నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మీ శాపములన్నిటిని దేవుడు ఆశీర్వాదముగా మారుస్తానని ఆయన మీ పట్ల వాగ్దానము చేయుచున్నాడు. ఇటీవల, బెంగుళూరు పట్టణములో జరిగిన ఒక నిజసంఘటనను నేను చదివియున్నాను. ఒక కోర్టు కేసు విషయములో న్యాయమూర్తి యొక్క కుర్చి యొద్దకు ఒక పెద్దావిడ వెళ్లి, అతనికి చేతబడి చేయడానికి ప్రయత్నించినది. న్యాయమూర్తి కానీ, ఇంకను అక్కడ మనుష్యులు ఎవ్వరు కూడా రాకముందుగానే ఆ కుర్చి యొద్దకు వెళ్లి చేతబడి చేయడానికి ఆమె ప్రయత్నించినది. అవును, ఈ లోకములో ఎన్నో విషయములు జరుగుతుంటాయి. అయితే, వాటన్నిటి నుండి ప్రభువు మనలను కాపాడుతాడు అనియు మరియు మన శాపములన్నియు దీవెనలుగా మారుస్తాడని మన పట్ల వాగ్దానము చేయుచున్నాడు. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి నెహెమా 13:2వ వచనమును మనము ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "...మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను...'' అని చెప్పబడినట్లుగానే, ఈ రోజు మీరు అటువంటి పరిస్థితులలో ఉన్నారేమో? తరతరాలుగా వచ్చే శాపములను గురించి చెబుతూ ఉంటారు. ఒక తరము నుండి మరొక తరము వరకు తల్లి నుండి బిడ్డలకు శాపము వస్తూ ఉండవచ్చును. ఆలాగుననే, మీ మనమసంతానమునకు కూడా వస్తూ ఉండవచ్చును. అయితే, అదే శాపమును ప్రభువు ఆశీర్వాదముగా మార్చుచున్నాడు. ఇవి తరతరాలు శాపములు మరియు ఏవైనా వ్యసనములై ఉండవచ్చును. కానీ, దేవుడు వాటన్నిటిని మీకు ఆశీర్వాదకరముగా మార్చుచున్నాడు.
నా ప్రియులారా, సాధారణముగా, "అతని తండ్రి మద్యము త్రాగేవాడు కనుకనే, కుమారుడు కూడా త్రాగుచున్నాడు అని అంటారు. మరియు అతని తండ్రి జూదము ఆడేవాడు, కనుకనే, ఇతను కూడా జూదము ఆడుచున్నాడు అని అనేవారు.'' అయితే, నా స్నేహితులారా, నేడు మీ నుండి ఆ శాపము విరిచివేయబోవుచున్నాడు, దానిని ఆశీర్వాదముగా మార్చబోవుచున్నాడు. అది మీ నుండి మార్పు రాబోవుచున్నది. మీరు మీ పిల్లలకు ఆ శాపములను మోసుకొని వెళ్లరు. నేడు ప్రభువు మీ జీవితములో ఆ మార్పును కలిగించబోవుచున్నాడు.
