నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోహాను 12:15వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు'' ప్రకారముగానే, యేసయ్య సాత్వికుడను దీనుడుగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథము చెబుతుంది. ఆలాగుననే, బైబిల్ నుండి మత్తయి 11:29వ వచనములో చూచినట్లయితే, " నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును'' అని చెప్పబడిన ప్రకారముగానే, ఆయన ఒక గొప్ప రాజుగా ఉండియున్నాడు. అయితే, యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు ఒక గాడిద పిల్ల మీద ఎక్కి మన మధ్యలోనికి వచ్చియున్నాడు. ఆయన ఎంతో దీనత్వముగలిగిన దేవుడుగా ఉన్నాడు. అయితే, ఆయన ఇశ్రాయేలీయుల రాజుగా పిలువబటియున్నాడు. కానీ, బైబిల్ నుండి యోహాను 1వ అధ్యాయములో చూచినట్లయితే, నతనయేలు అను వ్యక్తిని యేసయ్య చూచినప్పుడు, యేసయ్య యొక్క గుణములను అర్థము చేసుకొని నతనయేలు, యేసయ్యను చూచి, ' ఇశ్రాయేలీయుల రాజువు నీవే ప్రభువా' అని తెలియజేసియున్నాడు. ఆ మాటలు బైబిల్ నుండి యోహాను 1:49వ వచనములో దానిని మనము చూడగలుగుచున్నాము, " నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడ వు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను.'' ఆలాగుననే, ఈ భూమి మీద మరియు ఈ భూమి క్రింద, భూమిపైన, సమస్తమునకు ఆయన సర్వాధికారమును కలిగియున్నాడు. ఆయన ఆజ్ఞాపించినట్లయితే అది నిశ్చయముగా నెరవేర్చబడుతుంది.
కనుకనే, మనము నా ప్రియులారా, బైబిల్ నుండి జెకర్యా 9:9వ వచనములో చూచినట్లయితే, ప్రభువును గురించి దేవుని వాక్యము ఈలాగున చెబుతుంది, " సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు'' ప్రకారము ఆయన రాజుగా అయి ఉన్నాడు గనుకనే, మనము ఇంకా అధికముగా సంతోషించాలి. అవును, యేసయ్య, ఈ వాగ్దానమును నెరవేర్చియున్నాడు. ఆయన ఒక రాజు వలె గాడిద పిల్ల మీద ఆసీనుడై యెరూషలేములోనికి ప్రవేశించియున్నాడు. ఆయన ఈ లోకములోనికి మరల రెండవ రాకడలోనికి రాబోవుచున్నాడు. ఆయన రాజు మాత్రమే కాదండి, ఆయన రాజులకు రాజై యున్నాడు. అందుకే బైబిల్‌లో ప్రకటన 19:16వ వచనములో చూచినట్లయితే, " మరియు ఆ గుఱ్ఱము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని '' అని చెప్పబడిన ప్రకారము యేసయ్యకు గల పేరును మనకు ఈ వచనములో తెలియజేయుచున్నది. ఆయన రాజులకు రాజును మరియు ప్రభువునకు ప్రభువునై యున్నాడు. ఇంకను బైబిల్ నుండి ప్రకటన 22:12వ వచనములో చూచినట్లయితే, " ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది'' అని సెలవిచ్చుచున్నాడు. రెండవసారిగా, యేసయ్య, ఒక తెల్లని గుఱ్ఱము మీద ఆసీనుడై త్వరగా వచ్చుచున్నాడు. ఆయన అంగీ రక్తములో ముంచబడినట్లుగా ఉంటుంది. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. అవును, రాజు మీ యొద్దకు వచ్చుచున్నాడు.
