పరిచర్యలో భాగస్థులైన ప్రియులగువారికి,

'నేను నీ గృహమును కట్టుదును'' అని 2 సమూయేలు 7:11 లో తాను పలికినట్లుగా ఈ 2026 సంవత్సరము కొరకు అదే వాగ్దానమును ప్రభువు ఇచ్చుచున్నాడు. దావీదు కుటుంబమును, తన సంతతిని హెచ్చించి తన రాజ్యమును వారికి నిత్యము స్థిరపరచెదనని ప్రభువు వాగ్దానమిచ్చాడు. ఇశ్రాయేలులో ఇప్పటికి ఆ వాగ్దానము రుజువగుచున్నది. ఆ ప్రకారముగా మన కుటుంబములను కూడా స్థిరముగా కడతానని, మన భవిష్యత్తును రక్షణాత్మకముగా ఉంచుతానని, భయము మరియు అనిశ్చితి పరిస్థితుల మధ్యలో కూడా సమాధానమును తీసికొనివస్తానని ప్రభువు మనము అభయమిచ్చుచున్నాడు. ఈ సంవత్సరము మన జీవితము మరియు మన కుటుంబము యేసుచే మరియు యేసులో కట్టబడును.

ఈ సంవత్సరము దేవుడు మన గృహములను ఎలా కడతాడు? ఆయనలో నిత్యము స్థిరముగా ఉండు తన స్వంత స్థలముగా దేవుడు మనలను కడతాడు మరియు ఆయన అందులో నివాసముంటాడు, తన సన్నిధితో, సమాధానంతో మరియు సమృద్ధితో పొంగిప్రవహించేలా మనలను నిర్మిస్తాడు.

✨ యేసు పునాదిగా ఉండే ఒక రాజప్రాసాదమువలే నిర్మిస్తాడు: మన పాపములు నిర్మూలింపబడి తద్వారా ఎన్నడూ కదిలింపబడని స్థిరమగు మరియు మహిమకరమైన అంతఫురమువలె మనము ఉండుటకై క్రీస్తు తన ప్రశస్తమైన రక్తమును చిందించాడు, పరలోకములోని తన మహిమను విడిచిపెట్టాడు మరియు శ్రమనొంది మరణించాడు. యేసును మన పునాదిగా మనము చేసికొన్నప్పుడు ఆయన మన జీవితమును హెచ్చింపజేస్తాడు మరియు స్థిరముగా నిలిచేలా చేస్తాడు (1 కొరింథీయులకు 3:11).

✨ పరిశుద్ధాత్మ నివాసముండే ఒక రాజప్రాసాదము లేదా అంతఃపురము వలే నిర్మిస్తాడు: యేసే పునాదిగా ఉన్నప్పటికీ మనలను రాజప్రాసాదము వలే నిర్మించేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు మన బలహీనతలో మనము సహాయము చేస్తాడు, మనలను కాపాడతాడు, మనలను బలపరుస్తాడు మరియు తన నివాసస్థలమగు మనలను పరిశుద్ధముగా ఉంచుతాడు. దేవుని వాక్యము ద్వారా మనము జీవము పొందుకొనెదము మరియు జీవముగల రాళ్లవలె మరియు యేసు నివాసముండే భవనమువలె నిర్మించబడెదము. (ఎఫెసీయులకు 2:20&22, రోమీయులకు 8:26, యెషయా 59:19, 1 కొరింథీయులకు 14:15 & మార్కు 16:16–18).

✨ సమాధానపు కంచెతో కూడిన రాజప్రాసాదము వలె నిర్మిస్తాడు: దయ్యమునకు మరియు మన విరోధులగు ప్రజలకు లేదా ఈ లోకపు ఒత్తిళ్లకు మనము భయపడవలసిన అవసరము లేదు. దేవుడు మన చుట్టూ అగ్ని ప్రాకారమును మరియు సమాధానపు కంచెను ఉంచియున్నాడు. ఆయనే యేసు. సమాధానము పరిశుద్ధతను కలుగజేస్తుంది మరియు పరిశుద్ధత ద్వారా మనము దేవుని చూచెదము. (కీర్తన 147:14, రోమా 16:20, యోబు 1:10 & హెబ్రీయులకు 12:14)

