నా ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు దేవుడు మీ కొరకు బైబిల్ నుండి ఒక వాగ్దానముగా సామెతలు 23:18వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు'' అని చెప్పబడినట్లుగానే, నిశ్చయముగా మీ ఎదురు చూపులకు ఒక ముగింపు ఉంటుందని నమ్మండి. ఈ వాగ్దానమును పొందుకోవడం మనకు ఎంత ఆనందకరమో కదా? కాబట్టి, నా ప్రియులారా, ఈ రోజు మీ ప్రార్థనలేవియు కూడా వ్యర్ధము కానేరవని నాకు తెలుసు. బహుశా! మీరు ఒక ఆశీర్వాదం పొందడానికి ఎంతో కాలం వేచి ఉండి ఉండవచ్చును. కానీ, ఈ రోజు ప్రభువు ఇలా అంటున్నాడు, నిశ్చయంగా మీకు భవిష్యత్తులో ఒక నిరీక్షణ ఉంటుంది. అది, "నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును'' అని చెప్పబడినట్లుగానే, మనం దేవుని నుండి ఒక మాటను పొందుకున్నప్పుడు, అది మనకు ఎంతో ఆనందమును కలిగించుచున్నది. అందుకే బైబిల్ నుండి సామెతలు 24:13,14వ వచనములలో చూచినట్లయితే, "నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము అది నీకు దొరికిన యెడల ముందుకు నీకు మంచిగతి కలుగును నీ ఆశ భంగము కానేరదు'' అని చెప్పబడినట్లుగానే, దేవుని వాక్యం మన హృదయములను బలపరచి, మనలో నిరీక్షణను నింపడానికి తగినకాలములో మీ యొద్దకు వచ్చుచున్నది.

ఒకసారి మేము నాగాలాండ్‌లో పరిచర్య చేయుచున్నప్పుడు, ప్రభువు నాకు వాగ్దానమును అనుగ్రహించియున్నాడు. ఆ వాగ్దానము బైబిల్ నుండి కీర్తనలు 127:3వ వచనములో చూచినట్లయితే, "కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే'' అని చెప్పబడినట్లుగానే, ఆ దినములలో శామ్యేల్, శిల్పాకు ఒక బిడ్డను దయచేయాలని మా కుటుంబమంతయు కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించియున్నాము. మేము అక్కడ ప్రభువునకు సేవ చేయుచున్నందు వలన, మా అంకిత భావానికి బహుమానంగా, ప్రభువు నాగాలాండ్‌లో శిల్పాను నిజంగా ఆశీర్వదించియున్నాడు. అయితే, ఆ రోజు, శిల్పా తను గర్భవతిగా ఉన్నదని నేను నిశ్చయంగా నమ్మాను. మరియు అదే రోజున శిల్పా కూడా పరీక్ష చేసి, ఆమె గర్భవతి అని గుర్తించినది. కానీ, శ్యామ్ మరియు శిల్పా ఇద్దరూ ఆ విషయమును మాకు తెలియకుండా రహస్యంగా దాచి ఉంచియున్నారు. వారు దానిని రహస్యంగా ఉంచినప్పటికిని, ప్రభువు దానిని నాకు బయలుపరచియున్నాడు. అయితే, మేము నాగాలాండ్ నుండి కొండ మార్గము ద్వారా క్రిందికి దిగి వచ్చుచున్నప్పుడు, ఆ ప్రయాణము ఎంతో కఠినమైన మార్గముగా ఉండెను. ఆ మార్గము ఎత్తుపల్లములతో నిండియుండెను. అయినను, నేను దేవుని మాటల మీద ఎంతో నమ్మకముగా ఉండియున్నాను. కానీ, నాలో భయము వచ్చినది. కనుకనే, నేను నా భర్తగారితో, మనం ప్రత్యేకంగా శిల్ప కొరకు ప్రార్థించాలని తెలియజేశాను. తద్వారా, ప్రభువు ఆ బిడ్డను, తల్లిని ఇద్దరిని క్షేమముగా కాపాడవలెనని నేను కూడా ప్రార్థించియున్నాను.

