నా ప్రియ స్నేహితులారా, ఈ నూతన మాసములో అడుగిడిన మీరు స్థిరంగా నిలిచియుండాలనియు, మీరు దేవుని మీద కట్టబడాలని మీ పట్ల కోరుచున్నాడు. ఇప్పటి వరకు, మీరు దేవుని యందు భయభక్తులతో నడుచుకొనియున్నారు, ఆయన చిత్తమును వెదకియున్నారు, ఆయన స్వరమును వినుటకు ఆయన సన్నిధిలో సహనముతో కనిపెట్టుకొనియున్నారు మరియు మీ హృదయమును, మనస్సును, శరీరమును మరియు క్రియలను పరిశుద్ధముగా ఉంచుకొనియున్నారు కనుకనే, ఈనాటి నుండి ప్రభువు మిమ్మును స్థిరముగా తన మీద కట్టుకొనుచున్నాడు. అందుకే బైబిల్ నుండి మత్తయి 16:18వ వచనములో చూచినట్లయితే, "...ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని'' యేసు మనతో చెప్పుచున్నాడు. కనుకనే, బండయైన క్రీస్తు మీద మీరు కట్టబడుట ద్వారా మీరు ఆయన ఆలయమైయున్నారు. అవును, మీరు మరియు నేను దేవుని ఆలయమైయున్నాము. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 3:16వ వచనములో చూచినట్లయితే, " మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? '' అని సెలవిచ్చుచున్నది. మీరు మీ సొత్తు కారు. మీరు దేవుని ఆలయమై యున్నారు. కనుక, మీరు ఎన్నడు కూడా, ' మేము ప్రత్యేకమైనవారు కాదనియు లేక మీ జీవితమునకు విలువలేదనియు అనుకొనవద్దు.' నా ప్రియులారా, మీరు జీవముగల దేవుని ఆలయమైయున్నారు మరియు ఆయన ఆత్మ మీలో నివసించుచున్నది. ఇంకను మీలోనున్న క్రీస్తు మహిమా నిరీక్షణయై యున్నాడు. క్రీస్తే ఆ బండయై యున్నాడు. అందుకే బైబిల్ నుండి యెషయా 51:1వ వచనములో చూచినట్లయితే, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా, నా మాట వినుడి మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాని ఆలోచించుడి'' అని సెలవియ్యబడినట్లుగానే, అవును, బండయైయున్న యేసు తట్టు చూడండి. ఆయన తన మీద మిమ్మల్ని స్థిరముగా కట్టుచున్నాడు. మరియు ఏదియు మిమ్మల్ని ఆయన నుండి వేరుచేయలేదు. మన ప్రభువైన యేసు మీద మీరు స్థిరముగా నిలిచిపోవుదురు. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 8:35వ వచనములో చూచినట్లయితే, " క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనతయైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా?'' అని అపొస్తలుడైన పౌలు చెప్ప్పుచున్నాడు. బాధయైనను లేక ద్రోహమైనను, అపవాది క్రియలైనను లేక పాపపు భారములైనను మనలను క్రీస్తు నుండి వేరుచేయలేవు. మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుకొనుచున్నాము. బహుశా మీరు, 'తీవ్రమైన ప్రేమ ఆయన కొరకు నాలో లేదు. నేను సరిగ్గా ప్రార్థన చేయలేదు. నాలో చాలా లోపములు ఉన్నవి' అని అనుకొనుచుండవచ్చును. అయితే, మీరు దేవుని పట్ల చూపు ప్రేమకంటె ఆయనకు మీ మీదనున్న ప్రేమ చాలా గొప్పది అని జ్ఞాపకముంచుకోండి.