✨ అత్త్యుత్తమ ఆశీర్వాదములు కలిగియున్న ఒక రాజప్రాసాదమువలె నిర్మిస్తాడు: ఆయన దారిద్ర్యము ద్వారా మనము సంపన్నులగు నిమిత్తము యేసు సంపన్నుడైనను మన కొరకు పేదవానిగా మారాడు. యేసు మనలను రాజప్రాసాదము వలె నిర్మించినపుడు మనము ఆశీర్వాదములను పొందుకొనెదము తద్వారా దేవుని ప్రజలకు మరియు ఆయన రాజ్యమునకు మనము ఆశీర్వాదముగా ఉండెదము. (కీర్తన 81:16, 2 సమూయేలు 6:11, 2 సమూయేలు 7:29, 2 కొరింథీయులకు 8:9, 9:8)

ప్రేమామయుడగు తండ్రీ, నా జీవితమునకు పునాదికండి, పరిశుద్ధాత్మ ద్వారా మీయొక్క భవనమువలె నన్ను మార్పునొందించండి మరియు మీ వాక్యము ద్వారా జీవముగల రాళ్లవలె నన్ను తీర్చిదిద్దండి. దైవిక కంచెతో నా జీవితముచుట్టూ ఆవరించండి మరియు మీ ఆశీర్వాదముల ద్వారా జీవితమును పరిపూర్ణముగా అనుభవించేలా నాకు సహాయము చేయండి. యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్!

మిక్కిలి ప్రేమ మరియు ప్రార్థనలతో,

మీ ప్రియ సహోదరుడు,

డా. పాల్ దినకరన్


సిఓఓ కార్యాలయము నుండి

🌟 2025 లో పరిచర్య కనుపరచిన ప్రభావము - మీ కారణముగా

2025 సంవత్సరమును తరచి చూచినయెడల యేసు పిలుచుచున్నాడు పరిచర్యలో దేవుని విశ్వసనీయతనుబట్టి మరియు ఈ పరిచర్య ప్రయాణమంతటిలో మాతోపాటుగా మిమ్మును కూడా కలిగియున్నందుకు గొప్ప కృతజ్ఞతతో మేము నింపబడుచున్నాము. మీవంటి భాగస్థులు అందించిన ఉదారమైన విరాళములు ఈ సంవత్సరము భారత దేశమంతటా 2.4 కోట్ల ప్రజల ప్రాణములను ఏవిధముగా ప్రభావితము చేసినవి అనేది మీతో పంచుకొనుట మాకు దీవెనకరముగా ఉన్నది.

ఈ 2025 సంవత్సరపు ఆశీర్వాదము - దీవెనకరమగు వర్షము కురియు సంవత్సరము (యెహేజ్కేలు 34.26) అనునది మా ప్రతి పరిచర్య విభాగములో గొప్ప పంటను అనుగ్రహించింది మరియు అత్యద్భుతమైన వర్ధిల్లతను మరియు అభివృద్ధిని తీసికొనివచ్చింది.

ప్రార్థన గోపురము పరిచర్య: భారత దేశములోని 104 ప్రార్థన గోపురములలో ప్రార్థన విజ్ఞాపకులు ప్రార్థన గోపురములను సందర్శించిన 19,07,500 ప్రజలకు పరిచర్య చేసారు. ప్రార్థన గోపురములలో నిర్వహింపబడిన 43,000 కు పైగా కూటములలో 15.7 లక్షల ప్రజలకు పరిచర్య చేయబడింది. 10.21 లక్షల మంది ప్రజలకు ప్రార్థన తైలమును ఉచితముగా పంపిణీ చేయబడింది. యేసు పిలుచుచున్నాడు సిబ్బందితో పాటుగా సుమారు 20,157 మంది వాలంటీర్లు ఈ సేవలన్నియు సాధ్యమయ్యేలా చేయగలిగారు.

ఉత్తరములు మరియు ఈమెయిల్ పరిచర్య: ఈమెయిల్ మరియు ఉత్తరముల ద్వారా మేము పొందుకొనిన 7 లక్షల ప్రార్థన విన్నపముల కొరకు డా. పాల్ దినకరన్ గారు, వారి కుటుంబము మరియు సిబ్బందితో పాటుగా ప్రార్థించారు, దేవుని వాక్యము మరియు భరోసాతో వారికి జవాబులు పంపారు.

