నా ప్రియ స్నేహితులారా, దేవుని యొద్ద నుండి నేటి వాగ్దానమును ఈ దినమున మనము చూడగలము. నేటి దినమున వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 11:30వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "నీతిమంతులు ఇచ్చుఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు'' అని చెప్పబడినట్లుగానే, మనము ఇతరులను రక్షించు కృపను దేవుడు నేడు మీకు అనుగ్రహించాలని మీ పట్ల కోరుచున్నాడు.

నా ప్రియులారా, ఈ లేఖనము ఈరీతిగా ఎందుచేత చెప్పబడియున్నది? మా తాతయ్యగారైన డాక్టర్. డి.జి.యస్. దినకరన్‌గారి యొక్క జీవితమును మీరు చూచినట్లయితే, ఆయనగారియొక్క ఆఖరి శ్వాస వరకు తన జీవితమును ఇతరుల కొరకు ప్రతిష్టించుకొని యున్నారు. ప్రజల ప్రార్థనా విన్నపము ల కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఉండలేరు. వారి యొక్క ఉత్తరములకు మరియు ఈమెయిల్‌కు జవాబులు అందించేవారు. రోగులను సందర్శించడము, వారి కొరకు ప్రార్థన చేయడము ఎప్పుడు కూడా ఆపలేదు. లేక వేదిక మీద నుండి వాక్యమును బోధించడము, ఆలాగే టి.వి. ద్వారా బోధన చేయడము, అత్యంత జ్ఞాపసంపదగలవారికిని మరియు దేవుని సేవకులకు వాక్యోపదేశము చేయడము. చాలా గొప్ప ఆవశ్యకత ఉన్నప్పుడు వారు పిలిచేవారు, లేక సందర్శించేవారు. దేవుని యొక్క పాదాల చెంత వేచియుండి, వారి కొరకైన దేవుని యొక్క వాక్కులను వారితో మాట్లాతూ ఉండేవారు. ఆఖరి శ్వాస వరకు ఆలాగుననే చేయుచుండేవారు. ఆయన ఆలాగున ఎందుకు చేయవలసి ఉన్నది? ఆఖరి సంవత్సరములలో ఆయన ఆనందముగా విశ్రాంతి తీసుకొనవచ్చును కదా! ఆయన చేసిన దానికంతటికి ప్రతిగా ఈ లోకమును అనుభూతి చెంది, ఆనందించవచ్చును కదా! ఆయన తన కోసము జీవించుచు, ఆనందించవచ్చును కదా! ప్రతి యొక్క చిన్న కొలమానము ఇతరుల కొరకు వినియోగించుచూ ఆయన చివరి కాలము వరకు వచ్చారు. ఆయన విత్తియున్న దానిని బట్టి, ఈ రోజు ప్రపంచ వ్యాప్తముగా లక్షలాదిమంది వారు లేవనెత్తబడి, ఇతరుల కొరకు బోధించుచున్నారు. అంతమాత్రమే కాదు, దైవాశీర్వాదములను ఇతరుల మీదికి తీసుకొని వచ్చియున్నారు.

నా ప్రియులారా, ఈ రోజున అనేకమంది నాయకులు లేచి, వారి సమాజములకు అభివృద్ధికరమైన కార్యక్రమములను ఆశీర్వాదకరముగా చేయుచున్నారు. దేశములకు ఆశీర్వాదకరముగా ఉండు నిమిత్తమై చేయుచున్నారు. ఈ రోజున వారి యొక్క జీవితములు జీవవృక్షమువలె ఉండియున్నవి. ఆయన అనేకమంది లేక లక్షలాదిమంది హృదయాలలోనే మాత్రమే కాకుండా, ఆయన విత్తినది, ఎల్లవేళల కూడా వర్థిల్లుచుండు ఫలముగా మిగిలియున్నది. జీవ వృక్షము ఎన్నటికిని కూడా జీవమును ఉత్పతి చేయుచున్నది. ఫలము ఆయన విత్తిన వారిలో నుండి తరముల వెంబడి తరములు ఆ రీతిగానే ఫలములను ఇచ్చుచూనే ఉన్నది. అవును, స్నేహితులారా, లేఖనము ఈ రీతిగా తెలియజేయుచున్నది, " నీతిమంతులు ఇచ్చుఫలము జీవవృక్షము జ్ఞానముగలవారు ఇతరులను రక్షించుదురు'' అని చెప్పబడినట్లుగానే, మీరు కూడా ఆలాగుననే, దేవుని జ్ఞానమును కలిగియుండునట్లుగాను, జీవవృక్షముగా దేవుడు మిమ్మును మార్చబోవుచున్నాడు.

