దేవుడు మిమ్మును వర్ధిల్లజేసి మీ జీవితమును నిర్మిస్తాడు
నా ప్రశస్తమైన స్నేహితులారా, నేను ఈ నెల విషయమై మీ కొరకు ప్రార్థించుచుండగా ప్రభువు ఈ వాగ్దానమును నా హృదయములో ఉంచాడు.
''నీ కటాక్షముచొప్పున సీయోనుకు మేలుచేయుము; యెరూషలేముయొక్క గోడలను కట్టించుము'' (కీర్తన 51:18).
మన దేవుడు తన బిడ్డలను వర్ధిల్లజేయుట మాత్రమే కాకుండా వారి జీవితములలో ప్రతి విరిగి నలిగిన పరిస్థితిని పునర్నిర్మిస్తాడు. సీయోను దేనిని సూచిస్తుందో మీకు తెలుసా? అది దేవుని నివాసస్థలమును సూచిస్తుంది. ఈ రోజున యేసు క్రీస్తు మూలముగా మీ హృదయము ఆయన సీయోనుగా మారుతుంది. (1 యోహాను 4:4 & 3 యోహాను 2). ప్రభువు మీ జీవితమును వర్ధిల్లజేయుటకు ఇష్టపడు ఆరు చక్కని మార్గములను గూర్చి మనము చూద్దాం.
1. ఆయన మిమ్మును నీతిలో వర్ధిల్లజేస్తాడు: మన ఆత్మలను పునరుద్ధరించుట ద్వారా ప్రభువు ఎల్లప్పుడు మన జీవితములలో తన పనిని ఆరంభిస్తాడు. మన జీవితము నీతిపై కట్టబడినపుడు ఏ విరోధి లేదా సాతాను మనకు విరోధముగా నిలువలేడు. ప్రభువు తానే మనలను ఘనపరుస్తాడు, కాపాడతాడు మరియు మనలను స్థిరపరుస్తాడు. (కీర్తన 23:3).
'యోసేపు జీవితము యొక్క బహిర్గత విషయములను పునర్నిర్మించుటకు మునుపు దేవుడు అతని ఆత్మను మొదటిగా పునరుద్ధరించాడు మరియు తనను నీతి మార్గములలో నడిపించాడు. ప్రభువు తనను పూర్తిగా లేదా తలక్రిందులుగా మార్చివేసాడు'
2. ఆయన మిమ్మును స్తుతించుటలో వర్ధిల్లజేస్తాడు: పరిస్థితులను పట్టించుకొనకుండా దేవుని స్తుతించుటను కొనసాగించే హృదయమును ప్రభువు ఒక వ్యక్తికి అనుగ్రహించుట అనేది ఒక గొప్ప ఆశీర్వాదము. మనకు జవాబు రాక మునుపే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలని ప్రభువు మననుండి ఎదురుచూస్తున్నాడు. మన హృదయము స్తుతులతో నింపబడినపుడు మన కన్నులు సమస్య నుండి తీసివేయబడి ప్రతి సమస్య కంటే గొప్పవాడగు దేవునివైపు చూడడం ఆరంభిస్తాయి (కీర్తన 63:3 & కీర్తన 103:1).
3. ఆయన మనలను తన ఆశ్చర్యకరమైన సృష్టిగా వర్ధిల్లజేస్తాడు: ప్రభువు తన సింహాసనమును మన హృదయములలో స్థిరపరిచాడు అని మనము గ్రహించినపుడు మనలను మనము వ్యత్యాసముగా చూడడం ఆరంభిస్తాము. మన బలహీనతలపై దృష్టిపెట్టుటకు బదులుగా మనలో జీవించున్న దేవుని గొప్పతనమును చూడడం ప్రారంభిస్తాము. ప్రభువు మన కొరకు ఆశ్చర్యకార్యములు చేస్తాడు మరియు మన ద్వారా ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు (కీర్తన 139:14).
4. ఆయన జ్ఞానము మరియు వివేచనలో మిమ్మును వర్ధిల్లజేస్తాడు: ఈ జ్ఞానము అనేది మనుష్య తెలివితేటలు లేదా విద్య మాత్రమే కాదు. అది దేవుని గూర్చి వ్యక్తిగతముగా తెలుసుకొనినపుడు మాత్రమే అట్టి జ్ఞానమును పొందుకొనగలము. మన ఆత్మ దేవుని జ్ఞానము మరియు వివేచనలో వర్ధిల్లినపుడు మన ముందర ఉన్న ప్రతి మంచి మార్గమును ఆయన వెల్లడిపరుస్తాడు మరియు మనలను ఉన్నత స్థాయులకు లేవనెత్తుతాడు (సామెతలు 2:5 & 9).
