నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనము ఒక రక్షకుని కలిగియున్నాము. ఈ రోజు మన నిరీక్షణ అదియే. ఆయన మనలను క్రిందికి పడిపోనివ్వడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యెషయా 51:11వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనములో, ''యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును'' అన్న వాగ్దానము ప్రకారము ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. ప్రభువు తనకు ప్రియమైన ప్రజలైన వారు, వారి యొక్క బానిసత్వము నుండి తిరిగి తమ దేశమునకు వచ్చినప్పుడు, అట్టి వారిని గురించి ఆయన ఈ రీతిగా సెలవిచ్చియున్నాడు. వారు సుదీర్ఘ కాలము పాటు హింసించబడ్డారు, బానిసత్వములో ఉంచబడ్డారు. అయితే, ప్రభువు ఆనందగానము చేయుచున్న వారి వలె, అట్టి వారిని కాపాడి రక్షించి, సీయోనుకు వచ్చియున్నాడు. వారు తిరిగి వారి గృహములకు వచ్చినందున వారి ముఖములు ఎంతగానో సంతోషానందములతోను మరియు ఎంతగానో సంభ్రమాశ్చర్యములతో ఉన్న వారి వలె వారు తిరిగి వచ్చియున్నారు. దేవుడు వారికి సమకూర్చియున్న నివాస గృహములతో కూడి యున్న భూభాగములకు వారు ఎంతో సంతోషముగా వచ్చారు. అవును, నా ప్రియ స్నేహితులారా, ప్రభువు మన విషయములలో కూడా ఈలాగుననే జరిగించును. కనుకనే, మీరు దిగులుపడకండి.
నా ప్రియులారా, మీరు ఒకవేళ దాసత్వము అను కాడి క్రింద బానిసలుగా ఉండియున్నారేమో? లేక మిమ్మును అణిచివేతకు గురిచేయుచున్న వారి క్రింద మీరు ఉండియున్నారేమో? అణిచివేయుచున్న వారి క్రింద ఉంచబడి, ఆ రీతిగా పిలువబడుచూ, ఆలాగుననే బాధించబడుచున్నారేమో? ప్రజలు ఒకవేళ మిమ్మును అవమానించువారుగా ఆ రీతిగా ఉన్నారేమో? ఒక సమూహము ప్రజలు మిమ్మును హింసించుచున్నప్పుడు, దానిని మీరు భరించవలసిన స్థితిలో మీరు ఉండియున్నారేమో? దీనిలో నుండి బయటకు రావడానికి మార్గమే లేదు అని మీరు అనుకుంటున్నారేమో? భూస్వాముల అణిచివేతకు గురియగుచున్నారేమో? లేక మీ పొరుగువారి చేత అణిచివేతకు గురియగుచున్నారేమో? ఇంకను మీ యొక్క నాయకులైన వారి చేత అణిచివేయబడుచున్నారేమో? బయటకు రావడానికి మార్గమే లేదేమో? కానీ, ప్రభువు మిమ్మును భద్రపరచి, కాపాడడానికి సమయము ఇదియే కావచ్చును. ఒకవేళ మీకు సమయము ఆసన్నమైయుండవచ్చును. ఎందుకనగా, ఆయన నిమిత్తము మీరు దానిని సహించియున్నారు. మీరు సహనముతో ఆయన యందే నిరీక్షణను కలిగియున్నారు. కనుకనే, ప్రభువు దానిని చూచియున్నాడు. మీరు ఆయన యందలి విశ్వాసమును తాను చూచియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, ఆయన మిమ్మును రక్షించుచున్నాడు. తద్వారా, ఆయన యొక్క విడుదల మీ యొద్దకు వచ్చుచున్నది. కనుకనే, ప్రభువునందు ఆనందించండి.