నా ప్రియులారా, ఈ లోకములో మీరు సంపాదించుకొని, ప్రోగు చేసుకున్నట్లయితే, అట్టివారే జ్ఞానవంతులు అని చెబుయూ ఉంటుంది. మీ జీవితము బుద్ధిహీనులవలె ఇతరుల కొరకు త్యాగము చేయవద్దు అన్నట్టుగా ఉంటుంది, లేదు నా స్నేహితులారా, జ్ఞానముకలిగియున్న వారు ఇతరుల జీవితములను రక్షించుదురు. తద్వారా, వారు జీవవృక్షముగా ఉంచబడతారు. ఇంకను మనకోసం మనం జీవించడం, సంపదను కూడబెట్టుకోవడం, మరియు వ్యక్తిగత సుఖాలను అనుభవించడమే జ్ఞానమని లోకం మనకు బోధించుచున్నది. ఇతరుల కోసం మన ప్రాణములను త్యాగం చేయడము కూడా అది అవివేకంగా పరిగణిస్తుంది. కానీ దేవుని జ్ఞానం పూర్తిగా భిన్నమైనది. ఆయన దృష్టిలో, ఇతరులకు సేవ చేయుచూ, ప్రజలను జీవములోనికి నడిపించుచూ, మరియు తరతరాలను దీవించుచూ ఫలించు జీవవృక్షంగా మార్చబడువారు నిజమైన జ్ఞానముగలవారు. వారిలో ఉన్న వారి జీవమును బట్టి వారు ఆనందించెదరు. కనుకనే, అటువంటివారినిగా మిమ్మును చేయాలని ప్రభువును అడుగుదామా? మీ జీవితములను ఇతరులకు నిరీక్షణను, స్వస్థతను, మరియు రక్షణను తీసుకొని వచ్చు జీవవృక్ష ఫలములను ఫలించునట్లుగా చేయుచున్నాడు. కనుకనే, మీరు ఆయనకు నమ్మకంగా సేవ చేయుచున్నప్పుడు, మీ సేవాఫలితం రాబోయే తరతరముల వరకు అనేక జీవితములను జీవింపజేయుచున్నది. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, శాశ్వత ఫలాలను ఇచ్చే జీవితమును జీవించడానికి మమ్మును పిలిచినందుకు నీకు వందనములు. దేవా, మేము నీతి మార్గంలో నడుస్తూ, మా పూర్ణ హృదయంతో నిన్ను విశ్వాసంగా సేవించునట్లుగా మాకు సహాయం చేయుము. ప్రభువా, ఇతరులను రక్షించుటకు మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మా జీవితములను రక్షించడానికి, ఇతరుల కొరకు ఫలములను ఉత్పత్తి చేయడానికి, ఇతరుల జీవితములలో నమ్మకత్వముతో, నిన్ను సేవించుటకు మాకు సహాయము చేయుము. దేవా, యథార్థముగా విత్తనములు వేయుటకు సహాయము చేయుము. ప్రభువా, నీ నిమిత్తము పరుగులు పెడుతూ, సేవ చేయడానికి మాకు నీ కృపను చూపుము. దేవా, ఇతరులను రక్షించడానికి మాకు నీ శక్తిని అనుగ్రహించుము. ప్రభువా, మేము ఆలాగున వెళ్లి సేవచేయుచుండగా, అద్భుతకార్యములు చేయు శక్తి మమ్మును నింపునట్లుగా చేయుము. దేవా, మాలో ఉన్న ప్రతి వరము కృపాబలముగా వినియోగించబడునట్లుగా చేయుము. ప్రభువా, బలమైన ఆశీర్వాదములను ఇతరులకు వెళ్లునట్లుగా మేము చూచునట్లుగా చేయుము. దేవా, జ్ఞానముగల కార్యములు మా ద్వారా సంపూర్ణమైన సాఫల్యత అగునట్లుగా కృపను చూపుము. ప్రభువా, అధికమైన బలము మాలో నుండి ప్రజల జీవితములోను, దేశములో బయటకు వచ్చుట మేము చూచునట్లుగా, మమ్మును బలమైన ఆశీర్వాదకరముగా మార్చుము. దేవా, ఫలములు ఇచ్చు జీవవృక్షమువలె మమ్మును మార్చుమని సమస్త మహిమ నీకు చెల్లించుచు యేసుక్రీస్తు ఉన్నతమైన నామమమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.