5. ఆయన మిమ్మును తన మేలులతో మరియు తన సమృద్ధితో వర్ధిల్లజేస్తాడు: మనము ఆందోళన మరియు నిరుత్సాహముతో నింపబడినపుడు ఏలీయాను జ్ఞాపకం చేసుకోవాలి. తాను కూడా నిరుత్సాహముతో నింపబడి వెనుదిరిగినస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తనను సాంత్వనపరిచాడు, బలపరిచాడు మరియు తనకు ఆహారమును కూడా సమకూర్చాడు. ప్రభువు మన వేదనతో నిండిన ఆత్మను కూడా సేదదీర్చుతాడు మరియు మన జీవితమును తన పొంగిప్రవహించే మేలులతో మరియు సమృద్ధితో నింపుతాడు (యిర్మీయా 31:14 & 25).
6. ఆయన తన ప్రేమను పంచుట ద్వారా మిమ్మును వర్ధిల్లజేస్తాడు: మన హృదయమును మలచుటలో యేసుకు మనము అనుమతించినపుడు ఆయన మనలను తన సాత్వికము, తగ్గింపు, కరుణ మరియు దయతో నింపుతాడు. ప్రజలను మనము ఆయన కన్నులతో చూడటం ఆరంభిస్తాము మరియు ఆయన ప్రేమతో వారిని ప్రేమిస్తాము (మత్తయి 11:29).
నాకు ప్రశస్తమైన స్నేహితులారా, ఆయన హస్తము మన జీవితముపై నిలిచియున్నది మరియు కీర్తన 51:18 లోని తన వాగ్దానము ద్వారా తన పరిపూర్ణ చిత్తము మరియు తన సంతోషము ప్రకారముగా ఆయన మనలను వర్ధిల్లజేస్తాడు మరియు మన జీవితములోని అన్ని విభాగములను నిర్మిస్తాడు.
నా ప్రియ పరలోకపు తండ్రీ, మీ బిడ్డలను అపరిమితముగా వర్ధిల్లజేయండి. వారి జీవితములోని ప్రతి విరిగిన స్థితిని నిర్మించండి, వారి హృదయములలోని ప్రతి దుఃఖమును తీసివేయండి, మీ జ్ఞానము మరియు వివేచనతో వారిని నింపండి మరియు మీ పరిపూర్ణ చిత్తము మరియు మీ సంతోషమును బట్టి వారిని ఆశీర్వదించండి. యేసు నామములో, ఆమెన్!
సిఓఓ గారి కార్యాలయము నుండి:
మీ కారణముగా - జూన్ నెలలో పరిచర్యలో కనుపరచబడిన ప్రభావము
గత నెలలో సహో. సామ్యూల్ దినకరన్ గారు చెన్నైలోని ప్యారిస్ మరియు వానగరమ్ యేసు పిలుచుచున్నాడు ప్రార్థన గోపురములలో నిర్వహింపబడిన ఆదివారపు ఆశీర్వాద కూటములలో పరిచర్య చేసారు. మా వ్యవస్థాపకులు డా. పాల్ దినకరన్ గారు చెన్నైలోని సహో. డిజియస్ దినకరన్ ప్రార్థన గోపురములో నిర్వహింపబడిన ఆదివారపు ఆశీర్వాద కూటములో పరిచర్య చేసారు. ప్రభువు శక్తివంతముగా కదలాడగా పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, స్వస్థత, కుటుంబ పునరుద్ధరణ, ఆత్మీయ వరములు మరియు దైవిక పురోగతి నిమిత్తము వ్యక్తిగతముగా ప్రార్థనలు చేయబడినవి. వేలాది అధిక సంఖ్యలో ప్రజలు కుటుంబముగా ఈ కూటములలో పాల్గొని గొప్పగా ఆశీర్వదింపబడ్డారు. ప్రార్థన మరియు ప్రవచనాత్మక సాధికారత (PPE) కోర్సు యొక్క 5 వ బ్యాచ్ జూన్ 22 తారీఖున యేసు పిలుచుచున్నాడు ప్యారిస్, చెన్నై లో డా. పాల్ దినకరన్ గారు మరియు సహో. సామ్యూల్ దినకరన్ గారిచే నడిపించబడినది. మొత్తముగా 180 మంది విద్యార్థులు ఈ కోర్సులో చేరారు, ఇందులో 115 మంది వ్యక్తిగతముగా మరియు 65 మంది ఆన్లైన్ ద్వారా హాజరగుచున్నారు.
