నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనము ప్రభువునందు ఆనందించు దినముగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోబు 33:28వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మన ప్రాణమును విమోచించియున్నాడు. నా స్నేహితులారా, దేవుడు కూపములో నుండి మీకు పరిపూర్ణ విడుదలను అనుగ్రహించును గాక. అపవాది ఒకవేళ మిమ్మును వల విసిరి పట్టుకొనియున్నాడేమో? మరణ కూపములోనికి మీ జీవితములో వైఫల్యము సంకల్పించి, మీ దేహము మీద వైకల్యము కల్పించి, మీ ఆనందములో లోపము కల్పించి, కుటుంబ పరిస్థితులలో వైఫల్యము సంకల్పించి, మీ యొక్క నీతిలో వైఫల్యము సంకల్పించి, మీ జీవితములో వైఫల్యము సంకల్పించి యుండవచ్చును. కానీ, నా ప్రియ స్నేహితులారా, పై వచనము సెలవిచ్చుచున్నట్లుగానే, " నా జీవము వెలుగును చూచుచున్నది'' అని చెప్పుచూ మీరు ఆనందించండి. " నేను జీవపు వెలుగును చూచి ఆనందించులాగున జీవించెదను. యేసు జీవపు వెలుగుగా మీలోనికి వచ్చుచున్నాడు. అందుకే, "చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను''అని లేఖనములలో చెప్పబడియున్నది. యేసు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఆ రీతిగా చేసియున్నాడు. కనుకనే, మీరు దిగులుపడకండి.

ఒకానొక సమయములో ఆయన దయ్యముల చేత పట్టబడిన ఒక యౌవనస్థుని కలుసుకున్నాడు. అతని తండ్రి దానిని భరించలేక తన కుమారుని యేసు చెంతకు తీసుకొని వచ్చాడు. దురాత్మ అతనిని చంపివేయుటకు ప్రయత్నము చేయుచుండెను. నోటి వెంట నురుగు కారుచుండెను. తద్వారా, అతడు మాటలాడలేకపోవుచుండెను. దురాత్మల ప్రభావము ద్వారా అతడు నీళ్లలోనికి, అగ్నిలోనికి పడవేయబడుచూ ఉండేవాడు. అయితే, ఆ తండ్రి తన కుమారుని నిమిత్తము యేసుప్రభువు చెంత బ్రతిమాలుకొనుచుండెను. యేసు ప్రభువు ఆ యొక్క కుమారుని మీద కనికరపడ్డాడు. ఎందుకంటే, అపవాది ఆ పిల్లవానిని మరణ కూపములో వేయాలని ఎంతగానో ప్రయత్నించుచుండెను. వాని జీవితమును నాశనము చేయాలని అనుకున్నాడు.

కానీ, ప్రభువు కనికర సంపన్నుడు ఉన్నాడు. గనుకనే, అపవిత్రాత్మను ఆ పిల్లవానిలో నుండి బయటకు రావాలని ఆజ్ఞాపించియున్నాడు. ఆ యొక్క పిల్లవానిని పరిపూర్ణముగా అపవాది హస్తములలో నుంచి ఆయన వానిని విడిపించి, వానికి నూతన జీవమును అనుగ్రహించియున్నాడు. తన వెలుగును వానిలో ప్రకాశింపజేసియున్నాడు. నా ప్రియులారా, ఈ రోజున మనలో నుండి అంధకారమంతయు తొలగించబడుతుంది. మీరు జీవపు వెలుగును కలిగియుండుటకు విశ్వసించుచున్నారా? నేడు మనమందరము కలిసి జీవపు వెలుగును స్వీకరించుదాము. ఇటువంటి జీవపు వెలుగును మీరు కూడా కలిగియుండాలంటే, నిశ్చయముగా మీ జీవితములను దేవునికి సమర్పించినప్పుడు, వెలుగుగా ఉన్న యేసు మీలోనికి వచ్చి, మీ చీకటి కూపమంతటిని తొలగించి, మిమ్మును జీవపు వెలుగుగా మారుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు నీకు వందనములు. యేసయ్యా, నీ యొక్క వెలుగును నీవు మాకు అనుగ్రహించుచున్నందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు జరిగించినట్లయితే, సమస్తమును మార్చబడతాయి. కనుకనే, దేవా, మా హృదయము గొప్ప సంతోషమును, నిరీక్షణను స్వీకరించునట్లుగా చేయుము. ప్రభువా, అపవాది మాకు తీసుకొని వచ్చిన ప్రతి అంధకారము వంటి పరిస్థితులను నీవు చూచి, మాలో ఉన్న ప్రతి అంధకారము ఫటాపంచలై పోవునట్లుగా మా అంధకారము నుండి మమ్మును బయటకు తీసుకొని రమ్ము. దేవా, మమ్మును వెంటాడుచున్న మరణ భయము, మా జీవితము నాశనము చేయబడాలనియు, వివాహ బంధము విచ్ఛిన్నము కావలెననియు, మా ఆరోగ్యము దెబ్బతినవలెననియు ప్రయత్నించుచున్న అపవాది నుండి మమ్మును విమోచించి, మాకు జీవపు వెలుగును దయచేయుము. దేవా, మా జీవితములో మా దేహములను నీవు చేపట్టి, నీవు మాకు రక్షకునిగా ఉండి, మా దేహములో ఇప్పుడే అద్భుతమును ఆజ్ఞాపించుము. ప్రభువా, మేము ఎల్లప్పుడు మరణ కూపములోనికి వెళ్లకుండా, మమ్మును నీవు జీవములోనికి తీసుకొని రమ్ము. ప్రియమైన ప్రభువా, మా జీవితము నుండి సమస్త అంధకారమును, భయమును తొలగించుము. దేవా, నీవు మా రక్షకుడవుగా ఉండి, ప్రతి కీడు నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, మా శరీరమును స్వస్థపరచుము మరియు మా కుటుంబమును మరల పునరుద్ధరించుము మరియు మా జీవితంలో అద్భుతములను జరిగించుము. దేవా, మేము మరణ కూపములోకి దిగకుండా చూడుము. నీ జీవపు వెలుగు మాలో ప్రకాశించునట్లుగానే, మమ్మును బలపరచి, మా అడుగులను నడిపించుము. ప్రభువా, నీ అద్భుతమైన శక్తిని మేము అనుభవించునట్లుగా, మమ్మును నీ యొక్క జీవపు వెలుగులో భద్రపరచుము. దేవా, మాలో ఉన్న చీకటి తొలగింపబడి, నీ వెలుగును మాలోనికి ప్రకాశింపజేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.