నా ప్రియ స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎజ్రా 7:27,28వ వచనములను తీసుకొనబడినది. ఆ వచనములో, "యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులును రాజు యొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, నాతో కూడ వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని'' అని ఎజ్రా భక్తుడు చెప్పెను. ఎజ్రా భక్తుడు దేవుని యొక్క లేఖనములన్నిటిని కూడా ప్రజల యొద్దకు మరల తీసుకొని వచ్చి సమకూర్చాడు. అతడు ఒక యాజకుడు. కనుకనే, దేవుని యొక్క దయను అతను గుర్తించి, కృతజ్ఞతలు తెలియజేసియున్నాడు. నా ప్రియులారా, ఈ లోకములోని ప్రజలు,'ఈ యొక్క దీవెనను పొందుకోవడానికి నేను ఎంతో అదృష్టవంతులము' అని చెబుతుంటారు. అయితే, ఈ లోక ప్రజల వలె కాకుండా, దేవుని బిడ్డలు, ' దేవుని దయ నాయందు ఉన్నది' అని చెప్పాలి. అందుకే బైబిల్ నుండి ఎజ్రా 9:9వ వచనములో చూచినట్లయితే, "నిజముగా మేము దాసులమైతిమి; అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, పారసీక దేశపు రాజుల యెదుట మాకు దయ కనుపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుట కును, యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించితివి'' అని ఎజ్రా భక్తుడు చెప్పిన ప్రకారము దేవుడు మన తన దయను కనుపరచుచున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు బబులోను చెరలో ఉండియున్నారు. అయితే, బబులోను చెరలో నుండి వారు తిరిగి వచ్చిన తర్వాత, మందిరమును వారు తిరిగి కట్టే పనిని ప్రభువు ఎజ్రా భక్తునికి అప్పగించియున్నాడు. దేవుని యొక్క మందిరములను నిర్మించి, పాడైన స్థలములను తిరిగి నిర్మించినవాడు భక్తుడైన ఎజ్రా.
అదేవిధముగా, దినకరన్ కుటుంబ సభ్యులమైన మేము కూడా దేవుని ప్రేరేపణ చొప్పున 2026వ సంవత్సరమును తిరిగి నిర్మించు సంవత్సరముగా ప్రతిష్టించియున్నాము. అందుకే ఆ వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 58:12వ వచనమును చూచినట్లయితే, " పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేకతరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరుగబడిన దానిని బాగుచేయువాడవనియు దేశములో నివసించునట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను'' అని చెప్పబడిన వచనము ప్రకారము ప్రభువు మాతో ఎంతో స్పష్టముగా మాట్లాడియున్నాడు. ఆలాగుననే, దేవుని రాజ్యమును తిరిగి నిర్మించవలసినటువంటి కర్తవ్యమును ప్రభువు మీలో ప్రతిఒక్కరికి ఇచ్చియున్నాడు. అంతమాత్రమే కాదు, ' లేనివాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు' మన ప్రభువై యుంటున్నాడు. ప్రతి దానిని నిర్మించేవారినిగా మిమ్ముల్ని ప్రభువు చేయడము మాత్రమే కాదుకానీ, మీ జీవితములో విరిగిపోయిన వాటన్నిటిని కూడా ఆయన తిరిగి నిర్మిస్తాడు. ప్రభువు మీ పేరును మార్చివేస్తాడు. మీరు ఏమి లేనివారుగా ఒకవేళ ఈ రోజు మీరు పిలువబడుచున్నారేమో? ఎందుకు పనికిరానిదానవు, పనికిరానివాడవు అని ఈ రోజు పిలువబడుచున్నారేమో? అయితే, దేవుని దయ మీ మీదికి దిగివస్తూ ఉండగా, అన్నిటిని తిరిగి నిర్మించువాడు, నిర్మించు స్త్రీ అని మీకు పేరు పెట్టబడును. ఆలాగుననే, ప్రభువు యాకోబు యొక్క పేరును మార్చివేసియున్నాడు. కనుకనే బైబిల్ నుండి ఆదికాండము 32:28వ వచనములో చూచినట్లయితే, "అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.'' ఆ ప్రకారముగానే యాకోబు పేరు అంటే, మోసగాడు అని అర్థము. అయితే, యాకోబునకు అన్నిటిని సమకూర్చిన తర్వాత, అతని పేరు ఇశ్రాయేలు అని పేరు పెట్టి పిలిచెను. అనగా, 'దేవుని కుమారుడు' అని అర్థము. కనుకనే,నా ప్రియ స్నేహితులారా, అవును, మీ జీవితమును కూడా ఆలాగుననే, తిరిగి నిర్మించబోవుచున్నాడు. కనుకనే, మీరు చింతించకండి.
