నా ప్రియ స్నేహితులారా, ఈ దినమున దేవుని యొద్ద నుండి శ్రేష్టమైన దానిని ఎదురుచూడండి. ఎందుకనగా, దేవుడు తన బిడ్డలకు ఎల్లవేళల శ్రేష్టమైన దానిని మనకు అనుగ్రహించు దేవుడై యున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 1:19వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, " వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయున్నందున వారు నీపైని విజయము పొందజాలరు; ఇదే యెహోవా వాక్కు'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు మీకు తోడుగా ఉండి, మీ పోరాటముల నుండి మిమ్మును విడిపించవలెనని ఆయన మీ పట్ల కోరుచున్నాడు. కనుకనే, మీరు దేనికిని భయపడకండి.

ఆలాగుననే, 1944వ సంవత్సరములో, రెండవ ప్రపంచ యుద్ధము సమయములో, అమెరికా, కెనడా మరియు ఇంగ్లాండ్, జర్మనీతో కూడా కలిసి, వ్యతిరేకంగా చాలా సంక్లిష్టమైన యుద్ధముతో పోరాడుటకు వారు పాల్గొన్నారు. ఈ యుద్ధము ఫ్రాన్స్ దేశములో ఉన్న నార్మాండీ అనే నగరము యుద్ధమునకు సంబంధించిన తంత్రమునకు ప్రయోజనకరమైన స్థలముగా దానికోసము పోరాటము జరుగుతుంది. ఆ యొక్క యుద్ధమే వారు పోరాడుచున్న రెండవ ప్రపంచ యుద్ధమునకు సంబంధించిన ద్వారమునకు నడిపించు మార్గముగా ఉండియున్నది. అది యుద్ధ ఫలితమును నిర్ణయించగల వ్యూహాత్మక స్థలము. ఆ యుద్ధము ప్రారంభము కావడానికి ముందు, అమెరికా దేశము యొక్క ప్రసిడెంట్ (అధ్యక్షుడు) ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ అనబడే వ్యక్తి, విమానములో బయలుదేరి వెళ్లి, పౌరులందరితో కూడా మాట్లాడవలెనని ఉద్దేశించియున్నాడు. అతడు (ఎఫ్‌డిఆర్) రేడియో ద్వారా యుద్ధమును గురించి అందరితో మాట్లాడుచున్నాడు. అందరు కూడా ప్రెసిడెంట్ తన మాటల ద్వారా కార్య విముఖులను చేస్తాడని మరియు అతని యొక్క స్ఫూర్తిదాయక మాటలతో ప్రజలను ప్రోత్సహిస్తాడని అనేకమంది ఎదురు చూశారు. కానీ, దానికి బదులుగా, ఆ సమయములో అతడు తన మాటలనుగా వారికి చెప్పడానికి ఎంపిక చేసుకోలేదు. కానీ, పౌరులందరితో కలిసి ప్రార్థన చేయడానికి అతడు ఇష్టపడ్డాడు.

కనుకనే, అతడు వారందరిని చూచి, 'ఇటువంటి సమయములో మనమందరము కూడా కలిసి దేవుని వైపు చూద్దామా? కేవలము ఆయన మాత్రమే మనకు విజయమును అనుగ్రహించగలడు' అని అందరికి పిలుపునిచ్చాడు. అంతమాత్రమే కాదు, అతడు అందరితో కలిసి, ఈలాగున ప్రార్థించాడు, 'ప్రభువా, ఈ యుద్ధములో ధైర్యంగాను మరియు ఎంతో అతిశయముగాను పోరాడుతున్న మా కుమారుల మీదికి నీ దృష్టిని సారించుము. దేవా, నీవు వారితో కూడా వెళ్లుము. ఈ బలమైన యుద్ధములో నీవే మా పక్షమున పోరాటము చేయుము, మాకు విజయమును అనుగ్రహించుము' అని ప్రార్థించుచున్నప్పుడు, ఈ ప్రార్థన వ్రాసుకోవడములో తన కుమార్తెయైన అన్నా తనకు సహకరించినది. హృదయపూర్వకమైన ఈ ప్రార్థనను అతని కుమార్తె అన్నా రూజ్‌వెల్ట్ సహాయంతో రూపొందించాడు. ఆ తర్వాత, ఆ యుద్దమును దేవుని హస్తములకు అప్పగించుటలో దేశమునకు అతడు ఈ రీతిగా సహకరించియున్నాడు.

