నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు దేవుని వాక్యమును మీతో పంచుకోవడము నాకు ఎంతో సంతోషకరముగా ఉన్నది. అందుకే, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి మీకా 7:7వ వచనమును చూచినట్లయితే, "...యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు మన ప్రార్థనలను ఆలకించడము మనకు ఎంతో సంతోషము కదా! ఇంకను దేవుడు మన ప్రార్థనలు ఆలకించడము ఎంత మధురమై యున్నది కదా! మనము ప్రార్థనలో దేవుని కొరకు ఎంతగానో కనిపెడుతూ ఉంటాము. అయితే, దేవుడు మన ప్రార్థనలను ఆలకించి, మన జీవితములో అద్భుతాలను మనకు జరిగించినప్పుడు మనకు ఎంత ఆనందముగా ఉంటుంది కదా! దేవుని యొక్క ఆనందము మరియు బలము మనలను నింపడాన్ని మనము అనుభూతి చెందుతాము. మనము ఎగురుచున్నట్టుగా భావిస్తాము. అందుకే బైబిల్ నుండి యెషయా 40:31వ వచనములో చూచినట్లయితే, "యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు'' అని చెప్పబడిన ప్రకారము యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొనెదరు.

నా ప్రియమైన వారలారా, మన ప్రార్థనలకు జవాబులు రావలెనని మరియు ప్రభువు ఆలకించాలని అనేక రోజులు మరియు నెలలు, సంవత్సరములు మనము ఎదురు చూస్తూ ఉంటాము. ఆలాగుననే, మనము ప్రభువు యొక్క సన్నిధిలో ఎంతగా ఎదురు చూస్తుంటామో, ఆలాగే, మనము ప్రభువు యొక్క సన్నిధిలో అంతగా దేవుని యొక్క బలమును పొందుకుంటూ ఉంటాము. మనలను బలపరచుట కొరకే మనము ఎదురు చూచు విధంగా ప్రభువు మనలను ఆలాగున ఆపుతాడు. కాబట్టి, ప్రియులారా, మీరు చేసిన ప్రార్థనలన్ని ఏవియు కూడా వ్యర్థముగా పోనేపోవు. తప్పకుండా, మీ ప్రార్థనలన్నియు ప్రభువు ఆలకిస్తాడు. మీ కన్నీరు అంతయు ఆయన తుడిచివేస్తాడు. మీకు ప్రతిఫలము నిశ్చయముగా ఇవ్వబడుతుంది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 50:15వ వచనములో చూచినట్లయితే, "ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు'' అని చెప్పబడిన ప్రకారము అవును, మీరు ఆయనకు మొఱ్ఱపెట్టాలని, ప్రభువు మీ కొరకు ఎదురు చూచుచున్నాడు.

అదేవిధముగా, ఆంధ్ర ప్రదేశ్‌లో కాకినాడ పట్టణము నుండి ప్రియ సహోదరి మంగ, ఆమె తన యొక్క అద్భుతమైన సాక్ష్యమును ఈలాగున పంచుకున్నారు. 2014వ సంవత్సరములో ఆమెకు తీవ్రమైన కాలేయములో సమస్య వచ్చెను. తద్వారా, ఆమె ఏమియు తినలేకపోయేది. ఆమె పాలు త్రాగినను కూడా తన శరీరము ఆ పాలును కూడా జీర్ణించుకోలేకపోయేది. ఆమెకు ఎంతో తీవ్రమైనటువంటి జీర్ణ సమస్యలు ఉండేవి. ఆమెకు ఎంతో నొప్పి కలిగేది. వైద్యులు ఆమెకు కొన్ని చికిత్సలు చేశారు. ఆ మందులు ఎంతో బలంగాను మరియు శక్తివంతముగా ఉండినందున, ఆమె శరీరము ఆ మందుల ప్రభావమునకు కూడా