నా ప్రియమైనవారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 61:7వ వచనము ద్వారా ప్రభువు మాట్లాడుచున్నాడు. ఆ వచనము, "మీ యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపుభాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును'' ప్రకారము మన దేవుడు తిరిగి పునరుద్ధరీకరించే దేవుడై యున్నాడు. దేవుడు మనకు ఏ విధంగా సంపూర్ణమైన రూపాంతరతను కలుగజేస్తాడు అనేది ఈ వచనము మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. దేవుడు మన జీవితాలలో సంపూర్ణమైన రూపాంతరతను ఎలా కలుగజేయుచున్నదో ఈ వచనము మనకు తెలియజేయుచున్నది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 126:5-6వ వచనములలో చూచినట్లయితే, "కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును'' అని చెప్పబడిన ప్రకారము నేడు కన్నీళ్లతో ఉన్న మీరు సంతోషగానముతో పంటను కోయుదురు. నేడు ప్రతి విధమైన శూన్యతను సంపూర్ణమైన ఆశీర్వాదములుగా మార్చివేస్తాడు. ' మా చేతులలో ఏమియు లేదు' అని మీరు విలపించుచుండవచ్చును. ప్రభువు హస్తముల నుండి ఒక ఆశీర్వాదమును పొందుకొనుట కొరకు దీర్ఘకాలము నుండి మొఱ్ఱపెట్టుచుండవచ్చును. అయితే, మన జీవితాలలో ప్రభువు సమస్తమును పునరుద్ధీకరిస్తాడు అనే విశ్వాసమును మీరు కలిగియుండండి.
అదియు కూడా రెండంతలుగా ఆయన కలుగజేస్తాడు. ఇంకను మనము అడుగు వాటన్నిటి కంటెను, ఊహించు వాటన్నిటికంటెను అత్యధికముగా ప్రభువు ఎల్లప్పుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అటువంటి ధారళత్వము కలిగిన దేవుడై ఉంటున్నాడు. మనము ఏది చేశామో, దానికి మాత్రమే మనుష్యులు ప్రతిఫలము నిస్తారు. కానీ, దేవుడు ధారాళముగా రెండంతలుగా తిరిగి సమకూరుస్తాడు. కాకినాడ పట్టణము నుండి సహోదరుడు అరుణ్ కుమారుని యొక్క ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని ఆశించుచున్నాను. 2011వ సంవత్సరములో అతనికి వివాహము జరిగినది. అతని భార్య పేరు షర్మిలా, వారికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. 1992వ సంవత్సరములో తన తాతగారి ద్వారా అతడు యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో ఉన్న యౌవన భాగస్థుల పధకములో ఒక భాగస్థునిగా చేర్చబడ్డాడు. అప్పటి నుండి కూడా తన జీవితములో ఒక గొప్ప వర్థిల్లతను అతను పొందుకుంటూ వచ్చాడు. తన 10వ తరగతి పరీక్షలను అతను చక్కగా ఉత్తీర్ణతను పొందుకుంటూ వచ్చాడు. ఆలాగుననే, ఇంటర్మీడియట్ పరీక్షలలో కూడా పాస్ అయ్యాడు. తన పరీక్షలన్నియు కూడా అసలు తాను ఎలా ఉత్తీర్ణతను పొందుకున్నాడని ఆశ్చర్యపోవుచుండేవాడు. ఆ తర్వాత అతడు ఉద్యోగము కొరకు ఎంతగానో ప్రయత్నించాడు. అద్భుతరీతిగా అతని యెదుట తనకు అవకాశములు తెరువబడ్డాయి. అతను వెళ్లిన ప్రతి చోట దేవుని దయను కనుపరచుట చూశాడు.
అయితే, 2014వ సంవత్సరములో అరుణ్ కుమార్ కడుపు సమస్యతో (గ్యాస్ట్రిక్) ఎంతగానో వేదన చెందాడు. అయినను కూడా ప్రతి రోజు యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురమునకు కాల్ చేసి ప్రార్థన చేయించుకొనెను. ఆ ప్రార్థనలన్నిటి ద్వారా దేవుని కృప మూలముగా అతడు సంపూర్ణ స్వస్థతను పొందుకున్నాడు. ఆ తర్వాత అతడు రియల్ ఎస్టేట్ విభాగములో పనిచేయుచుండెను. ఇంకను వృత్తి పరముగా అతను ఎంతగానో వర్థిల్లుచుండెను. మార్కెటింగ్ మేనేజర్‌గా అతడు ఉన్నత స్థాయిని పొందుకున్నాడు. ఆ తర్వాత, అతడు జనరల్ మేనేజర్‌గా కూడా పదోన్నతిని పొందుకున్నాడు. ఆలాగుననే, కోవిడ్ -19 వచ్చేంతవరకు కూడా అంతయు చక్కగానే సాగిపోవుచుండెను. అయితే, 2020వ సంవత్సరము నుండి 2024వ సంవత్సరమున అతని వ్యాపారము తగ్గిపోవుచూ, ఆర్థికముగా వారి కుటుంబము ఎంతో నష్టాన్ని ఎదుర్కొంటూ, అతడు అనేకమైన బాధలను అనుభవించవలసి