నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు వాగ్దానముగా బైబిల్ నుండి లూకా 8:50వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, "...భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడును...'' అని యేసు సెలవిచ్చినట్లుగానే, మీరు ఆయన యందు నమ్మిక మాత్రము ఉంచినప్పుడు మీరు స్వస్థపరచబడుదురు అని వ్రాయబడియుండెను. అందుకే, ఆయన నమ్మిక మాత్రము ఉంచి, విశ్వసించు అని అంటున్నాడు. ఏ సందర్భములో ఈ మాటను యేసు సెలవిచ్చియున్నాడు? బైబిల్‌లో, " యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు యేసుక్రీస్తు అతనితో కూడా ఈ మాటలను చెప్పియున్నాడు, " భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో తెలియజేసియున్నాడు. యాయీరు యింటికి రావడానికి యేసు ప్రభువు ఆలస్యము చేయుచుండెను. తన యింటికి వచ్చి, తన యొక్క పండ్రెండు సంవత్సరముల చిన్న బిడ్డను స్వస్థపరచమని యాయీరు యేసయ్యను వేడుకున్నాడు. ఆ చిన్న బిడ్డ చనిపోవుటకు సిద్ధముగా ఉండెను. అయితే, యేసయ్య, అతని యింటికి వెళ్లుటకు ఆలస్యము చేయుచుండెను. ఆయన అతని యింటికి వచ్చుచున్నప్పుడు ఆయన చుట్టు అనేకమంది జనులు కూడి ఉండెను. పండ్రెండేండ్ల నుండి రక్తస్రావ రోగముగల యొక స్త్రీ యెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి, ఆ జనుల గుంపులో ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆ విధంగానే, అనేకమంది, యేసయ్య ద్వారా స్వస్థతను పొందుకొని యుండి ఉండవచ్చును. యేసయ్య, అందుకనే త్వరత్వరగా అతని యింటికి రాలేకపోయి ఉండవచ్చును. అక్కడ కొంచెము ఆలస్యము జరిగియున్నది. యేసయ్య, ఆ స్థలమునకు చేరునంతలోనే, ఆ చిన్న బిడ్డ మృతి చెందియున్నది. మనము మునుపటి వచనములో చూచినట్లయితే, "ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింట నుండి యొకడు వచ్చి, ఈ విధంగా అన్నాడు, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను'' ప్రకారముగా, ఆయనను శ్రమపెట్టవద్దని చెప్పినట్లుగానే, అనేకసార్లు మనము కూడా మన చుట్టు ఉన్నవారి యొద్ద నుండి ఇటువంటి నిరుత్సాహపరచే మాటలను మనము వినియుంటాము కదా! ఇంకను,' మీ జీవితములో అంతా మృతమై పోయియున్నది, నీవు ఇక ఈ విషయమును పొందుకొనలేవు, నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు, నీ గర్భములో నీ బిడ్డ చనిపోయినది,' అని ప్రజలు ఆ విధంగా అనేకమైన విషయములను పలికి యుండవచ్చును. ఇంకను, ' నీవు ఒక అద్భుతమును పొందుకొనుటకు ఇక నీకు అవకాశము లేదు అని చెప్పియుండవచ్చును. మీరు అటువంటి మాటలు అనేకముగా వినియుండవచ్చును. నీ బిడ్డ ఇక మీ యొద్దకు ఇక రానే రాదు, నీవు ఇక నీ బిడ్డలతో సంతోషముగా ఉండలేవు, నీ జీవితములో ఇక ఎన్నటికిని నీవు సంతోషమును చూడలేవు, ఇంకను నీవు ఎన్నటికిని స్వస్థతను పొందుకొనలేవు అని డాక్టర్లు చెప్పియుండవచ్చును.' అయితే, మీరు అటువంటి మాటలను వినియున్నారేమో? కానీ, యాయీరుతో చెప్పబడిన మాటలను, యేసయ్య కూడా వినియున్నాడు. యేసయ్యా మన మాటలను వినడము మాత్రమే కాదు, ఆయన మనలను పట్టించుకుంటాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 139:4వ వచనములో చూచినట్లయితే, " యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది'' ప్రకారము మన నోట నుండి ఒక మాట రాకమునుపే ప్రభువు ఆ మాటలను ఎరిగియున్నాడు. ఆలాగుననే, ప్రభువునకు మన మార్గములన్నియు కూడా తెలిసేయున్నవి.
