నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు మీతో ఉండాలని ఎంతగానో ఆశించుచున్నాడని చెబుతున్నాడు. అవును, ప్రభువు తన ప్రజలతో కూడా ఉండాలని ఎంతగానో ఆశించుచున్నాడు. మనము ఆయన యొద్దకు వచ్చి, ఆయనతో మాట్లాడాలి అని ఆయన మన కొరకు వేచియుంటాడు. మనము ఆయన పాదముల చెంత కూర్చుని ఈ రోజు జరిగినదంతయు ఆయనతో పంచుకోవాలని ఆయన మన కొరకు వేచియుంటున్నాడు. మన సంతోషమును గురించి, మన దుఃఖమును గురించి, అన్నిటిని గురించి మనము ఆయనతో పంచుకోవాలని ఆయన కొరకు వేచియుంటాడు. ఆలాగుననే, మన ప్రణాళికలు ఏమై ఉన్నవని ఆయన తెలుసుకోవాలని ఆయన మన పట్ల ఆశించుచున్నాడు. ఇంకను, ఈ రోజు మీరు ఏమి ధరించాలని కోరుచున్నారని కూడా ఆయన తెలుసుకోవాలని ఆశిస్తాడు. అవును, ప్రభువు మనకు సమీపముగా ఉండాలని మన పట్ల ఆశించుచున్నాడు.
అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి 2 దినవృత్తాంతములు 15:2వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "... మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయన యొద్ద విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును'' అని చెప్పబడినట్లుగానే, ఆయన మీ పక్షమున ఉండాలని మీ పట్ల కోరుచున్నాడు. అవును, నా ప్రియులారా, ఆయన ఎంతో సహనము కలిగియున్న దేవుడు. ఆయన తనకు తానుగా మన జీవితములోనికి వచ్చేయడు కానీ, మీరు వచ్చి కూర్చుండు వరకు ఆయన మీ కొరకు వేచియుంటాడు. యేసయ్య, ఒక కాఫీ టేబుల్ దగ్గర కూర్చుని ఉండు ఒక చిత్రము నాకు ఎప్పుడు జ్ఞాపకమునకు వస్తుంది. అది మా యింటి గది బయటనేఅటువంటి ఒక బల్ల ఉన్నది. నేను ఆ బల్లను చూచినప్పుడల్లా, యేసయ్య అక్కడ కూర్చుని ఉన్నట్లుగాను, నేను వచ్చి, ఆయనతో మాట్లాడవలెనని నా కొరకు వేచియున్నట్లుగా నేను భావిస్తుంటాను. అవును, ప్రభువు ఈ రోజు మీ కొరకు కూడా ఆలాగుననే వేచియుంటున్నాడు.
నా ప్రియులారా, ఆయనతో కూర్చుని ఆయనతో మాట్లాడండి. మీ కష్టాలన్నిటిని ఆయనతో పంచుకొనండి. మిమ్మును బాధించుచున్న విషయములన్నిటిని ఆయనతో చెప్పండి, "ప్రభువా, ఇంక ఇది నా వలన కాదు'' అని చెప్పండి. అప్పుడు మీ జీవితములో ఉన్న అన్ని విషయాలను ప్రభువే చూచుకుంటాడు. అందుకే దేవుని వాక్యములో చూచినట్లయితే, "మీ భారమంతటిని కూడా నా మీద మోపండి, నేను మీ గురించి అన్నిటిని చూచుకుంటాను'' అని ప్రభువు వాగ్దానమిచ్చుచున్నాడు. అంతమాత్రమే కాదు, ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడు. అందుకే బైబిల్ నుండి యాకోబు గ్రంథము 4:8వ వచనములో చూచినట్లయితే, "దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి'' అని చెప్పబడినట్లుగానే, మీరు దేవుని యొద్దకు వచ్చినట్లయితే, ఆయన మీ యొద్దకు వస్తాడు. కనుకనే, నా ప్రియులారా, ఈ రోజు మన జీవితాలను యేసయ్య వైపు మరల్చుకుందాము. ఒకవేళ మీరు ఈ లోకములో ఉన్న అనేక విషయాల ద్వారా పరధ్యానులుగా ఉంటున్నారా? మీ కుటుంబము మరియు మీ యొక్క ఫోన్ లేక సోషల్ మీడియా వీటన్నిటి చేత పరధ్యానులు అయిపోతున్నారా? అవన్నిటి చేత మీరు ఆకర్షింపబడినప్పుడు ప్రభువుకు మీరు దూరమై పోతుంటారు. కనుకనే, నా ప్రియ స్నేహితులారా, మన దృష్టి ఈ రోజు ఆయన వైపు మరల్చండి. ఈ రోజు మనము కలిసి ప్రార్థించుకుందాము. ఒకవేళ, నేడు మీరు, 'మేము దేవునికి ఎంతో దూరముగా ఉన్నాము' అని అనుకుంటున్నారేమో? ఇంకను, 'ప్రభువు మమ్మును గురించి మరచిపోయాడేమో' అని అనుకుంటున్నారేమో? కానీ, ప్రభువు ఈ రోజు, అటువంటి మిమ్మును చూచి, "మీరు నా యొద్దకు రండి, నేను మీకు సమీపముగా ఉన్నాను'' అని అంటున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, నేడు మీరు ఉన్న పక్షముననే మీరు ప్రభువు యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగలిగిన మా పరలోకమందున్న ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీవు మా మీద కలిగియున్న ప్రేమను బట్టి నీకు వందనములు. ప్రభువైన యేసయ్యా, ఈ రోజు మేము నీ సన్నిధిలో మొఱ్ఱపెట్టుచున్నాము, మా జీవితాలను నీ హస్తములకు సమర్పించుకొనుచున్నాము. ప్రభువా, మేము నీకు అతి సమీపముగా రావడానికి కృపను ఇవ్వండి. దేవా, మేము నీకు మరింత దగ్గరగా వచ్చి, ప్రతిరోజూ నీ సన్నిధిని అనుభవంచునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితములో ఉన్న పరధ్యానములన్నిటిని తొలగించుము. తండ్రి, మమ్మును, సోషల్ మీడియా నుండి, ఫోన్ వలన కలిగే పరధ్యానముల నుండి, వీడియో గ్యేమ్స్ నుండి మా కుటుంబమును మరియు మా పిల్లల వలన కలిగే ఆకర్షణలను బట్టి, వాటన్నిటిని బట్టి, మేము పరధ్యానముగా ఉండకుండా మాకు సహాయము చేయుము. దేవా, పై చెప్పబడిన విషయాలన్నిటి ద్వారా మా హృదయాలను నీ నుండి దూరం చేయకుండా మాకు సహాయం చేయుము. ప్రభువా, మేము నీకు అతి సమీపముగా ఉండు కృపను మాకు దయచేయుము. దేవా, మేము నీకు ఎంతో దూరముగా ఉన్నాము, దయతో నీవు మమ్మును విడిచిపెట్టకుండా, నీవు మా జీవితముల పట్ల జాగ్రత్త వహించండి. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మును నింపి మమ్మును ఆశీర్వదించుమని యేసుక్రీస్తు ప్రేమగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


