నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 19:11వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "...నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును'' ప్రకారం ఇట్టి లాభము లేక బహుమానము దేవుని ఆజ్ఞను మీరు అనుసరించినప్పుడు మీకు కలుగుతుంది. దేవుని శాసనములను మీరు పాటించినప్పుడు మీకు గొప్ప లాభము కలుగుతుంది. బైబిల్‌లో కీర్తనలు 19:8-9వ వచనములను మీరు చదివినట్లయితే, "యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి'' అని చెప్పబడిన ప్రకారం దేవుని యొక్క న్యాయ తీర్పును బట్టి, మనము గొప్ప బహుమానమును, లాభమును పొందుచున్నాము. దేవుడు ఈ తీర్పును దేనిని బట్టి అనుగ్రహిస్తాడు? కీర్తనలు 19:9వ వచనములో చూచినట్లయితే, యెహోవాయందైన భయమును బట్టి, దేవుడు ఆ రీతిగా బహుమానమును అనుగ్రహించునై యున్నాడు. దేవుని యందు భయమును కలిగి ఉండి, హృదయమును ఆయనకు ఇచ్చి, నీతిగా జీవించినట్లయితే, దేవుడు గొప్ప బహుమానమును మీకు తీర్పుగా ఇస్తాడు. కేవలము, బహుమానము మాత్రమే కాదు, గొప్ప లాభమును అనుగ్రహిస్తాడు. కనుకనే, నేడు మీరు ప్రభువు యొద్ద నుండి గొప్ప బహుమానమును పొందునై యున్నారు. అందుకే లేఖనములో చూచినట్లయితే, "కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు మరియు పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొని తిరిగి వచ్చెదరు'' ఇది మీ కొరకైన దేవుని ప్రణాళికయై యున్నది. మీకు ప్రతిఫలముతో పాటు మీ జీవితములో సంతోషమును కూడా మీకు అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా!
నా ప్రియులారా, నేడు ఆయన మీకు అనుగ్రహించు ప్రతి ఆశీర్వాదమును అత్యంత ఐశ్వర్యవంతముగా మీరు అనుభవించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కేవలము, ఆశీర్వాదము మాత్రమే కాదు, కేవలము, వేతనము మాత్రమేకాదు, కేవలము బహుమానము కాదు, కేవలము పై అధికారుల నుండి కృతజ్ఞతలను పొందుకొనడము మాత్రమే కాదు, కేవలము మీ యజమానుల నుండి పొగడ్తలు మాత్రమే కాదు, కొన్ని సంవత్సరముల ప్రతిఫలముగా నివాస గృహము పొందుకొనుట మాత్రమే కాదు. కానీ, ప్రభువు ఈలాగున అంటున్నాడు, " అడగండి, మీ సంతోషము పరిపూర్ణమగుతుంది '' అని చెబుతున్నాడు. యేసు మాత్రమే అటువంటి సంతోషమును అనుగ్రహించగలడు. యెహోవా యందలి ఆనందము మీ యొక్క బలమై యున్నది. దేవుడు మీకు బహుమానమును మీకు అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు. అయితే, మీకు గొప్ప బహుమానమును కూడా ఇవ్వాలని మీ పట్ల వాంఛ కలిగియున్నాడు. అయితే, మత్తయి 19:29,30వ వచనములలో చూచినట్లయితే, " నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్యజీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు'' ప్రకారం యేసు నిమిత్తము, ఎవరినైనను లేక దేనినైనను విడిచిపెట్టినట్లయితే, అట్టివారికి ఈ లోకములో నూరంతలుగా ప్రతిఫలమును అనుగ్రహించుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆలాగుననే, నిత్యజీవమును కూడా ఇచ్చుచున్నాడు. నిత్యజీవము అనగా, దేవుని యొక్క రాజ్యము. దేవుని యొక్క నీతియై యున్నది. సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందమును అనుగ్రహించుచున్నాడు. దేవుడు మీరు దీనిని కలిగి ఉండాలని, మీ పట్ల కోరుచున్నాడు. నా ప్రియులారా, మీరు మీ చేతుల పనిని ఆనందించాలని కోరుచున్నాడు. ప్రేమ సంతోషము అన్నిచోట్ల ఉండాలని మీ పట్ల కోరుచున్నాడు. అందరితో కూడా సమాధానముతో ఉండాలి, సమాధానముగా పడకకు వెళ్లాలి, సమాధానముతో నిద్రమేల్కోవాలని ఆయన మీ పట్ల వాంఛకలిగియున్నాడు. ఇంకను ఇటువంటి ప్రతిఫలమంతయు కూడా సమాధానముగానే, మీ యొద్దకు రావాలి. అన్నిటికంటె మిన్నగా, నీతిగా మీరు బహుమానమును పొందాలి.
