నా ప్రియ స్నేహితులారా, ఈ రోజున మీకు శుభములు తెలియజేయుటలో నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 147:3వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు'' అని చెప్పబడినట్లుగానే, దేవుడు మీ గాయములను కట్టవలెనని మీ పట్ల కోరుచున్నాడు. ఒకవేళ, ఈ రోజు మీరు హృదయము విరిగిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? లేక అనారోగ్య పరిస్థితులలో మీరు ఉన్నారా? అనారోగ్యము మరల మరల మా యొద్దకు వచ్చుచున్నది అని అంటున్నారా? నేను ఎంతగా వైద్యము చేయించుకున్నను, ఆ రోగము అస్సలు తగ్గటము లేదు. అందును బట్టి మీరు విరిగిపోయిన స్థితిలో ఉన్నారా? లేక బలహీనమైన స్థితిలో ఉన్నారని మీరు భావించుచున్నారా? ఈ రోజు ప్రభువు అంటున్నాడు కదా, 'మీ విరిగిన హృదయమును ఆయన బాగు చేస్తాడు మరియు మీ గాయములను కడతాడు.' కాబట్టి, ధైర్యముగా ఉండండి.
నా ప్రియులారా, మీ గాయములన్నిటిని ఆయన కడతాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థతను పొందియున్నారు. కనుకనే, యేసయ్య, మీ కొరకు సిలువలో గాయాలపాలైయ్యాడు. ఇప్పుడు మీరు అనుభవించుచున్న నొప్పి ఆయనకు తెలుసు, మీ యొక్క శరీరములో మీరు ఎంత బలహీనతను అనుభవించుచున్నారని ఆయనకు తెలుసు. మీ భవిష్యత్తును గురిం చిన భయము మీ హృదయములో పట్టి పీడించుచున్నదని ఆయనకు తెలుసు. ఈ రోజు ఆయన మిమ్మును స్వస్థపరచి, నూతనమైన వారినిగా మార్చబోవుచున్నాడు. కనుకనే, మీరు చింతించకండి.
ప్రియ సహోదరుడైన సురేష్ యొక్క జీవితములో అదే జరిగియున్నది. కాకినాడ పట్టణము నుండి అతడు తన సాక్ష్యమును ఇలాగున పంచుకొనియున్నాడు. వైద్యులు, 'అతనికి గొంతులో క్యాన్సర్ వచ్చియున్నదనియు మరియు నీవు నీ యొక్క స్వరతంతులను కోల్పోవచ్చును' అని చెప్పియున్నారు. మేము ఆఫరేషన్ చేసి, ఈ క్యాన్సర్‌ను తొలగించాలని చెప్పాడు. ఈ విషయము వినగానే, అతని హృదయము విరిగిపోయినది. తద్వారా, 'నా స్వరమును పూర్తిగా కోల్పోతాను' అని అతడు ఎంతగానో భయపడ్డాడు. ఆ తర్వాత, అతడు రెండు శస్త్రచికిత్సలను చేయించుకున్నాడు. ఆ తర్వాత కూడా క్యాన్సర్ వ్యాధి అతనిని విడిచిపెట్టలేదండి. తన భవిష్యత్తును గురించి అతడు ఎంతగానో భయముచేత వేదన పడుచుండేవాడు. శారీరకంగాను, మానసికంగాను ఎంతగానో బలహీనుడైపోయాడు. అతను విరిగిపోయిన స్థితి లో ఉండేవాడు. భయకంపితుడుగా అతడు ఎప్పుడు ఉండేవాడు. అటువంటి పరిస్థితులలో అతడు యేసు పిలుచుచున్నాడు మాస పత్రికను అందుకున్నాడు. ఆ పత్రికలో, "నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే'' అని వ్రాయబడియున్నటువంటి వాక్యమును అతను చదివియున్నాడు. ఆ వాక్యమును అతడు ఎంతో గట్టిగా పట్టుకున్నాడు. ఆ వాక్యము అతనికి గొప్ప ఆదరణను కలుగజేసినది. ఆ తర్వాత, బేతెస్ద ప్రార్థనా కేంద్రములో జరుగుచున్నటువంటి ప్రార్థనా కూడికకు హాజరయ్యాడు. ఆ కూటములో మా తండ్రిగారైన డాక్టర్. పాల్ దినకరన్‌గారు అక్కడికి వచ్చిన వారికందరికి వ్యక్తిగతంగా ప్రార్థించుచున్నారు. అతను కూడా అక్కడకు వెళ్లి చేరాడు. మా నాన్నగారితో కలిసి అతడు కూడా వ్యక్తిగతంగా ప్రార్థించుకున్నాడు. వెంటనే, తన యొక్క హృదయములో ఒక గొప్ప సమాధానమును అతడు అనుభూతి చెందాడు. తద్వారా, దేవుని యొక్క ఆదరణను అతడు పొందుకొనియున్నాడు. ఆ తర్వాత, అతడు మరల వైద్యుల యొద్దకు వెళ్లి, స్కానింగ్ చేయించుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతమైన ఆశ్చర్యకార్యము జరిగియున్నది. తద్వారా, వైద్యులు ఎంతగానో ఆశ్చర్యపోయారు. కనుకనే, ఆ వైద్యులు, అతనిని చూచి, " నీ శరీరములో ఎటువంటి క్యాన్సర్ కణాలు లేవు'' అని చెప్పారు. అతడు అద్భుతముగా స్వస్థతను పొందుకొనియున్నాడు. అతను ఎంతగానో ఆనందముతో నింపబడియున్నాడు. అవును, "యేసు ప్రభువు నన్ను స్వస్థపరచు శక్తిగలవాడు'' అని చెప్పాడు.