టెలిఫోన్ పరిచర్య: 13 భాషలలో 46 లక్షల ప్రార్థన విన్నపముల నిమిత్తము మా విజ్ఞాపకులు ప్రార్థించారు; 5,86,309 మంది భాగస్థులు దేవుని వాగ్దానమును మరియు తమ జన్మదినము మరియు వివాహ వార్షికోత్సవం సందర్భముగా ప్రత్యేక ప్రార్థనలను పొందుకొన్నారు.

సామాజిక మాధ్యమ పరిచర్య: ఆత్మీయ పోస్టులు, పాటలు, ప్రత్యక్ష ప్రసార కార్యక్రమములు, షార్ట్ ఫిల్మ్స్, వక్తృత్వ పోటీలు, టాక్ షోలు, మరియు అనుదిన వాగ్దానము ద్వారా ఈ సంవత్సరము మేము 18 కోట్ల ఆత్మలకు చేరువ కాగలిగాము. పాటలు ద్వారా 24 లక్షల మంది ప్రజలకు మరియు డిజిటల్ మీడియా పరిచర్య ద్వారా 21 మిలియన్ల మంది ప్రజలకు చేరువయ్యాము.

టీవీ పరిచర్య: అన్ని వయస్సుల ప్రజల ఆశీర్వాదముల నిమిత్తము మేము ఆరంభించిన నూతన కార్యక్రమముల ద్వారా తమిళ్, హిందీ, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషలలో వివిధ ఛానళ్లలో ప్రసారం కాబడిన 1,875 కార్యక్రమములు 14.4 మిలియన్ల వీక్షకులను మరియు ఫ్యామిలీ ఛానల్ మూలముగా మిలియన్ల కొలది వీక్షకులను ఆశీర్వదించినవి.

సంఘములకు సహాయము: ఈ సంవత్సరము 810 మంది పాస్టర్లు ఆర్ధిక సహాయము పొందుకొన్నారు మరియు 23 నూతన సంఘములు కట్టబడినవి మరియు నూతన పరచబడినవి.

 

🌟 జనవరి నెలలో పరిచర్య

2026 - వాగ్దాన గీతము: నూతన సంవత్సర ఆశీర్వాదము కొరకు తమిళ్, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో 'వాగ్దాన గీతము 2026' ను మేము యూట్యూబ్ లో విడుదల చేసాము. దయచేసి ఈ గీతములను విని మీ ప్రియులగువారితో ఈ గీతములను పంచుకొనుడి. పాటల కొరకు లింక్

రాంచి ప్రార్థన గోపురము, ఝార్ఖండ్: ఈ ప్రార్థన గోపురము పరిచర్య ద్వారా గడచిన సంవత్సరము 37,500 మంది ప్రజలకు మేము చేరువయ్యాము మరియు ఈ సంవత్సరము 50,000 మంది ప్రజలకు చేరువ కావాలని మేము ఉద్దేశించియున్నాము. ప్రజల కొరకు కూటములు నిర్వహించు నిమిత్తము కూటము హాల్ ను, కౌన్సిలింగ్ గదులను, ఆడియో-విజువల్ గదులను, ఇతర ఉపయోగిత గదులను ఆధునీకరించాము మరియు ప్రార్థన విజ్ఞాపకుల కొరకు అధిక సంఖ్యలో సీట్లను సిద్దపరిచాము. వీటన్నిటి కొరకు రూ. 3 కోట్లు వెచ్చించాము.

కారుణ్య విశ్వవిద్యాలయము - విద్య, సృజనాత్మకత మరియు కరుణ ద్వారా జీవితములను ప్రభావితము చేయుచున్నది.