అపవాది చేత అణచబడి, ఎంతగానో బాధను అనుభవించియున్న ఒక స్త్రీ ఉండెను. మా ప్రార్థనల మహోత్సవములకు మేనేజరుగా ఉన్న అధికారి మా నాన్నగారిని వెంటనే రమ్మని కబురు పంపించారు. ఆ వ్యక్తి, మా నాన్నగారితో, " సహోదరుడా, దురాత్మచేత బాధింపబడి, పట్టబడిన ఒక స్త్రీ పదే, పదే మీ పేరు చెబుతున్నారు. పాల్ దినకరన్‌గారు వచ్చి, నన్ను తగులబెడతాడు మరియు ఆయన నన్ను కాల్చివేయడానికి వచ్చుచున్నాడు అని ఆమె చెప్పుచున్నది,'' అని తెలియజేశారు. ఆ మాటలు విన్న మా తండ్రిగారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, ఆ కూటము జరుగుచుండగానే ఆయన స్వరము పోయి, ఆయన సరిగ్గా మాట్లాడలేకపోయారు. అందుకు, మా నాన్నగారు, ఆ మేనేజర్‌తో, ' నేను ఈ కూటములో మాట్లాడడానికి కూడా కనీసము స్వరమును కోల్పోయిన వానిగా ఉండియున్నాను కదా, మరి నేను ఈ స్త్రీ కొరకు ఏలాగున ప్రార్థన చేయగలను?' అని చెప్పారు. అయితే, ఆ అధికారి, ' లేదు సహోదరుడా, ఆమె మీ పేరును పదే పదే చెబుతుంది' అని అతడు చెప్పెను. కనుకనే, మా నాన్నగారు త్వరితముగా ఆయన అక్కడకు వెళ్లారు. ఆ సభ యొక్క వేదికకు ముందుగా వేసియున్న ఆ పందిరిలోనికి వెళ్లారు. అయితే, అక్కడ ఆమె మా నాన్నగారిని చూడగానే, ప్రభువు యొక్క కారుణ్యము ఆయనను ఎంతగానో చలింపజేసియున్నది. ఎందుకనగా, ప్రియమైన తల్లిగా తన ఇద్దరు బిడ్డలను తన ప్రక్కన ఉంచుకొని ఎంతగానో ఆవేదన చెందుచుండెను. అయితే, మా నాన్నగారు, సరిగ్గా మాట్లాడలేని స్వరముతో, ఈలాగున చెప్పియున్నారు, 'ప్రభువా, ఈ యొక్క దురాత్మ ఈమెను విడిచిపెట్టి వెళ్లిపోవునట్లుగా చేయుము. ఈమెను కనికరించి, ఆమెకు విడుదలను అనుగ్రహించుము' అని ప్రార్థించారు. వెంటనే, ఆ దురాత్మ ఆమెను విడిచిపెట్టి బయటకు వెళ్లిపోయినది. తద్వారా, ఆమె క్రింద పడిపోయినది. ఆ క్షణములోనే, మా నాన్నగారి స్వరము తిరిగి మరల వచ్చినది. ఆమె పొందుకున్న విడుదల ద్వారా తాను ఎంతగానో ఆనందించినది. ప్రత్యేకంగా, ఆ తల్లి పొందిన విడుదలను చూచి, ఆమె బిడ్డలు ఎంతగానో ఆనందించారు. వారు కుటుంబ సమేతముగా, ఎంతగానో ఆనందించారు. బిడ్డలు వారి యొక్క తల్లిని తిరిగి పొందుకున్నారు. నా ప్రియ స్నేహితులారా, ఇది మన యొక్క సమయము. మనము దేవుని దగ్గర నుండి ఇటువంటి విడుదలను పొందుకొనుటకు ఆయనను అడుగుదామా? ఆలాగున మీరు కూడా ఆయన యొద్దకు వచ్చి, భారముతో ప్రార్థించినట్లయితే, నిశ్చయముగా, ఆయన మిమ్మును విమోచించిన వారివలె సంగీతనాదముతో మీరు తిరిగి వచ్చునట్లుగా నిత్యసంతోషము మీ తలల మీద ఉండునట్లుగాను, మీరు సంతోషానందముగలవారగునట్లుగాను, దుఃఖమును నిట్టూర్పును మీ నుండి తొలగిపోవునట్లు చేసి, మిమ్మును నేటి వాగ్దానము నుండి ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా జీవితంలో ఉన్న ప్రతి భారమును, ప్రతి అణచివేతను నీవు చూస్తున్నావు. కనుకనే, మా మీద ఉన్న అణిచివేత ఇక ఆగిపోవునట్లుగా చేయుము. దేవా, మాకున్న బానిసత్వము మా నుండి ఈ రోజే తొలగిపోవునట్లుగాను, మమ్మును స్వతంత్రులనుగా చేయుము. ప్రభువా, మేము బాధ, అవమానం, మరియు నిస్సహాయత ద్వారా విడుదల పొందుటకు నీ కొరకు కనిపెట్టుచున్న మాకు ఈ రోజు, నీ విమోచన మా జీవితంలోనికి వచ్చునట్లుగా చేయుము. దేవా, ఇంతకాలం మమ్మును బంధించి ఉంచిన ప్రతి సంకెళ్ళను ఇప్పుడే తెగిపోవునట్లుగా చేయుము. ప్రభువా, మా హృదయమును మరొక్కసారి నిత్యమైన ఆనందంతో, సంతోషగానములతోను మమ్మును నింపుము. దేవా, మా నిట్టూర్పు, దుఃఖము మా జీవితములో నుండి తొలగిపోవునట్లుగా, మా తలల మీద నిత్య సంతోషము నిలిచియుండునట్లుగా మాకు అటువంటి కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా సమాధానమును, మా గౌరవమును మరియు మా నిరీక్షణను మరల పునరుద్ధరించుము. దేవా, నీవు నీ ప్రజలను రక్షించి, దాసత్వము నుండి బానిసలను విడిపించినట్లుగానే, మమ్మును కూడా విడిపించి, రక్షించుము. ప్రభువా, నీవు మమ్మును ఎన్నటికిని నిరాశపరచవని మేము నీ యందలి విశ్వాసమును కలిగియుండుటకు మాకు నీ కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు శాశ్వతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


