నా ప్రియమైన స్నేహితులారా, నేడు మనకు ఒక నూతన నిరీక్షణ ఉన్నది. ప్రతిరోజు ఆయన కనికరములు మన పట్ల నూతనముగా ఉన్నవి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 40:31వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు నేడు మీకు నూతన బలమును అనుహ్రించుచున్నాడు. అంతమాత్రమే కాదు, మీరు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నా ప్రియులారా, అటువంటి బలమును మీరు నేడు పొందుదురు. ఈ లోకములో అనేకమంది, వారి యొక్క ధనము మీద ఆధారపడుతుంటారు. వారు భద్రపరచబడి ఉండుట కొరకు, వారి యొక్క బిరుదుల మీదను మరియు వారి యొక్క స్థాయి మీదను ఆధారపడియుంటారు. బలముగా ఉన్నారు అనిపించడము కోసము వారి చుట్టు ఉన్నవారి మీద ఆధారపడుతారు. కానీ, అవన్నియు కూడ గతించిపోవును. కేవలము ప్రభువు మాత్రమే నిరంతరము నిలిచియుండువాడు. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.
అవును, నా ప్రియులారా, మీరు ఈ రోజున దేవుని యందు నిరీక్షణ కలిగియుండుట నిమిత్తము ఎంపిక చేసుకొనియున్నారు. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నట్లుగానే, " మీ యొక్క బలము నూతనపరచబడుతుంది'' అని చెప్పబడియున్నది. నా మట్టుకైతే, ఉపవాసము ఉండి, ప్రార్థించుట ద్వారా నా బలమును నూతనపరచబడుటను నాకు చూపించియున్నాడు. ఆ రీతిగా ఆయన బలము కొరకు మనము దేవుని సన్నిధిలో ఉపవాసముతోను మరియు ప్రార్థనలతోను వేచియుండెదము.
నేను చిన్నవయస్సులో ఉన్నప్పుడు ఉపవాసము ఉండి ప్రార్థించేవాడను. మా తల్లిగారు మరియు మా తండ్రిగారు అందులోనికి నన్ను నడిపించియున్నారు. మొదటిసారి నేను ఉపవాసము ఉన్నప్పుడు, నాకు చాలా ఆకలి అనిపించినది. ఒక గంట తర్వాత, మరల నాకు ఆకలి అనిపించినది. అదే నాకు గొప్పగా సాధించినట్లుగా అనిపించినది. నా కడుపు మాత్రము ఆకలికి సణగడము ప్రారంభించినట్లుగా ఉన్నది. దోసెలు మరియు చట్నిలు నా ఊహలలో కనబడుచున్నవి. ఇక మీదట నేను ఉపవాసము ఉండలేను. నేను ఆకలికి ఉండలేకపోవుచున్నాను, నాకు దోసె కావాలి అని మా అమ్మ దగ్గరకు వెళ్లి చెప్పాను. తదుపరి ఫర్యాయము నాకు ఆకలి అవుతుంది అమ్మా అని చెప్పినప్పుడు, అమ్మా, నాకు ఏదైనా పానీయమును ఇస్తానని చెప్పి, నాకు హార్లిక్స్ ఇచ్చారు. రెండవ ఫర్యాయము నా ఆహారముగా నాకు హార్లిక్స్గా ఉండినది. ఆ తర్వాత, నేను ఉపవాసము ఉండి, ప్రార్థించియున్నప్పుడు, దేవుని సానిధ్యమును అనుభూతి చెందుట ఆరంభమైనది. ఆయన వాక్యమును చదవడము ప్రారంభించాను. ఆయన వాక్కును స్వీకరించాను. నూతనమైనది నా హృదయము నింపియున్నది. ఉపవాసము మరియు ప్రార్థన ఆ రీతిగా కొనసాగించబడుచుండగా, నా భూపరమైన చింతలన్నియు కూడా కనుమరుగై పోయినవి. భూపరమైన ఆకలి దాహము ఆశలన్నియు కూడా కనుమరుగై పోయినవి. ఆత్మ కొరకైన ఆశ నాలో ఆరంభించబడినది. తద్వారా, నా ఆత్మ క్రియాత్మకంగా చురుకుగా ఉంటున్నది. దేవుని యొక్క వాక్యము చదవడములో గొప్ప శాంతిని అనుభూతి చెందాను. ప్రభువు నా కోసము ఏమి చేయబోవుచున్నాడని ఆయన నాకు చెబుతూ ఉండడము ద్వారా, నన్ను నూతనమైన కార్యములలోనికి నడిపించా డు. తద్వారా, నా హృదయము బలపరచబడియున్నది. నేను బయలు వెళ్లి, కొద్ది రోజులలోనే ఒక గొప్ప విజయమును చూడగలిగాను.
నా ప్రియులారా, ఆయన మొదటిగా మిమ్మును సిద్ధము చేస్తాడు. బలమును స్వీకరించడానికి మరియు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగరడానికి ఇంకను మీరు ఎదురు చూస్తున్న అద్భుత కార్యములను పొందుకొనడానికి మీరు ప్రభువులో నిరీక్షణ కలిగియుండడానికి దేవునికి వందనములు తెలియజేయండి. అది ఎప్పటికిని వైఫల్యము చెందదు. కనుకనే, నేడు మీరు ఒకవేళ ఎంతో కాలముగా ఒక మంచి ఉద్యోగము కొరకు, సంతానము కొరకు, ఇంటి కొరకు, మంచి భవిష్యత్తు మరియు వివాహ జీవిత భాగస్వామి కొరకు ఎదురు చూస్తునట్లయితే, ఇప్పుడే మీ జీవితములను దేవునికి సమర్పించుకున్నట్లయితే, దేవుని కొరకు ఎదురు చూచు మీరు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురునట్లుగా దేవుడు మీకు నూతన బలమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మాకిచ్చిన నిరీక్షణ కొరకై మరియు మాకిచ్చిన విశ్వాసమును బట్టి నీకు వందనములు. తద్వారా, మేము అంతము కాము, మేము నిన్ను కలిగియుండుటకు మాకు నీ కృపను దయచేయుము. ప్రభువా, నీ యొక్క మాధుర్యమైన సాన్నిధ్యమును మేము స్వీకరించుటకు మాకు సహాయము చేయుము. దేవా, నీ ద్వారా మేము మంచి యీవులను మరియు వరములను పొందుకొనుటకు నీవు అటువంటి కృపను మాకు ఇమ్ము. యేసయ్యా, మేము పక్షిరాజు వలె పైకి ఎగురునట్లుగా, నీ యందు నూతన బలమును పొందుకొనుటకు నీ కొరకు వేచియుండుటకు మరియు మాకు అటువంటి హృదయమును అనుగ్రహించుము. దేవా, నిన్ను వెదకకుండా, నిన్ను అడగకుండా, నీవు లేకుండా మేము త్వరపడకుండా ఉండునట్లుగాను, నీ కొరకు వేచియుండకుండునట్లుగాను, నీ మీద ఆధారపడియుండు హృదయమును మాకు దయచేయుము. ప్రభువా, నీ యొక్క ఆత్మతోను మరియు నీ యొక్క వాక్యము నింపుదలతోను మేము అనుభూతి చెందునట్లుగా మా హృదయములు మరియు ఆత్మలో పూర్తిగా నింపబడునట్లుగా మాకు నీ యొక్క కృపనిమ్ము. దేవా, మేము నీ కొరకు వేచియున్నందు వలన, ఆ తర్వాత మేము అద్భుత కార్యములను చూచునట్లుగా మాకు సహాయము చేయుమని యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున స్తుతించుచూ ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