అవును, నా ప్రియ స్నేహితులారా,ఈ రోజున అతడు పరిపూర్ణమైన స్వస్థతను పొందుకొని ఆనందించుచున్నాడు. అంతమాత్రమే కాదు, సంతోషముగా అతడు జీవించుచున్నాడు. నా ప్రియులారా, ప్రభువు మీ జీవితములో కూడా అటువంటి అద్భుతములను జరిగిస్తాడు. విరిగిన హృదయములో మీరు ఒకవేళ చూస్తున్నారేమో? 'ప్రభువా, మేము ఇక ఎంతకాలము శ్రమపడవలెనని మీరు అనుకుంటున్నారేమో? ఇక ఇదేనా నా పరిస్థితి అని మీరు అడుగుచున్నారేమో? నేను ఈలాగున అవ్వడానికి నేను ఏ పాపము చేసియున్నాను అని అనుకుంటున్నారేమో?' అయితే, ప్రభువు ఈలాగున మిమ్మును చూచి అంటున్నాడు, 'ఈ రోజు మీ యొక్క విరిగిన హృదయమును నేను బాగుచేస్తాను ' అని వాగ్దానము చేయుచున్నాడు. ప్రియులారా, ఈ రోజు మీ గాయములన్నిటిని ప్రభువు కట్టబోవుచున్నాడు. ఒకవేళ, ఇది అసాధ్యము అని వైద్యులు మీతో చెప్పుచుండవచ్చును. కానీ, అసాధ్యమైన వాటన్నిటిని సాధ్యపరచుటకు మన యేసయ్య శక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి, ఈ రోజు మీరు ఆయనయందు విశ్వసించండి. ఆయన యొక్క ఆదరణను పొందుకొనండి. మీ జీవితములో ఆయన అనుగ్రహించు బలమును మీరు పొందుకొనండి. ఒకవేళ, మీరు విరిగిన పోయిన మరియు పగిలిపోయిన స్థితిలో మీరు ఉండవచ్చును. మీరు మీ శరీరములో ఎంతగానో బలహీనపడియుండవచ్చును? మీ యొక్క రోగము మిమ్మును సజీవముగా తినివేయుచుండవచ్చును. మీ యొక్క బలమంతటిని అది తీసివేయుచుండవచ్చును. ఈ రోజు మీరు నిస్సహాయ స్థితిలో ఉండవచ్చును. ఆయన సంపూర్ణంగా మిమ్మును స్వస్థపరుస్తాడు. విశ్వసించుచు మీరు ప్రార్థన చేయండి. చెందరిన మీ గుండెను ఆయన బాగు చేస్తాడు మరియు మీ గాయములను కడతాడు. ప్రభువు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా యొక్క విరిగిన హృదయమును నీ గాయముల ద్వారా బాగుచేయుము. దేవా, మేము ఈ రోజు నిస్సహాయస్థితిలో ఉన్న మమ్మును, నీ స్వస్థతా శక్తిని మాలోనికి పంపించి, మాకు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించుము. దేవా, మా జీవమును, మా శరీరములోనికి ప్రవహించునట్లుగా చేయుము. ఇప్పుడే దేవా, మాకు పరిపూర్ణమైన స్వస్థతను దయచేయుము. యేసయ్యా, మా శరీరములోనికి నీ స్వస్థతా శక్తిని మరియు నీ యొక్క జీవమును మాకు అనుగ్రహించుము. దేవా, మా యొక్క మనస్సులను నీ యొక్క జీవముతో నింపుము. ప్రభువా, మా హృదయములో నీ జీవమును దయచేయుము. యేసయ్య, నీవు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థతను అనుగ్రహించుము. దేవా, నీ యొక్క స్వస్థపరచు హస్తముతో మమ్మును తాకి, మా గాయములను కట్టి, మాకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించుము. ప్రభువా, మేము నీ యందు విశ్వాసముంచి, నీ యొక్క స్వస్థతను పొందుకొనుటకు మాకు అటువంటి కృపను దయచేయుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


