నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు మీరు యేసు పిలుచుచున్నాడు యాప్‌గాని మరియు క్యాలేండర్‌గాని చూచినట్లయితే, నేటి దినమున కొరకైన వాగ్దాన వచనమును మనము చూడగలము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నిర్గమకాండము 16:4వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను'' అని చెప్పబడియున్నది, ఆమేన్. అవును, దేవుని యొద్ద నుండి లభించే ఈ అద్భుతమైన సమకూర్పు కొరకు ఎదురుచూస్తూ ఉండి ఉండవచ్చును. నా ప్రియ స్నేహితులారా, అది వస్తుంది అని విశ్వసించండి. ఆలాగుననే, విశ్వాసంతో దానిని స్వీకరించండి. నా ప్రియులారా, మీరు నడుచుచున్న మార్గము మీకు కష్టంగా కనిపించినప్పుడు కూడా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయనకు విధేయులై, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయనతో నడవాలని ఎంచుకున్నారు. కనుకనే, ఆయన యొక్క సమకూర్పు మీ యొద్దకు తప్పకుండా వచ్చును. అది ఒక అరణ్యమార్గమని, ఎడారి మార్గమనియు మీకు తెలిసినప్పటికిని మరియు ఆ ప్రయాణమునకు మీ యొద్ద తగిన ధనం లేకపోయినప్పటికిని మీరు ప్రభువుకు విధేయత చూపించి, ఆయనను విశ్వసించి, ఆయనను వెంబడించియున్నారు. కనుకనే, ఈనాడు, మీ యొక్క అత్యంత అవసరతల మధ్య దేవుడు మిమ్మును ఘనపరచుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన అద్భుతరీతిలో మీ ప్రతి అవసరతలను తీర్చుచున్నాడు; నేటి నుండి ఆయన ఎల్లప్పుడు మీకు సమకూర్చువాడుగా ఉండి మిమ్మును సమృద్ధితో నింపుతాడు.

ఆలాగుననే, అరణ్యంలో ఇశ్రాయేలీయులకు ఆకాశం నుండి మన్నాను కురిపించినట్లుగానే, మీకు ఏమి కావలెనో సరైన సమయంలో సమకూర్చడం దేవునికి తెలుసు. కనుకనే, మీరు దేనిని గురించి చింతించకుండా, ధైర్యముగా ఉండండి. మీకు ఒక అద్భుతమును తెలియజేయాలని కోరుచున్నాను. ఆ అద్భుతమేమనగా, ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్న ఒక అత్యంత మధ్యతరగతి కుటుంబం, దాని పోషణ కొరకు పూర్తిగా దేవుని మీదనే ఆధారపడియున్నారు. అయితే, ఒకరోజు ఉదయకాలమున, అనేకమంది పిల్లలు అల్పాహారం కొరకు ఆకలితో ఎదురుచూస్తున్నారు; కానీ అక్కడ ఆహారం లేదు, పిల్లలకు ఆహారం సమకూర్చడానికి వారి యొద్ద కావలసిన ధనము కూడా లేదు. అటువంటి సమయములో వారికి ఏమి చేయాలో తెలియలేదు. కనుకనే, వారు ఇలాగున ప్రార్థించారు: 'ప్రభువా, నీవే మా పోషకుడవు. ఈ దర్శనమును మాకు అనుగ్రహించునది నీవే. దయచేసి, మాకు ఈ రోజునకు కావలసిన పోషణను అనుగ్రహించి, మమ్మును ఆదుకొనుము' అని చెప్పి భారముతో ప్రార్థించెను. సరిగ్గా అదే సమయములో, వారి ఇంటి గంట మోగిన శబ్దం వారికి వినబడినది. వారు వచ్చి చూచినప్పుడు, అది వారి ఇంటి ముందే పాడైపోయిన ఒక పాల వాహనమును మరియు ఆ పాల వాహనమును నడుపుచున్న ఒక ్రడైవర్ ఉండుట గమనించారు. అతను, వారిని చూచి, ' నా వాహనము పాడైపోయినది, కనుకనే ఈ పాలన్నింటిని ఏమి చేయాలో నాకు తెలియడం లేదు. నా ట్రక్కును బాగు చేయడానికి ఎన్నో గంటలు పడుతుంది, అంతవరకు ఈ పాలు అన్నియు పాడైపోతాయి. కనుకనే, దయచేసి ఈ పాలును మీరు తీసుకోండి? వాటిని మీరు తీసుకొనమని అతడు వారిని బ్రతిమిలాడుచుండెను. చూడండి, ఎంత అద్భుతము కదా, దేవుడు, ఆరోజు వారికి కావలసిన సమకూర్పును దయచేశాడు. కనుకనే, దేవుడు తమకు కావలసిన సమకూర్పును దయచేసినందుకును మరియు పిల్లలందరి కడుపులను పాలతో సమృద్ధిగా నింపినందుకు ఆ కుటుంబము వారు ప్రభువుకు ఎంతగానో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి, ఆయనను స్తుతించారు. హల్లెలూయా!

నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మిమ్మును చూచుచున్నాడు మరియు ఆయనే మీకు పోషకుడుగా కూడా ఉంటాడు. ఆయన మీ సొంత ఇంటిని కూడా సమృద్ధితో సమకూరుస్తాడు, మీ అప్పుల విషయంలో మీకు సహాయం చేస్తాడు మరియు మీకు అత్యవసరమైన సమయంలో కూడా మీకు అండగా మరియు తోడుగా ఉండి మిమ్మును నడిపిస్తాడు. అంతమాత్రమే కాదు, నా ప్రియులారా, మీరు కోరుచున్న ఆ అనుమతి మీకు లభించబోవుచున్నది. ఇంకను మీరు ఎదురుచూచున్న సమాధానం మీ యొద్దకు వచ్చును. ఆయనను నమ్మినవారిని దేవుడు ఎన్నడూ నిరాశపరచడు. కాబట్టి, స్నేహితులారా, ఈరోజు, విశ్వాసంతో ఆయన అనుగ్రహాన్ని స్వీకరించండి మరియు పరలోకం నుండి ఆహారాన్ని కురిపించిన దేవుడు మీ జీవితంలోని ప్రతి అవసరాన్ని తప్పకుండా తీరుస్తాడని నమ్మండి. నేటి వాగ్దానము నుండి ఆయన మిమ్మును సమృద్ధిగా దీవించును గాక.

ప్రార్థన:
కనికరముకలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా జీవితంలోని ప్రతి దశలో నీవు మా పోషకునిగాను, మా ఏకైక ఆధారంగాను ఉన్నందుకు నీకు వందనములు. ప్రభువా, నీవు మాకు సమస్తమును సమకూర్చుతావని మేము నిన్ను నమ్ముచున్నాము. దేవా, మా జీవితములో మాకు ముందుగా మార్గం కనిపించనప్పుడు కూడా నీ స్వరానికి విధేయత చూపుతూ, విశ్వాసంతో నడవాలని ఎంచుకొనునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీవే మాకు మార్గం, కాబట్టి మార్గం లేదనిపించిన చోటనే దయచేసి మాకు మార్గమును చూపించి, మేము ముందుకు కొనసాగునట్లుగా చేయుము. దేవా, మాకు అవసరమైన పోషణ, నిధులు మరియు ఆర్థిక ఆశీర్వాదాన్ని సరైన సమయంలో పొందునట్లుగా మాకు సహాయం చేయుము. ప్రభువా, మా శరీరంలో సంపూర్ణమైన స్వస్థతను తగినకాలమందు అనుగ్రహించి, తద్వారా మేము లేచి బలంతో మరియు ఆనందంతో నీ చిత్తమును నెరవేర్చుటకు సహాయము చేయుము. దేవా, మాకు ముందుగా ఉన్న ప్రతి ఆటంకమును తొలగిపోవునట్లుగా చేసి, నీ అనుగ్రహం మాకు ముందుగా వెళ్ళునట్లుగా చేయుము. ప్రభువా, మా విశ్వాసాన్ని ఘనపరచి, మా అవసరతలన్నిటిని క్రీస్తుయేసులో తీర్చి, నిన్ను స్తుతించుటకు మాకు అటువంటి కృపను దయచేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.