నా ప్రియులారా, బండయైన క్రీస్తు మీద మీరు స్థిరముగా కట్టబడినప్ప్పుడు, మీరు క్రీస్తునందు స్థిరపరచబడినప్పుడు, శుద్ధీకరణ, నూతనత్వం మరియు రూపాంతరము పొందుట కొరకు బండ నుండి జీవజలములు పొందుకుంటారు. అందుకే బైబిల్ నుండి 1 కొరింథీయులకు 10:4వ వచనములో చూచినట్లయితే, "అందరు ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి; ఆ బండ క్రీస్తే'' అని సెలవిచ్చుచున్నది. మనము ఇశ్రాయేలు ప్రజలను చూచినప్ప్పుడు, వారు తీవ్రమైన శారీరక బంధకములను అనుభవించుట మాత్రమే గాక, వారు దేవునితో వారి సంబంధము విషయములో ఇబ్బందిపడుచున్నారు. ఫరో మరియు అతని అధికారులు వారిని బానిసలుగా ఉపయోగించుకొనుచు, బాధలు పెట్టుచున్నప్పుడు వారు దేవుని మీద గొణుగుతూ ఉన్నారు. మోషే ద్వారా దేవుడు వారికి తన వాక్యమును ప్రత్యక్షపరచి, వారి పట్ల ఆయన వాక్యమును ధృవీకరించి, తన ప్రజలను బంధకముల నుండి విడిపించెను. ఎఱ్ఱ సముద్రము ద్వారా ఆయన వారిని నడిపించెను. ఎఱ్ఱ సముద్రములోని నీటి ద్వారా, వారు తమ గత బంధకముల నుండి శుద్ధీకరించబడ్డారు, తమ పాత జీవితములో నుండి స్వేచ్ఛతో నిండిన క్రొత్త ఆరంభము వైపు నడిచారు. అదేవిధంగా, దేవుడు మిమ్మల్ని పాత కార్యములలో నుండి బయటకు తీసుకొనివచ్చి, క్రొత్త జీవితములోనికి నడిపించును. శుద్ధీకరించబడుటకును, పునరుద్ధరించబడుటకును మరియు మారుమనస్సు పొందుటకును ఆయన క్రీస్తు యొక్క జీవజలములను మీకు అన్నుహ్రించును. ఇది బండయైన క్రీస్తు నుండి వచ్చును. యేసే ఆ జీవజలమై యున్నాడు. అందుకే బైబిల్ నుండి యోహాను 7:37వ వచనములో చూచినట్లయితే, "...యేసు నిలిచి ఎవడైనను దప్పిగొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను'' అని యేసు సెలవిచ్చుచున్నాడు. నా ప్రియులారా, నేడు మీరు దప్పిక కలిగి యున్నారా? నన్ను ఎవరు విడిపించుదురు? అని బాధపడుచున్నారా? ప్రభువైన యేసును అడగండి. ఆయన మిమ్మును జీవజలములతో నింపుతాడు. ఆయన మిమ్మును శుద్ధీకరించును, నూతనపరచును మరియు నూతన జీవితములోనికి మిమ్మల్ని నడిపించును. మీరు శారీరకమైన లేక ఆత్మీయ బంధకములతో ఇబ్బంధిపడుచున్నట్లయితే, మీ జీవితమును దేవుని హస్తములలోనికి సమర్పించుకోండి. ఆయన ప్రతి బంధకమును విడగొట్టును మరియు సమస్తమును మీ కొరకు నూతనముగా మార్చును. ఆయన మీ అవసరాలను తీరుస్తారు, అలాగే క్లిష్ట పరిస్థితులలో కూడా తన మంచితనాన్ని మీరు అనుభవించునట్లుగా చేస్తాడు.
నా ప్రియులారా, మీ జీవితమును క్రీస్తు మీద స్థిరముగా కట్టబడినప్పుడు, మీకు వ్యతిరేకముగా ఏది వచ్చినను దానిని తట్టుకొనగల దైవీక బలమును పొందుకొనెదరు. అందుకే బైబిల్ నుండి లూకా 6:48వ వచనములో చూచినట్లయితే, "వాడు ఇల్లు కట్టవలెనని యుండి లోతుగా త్రవ్వి, బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ యింటి మీద వడిగా కొట్టినను, అది బాగుగా కట్టబడినందున దాని కదలింపలేకపోయెను''అని సెలవిచ్చుచున్నది. గమనించండి, మీ జీవితములో కష్టములు వరదలవలె వచ్చినను సరే, మీరు బండ మీద కట్టబడినట్లయితే, మీరు ఎన్నటికీ కష్టములు ఎదుర్కొనరు అని అర్థము కాదు. కష్టములు వచ్చినను, అవి మీ జీవితపు పునాదిని కదిలించలేవు అని అర్థము. మీ కుటుంబము, ఉద్యోగము, వ్యాపారము, పిలుపు మరియు భవిష్యత్తు కదల్చబడవు. దేవుని వాక్యము మీద మీ జీవితమును కట్టుకున్నప్పుడు, మీ పునాది మరింత స్థిరముగా ఉంటుంది. దేవుడు మీలో కట్టుచున్న దానిని ఏ వరదలు కూడా నాశనము చేయలేదు. అందుకే బైబిల్ నుండి ద్వితీయోపదేశకాండము 32:13 వ వచనములో చూచినట్లయితే, "భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెను పొలముల పంట వానికి తినిపించెను కొండ బండ నుండి తేనెను చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుఱ్ఱించెను'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీకు ఆయన యొక్క శ్రేష్ఠమైన ఆశీర్వాదములను అనుగ్రహించును మరియు మీరు ఆయన మీ కొరకు సిద్ధపరచి మేలులను అనుభవించెదరు. అసాధ్యమనిపించే ప్రతి చోట కూడా ప్రభువు మీ అవసరాలను తీర్చి, మిమ్మల్ని పోషిస్తాడు.