తట్టుకొనలేకపోయినది. ఆ మందుల ప్రభావము వలన ఆమెకు ఇతర సమస్యలు కూడా అనేకములు వచ్చి యున్నవి. ప్రతిరోజు కూడా ఆమె శ్రమపడుతూనే ఉంటుండెను. అయితే, 2025వ సంవత్సరము వేలూరులో జరుగుచున్న యేసు పిలుచుచున్నాడు కూడికలను గురించి విని, ఎంతో విశ్వాసముతో ఆమె ఆ కూడికలకు ప్రార్థన నిమిత్తము వచ్చియుండెను. కూడిక అనంతరము ప్రజల కొరకు నా కుమారుడు శామ్యేల్ వ్యక్తిగతంగా ప్రార్థించుచున్నప్పుడు, ఆమె కూడా ప్రార్థన నిమిత్యము ఆ కూటమునకు వచ్చియున్నది. ఆమె మీద నా కుమారుడు చెయ్యి పెట్టిన వెంటనే, తన శరీరములోని నొప్పి ఆమెను విడిచిపోయినది. ఆమె శరీరములోపల ఏదొ ఒక కార్యము జరుగుతుందని ఆమె తెలుసుకొనెను. వెంటనే, ఆమె నూతన బలమును పొందుకొనెను. ఆ రోజు నుండి ఆమె తన ఆహారమునంతటిని తీసుకొనగలిగినది. ఆ రోజు నుండి ఆమె పాలును కూడా చక్కగా త్రాగ గలిగినది. ఆమె పరిపూర్ణముగా స్వస్థతను పొందుకొనియున్నది. నా ప్రియులారా, ఎంత గొప్ప దేవుని మనము ఆరధించుచున్నాము కదా! దేవుడు మన ప్రార్థనలను ఆలకించడము ఎంత అద్భుతకరమైన విషయము కదా! నా ప్రియ స్నేహితులారా, నేడు ప్రభువు మీ ప్రార్థనలను కూడా నిశ్చయముగా ఆలకిస్తాడు. కనుకనే, ఈ రోజు ప్రభువు మీ ప్రార్థనలను తప్పకుండా ఆలకించి, మీకు జవాబును దయచేస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
పరలోక తండ్రీ, మా ప్రార్థనలు ఆలకించి, మాకు జవాబును ఇస్తావని మేము ఎంతో కాలము విశ్వాసముతో మరియు నమ్మకంతోను ఎదురు చూస్తున్నాము. యేసయ్యా, ఇప్పుడు కూడా, మేము నీ యొక్క పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. దేవా, మా శరీరములో ఉన్న ప్రతి వాపును, నొప్పిని నీ గాయపడిన హస్తముతో తాకి మేము స్వస్థతను పొందుకొనునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, మా కాలేయము, మా శరీరములో ఉన్న ప్రతి అవయవయములను మరియు మా జీర్ణ అవయములను తాకి మమ్మును స్వస్థపరచుము. దేవా, మేము తినే ప్రతి ఆహారములో ఎటువంటి పరిమితులు ఉండకుండా చేయుము. ప్రభువా, మా శరీరములో మేము కోల్పోయిన ప్రతి అవయవములను నీ శక్తి ద్వారా మమ్మును బలపరచి, పునరుద్ధరించు. యేసయ్య, నీ నామమున మా కన్నీళ్లను తుడిచి, మా ప్రార్థనను ఆలకించి, మాకు సంపూర్ణ స్వస్థతను దయచేయుము. ప్రభువా, మా నిరీక్షణ ద్వారా, నీ పరిపూర్ణ సమాధానముతో మమ్మును నింపుము. దేవా, నీ స్వస్థతా శక్తి మా జీవితంలోనికి ప్రవహించునట్లుగా చేసి, మా యొక్క ప్రతి భారాన్ని తొలగించుము. యేసయ్య, నీ యొక్క సమాధానమును నీవు మాకు అనుగ్రహిస్తావనియు మరియు తగిన సమయంలో మమ్మును ఘనపరుస్తావని మేము నమ్ముచూ యేసుక్రీస్తు యొక్క సాటిలేని నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.