మీ గృహమును ఏవిధముగా నిలబెట్టుకోవాలని నేను మీతో మాట్లాడబోవుచున్నాను. మీ జీవితమును ఎలా నిలబెట్టుకోవాలి అనే విషయమును కీర్తన 127:1 లో మాత్రమే మనము కనుగొనగలము.
"యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే''
అవును, దేవుడు సమస్తమును కట్టువాడు (హెబ్రీయులకు 3:4). మీ జీవితములో ఏదైతే విరిగినస్థితిలో ఉన్నదో, కృంగిన లేదా నశించినస్థితిలో ఉన్నదో ఈ నెలలో దానిని కట్టెదనని ప్రభువు వాగ్దానమిచ్చుచున్నాడు.
1. దేవుడు ఒక ఇంటిని కట్టినపుడు ఆయన దానిని 'సమాధానకరమైన ఇంటిగా' కడతాడు : ఎప్పుడైతే మనము నీతితో మరియు దేవుడు మనలను జీవించాలని ఆశించిన రీతిలో మనము జీవించినపుడు అది సమాధానము, సమృద్ధి, కాపుదల మరియు వర్ధిల్లతను మన జీవితములలోనికి తీసికొనివస్తుంది. ఆయన మనలను గూర్చి సమస్తమును సంరక్షించి సమకూర్చుతాడు, మనము విశ్రాంతిని మరియు సమాధానకరమగు జీవితమును కలిగియుంటాము. (యెషయా 32:18, కీర్తన 147:14 & అపొ.కా. 9:31)
2. ప్రభువు తన 'రక్షణ' తో నింపబడిన ఇంటిని మనకు అనుగ్రహిస్తాడు : కుటుంబములో ఒక వ్యక్తి రక్షణ లేదా మారుమనస్సును కలిగియుండి యేసును వెంబడించినపుడు ఇతరులు కూడా పరిశుద్ధాత్మ ప్రభావముతో దేవుని బిడ్డలుగా మార్పునొందెదరు. భార్యాభర్తలు తమలో విశ్వాసమును కలిగియుండి ఆప్రకారముగా జీవించినపుడు వారి బిడ్డలు కూడా దైవికముగా ఎదిగెదరు, రక్షణ పొందెదరు మరియు ఆత్మీయతలో వెనుకబడినవారు కూడా ప్రభువుయొద్దకు తిరిగివచ్చెదరు (అపొ.కా. 16:31, 1 కొరింథీయులకు 7:14, మలాకీ 2:14 & యిర్మీయా 3:22).
3. దేవుడు మన కుటుంబమును మరియు మన గృహమును 'పరిచర్య కుటుంబము' గా కడతాడు : ఎప్పుడైతే మనము ప్రభువు పరిచర్య చేస్తామో, ప్రజలకు ఆయన ప్రేమను పంచుతామో, వారి కొరకు మన గృహమును తెరుస్తామో అప్పుడు మనము ప్రభువు యొక్క సూచనలుగా ఉండెదము, ప్రభువు మన కుటుంబములో పునరుత్ధానమును అనుగ్రహించి మనలను ఘనపరుస్తాడు.
ప్రజలు యేసు మాటలను వినాలని మార్త, మరియ, లాజరు తమ గృహమును తెరిచారు. అప్పుడు ప్రభువు లాజరును మరణమునుండి లేవనెత్తాడు తద్వారా ఈ అద్భుత కార్యము యేసునందు అనేకులు విశ్వాసముంచేలా నడిపించింది (లూకా 10:38–42 & యోహాను 11:38-43).
4. మీ గృహము 'బలముగా స్థిరపరచబడిన గృహము' వలె మారుతుంది : ఎప్పుడైతే మనము మన ఇంటిని మరియు మన జీవితములను దేవుని వాక్యముద్వారా స్థిరపరచుకుంటామో మరియు దేవుడు మనలను నడిపించిన ప్రకారం సమస్తమును చేసెదమో అప్పుడు ఎట్టి వరదలు వచ్చినా, కుంభవృష్టి కురిసినా మరియు పెనుగాలి వీచినా మన ఇల్లు నిత్యము నిలుస్తుంది. కుటుంబములో బలమైన ఐక్యత మరియు బంధము ఉంటుంది మరియు అది మన కుటుంబములోని ఇతర సభ్యులకు మనలను దీవెనగా ఉంచుతుంది (యెషయా 8:18,1 కొరింథీయులకు 10:4 & ఎఫెసీయులకు 2:20, 5:22,23 &31).
