి చేతబడి శక్తులు మరియు మంతమ్రులు మరియు చీకటి శక్తుల వలన అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఒకరోజు వారి స్నేహితుడైన ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వారి కొరకు ప్రార్థించి, యేసు పిలుచుచున్నాడు పరిచర్యను గురించి చెప్పియున్నారు. వరంగల్‌లో ఉన్నటువంటి యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమును వారు సందర్శించారు. అక్కడ ఉన్న ప్రార్థన యోధులు వారిని గురించి ప్రార్థించిన అనంతరము ప్రార్థన గోపురము యొక్క నిర్మాణ పధకములో వారిని భాగస్థులుగా చేర్పించియున్నారు. ఆ దంపతులు పరిచర్య నిమిత్తము ఐదు వేల రూపాయలను కానుకగా ఇచ్చియున్నారు. దినకరన్ కుటుంబము యొక్క ప్రార్థనల యందు వారు విశ్వసించారు. మా యొక్క మాస పత్రికను వారు పొందుకుంటుండేవారు. ఆ తర్వాత, వారి దుఃఖమంతటిని సంతోషముగా మార్చివేశాడు. ఈ రోజు వారిని చేతబడి శక్తులు మరియు మంతమ్రులు మరియు చీకటి శక్తులన్నిటి నుండి విడుదల చేసియున్నాడు. నా ప్రియులారా, దేవునికి ఇచ్చుట ఎంత ఆశీర్వదాకరమైయున్నది కదా! ప్రభువు యెదుట వారు తమ్ముతాము తగ్గించుకొని, త్యాగపూర్తిముగా దేవుని పరిచర్య కొరకు కానుకలను ఇచ్చియున్నారు. వారి సంపదతో ప్రభువును ఘనపరచియున్నారు. ప్రభువు కూడా వారికి ఒక నూతన గృహమును ఇచ్చి, వారిని ఆశీర్వదించియున్నాడు. ఈ రోజు వారు యేసుప్రభువును విశ్వసించుచున్నారు. ఎవరి జీవితములోనైన జరిగేటటువంటి ఒక గొప్ప అద్భుతము రక్షణయై యున్నది. ఈ రోజు ప్రభువును సేవించగలిగే ఆనందమును వారు పొందుకొనెదరు. కనుకనే, నా ప్రియులారా, "...నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును'' అని సెలవిచ్చినట్లుగానే, మనము దేవునిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యముగా చూడకూడదు. ప్రభువు మనకు ఇచ్చినటువంటి సమస్తముతో ప్రభువు ఘనపరచడానికి మన హృదయములను మనము ఆయనకు సమర్పించుకుందాము. మా కుటుంబ జీవితములో కూడా ఆలాగుననే జరిగింది. మా బిడ్డలు జన్మించినప్పుడు కూడా నా భర్తగారు చేసిన మొదటి కార్యమేదనగా, పరిచర్య కొరకు వారిని ప్రతిష్టించారు. అందునిమిత్తమే, మా బిడ్డలు ఈ రోజు ఆశీర్వదింపబడియున్నారు. కాబట్టి, నా ప్రియులారా, మనము కలిగియున్న సమస్తమును ప్రభువునకు సమర్పించడానికి ముందుకు వద్దాము. మీ రాబడి అంతటిలో ప్రభువునకు ఇచ్చి, ఆయనను ఘనపరచండి. మీ సమయమంతటిని ఆయనకు ఇచ్చి, ఆయనను ఘనపరచండి. అప్పుడు నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, తగ్గింపు హృదయముతో మేము నీ సన్నిధికి వచ్చియున్నాము. ప్రభువా, మేము మాట్లాడుచున్న మరియు ఆలోచించుచున్న మరియు చేయుచున్న ప్రతిదానిలో నిన్ను ఘనపరచడానికి మాకు నేర్పించుము. దేవా, మేము నీ సన్నిధిని మరియు నీ ఆశీర్వాదాలను చులకనగా తీసుకున్న సమయాలకు మమ్మును క్షమించుము. ప్రభువా, నీ యెదుట మమ్మును మేము తగ్గించుకోవడానికి మరియు ప్రతిరోజూ నీ ముఖ సన్నిధి కాంతిని వెదకడానికి మాకు సహాయం చేయుము. దేవా, నిన్ను గౌరవించే మరియు నిజాయితీతో నిన్ను ఆరాధించే హృదయాన్ని మాకు అనుహ్రించుము. ప్రభువా, మా జీవితం మరియు మా సంపదతో సహా నీవు మాకు ఇచ్చిన ప్రతిదానితో నిన్ను గౌరవించడానికి మాకు సహాయం చేయుము. యేసయ్యా, నీవిచ్చిన వాగ్దానం ప్రకారం నిన్ను గౌరవించబడటానికి మమ్మును పైకి లేవనెత్తుము మరియు మా జీవితాన్ని నీ కటాక్షముతోను మరియు కృపతో నింపుము. ప్రభువైన యేసయ్యా, మమ్మును మేము తగ్గించుకొని, నీ ఆశీర్వాదముల కొరకై నీవైపు చూస్తున్నాము. దేవా, నీ హస్తము మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. తండ్రీ, పై చెప్పబడిన దంపతులను ఆశీర్వదించినట్లుగా, నేడు మా మీదికి నీ ఆశీర్వాదములు దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, ఉద్యోగములేని మాకు ఒక నూతన ఉద్యోగము, గృహములేని మాకు గృహమును, వివాహ జీవితమును, ఇచ్చి, మమ్మును దీవించి, మమ్మును ఘనపరచుము. ప్రభువా, మేము నీ పరిచర్యకు ఉత్సాహముగా ఇవ్వడానికి మరియు నిన్ను ఆరాధించడానికి మా హృదయములను తెరువుము. దేవా, ఈ రోజు రెండంతలుగా ఘనత మా మామీదికి దిగివచ్చునట్లుగా చేయుమని యేసు యొక్క గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.