అందుకే ఈ ఈలాగున వ్యక్తి అంటున్నాడు కదా, 'బోధకుని నీవు ఇక శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయియున్నది.' అయినప్పటికిని, యేసయ్య, యాయీరు యొక్క గృహమునకు వెళ్లియున్నాడు. యేసయ్య, ఆ బిడ్డ మృతి చెందిన ఆ మరణపడక యొద్దకు వెళ్లి, "ఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.'' వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి. తను ప్రాణమును తిరిగి పొందుకొనెను. ఒక అద్భుతము జరిగియున్నది. తన తల్లిదండ్రులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. వారు ఈ అద్భుతమును నమ్మలేకపోయారు. ఆమె చనిపోయినప్పుడు, తన తల్లిదండ్రులు మరియు ప్రజలు ఎంతగానో ఏడ్చుచుండెను. ఆ మృతి చెందిన బిడ్డ కొరకు ఏడ్వడానికై విలపించువారిని కూడా ఒకవేళ వారు రప్పించియుండవచ్చును. ప్రజలు విలపిస్తూ, ఏడుస్తూ ఉన్నారు. అయితే, యేసయ్య, ఆ గృహములోనికి ప్రవేశించి, ఆ బిడ్డను తిరిగి జీవింపజేసియున్నాడు. యేసయ్యా, జీవమును, పునరుత్థానమునై యున్నాడు. కనుకనే, మనము దేవుని నమ్మినట్లయితే, మనము దేవుని యొక్క మహిమను చూచెదము. మనము యేసయ్యను, విశ్వసించినట్లయితే, ఎన్నటికిని మృతి చెందము. మనము జీవమును కలిగియుండగలుగుతాము. అవును, నా ప్రియ స్నేహితులారా, అసాధ్యమైన వాటియందు విశ్వాసముంచండి. ఒకసారి మేము నాగపూర్ పట్టణములో ఉన్నప్పుడు ఉదయకాల కూడికలో నేను పరిచర్య చేయుచుండగా, అపవిత్రాత్మ పట్టినటువంటి అనేకమందిని ప్రభువు విడుదల చేసియున్నాడు. అపవిత్రాత్మల చేత బాధింపబడుచున్న తల్లులను చూచినప్పుడు, నేను ఎంతగానో బాధపడ్డాను. వారు నేలపైన అటుఇటు పొర్లాడుచున్నారు. వారిలో ఉన్న దురాత్మ శక్తులు ఆవిధంగా చేయుచుండెను. అయితే ప్రార్థన సమయములో కూడా వారినందరిని కూడా ప్రభువు విడుదల చేసియున్నాడు. నేను ఎంతో సంతోషముగా అక్కడ నుండి వెళ్లాలనుకున్నాను. నా పాదాలు ఇంకా నేలను కూడా తాకలేదు, రక్తస్రావము సమస్యతో బాధపడుచున్నటువంటి ఒక స్త్రీ అక్కడకు వచ్చి, నన్ను పట్టుకొనియున్నది. నా చేతిని ఆమె గట్టిగా పట్టుకున్నది. నేను ఇంకా ముందుకు వెళ్లలేకపోయాను. సహోదరి, నా స్వస్థత కొరకు దయచేసి ప్రార్థన చేయమని కోరినది. నేను తన మాటలను వినలేకపోయాను కూడా నా చుట్టు ప్రజలు గుమికూడియున్నారు. అయితే, నేను కేవలము ఒక క్షణము కళ్లు మూసుకొని ఆమె కొరకు ప్రార్థించాను.
