నాకు అమూల్యమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోబు 24:22వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "ఆయన తన బలముచేతను బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను వారు మరల బాగుపడుదురు'' అని చెప్పబడిన ప్రకారము దేవుడు తన బలము చేత మిమ్మును నింపాలని మీ పట్ల కోరుచున్నా డు. అయితే, మీరు నిరాశలో ఉండియున్నారా? నేను సమస్తమును కోల్పోయాను అని అనుకుంటున్నారా? ఇక నేను ఎన్నటికిని పైకి లేవలేను అని అనుకుంటున్నారా? అందుకే బైబిల్‌లో 1 కొరింథీయులకు 1:27 వ వచనములో చూచినట్లయితే, "జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు'' అని చెప్పబడిన ప్రకారము ఈ రోజు మిమ్మును చూచి, అందరు వెఱ్ఱివారు అని అనుకుంటున్నారా? లేక మీరు, మేము బలహీనమైనవారము అని అనుకుంటున్నారా? బలహీనమైన స్త్రీని/పురుషుని అని అనుకుంటున్నారా? అయితే, మీ రు బలహీనమైన పాత్రలుగా ఉన్నామని అనుకుంటున్నారా? అయితే, మీరు దేవుడు ఏర్పరచుకొను పాత్రయై యున్నాడు. కానీ, ఈ లోకములో మేలు చాలా జ్ఞానులము, మేము ఎంతో జ్ఞానముతో నింపబడి ఉన్నాము, మాకు దేవుడు అక్కరలేదు అనుకొను ప్రతి ఒక్కరు, మాకు సమస్త శక్తి ఉన్నది, ప్రతి అధికారము మాలో ఉన్నది. ఉనికిలోనికి తీసుకొని రావడానికి మా కొరకు పనిచేయడానికి మా యొక్క శక్తిని మేము వినియోగించవలసి యున్నది అని అనుకుంటూ ఉన్నత స్థితికి ఎదగగలమని విశ్వసిస్తారు. చాలామంది తమకున్న శక్తిని అభ్యాసము చేయుచూ, ఉన్నతమైన స్థాయికి వచ్చినవారుగా ఉన్నారు. కానీ అయ్యో! ఆపద ముంచుకొచ్చి నప్పుడు, వైపరీత్యములు వచ్చినప్పుడు అంతా కుప్పకూలిపోతుంది.

దేశములో ఒక పెద్ద వ్యాపారాన్ని ఆర్థిక ఇబ్బందులు దాడిచేసినప్పుడు, దానిని మొదటి నుండి ఏమి లేని శూన్యము నుండి దానిని నిర్మాణము చేసిన దాని యజమానుడు, అతడు ఎంతో బలవంతుడైనప్పటికిని, బలహీనపడి దానిని భరించలేకపోయాడు. కనుకనే, అతడు తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. అతని మీద ఆకస్మాత్తుగా దాడి జరిగింది. అతడు దానిని సహించలేకపోయాడు. ఎందుకంటే, తన పేరు అంతయు కూడా పాడైపోయినదని అన్నట్టుగా భావించాడు. లెక్కల కొరకైన దాడి తన పేరును క్రింది స్థాయికి దిగజార్చినది. ఆ అవమానాన్ని అతడు భరించలేకపోయాడు, అతడు తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. తనను నమ్ముకున్న తన కంపెనిలో ఉన్న వారందరిని విడిచిపెట్టి, అతడు తన గదిలోనికి వెళ్లి, తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విధంగా అతడు తన జీవితమును అంతము చేసుకున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ లోకము ఆలాగున ఉంటుంది, ఈ లోక జ్ఞానము కూడా ఆ రీతిగానే ఉంటుంది. నా ప్రియులారా, ఈ లోకము యొక్క శక్తి ఆలాగుననే ఉంటుంది. మనము దాని మీద నమ్మకము పెట్టినట్లయితే, మనము అంతమైపోయినట్లుగా ఉంటాము. అది కొద్ది కాలము మాత్రమే నిలిచి ఉంటుంది. అందుచేతనే మనకు దేవుడు కావాలి. యేసు ఎంతో బలహీనుడైయ్యాడు. మనము అనుభూతి చెందుచున్న బలహీనత అర్థము చేసుకొనుటకు కొరకు మాత్రమే, ఈ లోకములో అత్యంత బలవంతులైన వారిని సిగ్గుపరచుట కొరకే మరియు మనలను పైకి లేవనెత్తుట కొరకు మాత్రమే. అవును, ఆయన సిలువలో వ్రేలాడదీయ్యబడినప్పటికిని, ఆయన ఎంతగానో ఎగతాళికి మరియు పరిహాసమునకు గురైయ్యాడు. చూడండి, 'నీవు అందరిని రక్షించావు గదా! ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకొనుము,' అని వారు అంటున్నారు. అవును, వారందరు కూడా యేసుక్రీస్తును వెఱ్ఱివాడు అని అనుకున్నారు. అవును, మా ప్రియులారా, మీరు వెఱ్ఱివారు అని ప్రజలు మిమ్మును పరిహాసము చేసినప్పుడు, ఆ బాధ యెట్టిదో, ఆయన అర్థము చేసుకొనుట కొరకు, ఆయన ఆ మార్గము గుండా వెళ్లియున్నాడు.