  • కారుణ్య విశ్వవిద్యాలయము NAAC A++ Accreditation, NBA, ICAR, ACCA (UK) approvals తో ఆక్రెడిటెడ్ అయినది, QS I-GAUGE Platinum, QS World University Rankings మరియు Times Higher Education (THE) World Rankings 2025 తో విశ్వవ్యాప్తముగా గుర్తింపు పొందినది.
  • 2025–26 విద్యా సంవత్సరమునకు రూ. కోట్ల విలువైన స్కాలర్షిప్ లను 1,092 మంది అర్హత కలిగిన విద్యార్థులకు అందించుట జరిగింది. దీనిలో భాగముగా అభాగ్యులైన విద్యార్థులకు, విపత్తు బాధితులకు మరియు మణిపూర్ రాష్ట్ర విద్యార్థులకు 100% ట్యూషన్ ఫీజు రాయితీ ఇవ్వబడింది కూడా.
  • కారుణ్య విశ్వవిద్యాలయము Papua New Guinea దేశమునుండి 25 మంది విద్యార్థులను ఆహ్వానించింది తద్వారా semester abroad programmes మరియు international internships in 85+ countries మూలముగా global universities and industries తో నూతన సంయుక్త అవగాహనను కుదుర్చుకొన్నది.
  • రానున్న 2026-2027 విద్యా సంవత్సరము కొరకు కారుణ్య విశ్వవిద్యాలయములో ప్రవేశములు ఆరంభమైనవి. చేరనున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు లో పూర్తిస్థాయి రాయితీతో కలుపుకొని అధిక సంఖ్యలో ఇతర మెరిట్ స్కాలర్షిప్ లతో Multi-Crore scholarship లను ప్రకటించింది. https://admissions.karunya.edu ను దర్శించండి.

సీషా - జీవితములను మరియు జీవనోపాధులను పునర్నిర్మించుచున్నది

  • 30,000 మందికి పైగా అభాగ్యులైన చిన్నారులు భారత దేశములోని అనేక ప్రాంతములలో స్కూల్ కిట్లు మరియు నూతన దుస్తులు పొందుకొని సంతోషముతో నింపబడ్డారు.
  • ఈ సంవత్సరము Kadru (Ranchi), Kottayam (Kerala), Manipur, Tiruvallur, Vikravandi (Viluppuram), మరియు Vyasarpadi లలో నూతనముగా 6 సీషా బోధన కేంద్రములు ఆరంభమైనవి. వీటితో కలుపుకొని ప్రస్తుతము భారత దేశమంతటా మొత్తము 63 సీషా బోధన కేంద్రములు ఉన్నవి.
  • Roing and Itanagar (Arunachal Pradesh) లలో నూతన టైలరింగ్ కేంద్రములను సీషా ఆరంభించింది. అట్టడుగువర్గాల స్త్రీలకు సాధికారతను కల్పించుటలో భాగముగా చెన్నైలోని తాంబరం మరియు ప్యారిస్ లలో ఉచిత టైలరింగ్ కేంద్రములు కూడా ఆరంభమైనవి.
  • ఇది మాత్రమే కాకుండా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమములు, ట్యూషన్ సెంటర్లు, వైద్య సహాయము, విపత్తు సహాయక చర్యలు, వృద్ధులకు సేవలు వంటి అనేక సహాయక సేవల ద్వారా అట్టడుగు వర్గాల సమాజములకు చెందిన వేలకొలది అధిక సంఖ్యలో జీవితములకు సీషా చేరువగుచున్నది.


యేసు పిలుచుచున్నాడు పరిచర్యలు ద్వారా 25 కోట్ల ప్రజల కన్నీటిని తుడవాలనే లక్ష్యముతో ఈ సంవత్సరము ప్రజల కొరకు ప్రార్థించుటకు ప్రతి రాష్ట్రములో 1000 మంది ప్రార్థన విజ్ఞాపకులను, నూతన అంబాసిడర్లను, యోవన నాయకులను మరియు శిక్షణ కార్యక్రమముల మూలముగా ప్రార్థన భాగస్థులను లేవనెత్తాలనే మరియు అభాగ్యులగు ప్రజలకు సీషా మూలముగా కరుణతో కూడిన సంరక్షణను అందించాలనే లక్ష్యములను మేము కలిగియున్నాము.

మనము కలిసిమెలిసి సంయుక్తముగా ఈ సంవత్సరము 25 కోట్ల ఆత్మలకు పరిచర్య చేయుటద్వారా వారి జీవితములలో నిరీక్షణను మరియు అద్భుతములను తీసికొనివచ్చెదమా! ఈ లక్ష్యములు అన్నింటి విషయమై ప్రార్థించమని మరియు మాతో చేరమని మిమ్మును అభ్యర్ధించుచున్నాము. వీటికొరకు మీ చేయూత అందించుటకు లిం https://www.jesuscalls.org