ఆ సమయంలో, జర్మనీ అత్యంత బలమైన స్థానములో ఉన్నట్లుగా కనిపించింది. కానీ, నార్మండీ అను ప్రాంతములో జర్మనీ యుద్ధములో పోరాడినది కానీ, ఓటమిపాలైనది. అయితే, అమెరికా యుద్ధ ధళాలు ఫ్రాన్స్‌లో ఉన్న ఆ యొక్క సముద్ర తీర ప్రాంతములోనికి ప్రవేశించగలిగాయి. లేనట్లయితే, ఆ భూభాగములోనికి వారు ఎప్పటికి కాలు మోపగలిగేవారు కాదు. ఆ తర్వాత, యుద్ధమును గెలువడము వారికి అత్యంత సుళువుగా ఉండినది. తద్వారా, ప్రభువు వారికి గొప్ప విజయమును అనుగ్రహించియున్నాడు. ఆ విజయముతో వారు ఫ్రాన్స్‌లోనికి ప్రవేశించుటకు మార్గము తెరవబడినది. ఒకవేళ ఆ విజయమును వారు పొందలేకపోయినట్లయితే, వారు ఎన్నటికిని ఫ్రాన్స్‌లోనికి ప్రవేశించలేక పోయేవారు. ఆ నిర్ణయాత్మక విజయమే ఆ యొక్క పరిస్థితిని పూర్తిగా ఒక మలుపుగా నిలుపుటకు మార్చబడినది. చివరికి, రెండవ ప్రపంచ యుద్ధములో ఇది విజయానికి దారితీసింది. ప్రభువే వారికి ఆ గొప్ప విజయమును అనుగ్రహించియున్నాడు. హల్లెలూయా!

అదేవిధంగా, నా ప్రియులారా, అవును, ఈ వచనము ప్రకారము శత్రువులైతే, మీతో పోరాడుతారు. కానీ, దేవుడైతే, మిమ్మును ఎంతగా భద్రంగా ఉంచియున్నాడని చూపించడానికి ఇది ఒక అవకాశముగా తీసుకుంటారు. వారందరు కూడా గొప్ప దేవుడు మీతో కూడా ఉన్నాడన్న సంగతిని చూడగలుగుతారు. తద్వారా, వారు ఎప్పటికిని ఇక మీతో కూడా పోరాడలేరు. నా ప్రియులారా, మీ గొప్ప తనమును చూపించడానికి ఈ రీతిగా అనుమతించబడుతుంది. ఒకవేళ మీరు బలహీనులుగా ఉంటూ దాక్కుంటున్నారేమో? లేక అహింసను సహించలేకపోవుచున్నారేమో? కనుకనే, వారికి భయపడకండి. రండి, ఇప్పుడు మనమందరము కలిసి ప్రార్థన చేసి, మన పోరాటాలలో విజయమును సాధించుకుందాము. ఈ రోజు దేవుడు మీతో, 'నీ శత్రువులు నీపై యుద్ధం చేయవచ్చును, కానీ వారు నిన్ను జయించలేరు' అని సెలవిచ్చుచున్నాడు. కొన్నిసార్లు దేవుడు మీ జీవితములో యుద్ధాలను అనుమతిస్తాడు, అవి మిమ్మును నాశనము చేయడానికి కాదు, మీ జీవితములో తన గొప్ప శక్తిని బయలుపరచడాని కొరకే. తద్వారా, మీరు పొందుకున్న మీ విజయము ద్వారా, సర్వశక్తిమంతుడైన దేవుడు మీతో కూడా ఉన్నాడని ఇతరులు గ్రహిస్తారు. దేవుడు కాపాడు వారిని ఎదిరించి ఎవ్వరూ నిలువలేరని వారు చూడగలరు. కాబట్టి భయపడకండి. ఈ రోజే మీ ప్రతి పోరాటాన్ని ప్రభువు