అవును, నా ప్రియులారా, తగిన సమయంలో ప్రభువు యొద్ద నుండి ఒక చక్కటి వాగ్దానమును పొందడం మనకు ఎంత ఆనందమును కలిగించుచున్నది కదా! మరియు అది నాకు తేనె వలె మధురంగా ఉండియున్నది. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు నాకు తగిన సమయంలో వాగ్దానమును అనుగ్రహించియున్నాడని నేను దేవుని ఆ యొక్క వాగ్దానమును నమ్మాను. ఆలాగుననే, ప్రభువు తల్లిని మరియు బిడ్డను క్షేమంగా కాపాడియున్నాడు. అదేవిధముగా, నా ప్రియులారా, ఈ రోజు ప్రభువు మాకు చక్కటి బిడ్డయైన, మా మనవరాలు క్యాట్లిన్‌ను ఇచ్చి, మమ్మల్ని ఆశీర్వదించియున్నాడు. అవును స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడా దేవుని యొద్ద నుండి సంతానము కొరకు లేదా దేవుని నుండి మీకు కావలసిన ఆశీర్వాదముల కొరకు ఎంతో కాలము నుండి అడుగుచూ ఉండవచ్చును. అయితే, ప్రభువు ఇలా అంటున్నాడు, "నిశ్చయముగా, ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు'' అని చెప్పినట్లుగానే, కాబట్టి, ఈరోజు ఈ సందేశము చదువుచున్న మీ ప్రార్థనకు ప్రభువు తప్పకుండా జవాబును ఇస్తాడు. నేడు ఈ సందేశము చదువుచున్న మిమ్మును మీరు దేవుని హస్తములకు సమర్పించుకుని, ఆయన మీ పట్ల చేసిన వాగ్దానము నిమిత్తము నమ్మకంగా ఉంటూ ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా, దేవుడు మీకు మంచి ముందుగతిని కలిగించి, మీ ఆశ భంగము కాకుండా చేసి, మీకు సంతానమును మరియు మీకు కావలసిన సమస్తమును ఆయన సమృద్ధిగా అనుగ్రహించి, మిమ్మును వర్థిల్లింపజేయుచున్నాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

పార్థన:
కృపాకనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు చెల్లించుచున్నాము. దేవా, నిన్ను స్తుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, నీకు వందనములు. తండ్రి, మా భవిష్యత్తును నీ చేతులలో భద్రంగా ఉంచినందుకు నీకు వందనములు. దేవా, మేము నిరీక్షణ కలిగియుండుట కఠినంగా ఉన్నప్పుడు, నీ పరిపూర్ణ సమయంపై నమ్మకం ఉంచడానికి మాకు కృపనిమ్ము. దేవా, జీవితంపై నీవు పలికిన వాగ్దానముల యందు మేము ఎన్నటికీ నిరీక్షణను కోల్పోకుండా ఉండునట్లుగా చేయుము. ప్రభువా, మా కొరకు నీవు కలిగియున్న ప్రణాళిక ద్వారా కలుగు ఆశీర్వాదమును పొందుకొనుటకు మమ్మును సిద్ధపరచుము. ప్రభువా, మా నిరీక్షణకు ఒక ఉద్దేశం కలదని, మా నిరీక్షణ ఎన్నటికీ భంగరముకానేరదని నమ్ముటకు కృపనిమ్ము. ప్రభువా, నీవు మాకు ఇచ్చిన వాగ్దానము ప్రకారం మా భవిష్యత్తు యందు నిరీక్షణ కలిగి ఉండునట్లు చేసి, నిశ్చయముగా, మా ఆశ భంగముకాకుండా చేయుము. దేవా, మేము సంతానము కొరకు ఎంతగానో ఎదురు చూచుచున్నాము, నీ యొక్క వాగ్దానము ద్వారా మాకు నేడే సంతానమును అనుగ్రహించి, మా లోపములను సవరించి, మాకు గర్భఫలమును దయచేయుము. ప్రభువా, ఇంకను మేము యేసయ్య, యందు గొప్ప నిరీక్షణ కలిగి యుండునట్లుగా మా హృదయాలను సిద్ధపరచుము. దేవా, నేడు మా జీవితములో అవసరమైన ప్రతి కార్యమును మరియు మేము ఎదురు చూచు సమస్తమును నీవు మాకు అనుగ్రహించి మమ్మును వర్థిల్లజేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.