నేను మీకు ఒక అద్భుతమైన సాక్ష్యమును మీతో పంచుకోవాలని కోరుచున్నాను. హైదరాబాద్ పట్టణము నుండి సహోదరి జ్యోతి తన సాక్ష్యమును ఈలాగున పంచుకొనెను. 2021వ సంవత్సరములో నా జీవితములో ఎంతో వేదనకరమైన ఒక మలుపు తిరిగియున్నది. క్యాన్సర్ వ్యాధి నుండి మూడు సంవత్సరముల నుండి నేను ఎంతగానో వేదన చెందియున్నాను. నాల్గవ దశలో నాకు క్యాన్సర్ వ్యాధి ఉండి యుండినది. ఎంతో భయంకరమైన నొప్పిని కలిగించే వైద్య చికిత్సలను నేను చేయించుకొన్నాను. నా భవిష్యత్తును గురించి నేను ఎంతో బాధపడ్డాను. ఆ నొప్పి, వేదనతో పాటు, ఎంతో భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురైనవి. వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసిందిగా సూచించారు. ఆ యొక్క ఆపరేషన్‌కు రెండు లక్షల ఇరవై వేలు అవసరమై యుండెను. అంత పెద్ద మొత్తములో ఆ డబ్బును మేము చెల్లించడము, మా వలన కాని పనిగా ఉండెను. అంత డబ్బును చెల్లించడము మాకు ఎంతో అసాధ్యమైన కార్యముగా ఉండెను. నేను 8 నెలల పసిబిడ్డను కలిగియున్నాను. నా కుటుంబమును నేను చూచుకోలేకపోయాను. ఇటువంటి పరిస్థితులలో నేను డాక్టర్. పాల్ దినకరన్‌గారికి నేను ఒక ఉత్తరమును వ్రాసియున్నాను. నా యొక్క వేదన అంతటిని నేను సహోదరునితో పంచుకొనియున్నాను. ఎంతో ఆశ్చర్యకరమైన విధంగా నాకు ఒక అద్భుతమైన జవాబుగా వారు నాకు తిరిగి వ్రాసి పంపించియున్నారు. ఆ జవాబు చదివిన తర్వాత, నా హృదయములో సంతోషము, ఎంతో నిరీక్షణ నిండియున్నది. నా యొక్క వైద్య చికిత్సకు అవసరమైనటువంటి డబ్బు అంతయు కూడా నాకు సహాయపూర్వకంగా అందియున్నది. ఇంకను ఆపరేషన్ కావలసినటువంటి డబ్బు అంతయు కూడా నాకు సమకూర్చబడియున్నది. అది కేవలము దేవుని దయయై ఉంటున్నది. ఎడతెగక ప్రార్థనలు చేయబడుట ద్వారా, మరియు ఆపరేషన్ మూలముగా నేను క్యాన్సర్ వ్యాధి నుండి పూర్తిగా స్వస్థపరచబడ్డాను. ఆ వ్యాధి యొక్క లక్షణములు ఇక నాలో కనిపించలేదు. వైద్యము పూర్తిగా ఏదైతే చేయలేకపోయినదో, దేవుడు విశ్వాసము మూలముగాను మరియు ప్రార్థనలు ద్వారా ఈ గొప్ప కార్యమును జరిగించియున్నాడు. ఈ రోజు నేను మీ యెదుట ఒక గొప్ప సజీవ సాక్ష్యము నిలువబడియున్నాను. ఎంతమంచి గొప్ప దేవునిని మనము కలిగియున్నాము. అవును, నా ప్రియులారా, ఈ ప్రియ సహోదరి యొక్క జీవితమును తిరిగి నిర్మించియున్నాడు. ఆమె స్వస్థపరచబడడము ఎంతో అసాధ్యము. ఆమెకు నాల్గవ దశలో క్యాన్సర్ ఉండెను. అయితే, ప్రభువు ఆమెకు తోడుగా ఉన్నందున మరియు ఆమె యొక్క దయ ఆమె యందు ఉన్నందున ఆమె యొక్క గొప్ప అద్భుతమును పొందికొని యున్నది. అదే విధముగా, నా ప్రియులారా, ప్రభువు హస్తము మీ మీద ఉన్నది. మరియు దేవుని సహ్తము మీకు తోడుగా ఉంటున్నది. దేవుడు మీ జీవితములో అన్నిటిని సమకూర్చును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నీ ప్రేమ గల హస్తము నీ బిడ్డలైన మా మీద ఉండునటు దిగివచ్చునట్లుగా చేయుము. ప్రభువా, వ్యాధి ఉన్న మా మీదికి ఇప్పుడే దిగివచ్చి, మాకు అద్భుతమైన స్వస్థతను అనుగ్రహించుము. యేసయ్యా, ఎటువంటి భయంకరమైన వ్యాధి ఉన్నను సరే, కనికరముతో మా పట్ల నీవు కదిలించబడి, నీవు పొందిన వ్యాధుల నుండి మాకు స్వస్థతను దయచేయుము. దేవా, నీ దయ ఇప్పుడే మా మీదికి దిగివచ్చునట్లుగా కృపను చూపుము, మాలో ఉన్న ప్రతి అవయవములను తాకి మాకు సంపూర్ణ స్వస్థతను మాకు అనుగ్రహించుము. తండ్రీ, మా జీవితంపై నీవు చూపిన అనుగ్రహానికి మేము నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. దేవా, ఎజ్రాతో నీవు ఉన్నట్లే, నీ చేయి మా మీద ఉండును గాక. ప్రభువా, మేము లేచి విరిగిపోయిన దానిని పునర్నిర్మించడానికి ధైర్యాన్ని మాకు అనుగ్రహించుము. దేవా, మా జీవితంలో శత్రువు దెబ్బతీసిన ప్రతిదాన్ని పునరుద్ధరించు. ప్రభువా, మమ్మును నీ యొక్క శక్తి చేత బలపరచుము, మరియు మేము నిర్మాణకుడిగా, పునరుద్ధరణకర్తగా మరియు మరమ్మతుదారుడిగా మారునట్లుగా కృపను అనుగ్రహించుము. దేవా, నీ వాగ్దానాలు మా జీవితంలో సజీవంగా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, దయచేసి నీ రాజ్యాన్ని పునర్నిర్మించడానికి మమ్మును వాడుకొనుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


