నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి హగ్గయి 2:19వ వచనమును తీసుకొనబడినది. ఇది మన కొరకు దేవుడు గొప్ప సంగతిని వాగ్దానము చేయుచున్నాడు. ఆ వచనము, "...అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను'' ప్రకారం ఇది ఎంత గొప్ప ప్రోత్సాహమును మనకు కలిగించుచున్నది కదా! హగ్గయి మరియు ఈ అధ్యాయము యొక్క గత చరిత్రను మీరు చూచినట్లయితే, ఇశ్రాయేలీయుల ప్రజలు తమ యొక్క హృదయములో దేవునికి అక్కడ స్థలము ఇవ్వని వారుగా ఉండియున్నారు. ఈ హగ్గయి గ్రంథము యొక్క గత చరిత్రను మీరు చూచినట్లయితే, ఇశ్రాయేలీయుల ప్రజలు తమ హృదయములో దేవునికి చోటు ఇవ్వలేదు. కనుకనే, ఆయన వారిని చూచి, 'మీ హృదయములో స్థలము లేకుండా నేను ఎలాగున వచ్చి మిమ్మును ఎలాగున దీవించగలను 'అని అంటున్నాడు. వారిని చూచి ప్రభువు ఎంతో నిరాశ చెందియుండెను. అందుచేతనే, వారి యొక్క కొట్లలలో ధాన్యముండకపోయినను, మీ ద్రాక్షచెట్లు ఎండిపోయినను, అంజూరపు చెట్లు వాడిపోయినను, దానిమ్మచెట్లయినను ఒలీవచెట్లయినను ఎండిపోయినట్లుగా ఉన్నవి. అవి ఫలములు ఫలించకపోయెను గదా. కానీ, మీరు మీ హృదయమును నాకిచ్చి యున్నప్పుడు, "అయితే ఈ దినము మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. నేను మీ హృదయములోనికి వచ్చెదను. నేను ఐశ్వర్యవంతముగా మిమ్మును ఆశీర్వదించెదను''అని సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు కలవరపడకండి. మీరు ప్రభువునందు ఆనందించండి.

అదేవిధముగా, బైబిల్‌లో పేతురు జీవితములో ఆలాగుననే జరిగించి యున్నాడు. పేతురు తనే స్వయంగా తన పనినంతటిని చేయుటకు ప్రయత్నించాడు. స్వతహాగా జీవించడానికి మరియు ఆశీర్వాదకరముగాను ఫలభరితముగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ, అదంతయు ఎండిపోయినది. అతడు చేపలు పట్టు జాలరీగా ఉండియు కూడా ఒక చేపను కూడా పట్టలేకపోయాడు. అతనికి అదృష్టమే లేదు. అతడు ఎంతగా ప్రయాసపడినప్పటికిని, అతనికి ప్రతి ఫలము దొరకలేదు. కానీ, యేసు అతని యొద్దకు వచ్చాడు. అతనిని చూచి, ' పేతురు నీ హృదయమును నాకిమ్ము, నీ దోనెను నాకిమ్ము, నీ జీవితాన్ని నాకివ్వు పేతురు, నీవు నన్ను వెంబడించుము, నేను నిన్ను ఫలభరితముగా చేయుదును, అనేకమైన చేపలు పట్టడములో ఫలభరితముగా నిన్ను చేయుదును. దేవుని రాజ్యమునకు అనేక మంది మనుష్యులను పట్టు జాలరిగాను, ఫలభరితముగాను చేయుదునని సెలవిచ్చాడు.' ఆలాగుననే, దేవుడు పేతురును ఆశీర్వదించి, ఏమి లేని స్థాయి నుండి అతనిని ఫలభరితముగా చేశాడు. అదే మన యొక్క గురి మరియు గమ్యము కూడా కనుకనే, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, కనుకనే, ఈ రోజు మొదలుకొని దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు కాబట్టి, మీ హృదయములను ఆయనకు సమర్పించుకున్నట్లయితే, నిశ్చయముగా, ఆయన పేతురు యొద్దకు వచ్చినట్లుగానే, ఆయన మీ యొద్దకు వచ్చి, మిమ్మును ఫలభరితముగా మారుస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరముగా మిమ్మును మారుస్తాడు. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. ప్రభువా, ఈ రోజు నుండి మమ్మును ఆశీర్వదిస్తానని నీవు మా కిచ్చిన వాగ్దానానికై వందనాలు. దేవా, మా హృదయాన్ని ఇప్పుడు నీకు తెరచుచున్నాము, మా హృదయంలో నీకు పూర్తి స్థానం ఇవ్వకుండా మేము జీవించిన కాలాన్ని బట్టి మమ్మును క్షమించుము. ప్రభువా, మా హృదయంలోనికి రమ్ము, దానిని నీకు నివాసంగా చేసుకొనుము. దేవా, నీవు పేతురు ఖాళీ వలలను పొంగిపొర్లుతున్న సమృద్ధి దోనెలనుగా మార్చినట్లుగానే, నేడు మా జీవితాన్ని, మా ప్రయత్నాలను, మా పోరాటాలను, మా కుటుంబాన్ని తీసుకొని నీ ఆశీర్వాదాన్ని మేము పొందుకొనునట్లుగా చేయుము. ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి, నిన్ను హృదయపూర్వకంగా అనుసరించడానికి మరియు లోబడి ఉండడానికి మమ్మును నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మాలో ఫలప్రదత మరియు అనుగ్రహం ప్రవహించునట్లుగా చేయుము. యేసయ్యా, ఈ రోజు నుండి, నీ ఆశీర్వాదం మా మీదికి దిగివచ్చునట్లుగా చేయుము. ప్రియమైన ప్రభువా, మేము శ్రేష్టముగా ప్రయత్నించాము. స్వయంగా జీవించుచు, మేము సమస్తమును చేయగలము అని ఆలోచనతో జీవించాము. మేము ప్రతిరోజు నిన్ను వెదకనవరసము లేదన్నట్లుగాను, నీ సహాయము మాకు అక్కరలేదు అన్నట్టుగా, మా జ్ఞానము మమ్మును రక్షిస్తుందన్నట్టుగాను ప్రయత్నించాము. కానీ, ప్రభువా, అవన్నియు మమ్మును పతనము చేశాయి. ఈ రోజు ఆశీర్వాదము లేదు, బహుమానము లేదు, ఏ సంతోషము లేదు, మేము ఏమి శాంతిలేనివారముగా మిగిలిపోయాము. ప్రభువా, మా హృదయాలను నీకు సమర్పించుకొనుచున్నాము, నీవు మా వైపు చూడుము. దేవా, నీ ఆశీర్వాదములను మా జీవితములోనికి ప్రవాహముగా పొర్లి మా యొద్దకు వచ్చునట్లుగా చేయుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.