అవును, నా ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా, మిమ్మును నీతిమంతులుగా పిలవాలి, చివరికి, అపవాది కూడా మిమ్మును నీతిమంతుడు మరియు నీతిమంతురాలైన స్త్రీ అని చెప్పాలి. అత్యంత దుష్టుడు కూడా ఆలాగుననే చెప్పాలి. మిమ్మును నీతిమంతులుగా మార్చే యేసుక్రీస్తు ద్వారా కూడా వీటన్నిటిలో అత్యధికమైన విజయమును మీరు పొందుకొనుచున్నారు. ఆయన మీ నీతిని బట్టి మిమ్మును ప్రేమించుచున్నాడు. దేవుడు ఇటువంటి కృపను మీకు అనుగ్రహించును గాక. గొప్ప బహుమానముతో మిమ్మును ఈ రోజును దీవించును గాక. దేవుడు అబ్రాహామునకు ప్రత్యక్షమై, ఈలాగున చెప్పాడు, "అబ్రాహామా, నేను నీకు గొప్ప బహుమానమై ఉన్నాను, నీతిగలవాడవై, దీనమనస్సుగలవాడవై నా ముందు నడువుము. కేవలము నేను చెప్పినదానికి విధేయుడవు కమ్ము, నేనే స్వయముగా నీకు గొప్ప బహుమానముగా ఉండెదను మరియు నీతో కూడానే ఉండెదను'' అని సెలవిచ్చాడు. ఎంత గొప్ప సంతోషము కదా! కనుకనే, నా ప్రియులారా, నేడు మీరు కూడా అబ్రాహాము వలె దేవునికి ఆజ్ఞను పాటించుచు, విధేయులైనప్పుడు, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మీకు గొప్ప బహుమానమును ఇచ్చి, మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, నీ మార్గాలలో నడిచేవారికి గొప్ప ప్రతిఫలం లభిస్తుందని నీవు ఇచ్చిన వాగ్దానానికి ధన్యవాదాలు. ప్రభువా, నీ ఆజ్ఞలను పాటించాలని మరియు నీ పట్ల భయభక్తులతో జీవించాలని కోరుకుంటూ, వినయపూర్వకమైన హృదయంతో మేము నీ యొద్దకు వచ్చుచున్నాము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ద్వారా మా జీవితాన్ని నీతి, సమాధానము మరియు ఆనందంతో నింపుము. దేవా, నీవు ఆనందగానముతో పంటను కలిగిస్తావని గుర్తెరిగి, మా కన్నీళ్ల ద్వారా కూడా విశ్వాసంతో విత్తడానికి మాకు సహాయం చేయుము. ప్రభువా, ఈ లోక ప్రతిఫలాలను మాత్రమే కాకుండా, నీ సన్నిధి నుండి వచ్చే ఆనందాన్ని కూడా నీవు ఇచ్చే ఆశీర్వాదాలను ఆనందించడానికి మాకు నేర్పుము. దేవా, ప్రతి సయయములో మా హృదయం కృతజ్ఞత మరియు శాంతితో పొంగిపోర్లునట్లుగా చేయుము. ఇతరులు మాలో నీ నీతిని చూచునట్లుగా అటువంటి గొప్ప ధన్యతను దయచేయుము. ప్రభువా, మేము 'నీ గొప్ప బహుమానము' అని నీవు అబ్రాహాముకు చెప్పినట్లుగా, మేము ఈ రోజు ఆ మాటను పొందుకుంటున్నాము. ప్రభువా, నీవు బహుమానమును, దయచేయుటకు ఎల్లప్పుడూ నీవు మాతో కూడా ఉండుము. ఇంకను మాతో నడువుము, మమ్మును నీ యొక్క నీతిగల మార్గములో నడిపించుము మరియు మా హృదయమంతటితో నిన్ను పాటించడంలో మాకు సహాయం చేయుమని యేసు క్రీస్తు నీతిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.