కనుకనే, నా ప్రియులారా, ఆయన మీకు కావలసిన జ్ఞానమును అనుగ్రహిస్తాడు, పూర్ణ శాంతితోను, పూర్ణ సహనముతోను మిమ్మును సంపూర్ణులనుగా చేస్తాడు. అట్టి జ్ఞానము చేత, ఆయన మీకు బలవంతులను సిగ్గుపరచు స్థాయిని అనుగ్రహిస్తాడు. తద్వారా, మీరు పైకి లేవనెత్తబడెదరు. ఆయన నామము మీ ద్వారా పైకి లేవనెత్తబడుతుంది. ఇందుకోసమై, బైబిల్‌లో యెషయా 9:6వ వచనములో చూచినట్లయితే, "...ఆశ్చర్యకరుడుగా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు '' అని చెప్పబడినట్లుగానే, ఆయన బలవంతుడైన దేవుడుగా దిగివచ్చియున్నాడు. సమాధానకర్తయగు అధిపతిగా ఆయన మన మధ్యకు దిగివచ్చియున్నాడు. ఆయన మీకు సహాయము చేస్తాడు. ఆయన మీ మీద జాలిపడి, మీకు కావలసిన జ్ఞానము ఇస్తాడు, పైకి లేవనెత్తబడడానికి తగినంతగా బలమును ఇస్తాడు. నా ప్రియులారా, నేటి వాగ్దానములో సెలవిచ్చినట్లుగానే, ఆయన మిమ్మును బలవంతులనుగా చేయుచు, మీ జీవిత దినములను పొడిగిస్తాడు. ఆయన ఇంకను నిరాశలో ఉన్న మిమ్మును పైకి లేవనెత్తుతాడు. మీ నిరాశ పరిస్థితిలో నుంచి మిమ్మును పైకి లేవనెత్తినప్పుడు, మీరు బలవంతులుగా స్థిరపరచబడినవారుగా మారుతారు. మీరు జ్ఞానముకలిగినవారుగాను మరియు సంపూర్ణ ఘనత నొందినవారుగా మీరు ఉండబోవుచున్నారు. దేవుడు ఇట్టి ఆశీర్వాదముతో మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువా, మేము అనుభూతి చెందిన దానికి ప్రతిగా, ఈ రోజు మాకు కావలసిన జ్ఞానమును దయచేయుము. దేవా, మా బలహీనతలో నుండి మేము పైకి లేవనెత్తబడుటకు కావలసిన శక్తిని మాకు అనుగ్రహించుము. ప్రభువా, ఈ లోక జ్ఞానులను మరియు బలవంతులను సిగ్గుపరచునట్లుగా మమ్మును దీవించుము. ప్రభువా, బలహీనతతోను మరియు నిరాశతోను ఉన్న మేము ఉన్నపక్షముగానే నీ సన్నిధికి వచ్చుచున్నాము. ప్రభువా, తిరిగి లేవడానికి దయచేసి మమ్మును నీ యొక్క శక్తి చేత బలపరచుము. దేవా, నీవు మమ్మును ఏర్పరచుకున్న పాత్రనని మాకు గుర్తుచేయుము. ప్రభువా, నీ దైవీక జ్ఞానం, శాంతి మరియు సహనంతో మమ్మును నింపుము. యేసయ్య, మా యొక్క ప్రతి నిరుత్సాహం మరియు భయం నుండి మమ్మును పైకి లేవలేనని లౌకిక బలం మీద నమ్మకం ఉంచకుండా మాకు సహాయం చేయుము. దేవా, నీ శక్తి ద్వారా మమ్మును బలవంతులనుగా మరియు జ్ఞానవంతులనుగా చేయుము. ప్రభువా, మా జీవితం నీ నామమునకు మహిమను తీసుకొనివచ్చునట్లుగా చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.