సన్నిధికి తీసుకురండి. ఆయనే మీ పరాక్రమశాలియైన శూరుడుగాను, ఆయనే మీ యొక్క సేనాధిపతిగా ఉన్నాడు. ఒకవేళ, ఈ లోకములో మానవులు, గొప్ప అధికారులు, వ్యవస్థలు, సంస్థలు లేదా క్లిష్ట పరిస్థితులు మరియు వాధులు వీటి ద్వారా ఏ రూపంలోనైన మీకు వ్యతిరేకత ఎదురైనా సరే, దేవుడు మీకు ముందుగా వెళ్లి, మీ పక్షాన పోరాడి, మీకు విజయమును అనుగ్రహిస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవే మాకు పరాక్రమముగల యోధునిగా ఉన్నందుకై నీకు వందనములు. ప్రభువా, నీ బలమైన శక్తి మాకు ముందుగా వెళ్లునట్లుగా మాకు సహాయము చేయుము. యేసయ్యా, నీవే మాకు సైన్యాధిపతిగా ఉన్నావు, కనుకనే, మా జీవితములో మేము ఎదుర్కొంటున్న యుద్ధములను నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. ప్రభువా, బలమైన శత్రువులైన వారు మాకు విరోధముగా పోరాడుచున్నను, వారిని నీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. దేవా, నీ బిడ్డలైన మా మీద నీ దృష్టిని సారించుము. ప్రభువా, మేము బలహీనులుగా ఉన్నాము మరియు అహింసను సహించలేక దాక్కుకొనియున్నాము. దేవా, నీవు మమ్మును కనికరించి, నీ యందు విశ్వాసముంచుటకు మాకు సహాయము చేయుము. యేసయ్యా, మా పక్షమున నీవు లేచి, మా జీవితములో ఎదుర్కొంటున్న యుద్ధములను నీవు చేపట్టి, మాకు విజయమును దయచేయుము. ప్రభువా, ఈ రోజు మా యొక్క ప్రతి యుద్ధాన్ని, భారమును మరియు సవాలును నీ చేతులకు అప్పగించుచున్నాము, నీవు మా పక్షమున పోరాడి, ఎటువంటి శత్రువు మమ్మును జయించకుండా చేసి, మేము బలహీనంగా ఉన్నప్పుడు మమ్మును బలపరచుటకు మా హృదయాన్ని ధైర్యంతో నింపుము. దేవా, మేము జయించుటకు మార్గం లేదనిపించే చోట నీవు మాకు మార్గమును కల్పించుము. ప్రభువా, ఈ లోకములో గొప్ప అధికారులు, వ్యవస్థలు, సంస్థలు మాకు విరోధముగా ఉన్నారు, అయినను, వారికి మేము భయపడకుండా, ధైర్యముతో వారిని ఎదుర్కొనుటకు నీవు మా పక్షమున పోరాడి మాకు విజయమును అనుగ్రహించుము. దేవా, మా యుద్ధాలలో పోరాడుటకు మాకు మార్గమును కలిగియుండుటకు నీవే మాకు సహాయము చేయుము. ప్రభువా, మా శరీరములోను, మా యొక్క ప్రతి పోరాటములలోను నీవే మాకు విజయమును అనుగ్రహించుమని యేసుక్రీస్తు యొక్క అత్యంత గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.