నా ప్రియ స్నేహితులారా, కారుణ్య విశ్వవిద్యాలయమును, డీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించి ఇప్పటికి 22 సంవత్సరములైనవి. ప్రభువు కృప ద్వారా కారుణ్యకు ఎంత గొప్ప ఆశీర్వాదమును అనుగ్రహించియున్నాడు కదా! మీలో అనేకులు కారుణ్యకు మరియు బేతెస్దకు వచ్చియుండవచ్చును అని నేను అనుకుంటున్నాను. అక్కడ సమాధానకరమైన వాతావరణమును మీరు అనుభవించియుంటారని నేను నమ్ముచున్నాను.

మాకు వివాహము జరిగిన క్రొత్తలోను మరియు క్యేటీ జన్మించిన క్రొత్తలో మేము అక్కడ ఒకటి లేక రెండు సంవత్సరములు నివసించియున్నాము. అక్కడ ప్రార్థించిన ప్రతిసారి, నేనుఏడ్చుచూ, శ్యామ్‌తో ఈలాగున చెబుతాను, 'ఇక్కడ దేవుని సన్నిధానము ఎంతో గొప్పగాను మరియు దీవెనకరముగాను ఉన్నది' అని చెప్పాను. నేను కూడా కార్యుణ్యలో విధ్యార్ధినిగా ఉంటూ, ఒక మూడు మరియు నాలుగు సంవత్సరములు ఇక్కడ నివసించినట్లయితే, ఎంత బాగుంటుంది కదా! అని చెప్పాను.

నా ప్రియులారా, అక్రిడిటేషన్ మరియు అకాడమిక్ పరముగా మాత్రమే కాదు కానీ, ఆధ్యాత్మికంగా కూడా ప్రభువు కారుణ్యను ఆశీర్వదించియున్నాడు. చదువుపరంగాను మరియు ఆధ్యాతికంగాను ఎదిగినటువంటి ఎంతో మంది విద్యార్థులు, ఇంకను దేవునితో సన్నిహితంగా నడిచిన విద్యార్థులు నాకు తెలుసు. కారుణ్య మీద మరియు అక్కడ చదివి బయటకు వెళ్లిన విద్యార్థులు మీద అత్యంతమైన దీవెనలను కుమ్మరించియున్నాడు. హల్లెలూయా!

నా ప్రియులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యోబు 36:11వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు'' అని చెప్పబడినట్లుగానే, మీరు ప్రభువును సేవించాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. అవును, ప్రభువు ఈ రోజు మీకు మరియు మీ కుటుంబమునకు అదే వాగ్దానమును అనుగ్రహించుచున్నాడు. ఒకవేళ, మీరు అనేకమైన నష్టములను ఎదుర్కొనియున్నారేమో? లేక మీ కుటుంబ సభ్యులను కోల్పోయి ఉన్నారేమో? మీ వ్యాపారము నష్టాలపాలైపోయినదేమో? కానీ, ఈ రోజు నుండి అభివృద్ధిని చూడబోవుచున్నారు. ఈ రోజు నుండి మీరు సంతృప్తిని కలిగియుండబోవుచున్నారు. మీ చేతుల నుండి చేయుచున్న ప్రతి పనిని ప్రభువు ఆశీర్వదించబోవుచున్నాడు. ఇది ఎంత అద్భుతమైన గొప్ప వాగ్దానము కదా! ఆయన మీ చేతి పనులను ఆశీర్వదించి, మీ జీవితమును పునరుద్ధరించబోవుచున్నాడు. కనుకనే, మీరు దేనినిమిత్తము భయపడకండి.

నా ప్రియులారా, ఈ రోజు మీ పనులకు బయటకు వెళడానికి అడుగు పెట్టుటకు ముందుగానే, ఈ వాగ్దానమును విశ్వసించి పొందుకొనండి. మీరు మీ గృహము నుండి అడుగు బయటకు పెట్టడానికి ముందు, మీ జీవితము మారబోవుచున్నదని నమ్మండి. ప్రభువు ఆ వాగ్దానమును మీ జీవితములో నిశ్చయముగా నెరవేరుస్తాడు. కలిసి మనము ప్రార్థించుకుందాము. నా స్నేహితులారా, ప్రభువు మిమ్మును రెండంతల ఆశీర్వాదములతో దీవించబోవుచున్నాడు. ప్రభువు మీ పరిస్థితిని మార్చివేసి, మీ దినాలను తన మంచితనంతో నింపబోవుచున్నాడు. యోబు జీవితంలో పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా అతనికి దయచేసినట్లుగానే, మీ విషయంలోనూ అలాగే చేయబోవుచున్నాడు. కనుకనే, ఆయనను నమ్మండి మరియు మీ జీవితంపై ఆయన దయ మీ మీద ఉంటుందని ఎదురు చూడండి. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, కారుణ్య మీద కుమ్మరించిన దీవెనలను బట్టి నీకు వందనములు. కారుణ్య విదార్థులందరిని ఆశీర్వదించుము. ప్రభువా, చదువుకొనుచున్న విద్యార్థులందరికి మంచి భవిష్యత్తును దయచేసి, వారు ఉన్నత శిఖరములకు ఎదుగునట్లుగా వారికి సహాయము చేయుము. దేవా, ఈ రోజు నుండి మా జీవితాలలో ఒక మార్పును అనుభవించునట్లుగా చేయుము. ప్రభువా, మేము చేయు ప్రతి పనిలోను రెండంతలుగా ఆశీర్వాదములను పొందుకొనునట్లుగా చేయుము. దేవా, యోబును మొదటికంటె చివరిలో రెండంతలుగా ఆశీర్వదించినట్లుగానే మమ్మును కూడా నీవు రెండంతలుగా ఆశీర్వదించుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి రంగంలోనూ మేము దైవికమైన మార్పును అనుభవించునట్లుగా చేయుము. దేవా, మా చేతుల పనిని ఆశీర్వదించి, మా ప్రయత్నాలను అభివృద్ధిపరచుము. ప్రభువాఐ పా యొక్క ప్రతి నష్టాన్ని పునరుద్ధరించి, మా యొక్క ప్రతి గాయమును స్వస్థపరచి మరియు మా హృదయములను సంతృప్తితో నింపుము. దేవా, అద్భుతాలు మమ్మును వెంబడించునట్లుగా చేసి, మా జీవితముల ద్వారా నీ నామము మహిమపరచబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.