5. మీ ఇల్లు 'ఆశీర్వాదకరమైన ఇల్లు' గా ఉంటుంది : మనము ఇచ్చినపుడు మన ఇల్లు ఆశీర్వదింపబడుతుంది మరియు బలముగా ఉంటుంది. మొదటిగా దేవుని పనికి పిమ్మట తమ వ్యక్తిగత అవసరతల నిమిత్తము దేవుని సేవకులకు, తరువాత మన బంధువులకు మరియు బీదలుకు మనము ఇవ్వవలసియున్నది (కీర్తన 115:12, మత్తయి 6:33, లూకా 6:38, మలాకీ 3:10, కీర్తన 16:2,3, 1 తిమోతికి 5:8 & యెషయా 58:7 & 8).
మీ హృదయమును దేవుని కొరకు తెరవండి. మీ జీవితములో యేసు ఈ రోజున కట్టబడునుగాక!
కుటుంబ ఆశీర్వాద పధకం లో చేరి ప్రభువుతో అనుసంధానతను కలిగియుండుడి. మీ కొరకు ప్రార్థన గోపురములో అనుదినము ప్రార్థన జరిగేలా చూసుకొనండి. ప్రార్థన మూలముగా మీకు సహకారము అందించాలని మేము ఆశిస్తున్నాము. ఈ ఆశీర్వాదములన్నియు మీ గృహముపై దిగివచ్చునుగాక మరియు ప్రభువు మీ కుటుంబమును కట్టునుగాక! https://bit.ly/jc_fbp ను క్లిక్ చేయుట ద్వారా ఈ రోజే చేరండి.
ఈ నెలలో ఈ ఆర్ధిక సంవత్సరము ఆరంభము కానుండగా ప్రభువు మిమ్మును వర్ధిల్లజేయును మరియు మీ జీవితములో సమస్తమును కట్టునుగాక!
'నా ప్రియ పరలోకపు తండ్రీ, మీ బిడ్డ జీవితమును కట్టండి, వారి ఆరోగ్యమును, ఉద్యోగమును, వారి ఇంటిని మరియు వారి సంబంధ బాంధవ్యములను కట్టండి. మీ వాక్యము ద్వారా తమను కట్టుకొనే కృపను వారికి అనుగ్రహించండి మరియు ఈ ఆశీర్వాదములన్నింటిని సంతోషముగా అనుభవించే విశ్రాంతిని వారికి దయచేయండి. మీ బలమైన నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్!'
మిక్కిలి ప్రేమ మరియు ప్రార్థనలతో,
మీ ప్రియ సహోదరుడు,
డా. పాల్ దినకరన్
మీ కారణముగా - మార్చి నెలలో పరిచర్యలో కనుపరచబడిన ప్రభావము
గత నెలలో పరిశుద్ధాత్మ యొక్క బలమైన కదలికను మరియు దేవుని సన్నిధి అలల రూపములో ప్రజలపై కదలాడుటను మేము వీక్షించాము తద్ఫలితముగా స్వస్థత, పునరుద్ధరణ, పాపపు బంధకములు బ్రద్దలగుట మరియు వ్యసనములనుండి విడుదల కలుగగా విస్తారమైన సంఖ్యలో ప్రజలు తమ హృదయములను యేసు ప్రేమకు సమర్పించుకున్నారు. గత నెలలో దినకరన్ కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతములలో పరిచర్య చేసారు మరియు వారు తమిళనాడులోని అరుణ్మయిలో నిర్వహింపబడిన యేసు పిలుచుచున్నాడు పాస్టర్ల ఆశీర్వాద కూటములో పరిచర్య చేసారు, బెంగళూరు లోని ఫ్రేజర్ టవర్ ప్రార్థన గోపురములో యేసు పిలుచుచున్నాడు భాగస్థుల నిమిత్తము రోజంతా ప్రార్థనలు చేసారు.
'దేవుడు పరిశుద్ధులు మరియు నీతిమంతులకు న్యాయము జరిగిస్తాడని' గత నెలలో పరిశుద్ధాత్ముడు డా. పాల్ దినకరన్ గారితో మాట్లాడినది మహారాష్ట్రలోని సాంగ్లీలో నిర్వహింపబడిన ప్రార్థన పండుగలో ఆ ప్రకారంగానే నెరవేరుటను మేము వీక్షించాము.