జాన్ ఓ'లియరీ అనే వ్యక్తికి సంబంధించిన ఒక కథ ఈలాగున ఉన్నది. అతనికి కేవలము 8 లేక 9 సంవత్సరములో వయస్సులో అతడు తన యింటిలో అగ్గిపెట్టెతో ఆడుకునేవాడు. అనుకోకుండా దురదృష్టవశాత్తు, గ్యారేజీ మొత్తం అంటుకుని కాలిపోయింది. తద్వారా, తన శరీరమంతా తీవ్రమైన గాయలతో నిండిపోయినది. కనుకనే, వైద్యులు, ' కేవలము ఒక్క శాతము మాత్రమే అతడు బ్రతుకుటకు అవకాశము ఉన్నది' అని చెప్పారు. అయితే, అతని జీవితములో ఒక అద్భుతమును జరిగించాడు. ప్రభువు అతనిని తాకి, తనను స్వస్థపరచియున్నాడు. కాబట్టి, అతడు ఒక ఆరు లేక ఏడు నెలలో అతడు పునరావాసములో ఉన్న తర్వాత, అతను నెమ్మదిగా కోలుకున్నాడు. ఇప్పుడు వివాహము జరిగి, దేశమంతయు తిరుగుతూ, చక్కగా ఉపన్యాసములు ఇచ్చుచున్నాడు. అవును, నా ప్రియులారా, ఈ శాపములు మిమ్మును క్రిందికి నెట్టివేయుటకు ప్రయత్నించవచ్చును. మీ కుటుంబమును నశింపజేయుటకు ప్రయత్నించవచ్చును. మీ జీవితములోని ఆశీర్వాదములన్నిటిని అడ్డుకోవడానికి ప్రయత్నించవచ్చును. కానీ, ప్రభువు, "మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటె గొప్పవాడు'' అని అంటున్నాడు. కనుకనే, నా ప్రియులారా, ప్రభువు మీ యొక్క శాపములను ఆశీర్వాదములుగా మారుస్తాడు. ప్రభువు మీ యొక్క శాపములన్నిటిని మీ పైన దీవెనలుగా మార్చుచున్నాడు. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా యొక్క ప్రతి శాపమును ఆశీర్వాదంగా మార్చగలవని మేము నమ్ముచున్నాము. దేవా, మా యొక్క శాపములన్నిటిని నీవు ఆశీర్వాదముగా మార్చబోవుచున్నందుకును మరియు శాపములన్నిటిని విరిచివేయుచున్నందుకై నీకు వందనములు. దేవా, నీ బిడ్డలైన మా కొరకు మరియు మా కుటుంబము కొరకు నీవు మా యొక్క శాపములను ఆశీర్వాదముగా మార్చుచున్నావని మేము నమ్ముచున్నాము. యేసయ్యా, నీ యొక్క అధికారము చేత, ఇక మా కుటుంబాలలోను, మా తరతరములలోను శాపములు ఉండకుండా, ఆశీర్వాదముగా మార్చుము. ప్రభువా, నీ కాపుదల మరియు నీ కంచె, మా చుట్టును మరియు మా కుటుంబముల చుట్టును ఉండునట్లుగా చేయుము. దేవా, తరతరాల శాపములన్నియు నీ నామమున విరిచివేయునట్లుగా సహాయము చేసి, ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగుతున్న ప్రతి వ్యసనపు అలవాటును, ఇంటర్‌నెట్‌లో చూచే వ్యసనాల నుండియు మరియు ప్రతి హానికరమైన ప్రభావాన్ని విచ్ఛిన్నం చేసి, వాటన్నిటి నుండి మమ్మును మరియు మా పిల్లలను, మా తరములను కాపాడుము. యేసయ్యా, మా పితరుల యొక్క శాపము నుండి మా పిల్లలను, మా కుటుంబములను మరియు సాతాను యొక్క ప్రతి దుష్ట ప్రణాళిక నుండి మమ్మునుకాపాడుము. దేవా, శాపముతో నిండియున్న మా గృహాములను నీ యొక్క సన్నిధితో నింపి, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదమును పొందుకొనునట్లుగా చేయుము. ప్రభువా, మాకు వ్యతిరేకంగా పలుకబడిన ప్రతి శాపమును దీవెనగా మార్చుము. ప్రభువా, మద్యపానం, జూదం మరియు ప్రతి అనారోగ్యకరమైన వ్యసనం నుండి మమ్మును నీ శక్తిచేత విడిపించుము. దేవా, మా చుట్టూ నీ రక్షణ కంచెను ఉంచి, నీ మార్గాలలో మమ్మును నడిపించుము. ప్రభువా, మా జీవితాలలో ఆశీర్వాదాలు పొంగిపొర్లునట్లుగాను, అవి మా పిల్లల జీవితాల ద్వారా కొనసాగునట్లుగా చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


