నా ప్రియమైన సహోదరీ, సహోదరులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 4:12వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు'' అని చెప్పబడినట్లుగానే, మన ప్రభువు మనము నడుచు ప్రతి అడుగును కూడా నిర్దేశిస్తాడు. మన మార్గముల యందు ఆయన మన పట్ల ఆనందిస్తాడు. కనుకనే, ఆయన ఈ విధముగా చేస్తాడు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 18:36వ వచనములో చూచినట్లయితే, " నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు'' అని చెప్పబడినట్లుగానే, మన అడుగులు జారిపడకుండా, మనలను కాపాడే దేవుడు. చూడండి, మనము ఎంత గొప్ప దేవునిని కలిగియున్నాము కదా! మన జీవితములో మనము వేయుచున్న ప్రతి అడుగును కూడా ప్రభువు లెక్కిస్తూ ఉంటాడు. ఆయన మనలను గురించి ఎంతగానో పట్టించుకునే దేవుడు. మనము చిన్న బిడ్డలను మన చేతులతో వారిని పట్టుకున్నప్పుడు, వారు క్రింద పడిపోకుండా, వారి చిట్టి చేతులను గట్టిగా పట్టుకొని చక్కగా నడిపిస్తాము కదా! ఒక్కసారి, నేను రోడ్డు దాటుచున్నప్పుడు నా మనవరాలైనటువంటి క్యేటీని నా చేతులతో తనను గట్టిగా పట్టుకున్నాను. నేను తనను నా చేతులతో గట్టిగా జాగ్రత్తగా పట్టుకోవలెనని ఎంతగానో చూచుకున్నా ను. ఒకవేళ, తను నా చేతులను పట్టుకొని ఉన్నట్లయితే, తాను క్రింద పడిపోవునప్పుడు, తనకు పట్టు దొరకదు. కాబట్టి, నేనే తన చేతిని గట్టిగా పట్టుకొనియున్నాను. అదేవిధముగా, ప్రభువు మన అడుగులను నిర్దేశించి, మనలను తన చేతులతో గట్టిగా పట్టుకొని మనలను తన మార్గములో నడిపిస్తాడు.
అదేవిధముగా, బైబిల్లో భక్తుడైన సొలొమోను కూడా తన కుమారుని గురించి ఎంతగానో ఆలోచించియున్నాడు. అందునిమిత్తము బైబిల్ నుండి సామెతలు 4:10-13వ వచనములలో చూచినట్లయితే, " నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించిన యెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞానమార్గమును నేను నీకు బోధించియున్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించియున్నాను. నీవు నడచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. నీవు పరుగెత్తునప్పుడు నీ పాదము తొట్రిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాని గట్టిగా పట్టుకొనుము అది నీకు జీవము గనుక దాని పొందియుండుము'' అని చెప్పబడినట్లుగానే, సొలొమోను తన కుమారునికి ఆదేశములను ఇచ్చియున్నాడు. సొలొమోను తన కుమారునికి 'నీవు దేవుని యొక్క ఆజ్ఞలను మరియు ఉపదేశములన్నిటిని అనుసరించుము అని చెప్పెను. అవి నీకు జ్ఞానమును కలుగజేయును, అప్పుడు ప్రభువు నీవు మార్గములను విశాలపరుస్తాడు. నీవు ఎంతమాత్రము తొట్రిల్లవు మరియు పడిపోవు.' అవును, ప్రియ స్నేహితులారా, జ్ఞానము మరుగై ఉన్నటువంటి ఉచ్చులకు దూరముగా మనలను ఉంచి, క్షేమమైన మార్గములో నడిపిస్తుంది. ఈ లోకము ఎంతో దుష్టమయమై ఉన్నది. ప్రజలు దుష్టత్వమును కలిగియుంటున్నారు. మనము జారి పడిపోవాలని ఎదురు చూచే ప్రజలు ఉంటారు. అయితే, ప్రభువే మన మార్గములను కాపాడుతూ ఉంటాడు. నా ప్రియులారా, ప్రభువు మన అడుగులను కాపాడుతాడు, ఆయన సరాళమైన మార్గములలో మనలను నడిపిస్తాడు. విశాలమైన మార్గములలో మనలను నడిపిస్తాడు. ఆయన మన యొక్క ఉపదేశములను అనుసరించినప్పుడు, మన జీవితములో మనము నిశ్చింతముగా ఉండడానికి కావలసిన వాగ్దానములను ప్రతిరోజు ఆయన మనకు వాగ్దానములను అనుగ్రహిస్తాడు.