మరుసటి రోజు సాయంకాలపు కూడికలో ఆమె ముందుకు వచ్చి, తన సాక్ష ్యమును పంచుకొనియున్నారు. సహోదరి ఇవాంజెలిన్‌గారి దగ్గరకు నేను వెళ్లలేకపోయాను. ఇంకను నా సమస్యలన్నియు ఆమెతో పంచుకోవాలని ఆశించాను. అయితే, దైవజనునిరాలిని తాకితే చాలు, నేను స్వస్థతను పొందుకుంటాను అని నమ్మాను. అనేక సంవత్సరములుగా తనకు ఎంతో అధికమైన రక్త స్రావము సమస్య ఉండి యుండెను. అయితే, ఆ సమయములోనే ప్రభువు ఆమెను తాకి స్వస్థపరచియున్నాడు అని ఆమె తన సాక్ష్యమును పంచుకున్నప్పుడు నేను ఎంతగానో ప్రభువునందు ప్రోత్సహించబడ్డాను. ప్రభువును నేను స్తుతించియున్నాను. తనకు ఎంతో అధికమైన విశ్వాసమున్నది. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మనలను తాకి స్వస్థపరుస్తాడు అని సందేహము లేని విశ్వాసమును మనము కలిగియున్నప్పుడు, ప్రభువు మన పట్ల ఒక అద్భుతమును చేస్తాడు అని నమ్మినప్పుడు, ప్రభువు ఒక అద్భుతమును మన కొరకు జరిగిస్తాడు అనియు, అసాధ్యమైన వాటిని గురించి మనము విశ్వసించినప్పుడు, అప్పుడే, అద్భుతములు నిశ్చయముగా జరుగుతాయి. ప్రార్థన యందు మీరు విశ్వాసముతో ఏవైతే, అడుగుతారో, వాటిని నిశ్చయముగా పొందుకుంటారు. యాయీరుతో యేసయ్య అదే చెప్పియున్నాడు, ' నీవు భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, నేను ఇది చేయగలుగుతాను అని విశ్వాసముంచుము, నీ యొక్క చిన్నకుమార్తె స్వస్థతను పొందుకుంటుంది అని చెప్పియున్నాడు.' నా ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు యొక్క స్వస్థతాశక్తి మీద విశ్వాసముంచండి. ఈ రోజే మీరు ఒక అద్భుతమును పొందుకొనగలరు. మీకు వయస్సు పెరుగుచున్నది కాబట్టి, అందుకే మీకు ఈ వ్యాధులు కలుగుచున్నవి, వైద్యులు పరీక్షించి, మీ గర్భము మృతమైనదని ఇక సంతానము కలుగదు అని అంటున్నారేమో? అటువంటి మాటలను వినకండి, కేవలము దేవుని యొక్క స్వస్థతా శక్తి మీద మీరు విశ్వాసముంచండి. నేటి వాగ్దానము ద్వారా ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, నీవు ఇచ్చిన మాట చొప్పున మమ్మును తాకి స్వస్థపరచుము. దేవా, మా శరీరములో ఉన్న ప్రతి బలహీనతను మా నుండి తొలగించుము. ప్రభువా, మాలో పనిచేయని ప్రతి అవయమును తాకి స్వస్థపరచి, మాకు నూతన అవయవములను దయచేయుము. దేవా, మా యొక్క మృతమైన శరీరములో ఉన్న అవయములలోనికి నీ జీవమును పంపించి, మరల మమ్మును జీవింపజేయుము. ప్రభువా, ఈ రోజు మేము ప్రతి అసాధ్యమైన పరిస్థితిని నీ ముందు ఉంచుచున్నాము. దేవా, భయం, సందేహం మరియు నిరాశ మమ్మును చుట్టుముట్టినప్పుడు, మేము నిన్ను నమ్మి, నీ యందు విశ్వాసముంచడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, నీ వాగ్దానములను చలించకుండా పట్టుకొని ఉండటానికి మా విశ్వాసాన్ని బలపరచుము. దేవా, మా జీవితంలోని ప్రతి నిర్జీవమైన ప్రాంతంలోనికి జీవమును పలికి, పునరుద్ధరణను తీసుకురమ్ము. దేవా, నీ యొక్క అద్భుతమైన శక్తితో మా శరీరాన్ని, మనస్సును, కుటుంబాన్ని మరియు భవిష్యత్తును స్వస్థపరచుము. ప్రభువా, నీ సన్నిధితో మా యొక్క ప్రతి దుఃఖాన్ని తొలగించి, మా హృదయమును సమాధానముతో మరియు ఆనందంతోను నింపుము. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏదియు లేదని మేము నమ్మునట్లుగా సహాయము చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