ఆ కూటమును ఆపుచేయాలని ముంబై హైకోర్టులో ఒక ఫిర్యాదు చేయబడగా ప్రభువు మా తరపున బలముగా కదలాడగా మేము హైకోర్టు నుండి ఒక అసాధారణమగు నివేదికను పొందుకొన్నాము. అది ఈ కూటము రద్దుచేయాలనే ఆలోచనతో పోలీస్ అనుమతి రద్దుచేయగా, ప్రార్థన పండుగ 2 వ మరియు 3 వ దినమున కొనసాగేలా కోర్టు తీర్పు ఇచ్చింది. ఇందులో సుమారు 50,000 మంది ప్రజలు అనుదినము వ్యక్తిగతముగా కూడుకొన్నారు మరియు సామాజిక మాధ్యమము ద్వారా లక్షలాది ప్రజలు వీక్షించారు. దినకరన్ కుటుంబ సభ్యులు అచ్చట పాస్టర్ల మధ్యలో కూడా పరిచర్య చేయగా వారు నూతనమైన అభిషేకము మరియు దేవుని తాకుదలను పొందుకొన్నారు మరియు భాగస్థులతో కలిసి ప్రార్థించారు కూడా. ఈ కూటములు అన్నింటిలో మేము శక్తివంతమైన సాక్ష్యములను పొందుకొన్నాము మరియు యేసు నామము మహిమపరచబడింది. దినకరన్ కుటుంబ సభ్యులతో నిలిచి మేము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. వారి కుటుంబము కొరకు మరియు పరిచర్య నిమిత్తము మీయొక్క ఎడతెగని ప్రార్థనలు మాకు ఎంతో అమూల్యమైనవి. గత నెలలో మీరు ఉదారముగా విత్తిన విత్తనములు (కానుకలు) కనుపరచిన ప్రభావమునుగూర్చి ఇచ్చట తెలుపుచున్నాము.
- టెలిఫోన్ ప్రార్థన కాల్స్ మూలముగా మేము 3.7 లక్షల మంది ప్రజలకు పరిచర్య చేసాము.
- డయల్ ఏ ప్రేయర్ ద్వారా 12,720 మంది ప్రజలకు పరిచర్య చేసాము.
- ఉత్తరములు మరియు ఈమెయిళ్ల ద్వారా 59,860 మంది ప్రజలకు పరిచర్య చేసాము.
- మా ప్రార్థన గోపురములలో 1.38 లక్షల మంది సందర్శకులు వ్యక్తిగత ప్రార్థనలు పొందుకొన్నారు.
- సామాజిక మాధ్యమము ద్వారా నిరీక్షణ మరియు దేవుని ప్రేమ సందేశమును అందించుచు లక్షలాది ప్రజల
- జీవితములను ప్రభావితం చేసాము. సుమారు 2.50 కోట్ల వ్యూస్ పొందుకొన్నాము.
- ప్రార్థన గోపురముల ద్వారా 3290 కూటములు నిర్వహింపబడినవి తద్వారా 1.03 లక్షల మంది ప్రజలు తాకబడ్డారు.
- ఏప్రియల్ నెలలో చేయు పరిచర్య
డైనమిక్ కిడ్స్ క్యాంప్: ఈ ఏప్రియల్ లేదా మే నెలలలో భారత దేశములోని అన్ని యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములలో 6 నుండి 12 సంవత్సరములు మధ్య వయస్సు కలిగిన పిల్లల నిమిత్తము 6 రోజుల పాటు డైనమిక్ కిడ్స్ క్యాంప్ ను మేము నిర్వహించనున్నాము. ఈ క్యాంపులో ప్రవేశము ఉచితము. ఈ సంవత్సరము 20,000 మంది చిన్నారులు ఈ క్యాంపులో పాల్గొనెదరని మేము ఎదురుచూచుచున్నాము. కావున మీ చిన్నారులను పంపి అందులో వారిని భాగస్వామ్యము చేయండి. మీకు ఒక బిడ్డ కొరకు (రూ. 300/-) లేదా ఇద్దరు చిన్నారుల కొరకు (రూ. 600/-) లేదా ప్రభువు మిమ్మును ప్రేరేపించిన ప్రకారం ఎంత మంది చిన్నారుల కొరకైనా స్పాన్సర్ చేయవచ్చును.