చివరగా, నా ప్రియులారా, ప్రభువు మిమ్మును బండ మీద కట్టియున్నాడు. కనుకనే, ఎన్నటికిని మీరు కదల్చబడరు. క్రీస్తునందు కట్టబడిన వారిని ప్రభువు బలంగా కాపాడతాడు. యేసు తన ఆలయమునకు వ్యతిరేకంగా పాతాళ ద్వారములు జయించలేవని వాగ్దానము చేసియున్నాడు. కనుకనే, అంధకార శక్తులు మీకు వ్యతిరేకంగా లేచి రావచ్చును, కానీ అవి మిమ్మల్ని జయించలేవు. ఎందుకనగా, మీరు ఆయన ఆలయమై యున్నారు. అందుకే బైబిల్ నుండి ఫిలిప్పీయులకు 2:10వ వచనములో చూచినట్లయితే, " పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగును'' అని చెప్పబడినట్లుగానే, మీరు యేసునకు చెందినవారు, మరియు ఆయన ఆత్మ మీలో నివసించుచున్నాడు. కనుక, మీకు వ్యతిరేకముగా లేచిన శక్తులను చూచి భయపడకండి. అందుకే బైబిల్ నుండి రోమీయులకు 16:20వ వచనములో చూచినట్లయితే, " సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును'' అని చెప్పబడినట్లుగానే, దేవుని ఆలయముగా ఉన్న మీలో నివసించుచున్నవాడు గొప్పవాడు. కాబట్టి, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. ప్రియులారా, మన బండయైన యేసు నుండి జీవజల నదులు, మధురమైన ఆశీర్వాదములు, ప్రతి తుఫానును ఎదుర్కొనగల బలము మరియు మీకు వ్యతిరేకముగా లేచిన ప్రతి దుష్టశక్తి నుండి కాపుదల వచ్చును. కనుక, ధైర్యముగా ఉండండి. మీరు మీ స్వంత బలముతో నిలబడుట లేదు మరియు కంపించుచున్న భూమి మీద నిలబడలేదు. మీరు బండయైన క్రీస్తు మీద నిలబడియున్నారు. కనుక మీరు ఎన్నటికిని కదిలింపబడరు. నేటి వాగ్దానము నుండి దేవుడు ఈ మాసమంతయు మిమ్మును దీవించి, స్థిరపరచును గాక.
ప్రార్థన:
పరలోకమందున్న మా ప్రియ తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. యేసయ్యా, మేము నీ ఆలయమును, నీవే మా మార్పులేని పునాదిగా ఉన్నందుకే నీకు వందనములు చెల్లించుచున్నాము. ప్రభువైన యేసయ్యా, నీవు మాకు దూరముగా లేవు. కనుకనే, నీ ఆత్మ ద్వారా నీవు మాలో నివసించుచున్నావు. మమ్మును నీ యొక్క నివాస స్థలమైన నీ ఆలయముగా చేసుకొనుచున్నందుకై నీకు స్తోత్రములు. ప్రభువా, మా ఆశ్రయదుర్గమైన నీ మీద మా జీవితము కట్టబడునట్లుగాను, నీ యొక్క బలమైన పునాది మీద స్థిరపరచుము. దేవా, మా హృదయాన్ని శుద్ధీకరించి, మా మనస్సును నూతనపరచి, నీ యొక్క జీవజలముల ద్వారా మా కొరకు నీవు సిద్ధపరచిన నూతన జీవితంలోనికి, విడుదలలోనికి మమ్మును నడిపించుము. ప్రభువా, మా ప్రతి అవసరతను తీర్చి, కష్ట పరిస్థితులలో కూడా నీ మంచితనమును మేము అనుభవించునట్లుగా చేయుము. దేవా, మా జీవితములో మేము ఎదుర్కొంటున్న ప్రతి శోధన మరియు వ్యతిరేకతలో స్థిరంగా నిలబడటానికి మాకు నీ యొక్క దైవీకమైన బలమును అనుగ్రహించుము. ప్రభువా, సాతాను ప్రతి అంధకార తంత్రము నుండి మమ్మును కాపాడి, మా కుటుంబమును, మా పిలుపును, పనిని మరియు మా యొక్క భవిష్యత్తును నీ చేతులలో భద్రముగా ఉంచి మమ్మును కాపాడుము. దేవా, మేము నీ యొక్క ఆలయముగా ఉండునట్లుగా మమ్మును నీ రక్తము ద్వారా పరిశుద్ధపరచి, నీ ఆత్మ మాలో సమృద్ధిగా నివసించునట్లుగా చేయుము. ప్రభువా, మాలో నివసించుచున్న నీవు గొప్పవాడవు కనుకనే, సమాధానకర్తయగు దేవా, నీవు సాతానును మా కాళ్ల క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించుమని యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


