నా ప్రియ స్నేహితులారా, సౌందర్యవంతమైన రోజు ఇది. ఎందుకనగా, దేవుడు మనతో కూడా ఉన్నాడన్న ఆ నిరీక్షణ మనకు ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్‌లో కీర్తనలు 62:6వ వచనము నుండి ఆయన ఈ రోజు మనతో మాట్లాడుచున్నాడు. ఆ వచనము, "ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణాధారము నా ఎత్తయిన కోట ఆయనే, నేను కదలింపబడను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. కనుకనే, మనము ఎన్నటికిని కదిలింపబడము. ప్రభువు ఏలాగున మనకు ఆశ్రయ దుర్గముగాను, రక్షణా ధారముగాను ఉంటాడు? మనము ఈ రోజున విమానములను గమనించినట్లయితే, ఎన్నో భయానకమైన సంగతులను మనము వింటూ ఉన్నాము కదా! కొన్ని విమానములు ఆకాశములోనే కూలిపోవుచున్నవి. కొన్ని ఏమో ప్రేలుడుతో మంటలు వచ్చుచున్నవి. చాలా వినాశనకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉండడము మనము గమనించ గలుగుచున్నాము. కనుకనే, మనము ఆకాశములో ఉన్నతమైన స్థానములో ఉండి యున్నప్పుడు, వాతావరణము అనుకూలముగా లేని సమయములలో కూడా, నీటి బొట్టులను మనము గమనించగలము. ఇంకను తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అకస్మాత్తుగా నీటి బొట్లు క్రిందకు పడినట్లు అనిపించినప్పుడు, సాధారణంగా, మనలో భయం కలుగుతుంది. పైన నుండి క్రిందికి ఆ యొక్క విమానము రావడము ఆరంభించుట మనము చూచినప్పుడు మనకు ఎంతో భయము అనిపిస్తుంది. ఆ యొక్క చిన్న నీటి బిందులకు కూడా, భయముగానే ఉంటుంది. ఈ యొక్క విమానము క్రిందికి రావడం ఆరంభించినప్పుడు, ఒక భయము మనలో కనిపిస్తుంది. ఏమి జరుగబోతుంది? విమానము క్రింద పడిపోతుందేమో? ఇది బ్రద్ధలైపోతుందేమో? అని మనము భయపడుతూ ఆశ్చర్యపోవచ్చును. చిన్నపాటి కుదుపు కూడా మనలను భయపెట్టగలదు.

కానీ, నా ప్రియ స్నేహితులారా, నాకైతే, ఎల్లప్పుడు ఒక గొప్ప మానసిక స్థైర్యము కలిగి ఉంటుంది. భయమే లేదు. ఎందుకంటే, 'నేను ఈ ప్రయాణములో దేవుని చిత్తమును జరిగించుటకు వెళ్లుచున్నాను అని నాకు తెలుసు. ' కనుకనే, "ఆయన నన్ను భద్రపరుస్తూ, ఆయనే జాగ్రత్త వహించవలసియున్నది. ఆయనే భద్రముగా నన్ను క్షేమముగా అక్కడికి తీసుకొని వెల్లవలసి యున్నది.'' కనుకనే, నేను భయపడను. దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నప్పుడు, అటువంటి భయానకమైన పరిస్థితులలో మనము భయపడము. ఎందుకనగా, ఆయనే మన ఆశ్రయ దుర్గము. ఆ రీతిగా ఆశ్రయ దుర్గముగా ఉండి, మనము కదిలించబడకుండా ఉండునట్లుగా, ఆయన మనకు సహాయము చేస్తాడు. కనుకనే, మీరు దేవుని చిత్తము జరిగించుటకు మిమ్మును మీరు లోబరచుకున్నప్పుడు ఈలాగున జరుగుతుంది. మీరు దేవుని చిత్తమును జరిగించబోవుచున్నప్పుడు ఏ మాత్రము కూడా మీరు భయపడరు. కనుకనే, మిమ్మును మీరు దేవుని చిత్తమునకు సమర్పించుకున్నప్పుడు, మీకు కూడా ఈలాగున జరుగుతుంది.

నా ప్రియులారా, విమాన ప్రయాణములో ఎన్నో అననుకూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికిని, మీరు ముందుకు వెళ్లకుండా ఎవరైనా ఆటంకములను సంకల్పించినప్పటికిని, ప్రజలు మీ మీద దాడి చేసే భయానకమైన పరిస్థితులు ఉండి ఉన్నప్పటికిని, మీరు ఏదైనా నిర్మాణము చేయుచున్నప్పుడు నష్టాలు వచ్చినప్పటికిని, ప్రభువు ఈలాగున అంటున్నాడు, "ప్రియమైన బిడ్డలారా, మీకు నేను ఆశ్రయ దుర్గముగా ఉండెదను. ఎందుకనగా, మీరు నా చిత్తమును జరిగించనై యున్నారు. కనుకనే, మీరు కదల్చబడుటకు నేను అనుమతిని ఇవ్వను'' అని మిమ్మును ధైర్యపరుస్తాడు.