మీరు కూడా స్వచ్చందంగా ఈ క్యాంపునకు వచ్చి చిన్నారులకు బోధించవచ్చును మరియు కార్యక్రమములను నడిపించవచ్చును. మరింత అధిక సమాచారం నిమిత్తము - [email protected]
ఘట్కోపర్ ప్రార్థన గోపురము: ముంబై నగరములో ఉన్న ప్రజలకు నిరీక్షణ, స్వస్థత మరియు మార్పును అందించు కేంద్రము ఇది. ఇంతవరకు ఈ ప్రార్థన గోపురము ద్వారా 3 మిలియన్లకు పైగా ప్రజల జీవితములు ప్రభావితం కాబడ్డవి. ఈ సంవత్సరము 1,20,000 జీవితములను క్రీస్తు ప్రేమతో మార్పునొందించాలని మేము ప్రార్ధనపూర్వకముగా ఉద్దేశించియున్నాము, శిక్షణ మరియు వేలాది విశ్వాసపాత్రులగు ప్రార్థన విజ్ఞాపకులను లేవనెత్తుట ద్వారా మాయొక్క ఔట్రీచ్ పరిచర్యలను బలపరచబోవుచున్నాము.
ప్రార్థన గోపురము నిర్వహణకు సంవత్సరమునకు రూ. 60 లక్షలు మేము వెచ్చించవలసియున్నది. మీరు అందించే విశ్వసనీయమగు విత్తనము ఈ పరిచర్య నడిపింపునకు మరియు జీవితములు నిర్మించుటకు మీకు ఉపకరించును. ఈ లక్ష్యము కొరకు ప్రార్థించండి, స్పాన్సర్ చేయుట ద్వారా దీనితో భాగస్వామ్యముకండి మరియు ఇచ్చట పరిచర్య చేయుట ద్వారా మరియు ప్రజల కొరకు శ్రద్ధ చూపించుట ద్వారా మీ సమయమును స్వచ్చందంగా వెచ్చించగలరు కూడా.
కారుణ్య విశ్వవిద్యాలయము
మానవాళికి సేవనందించుటకు శాస్త్ర సాంకేతిక మరియు ఇంజినీరింగ్ రంగములలో భవిష్యత్ నాయకులను సృష్టించుట
- కారుణ్యకు చెందిన మా ఒకానొక Agriculture Student ఒక top German company లో 31 lakhs/annum ఇంటర్న్షిప్ ఆఫర్ ను పొందుకొన్నారు.
- 3rd Year Biotechnology student, Osaka University, Japan లో ఇంటర్న్షిప్ పొందుకొన్నారు. కారుణ్య విద్యార్థులు ముగ్గురు Lodz University of Technology, Poland లో తమ semester abroad program ను చేయుచున్నారు మరియు Automation and Robotics లో advanced courses చేయుచున్నారు.
- Karunya ఒక జాతీయస్థాయి 24-hour hackathon ‘Aurelion 2026’ ను నిర్వహించగా ఇందులో design and develop industry-ready solutions ను 168 బృందములు చేసాయి.
- 2026-2027 సంవత్సరమునకు Karunya University లో ప్రవేశములు ఆరంభమైనవి. Multi-Crore scholarships ప్రకటింపబడినవి. ఇందులో full tuition fee waivers and many other merit scholarships కూడా ఉన్నవి. https://admissions.karunya.edu ను దర్శించండి.
సీషా
కరుణతో కూడిన సంరక్షణతో నిరీక్షణను పునరుద్ధరించుచు జీవితములను పునర్నిర్మించుచున్నది
- భారత దేశమంతటా SEESHA Project locations లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవమును సీషా నిర్వహించగా ప్రాంతీయ సమాజములకు చెందిన 540 మందికి పైగా స్త్రీలు ఇందులో పాల్గొన్నారు. వీరిలో అనేకులు వారి నైపుణ్య శిక్షణ కోర్స్ ముగింపు సర్టిఫికెట్లను పొందుకొన్నారు మరియు ఆ విధముగా సాధికారతను కలిగియున్నారు.
- కోయంబత్తూరులోని సీషా లెర్నింగ్ సెంటర్ల నుండి 200 మంది చిన్నారులు నూతన దుస్తులను పొందుకొన్నారు మరియు వానగరంలో 60 మంది స్కూల్ విద్యార్థులు భవిష్యత్తు విషయమై నడిపింపును మరియు స్కూల్ కిట్లను పొందుకొన్నారు.
- వీటికిపైగా సీషా తన సామాజికాభివృద్ధి కార్యక్రమములో భాగంగా Participatory Rural Appraisal (PRA) exercise ను భారత దేశమంతటా తాను టార్గెట్ చేసిన 44 ప్రాజెక్టు గ్రామములలో ఆరంభించింది.
ఈ లక్ష్యము కొరకు ప్రార్థించండి మరియు యేసు అవసరతను కలిగియున్న ప్రజలకు సహాయము చేయండి. మనము సంయుక్తముగా ఆయన రాజ్యము కొరకు ఆత్మలను సమకూర్చెదము మరియు తన మహిమను లోకములో ప్రతిబింబించెదము.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