వీటికిపైగా గత నెలలో మీయొక్క ప్రేమపూర్వక ప్రార్థనలు మరియు ఉదారమైన సహకారం ద్వారా 3 కోట్ల 37 లక్షల ప్రార్థన విన్నపములకు సేవా పరిచర్య చేయుటకు, విరిగి నలిగిన హృదయములకు దేవుని ఆదరణ మరియు స్వస్థతను తీసికొనివచ్చుటకు ప్రభువు మాకు కృప చూపించాడు.
- వ్యక్తిగత ప్రార్థనలు ఆశించుచు 1.7 లక్షల మంది ప్రజలు మా ప్రార్థన గోపురములను సందర్శించారు.
- మా 24x7 ప్రార్థన హెల్ప్ లైన్లు ద్వారా టెలిఫోన్ మూలముగా మమ్మును సంప్రదించిన 3.9 లక్షల మంది కాలర్లకు మేము పరిచర్య చేసాము.
- డయల్-ఏ-ప్రేయర్ సేవ ద్వారా 4,830 మంది ప్రజలు ప్రార్థనలు మరియు ఆత్మీయ సహకారమును పొందుకొన్నారు.
- సుమారు 60,000 ఉత్తరములు మరియు ఈమెయిళ్ల కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేయబడినవి.
- మా ప్రార్థన విజ్ఞాపకులు 1,47,200 మంది భాగస్థుల కొరకు వారి జన్మదినములలో మరియు 43,560 మంది కుటుంబ ఆశీర్వాద పధకం భాగస్థులకు వారి వైవాహిక వార్షికోత్సవములలో ప్రార్థించియున్నారు.
- 1 లక్ష మందికి పైగా ప్రజలు యేసు పిలుచుచున్నాడు వెబ్ సైట్ మరియు మొబైల్ యాప్ మూలముగా దేవుని ప్రేమ మరియు ప్రోత్సాహమును అనుభవించారు.
- మా సామాజిక మాధ్యమము వేదికలు 3.25 కోట్లకు పైగా వీక్షకులకు విశ్వాసము, ఆదరణ మరియు నిరీక్షణతో కూడిన సందేశముల ద్వారా సేవ చేసాయి.
- యేసు పిలుచుచున్నాడు పత్రిక సుమారు 3 లక్షల మంది చదువరులను బలపరిచింది.
కారుణ్య విశ్వవిద్యాలయము
(క్రీస్తు కేంద్రేకృత విద్య మూలముగా జీవితములలో మార్పును తీసికొనివచ్చుచున్నాము)
- కారుణ్య ఫ్యాకల్టీ a low-cost, high-functionality to enhance accessible rehabilitation technologies నిమిత్తము iHub, IIT Mandi నుండి రూ. 31.46 లక్షలను పరిశోధన నిమిత్తము ఆర్ధిక సహాయము పొందుకొన్నది.
- Advance collaborative research, industry-integrated learning, internships, and career opportunities.కొరకు కారుణ్య BIOZEN and PRADO తో వ్యూహాత్మక భాగస్వామ్యములలోనికి ప్రవేశించింది.
- కారుణ్య విద్యార్థులు పది మంది ప్రతిష్టాత్మక HackWithInfy 2027 programme ద్వారా Infosys నుండి up to Rs.11 LPA packages తో pre-placement offers పొందుకొన్నారు.
సీషా
(సంతోషమును వ్యాపింపజేయుచు ప్రకాశమానమైన భవిష్యత్తులు నిర్మించుచున్నది)
- సీషా 2026 సంవత్సరము కొరకు తన సాంవత్సరిక స్కూల్ కిట్ పంపిణీ కార్యక్రమమును ఆరంభించింది. ఆరంభ దినమున చెన్నై నగరము చుట్టుపట్ల ఉన్న అణగారిన కుటుంబములకు చెందిన 700 మంది విద్యార్థులకు స్కూల్ కిట్స్ పంపిణీ చేయబడినవి.