వచ్చెను. అయితే, ప్రభువు అతని జీవితములో కార్యములను కొనసాగించుచుండెను. కానీ, 2024, డిసెంబర్ 6వ తేదీన నా భర్తగారు రాజమండ్రి పట్టణమును సందర్శించినప్పుడు ఆ సహోదరుడు మా పరిచర్యలో ఒక స్వచ్ఛంధ సేవకునిగా పరిచర్య చేసియుండెను. ఆ సమయములో నా భర్తగారు అక్కడ పనిచేయుచున్న వాలంటరీగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించారు. తన జీవితములో అదే మార్పు నొందించిన సమయము. ప్రార్థన అనంతరము తన వ్యాపారములో ఎదుగుదలను అతడు చూచియున్నాడు. ఆశీర్వాదములు అతని జీవితములో కుమ్మరించబడుచున్నవి. అతడు పొందుకున్నటువంటి ఆశీర్వాదములన్నిటిని తను ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించియున్నాడు. ప్రభువు అతనిని ఎంతగానో బలపరచియున్నాడు. ఆ తర్వాత, అతనికి ఉన్న గ్యాస్ట్రిక్ సమస్యలన్నియు అతనిని విడిచిపెట్టి వెళ్లిపోయినవి. అతడు విశ్వాసములో కూడా ఎంతగానో బలము నొందియున్నాడు. ఇదంతయు దేవుని కృపాకనిరము వలననే జరిగియున్నది. ఈ రోజు అతడు ఒక యౌవనస్థు డుగా ఉంటూ, ప్రభువు కొరకు అతడు ఎంతగానో నిలబడుచూ, పరిచర్య చేయుచున్నాడు. అదేవిధముగా, నా ప్రియులారా, మీ జీవితములో ప్రభువు జరిగించడా? యేసు నొద్దకు రండి, మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించండి, మీ సమయమును ప్రభువునకు ఇవ్వండి. నా స్నేహితులారా, ఎప్పడు కూడా నిరాశ చెందకండి. మీరు యేసయ్య మీద విశ్వాసమును కలిగియుండండి. ప్రభువు రెండంతలుగా మీకు తిరిగి సమకూరుస్తాడు. ప్రభువును వెదకువారు, ఆయన యందు భయభక్తులు కలిగియుండువారికి ఏమియు కొదువుగాను, లేమిగా ఉండదు. అదియుగాక, నా ప్రియులారా, మీ జీవితములో హెచ్చింపును మరియు ఎదుగుదలను మాత్రమే మీరు చూచెదరు. కనుకనే, మీరు దిగులుపడకండి, నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనము. ప్రభువా, నీవు మాకు వాగ్దానం చేసినట్లుగానే, రెట్టింపు ఘనతను ఇచ్చు ఆశీర్వాదానికై నీకు వందనాలు మరియు మేము ఈ రోజు దానిని ఆనందకరమైన హృదయంతో అంగీకరించుచున్నాము. ప్రభువైన యేసయ్యా, సమస్తమును నీవు పునరుద్ధీకరించే దేవుడై యున్నందుకై నీకు వందనాలు. దేవా, మా అవమానం మరియు మేము కోల్పోయిన ప్రతిదానిని నీ యొద్దకు తీసుకొని వచ్చుచున్నాము. ప్రభువా, దయచేసి మా కన్నీళ్లను ఆనందగానములుగా మార్చుము. ఓ ప్రభువా, మేము కోల్పోయిన సమస్తమును మాకు తిరిగి రెండంతలుగా అనుగ్రహించుము. దేవా, మా యొక్క ఖాళీ చేతులను నీ ఆశీర్వాదాలతో నింపుము. ప్రభువా, మేము బలహీనులముగా ఉన్నప్పుడు మా విశ్వాసాన్ని బలపరచుము. దేవా, మేము సంపూర్ణ సమయం మరియు నీ దయను విశ్వసించుటకు నీ కృపను మాకు కనుపరచుము. ప్రభువా, మేము పోగొట్టుకున్న సమస్తమును నీవే తిరిగి మాకు సమకూర్చి, మరల పునరుద్ధరించుము. దేవా, మేము అడుగువాటన్నిటికంటెను, ఊహించిన దానికంటెను అత్యధికముగా మాకు దయచేయుము. ప్రభువా, మాలో సంపూర్ణమైన రూపాంతరత కలుగునట్లుగా, ఆర్థికముగా రెండంతలుగా దీవించబడునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, మా యొక్క ఆశీర్వదాములు హెచ్చింపబడునట్లుగా చేయుము. ప్రభువా, మేము సంపూర్యమైన ఆరోగ్యములో మంచిగా ఎదుగునట్లుగాను, ఆధ్యాత్మికంగా మేము ఆశీర్వాదమును పొందుకొనునట్లుగా సహాయము చేయుము. దేవా, మా కుటుంబమును, వ్యాపారమును మరియు ఉద్యోగమును మరియు మా కుటుంబ జీవితాలను కూడా రెట్టింపుగా ఆశీర్వదించుము. దేవా, అన్నిటిని రెండంతలుగా మాకు సమకూర్చబడునట్లుగా మా జీవితములో ఇప్పుడే అద్భుతములను జరిగించుము. యేసయ్యా, మేము ఎక్కడైతే, అవమానము, నిందలను ఎదుర్కొన్నామో, అదే స్థలములో మమ్మును ఘనపరచుమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సాటిలేని నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


