నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున మీకందరికి నా శుభములు తెలియజేయుచున్నాను. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 19:23 వ వచనమును నేడు మనము ధ్యానించబోవుచున్నాము. ఇది ఎంతటి అద్భుతమైన వాగ్దానము. ఆ వచనము, "యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జీవ సాధనము అది కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండ బ్రదుకును'' అని చెప్పబడినట్లుగానే, నా ప్రియులారా, మీరు ఎలాగున ఉన్నారు? దేవుని యందు భయభక్తులు కలిగియున్నారా? యౌవనస్థులారా, దేవుని యందు భయభక్తులు కలిగియున్నారా? ఆయన మార్గములను వెంబడించుచున్నారా? అయితే, బైబిల్ నుండి కీర్తనలు 112:1,128:1 మరియు 115:13వ వచనములలో మనము చూచినట్లయితే, " యెహోవా యందు భయభక్తులు కలిగియున్నవారు ధన్యులు '' అని చెప్పబడినట్లుగానే, మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగియుంటూ, ఇటువంటి గొప్ప ధన్యతను పొందుకొనండి.
నేడు బైబిల్ నుండి దావీదు, యోబు మరియు దానియేలు వంటి దైవభక్తుల జీవితములను గూర్చి మనము చదువుతాము. వారందరు దేవుని యందు భయభక్తులు కలిగియున్నవారు. వారి జీవితములు మార్చబడినవి. దేవునితో అన్యోన్య నడవడిని మరియు సహవాసమును కలిగియున్నారు. అందును బట్టి, సమృద్ధిగా వారు దీవించబడియున్నారు. అనేక సమస్యల నుండి వారు రక్షించబడ్డారు. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 103:11వ వచనములో చూచినట్లయితే," భూమికంటె ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయనయందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది'' అని చెప్పబడినట్లుగానే, ఆయనయందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికముగా ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగియుంటూ, ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో నడుస్తూ ఉన్నట్లయితే, మీరు అడుగువాటన్నిటిని కూడా ఎంతో జాగ్రత్త మీకు అనుగ్రహిస్తాడు. నా జీవితములో చూచినట్లయితే, నేను యౌవనస్థురాలిగా ఉన్నప్పుడు, దేవునితో అన్యోన్య సహవాసము అంటే ఏమిటో నాకు అస్సలు తెలియదు. ప్రభువు నాకు, దేవుని యందలి భయభక్తులను నేర్పించియున్నాడు. నా జీవితము సంపూర్ణంగా రూపాంతరపరచబడినది. అందుకే బైబిల్ నుండి కీర్తనలు 103:11వ వచనము ప్రకారము అదేవిధముగా నా జీవితములో ప్రభువు తన యొక్క కృపను చూపించియున్నాడు. నా 16 ఏళ్ల వయస్సులో ప్రభువు నాతో మాట్లాడాడు. ఆయన నాకు ఎంతో సమీపముగా ఉన్నాడని గ్రహించునట్లుగా చేశాడు. ఆ తర్వాత, నేను ఆయనను ప్రేమించడము మొదలు పెట్టాను. భయభక్తులుగల జీవితమును నేను కలిగియున్నాను. అందును బట్టి, ప్రభువు ఈ రోజు నన్ను అనేకమైన ఆశీర్వాదములతో దీవించియున్నాడు. హల్లెలూయా!
ఆందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 7:1వ వచనములో చూచినట్లయితే," ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము'' అని చెప్పబడిన ప్రకారముగా దేవుని యందు భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనవలెను. ఇంకను బైబిల్ నుండి 2 తిమోతికి 1:7వ వచనములో చూచినట్లయితే, " దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మనకు శక్తిని, ప్రేమను, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మను ఇయ్యలేదు. కనుకనే, నా ప్రియమైన వారలారా, బైబిల్ నుండి కీర్తనలు 145:19వ వచనములో చూచినట్లయితే, " తనయందు భయభక్తులుగలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొఱ్ఱ ఆలకించి వారిని రక్షించును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన యందు భయభక్తులు మీరు కలిగియున్నట్లయితే, ఆయన నిశ్చయముగా మీ మొఱ్ఱను ఆలకించి, మిమ్మును రక్షించును. కనుకనే, నా ప్రియ సహోదరి, సహోదరులారా, యౌవనస్థులారా, దేవుడు ఎంత గొప్ప జీవితమును మనకు ఇవ్వాలని ఆయన మన పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీ పూర్తి జీవితమును ప్రభువునకు ఇవ్వండి. ఆయనను మీ రక్షకునిగా అంగీకరించండి. దేవుని యందు భయభక్తులతో మీ రోజును గడపండి, అప్పుడు ప్రభువు మిమ్మును సమృద్ధిగా దీవిస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
మా ప్రశస్తమైన పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ అద్భుత సన్నిధానమునకై నీకు వందనములు. ప్రభువా, ఈ సందేశమును చదువుచున్న మమ్మును దర్శించుము, నీ యెడల భయభక్తులతో నడుచుకొనుటకు నాకు నేర్పుము. ప్రభువా, మేము దారి తప్పిపోకుండను, చీకటిలో నివసించకుండా, అపవాది మార్గములో వెళ్లకుండా, అంధకార మార్గమును వెంబడించకుండా, మేము నీ వెలుగు యొద్దకు వచ్చునట్లుగా మాకు నీ కృపను దయచేయుము. దేవా, నీ మహిమార్థమై మేము ప్రకాశించునట్లుగా చేయుము. ప్రభువా, మా జీవితమును సంపూర్ణముగా మార్చివేయుము. దేవా, మేము పలుకుచున్న మరియు చేయుచున్న ప్రతి మాటలో మా హృదయం నిన్ను ఘనపరచునట్లుగా చేయుము. ప్రభువా, ప్రతిదినం నీతో మాకు మరింత సన్నిహిత సంబంధాన్ని కలిగించుము. దేవా, నీ మార్గాలను అనుసరించాలని మేము ఎన్నుకున్నప్పుడు, మా జీవితాన్ని మార్చుము. ప్రభువా, నీ కనికరము మా మీద నిలిపి, మా అడుగులను నడిపించుము. దేవా, దయచేసి, మమ్మును నీ నుండి దూరం చేయుచున్న ప్రతి ఆటంకాన్ని తొలగించుము. ప్రభువా, నిన్ను నమ్మి, పూర్ణహృదయంతో నీకు విధేయులుగా ఉండుటకు మాకు నేర్పించుము. దేవా, నీ చిత్తానుసారంగా మా హృదయ కోరికలను నెరవేర్చుమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