- The 2026 SSLC (10th) and Higher Secondary (12th) పరీక్ష ఫలితములు సీషా విద్యార్థులకు అసాధారణ విజయములు తీసుకొనివచ్చినవి. అందరు కూడా ఉత్తీర్ణులయ్యారు మరియు అనేకులు 400 పైగా మార్కులు స్కోర్ చేసారు. అధిక మార్కులు పొందుకొనిన టాపర్స్, అవార్డులు పొందుకొని ఘనపరచబడ్డారు.
- దక్షిణ మరియు ఉత్తర భారత దేశములో నిర్వహింపబడిన వేసవి శిబిరముల ద్వారా సీషా నేర్చుకొనే కేంద్రములు మరియు ప్రాంతీయ సమాజములకు చెందిన 677 మంది చిన్నారులు ఆశీర్వదింపబడ్డారు. నిస్సహాయ కుటుంబములకు భారము తగ్గించుటకై చెన్నై లో ‘See and Smile’ Free Eye and medical camp నిర్వహింపబడినది.
జూలై నెలలో పరిచర్య
ఘట్కోపర్ ప్రార్థన గోపురము: ముంబై నగరంలోని ప్రజలకు నిరీక్షణ, స్వస్థత మరియు మార్పును తీసికొనివచ్చే ఒక కేంద్రము ఇది. ఈ సంవత్సరము క్రీస్తు ప్రేమ ద్వారా 1,20,000 జీవితములకు పరిచర్య చేయాలని ప్రార్ధనపూర్వకముగా మేము ఉద్దేశించాము. వందలాది విశ్వసనీయమగు ప్రార్థన విజ్ఞాపకులకు శిక్షణ అందించుట మరియు సాధికారతను కల్పించుట ద్వారా మా ఔట్రీచ్ ను బలపరచుచున్నాము. ప్రార్థన గోపురముల నిర్వహణ కొరకు సంవత్సరిక వ్యయము రూ. 60 లక్షలు కాగా మీయొక్క ప్రార్థన పూర్వకమగు విత్తనములు ఈ పరిచర్యను నడిపించుటకు, లెక్కింప శక్యముకాని సంఖ్యలో ప్రజలకు దేవుని సమాధానము, సంతోషము మరియు స్వస్థతను తీసికొనివచ్చుటకు మాకు సహాయము చేయును. మీ చేయూతను అందించుటకు క్లిక్ చేయండి https://bit.ly/GHATKOPARPTBF
టెలిఫోన్ ప్రార్థన గోపురము: యేసు పిలుచుచున్నాడు టెలిఫోన్ ప్రార్థన గోపురము ద్వారా ప్రతి నెల 7 భాషలలో 5,00,000 మందికి పైగా ప్రజలు ప్రార్థన మరియు నిరీక్షణను పొందుకొనుచున్నారు. మేము మా పరిచర్యను బెంగాలీ, భోజ్పురి మరియు గుజరాతి భాషలలో విస్తరింపజేయుచున్నాము తద్వారా భారత దేశమంతటా ఇంకా అధిక సంఖ్యలో ప్రజలకు చేరువకాగలము. ఈ నూతన పద్ధతి ద్వారా టెలిఫోన్ మూలముగా సంప్రదించు వారందరు వ్యక్తిగతీకరింపబడిన, అవసరతల ఆధారిత మరియు లేఖనముల వాగ్దానములతో కూడిన ప్రార్థనలు పొందుకొనెదరు తద్వారా తమ విశ్వాసముతో బలపడెదరు. స్పాన్సర్ చేయుటకు https://bit.ly/TELPT ను క్లిక్ చేయండి.
దేవుని రాజ్యము కొరకు మనము గొప్ప పనిని ఇంకా అధికముగా చేయవలసి ఉన్నది. ఈ లక్ష్యములు అన్నింటి కొరకు దయచేసి ప్రార్థించండి. www.jesuscalls.org మూలముగా చేయూతను అందించుట ద్వారా ఇందులో భాగముకండి.
మిక్కిలి ప్రేమ ప్రార్ధనలతో,
క్రీస్తునందు మీ ప్రియ సహోదరుడు
డా.పాల్ దినకరన్

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