నా ప్రియులారా, తద్వారా, మీ హృదయము పూర్తిగా ఆయన మీదనే ఆనుకొని ఉంటుంది. 'ఎందుకు నేను భయము నొందాలి, ప్రభువే నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు కదా! నేను ఆయన చిత్తమును జరిగించెదను. ఆయన నాకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. నా ప్రియులారా, ఈ వచనము సెలవిచ్చినట్లుగానే, "ఆయనే నాకు రక్షణాధారముగా ఉన్నాడు '' అని ధైర్యముగా చెప్పగలుగుతారు. నా ప్రియులారా, ఈ రోజు ఈ లోకములో ఎన్నో భయంకరమైన సంగతులు జరుగుచున్నప్పటికిని, ప్రభువు మనలను రక్షించుటకు ఆయనే త్వరగా దిగివచ్చును. ఆయన బలమైన అద్భుతమైన కార్యములను మన పట్ల జరిగించును. మన మీదికి ఆయన రక్షణనను తీసుకొని వచ్చును. ఆయనే మనకు విడుదల ఇచ్చువానిగా మనతో కూడా ఉంటాడు.

కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు మీరు దేవుని చిత్తమును జరిగించడానికి లోబడుచుండగా, మీ యొక్క వృత్తి, భవిష్యత్తులోను, మీ యొక్క సేవా పరిచర్యలోను, మీ జీవన వృత్తిలోను, మీ యొక్క పిలుపులోను, ప్రభువునకు సంపూర్ణముగా దేవునికి స్వాధీనము చేసుకొనండి. 'ప్రభువా, నాకేమి కావాలో దానిని చేయడము కాదు, ధనము సంపాదించుటకు కాదు. ప్రభువా, గొప్ప అతిశయమును సంపాదించుటకు కాదు, మరొకరిని, అనుకరించడానికి కాదు. అత్యంత శ్రద్ధగా నీ చిత్తమును జరిగించుటకు నీ పనిని చేయుటకు సహాయము చేయాలి. ప్రభువా, మా హృదయము ఎప్పుడు నీ చిత్తమును జరిగించుచుండగా, మాకు హృదయము ఎప్పుడు కూడా భయమునొందదు. మాకు తెలుసు మా హృదయము ఎప్పుడు ఆశ్రయ దుర్గము మా రక్షణాధారముగా ఉంటాడని మాకు తెలుసు' అని చెప్పినప్పుడు, నిశ్చయముగా మీరు ఎన్నటికిని కదిలించబడరు.

ఇప్పుడు కూడా నా ప్రియ స్నేహితులారా, మనలను మనము ప్రభువు చిత్తమునకు సమర్పించుకొని, ' ప్రభువా, మా లోనికి రమ్మమ, మాకు మార్గమును కనుప రచుము, నీ చిత్తమును కనుకపమరచము. నన్ను నీ చిత్తములో భద్రపరచుము. అప్పుడు మేము ఎప్పటికి భయమునొందము' అని చెప్పినప్పుడు నిశ్చయముగా ఆయన మీకు ఆశ్రయదుర్గముగాను, రక్షణాధారముగా ఉండి, మిమ్మును కాపాడి, భద్రపరుస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ పిలుపు మా మీదికి వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, నీ మార్గము మా జీవితములో తెరవజేయునట్లుగా కృపను చూపుము. దేవా, మేము అందులో నడుచుటకు ప్రారంభించుచుండగా, నీ యొక్క బలమైన దైవ భద్ర తను కలుగునట్లుగా మాకు సహాయము చేయుము. దేవా, నీవే మా జీవితమునకు ఆశ్రయదుర్గము ఉండునట్లుగా చేసి, మేము ఏ భయమును కలిగియుండగా, కేలము సమాధాననము, శాంతి, దేవునితో నడుస్తున్న గొప్ప ఆనందము, గొప్ప అద్భుత కార్యములను జరిగించి, ఆపదలలో మమ్మును రక్షించుము. ప్రభువా, మా యొక్క ఒత్తిడి నుండి మరియు మా యొక్క ప్రతి ఆటంకముల నుండియు మమ్మును విడిపించుము. దేవా, ఈ రోజు నుండి నీవే మాకు ఆశ్రయ దుర్గము మా రక్షణాధారముగా ఉండుము. విజయవంతముగా మమ్మును నడిపించుము. ప్రియ ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మా జీవితమును నీకు అప్పగించుచున్నాము. దేవా, మా యొక్క ప్రతి అననుకూల పరిస్థితిలో నీవే మా ఆశ్రయదుర్గముగా, మా రక్షణగా, మరియు మా కోటగా ఉండి, మా హృదయంలో నుండి ప్రతి భయమును తొలగించి, నీ శాంతితో, నీ విశ్వాసంతో మమ్మును నింపుము. ప్రభువా, మా యొక్క ప్రతి ప్రమాదం, దాడి, ఆటంకములు, నష్టం, మరియు కష్టం నుండి మమ్మును కాపాడుము. దేవా, మా వృత్తి, పరిచర్య, భవిష్యత్తు, పిలుపు, మరియు జీవితంలోని ప్రతి రంగంలో నీ ఉద్దేశ్యం ప్రకారం మమ్మును నడిపించుము. ప్రభువా, నీ మార్గము మా యెదుట తెరచి, అందులో విశ్వాసంతో నడవడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా జీవితములలో గొప్ప అద్భుతములు జరిగించి, మా యొక్క ప్రతి ఒత్తిడివేత మరియు ఆటంకముల నుండి మమ్మును విడిపించుము. ప్రభువా, నీ పిలుపు మా జీవితంపై నిలిచియుండునట్లుగాను, నీతో నడవడంలో ఉన్న ఆనందమును మేము అనుభవించునట్లుగా చేసి, మమ్మును నీలో భద్రపరచుమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.