2008వ సంవత్సరములో, ఆ సంవత్సరము కొరకు ఒక నూతన వాగ్దానమును నాకివ్వాలని నేను ప్రార్థించుచున్నప్పుడు, బైబిల్ నుండి జెఫన్యా 3:15వ వచనమును ప్రభువు నాకు చూపించియున్నాడు. "తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టి యున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు'' అని చెప్పబడినట్లుగానే, ఈ వచనమును నేను చదివినప్పుడు, నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను. ఇశ్రాయేలీయుల రాజు మీకు తోడుగా ఉన్నాడు. యేసయ్యా, మనకు రాజుగా ఉన్నాడు. ఆయన మీకు ప్రతిఫలమును ఇవ్వడానికి ఆయన తిరిగి రాబోవుచున్నాడు. ఎవరు చేసినటువంటి కార్యములను బట్టి, ఆయన వారికి ప్రతిఫలము ఇవ్వడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. మీరు ఆయనను పొందుకొనడానికై సిద్ధముగా ఉన్నారా? ప్రియ స్నేహితులారా. మనలను మనము ఎంత పరిశుద్ధంగా ఉంచుకోవాలో ఒకసారి పరీక్షించుకోవాలి. "అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే యుండనిమ్ము'' అని చెప్పబడినట్లుగానే, ఎవరైతే, పరిశుద్ధులుగా ఉన్నారో, వారు ఇంకను పరిశుద్ధులగుదురు మరియు ఎవరైతే, నీతిమంతులుగా ఉన్నారో , వారు ఇంకను నీతిమంతులగుదురు. కనుకనే, భయపకండి, స్నేహితులారా. మీ రాజు మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈసారి తెల్లని గుఱ్ఱము మీద ఆయన వచ్చుచున్నాడు. ఆయనను చూడడానికై, పొందుకొనడానికై మీ కన్నులను తెరచియుంచండి. మీరు ఆయన కొరకు చేసిన వాటన్నిటి కొరకై ప్రభువు మీకు ప్రతిఫలమునిస్తాడు. రాబోవుచున్న రాజును చూడడానికి ప్రభువు మీ న్నులను తెరచును గాక. కనుకనే, ఇప్పుడే మనము ప్రభువు వైపు చూద్దాము. నేటి వాగ్దానము నుండి ప్రభువు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్య, నీవే మా రాజువు. దేవా, నీవు మాకు రాజువు మాత్రమే కాదు, నీవు మాకు రాజులకు రాజుగాను మరియు ప్రభువులకు ప్రభువుగా ఉన్నావు. కనుకనే, దేవా, నీవే మాకు రాజువై ఉన్నావు. దేవా, ఇప్పుడు కూడా నిన్ను మేము మా రాజుగా గుర్తించుచున్నాము, కనుకనే, మేము నిన్ను పొందుకొనుటకు మమ్మును అర్హులనుగా మార్చుమని అడుగుచున్నాము. ప్రభువా, మా కొరకు నీవు ప్రతిఫలమును తీసుకొని వస్తున్నావని మేము ఎరిగియున్నాము, నీ కొరకు పనిచేయగలిగే శక్తిని మరియు తలాంతులను మాకు అనుగ్రహించుము. యేసయ్యా, నీ సేవ చేయుటకు కావలసిన నీ యొక్క వరములను మాకు దయచేయుము. ప్రభువా, నిన్ను ప్రేమించడానికై మాకు కావలసిన పరిశుద్ధాత్మ ఫలములను మాకు దయచేయుము. దేవా, మేము నీకు ప్రీతిగల జీవితాన్ని గడపడానికి దయచేసి మాకు సహాయం చేయుము. యేసయ్య, నీ రాకడ కొరకు హృదయమును పరిశుద్ధంగాను మరియు సిద్ధపడి ఉండుటకు మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మాలో ఉన్న ప్రతి భయమును తొలగించి, నీ యొక్క సమాధానముతోను మమ్మును నింపి, నీ యొక్క నీతి మార్గంలో నడవడానికి మరియు మా దృష్టిని ఎల్లప్పుడూ నీ మీద నిలుపుటకు మాకు నేర్పుము. ప్రభువా, నీవు మరల తిరిగి వచ్చునప్పుడు మేము నిన్ను ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