అందుకే బైబిల్ నుండి సామెతలు 4:18వ వచనములో చూచినట్లయితే, " పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును'' అని చెప్పబడినట్లుగానే, నీతిమంతుల మార్గములు ఉదయకాలపు సూర్యుని వలె ప్రకాశిస్తుంది అని వాక్యము సెలవిచ్చుచున్నది మరియు మధ్యాహ్నకాల వెలుగువలె ప్రకాశిస్తుంది. అవును, నా ప్రియులారా, అవును, ప్రతిరోజు మన మార్గము ప్రకాశవంతముగా మారుతుంది. మనము ఎప్పుడు కూడా జారిపోము మరియు క్రిందకు పడిపోము. మరియు దావీదు భక్తుడు కీర్తనలు 18:29వ వచనములో తెలియజేసినట్లుగానే," నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును'' అని చెప్పబడినట్లుగానే, మనము దేవుని సహాయము వలన సైన్యములపైన జయమును పొందుగలుగుతాము మరియు దేవుని సహాయము వలన మనము ప్రాకారములను దాటగలుగుతాము. మనము క్రిందకు పడిపోము. మనము పైకి మరియు పైపైకి వెళ్లిపోతూ ఉంటాము. మనము స్థిరమైన పురోగతిని కలిగియుంటాము. తాబేలు మరియు కుందేలు యొక్క కథను మీరు వినియుంటారు కదా! తాబేలు స్థిరమైన పురోగతితో మెల్లగా వెళ్లుతూ ఉంటున్నది. దానికి జ్ఞానము ఉన్నది. అవును, మనము కూడా దేవుని జ్ఞానమును కలిగియున్నప్పుడు, మనము స్థిరమైన పురోగతిని కలిగియుంటాము. కనుకనే, నా ప్రియులారా, దేవుని యొక్క సహాయముతో మీరు కూడా అన్నిటిని జయించగలుగుతారు. ప్రతి రోజు కూడా మీరు మీ జీవితములో మార్పులను చూడగలుగుతారు. అవును, నా ప్రియ స్నేహితులారా, మిమ్మును ఉన్నత శిఖరములకు ఎక్కించుట కొరకు దేవుని హస్తము మీ మీదికి దిగివస్తుంది. మీరు నడుచునప్పుడు, మీ అడుగులు ఎంతమాత్రము తడబడవు. శత్రువు వరద వలె మీ మీదికి పొంగి పొర్లి వచ్చినప్పుడు, ప్రభువు తన యొక్క ధ్వజమును మీ కొరకు ఎత్తుతాడు.అందుకే బైబిల్ నుండి యెషయా 59:19వ వచనములో చూచినట్లయితే, మీ ఎదుగుదలను ఆపడానికి ఏ శత్రువు కూడా మీకు ఎదురుగా వచ్చి, ఎంతమాత్రము నిలువబడలేడు. మీరు క్రిందకు అడుగున ఉండరు. కానీ, మీరు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. కాబట్టి, నా ప్రియమైన స్నేహితులారా, మీరు ధైర్యముగా ఉండండి. మిమ్మును లేవనెత్తడానికి ప్రభువు యొక్క హస్తము మీ మీదికి దిగివచ్చుచున్నది. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగలిగినటువంటి మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, ఈ రోజు మమ్మును లేవనెత్తుటకు నీ హస్తము మా మీదికి దిగివచ్చినట్లుగా చేయుము. ప్రభువా, మా మార్గములలో ఏ ఆటంకము ఉండకుండా చేయుము. యేసయ్యా, నీవు మా హస్తములను గట్టిగా పట్టుకొని, మా మార్గములను సరాళము చేయుము. ప్రభువా, ఇంకను ఏ ఎంతమాత్రము జారి క్రిందకు పడిపోవడము జరుగకూడదు. దేవా, ఓటమిలు ఇక ఎదురవుకూడదు. ప్రభువా, మా శరీరములను స్వస్థపరచుము. ప్రభువా, నీ యొక్క బలమైన హస్తము చేత మేము లేవనెత్తబడునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ యొక్క బలమైన శక్తి మా మీదికి దిగివచ్చి, మమ్మును పునరుద్ధరించునట్లుగా చేయుము. ప్రభువా, వ్యాధుల ద్వారా మేము ఎంతమాత్రము చనిపోకుండా, మేము జీవించునట్లుగా నీ స్వస్థతా శక్తిని మకు దయచేయుము. యేసయ్య, మృతమైన మా ప్రతి అవయములు ఇప్పుడే, పునరుద్ధరించబడి, స్వస్థపరచబడునట్లుగా చేయుము. దేవా, నీ ఆత్మచేత మేము పైకి ఎదుగునట్లుగాను ఇప్పుడు మేము లేవనెత్తబడుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితములో మేము జారిక్రిందపడిపోయినది ఇక చాలును, ఒటమిలు ఇక చాలును. ప్రభువా, నీ సహాయము వలన మేము ఉన్నత శిఖరములకు ఎక్కించబడునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, జీవితములో పైకి ఎదుగుటకు మేము మరియు మా ప్రియులగువారు వ్రాయు పోటీ పరీక్షలలో మాకు మంచి మార్కులను అనుగ్రహించి, ఐఎయస్ మరియు ఐఆర్యస్ అధికారులుగా మరియు ఇంకను మరెన్నో ఉన్నత పదవులను పొందుకొనుటకు మాకు సహాయము చేయుము. దేవా, మా నుదుటన నీ నామము వ్రాయబడునట్లుగాను, నీ నామము మహిమపడునట్లుగా మాకు నీ కృపను చూపుము. తండ్రీ, మా యొక్క ప్రతి అవమానమును, అగౌరమును మా నుండి తొలగించి, మా కుటుంబ సభ్యులందరి మధ్యలో మేము తలెత్తుకొని నడుచుటకు సహాయము చేయుము. యేసయ్యా, మా జీవితములో నీ యొక్క శక్తి ద్వారా రూపాంతరము కలుగునట్లుగా కృపను దయచేయుము. దేవా, నీ యొక్క సహాయము వలన మా ఉద్యోగములోను, వ్యాపారములలోను,చదువులలోను పదోన్నతి కలుగునట్లుగా చేయుము. ప్రభువా, మా కుటుంబ జీవితములో మా పేరు హెచ్చింపబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


