నా ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలమున మరియు ఈ రోజును మీకు శుభములు తెలియజేయుటలో నాకెంతో సంతోషముగా ఉన్నది. నేటి వాగ్దానముగా బైబిల్ నుండి రోమీయులకు 5:5వ వచనము తీసుకొనబడినది. ఆ వచనము, "ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది'' అని చెప్పబడినట్లుగానే, దేవుని యందు మనము నిరీక్షణను కలిగియుండాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. అనేకసార్లు మన జీవితములో కష్టాలు ఎదురైనప్పుడు మనము దేవుని పట్ల నిరీక్షణను కలిగియుండడము అసాధ్యము. ఆ తర్వాత, మనము ఏమి చేయాలో తెలియని పరిస్థితులు ఎదురగుచుండవచ్చును. అయితే, ప్రజలు మీ యొద్దకు వచ్చి, మీ జీవితములో ఏమి జరుగుచున్నది? అని అడగవచ్చును. తర్వాత, ఏమి చేయబోవుచున్నారు అని అడగవచ్చును? ఇది ఇంకా మీ జీవితములో జరగలేదు అని అడగవచ్చును? మీరు అద్భుతము కొరకు దేవుని నమ్మియున్నావు కదా! మరి ఎక్కడ ఆ అద్భుతము జరగలేదు అని మిమ్మును ప్రశ్నించవచ్చును? అనేకసార్లు ప్రజలు మిమ్మును బాధపెట్టుచుండవచ్చును. వారు మిమ్మును త్రోసివేయచుండవచ్చును. అటువంటి పరిస్థితులలో నిరీక్షణ కలిగయుండడము అసాధ్యముగా ఉండవచ్చును. మన జీవితములో దేవుని యొక్క ప్రణాళికలను అర్థము చేసుకోవడము కష్టముగా ఉండవచ్చును.

అయితే, నా ప్రియులారా, ప్రజలు మన యొక్క జీవితములో వారి యొక్క సమయములను పాటించాలి అని కోరుకుంటారు. కానీ, సరైన సమయములో దేవుడు మనలను హెచ్చించుటకు ప్రణాళిక చేయుచున్నాడు. అయితే, ప్రభువునందు నిరీక్షణ కలిగియుండడము ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. బైబిల్ గ్రంథములో యోసేపును గురించి ఆలోచించండి. ప్రభువు అతనికి కలలను మరియు దర్శనములను ఇచ్చియున్నాడు. ఉన్నతంగా హెచ్చింపబడుటను గురించి, అతనికి అవి చాలా పెద్దవి. అయితే, అతని జీవితములో ఆ కలకు వ్యతిరేకముగా అన్ని విషయాలు జరిగాయి. అతని ఒక గుంటలో పడవేయబడ్డాడు. అతని స్వంత అన్నలే అతనిని ఎంతగానో ద్వేషించారు. తనను బానిసత్వములోనికి అతనిని అమ్మివేశారు. అతడు దూరదేశములో చెరసాలలో వేయబడ్డాడు. అతనికి వచ్చిన కలకు మరియు అతని జీవితమునకు సంబంధము లేదు. అయినప్పటికిని, ప్రభువునందు నిరీక్షణ ఉంచడము మానివేయలేదు. అతని హృదయము రాయిగా మారిపోలేదు. దేవుడు తన ప్రేమను అతని మీద కుమ్మరించుచునే ఉన్నాడు. సరైన సమయములో అతనిని బాధపెట్టిన ప్రజలపైన పరిపాలన చేయు అవకాశమును అతనికి దేవుడు అనుగ్రహించాడు. కానీ, దేవుడు అతనిని శక్తిగల స్థానములో నిలబెట్టాడు. ప్రభువు తన సమయములో వీటన్నిటిని జరిగింపజేసియున్నాడు. ఎందుకనగా, యోసేపు నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగియున్నాడు.

యోసేపును నిరాశపరచిన తన అన్నలు అతనికి ముఖాముఖిగా ఎదురైనప్పటికిని, అతనిని బాధ, చేదు, అధిగమింపబడానికి అతడు అవకాశమివ్వలేదు. బాధను అధిగమించడానికి అవకాశము అతడు ఇవ్వలేదు. అయితే, దేవుని ప్రేమ చేత వారికందరికి సేవ చేశాడు. యోసేపు ఈ విధంగా అనగలిగాడు, " మీరు నాకు కీడుచేయ నుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను'' అని అన్నాడు. అయితే, అతని అన్నలు తనకు హాని కలుగజేయాలన్న నిజమును అతడు దాచిపెట్టలేదు గానీ, దేవుడు తన హృదయములో పనిచేయడానికి యోసేపు అనుమతించాడు. నా ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క హృదయానికి దేవుని ప్రేమ చేయగలిగినటువంటి అద్భుతము అదియే. దేవుని యందు మనము నిరీక్షణ ఉంచడానికి ఆ ప్రేమ మనకు సహాయపడుతుంది. దేవుని ప్రేమ చేత మనము నింపబడడానికి సహాయపడుతుంది. దేవుని యందు విశ్వసించడానికి సహాయపడుతుంది.

నా ప్రియులారా, దేవుని ప్రేమ మన జీవితములో ఆయన యొక్క ప్రణాళికలకు, ఆయన యొక్క సమయమును నమ్మడానికి ఉపయోగపడుతుంది. నా స్నేహితులారా, ఈ రోజు దేవుని యందు నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగండి. నేడు మీ పరిస్థితి ఏవిధంగా ఉన్నప్పటికిని, "యెహోవా యందు నిరీక్షణగలవారు ఎన్నటికిని సిగ్గునొందరు '' అని చెప్పబడినట్లుగానే, కాబట్టి, ధైర్యమును వహించండి. ప్రభువు యొక్క ప్రేమ నేడు మిమ్మును నింపబోవుచున్నది. ప్రభువు మీలో ఉన్నటువంటి బాధను, చేదునంతటిని తొలగించబోవుచున్నాడు. నా ప్రియులారా, మీ యొక్క ప్రతి బాధను తొలగిస్తాడు. మీ యొక్క ప్రతి నిరాశను తొలగిస్తాడు. మీలో ఉన్న ప్రతి విరిగిపోయిన స్థితిని తొలగిస్తాడు. తన ప్రేమతో మిమ్మును దీవిస్తాడు. కాబట్టి, ఈ రోజు ధైర్యమును తెచ్చుకొనండి, ప్రోత్సహించబడండి. ప్రభువు మీ జీవితము పట్ల గొప్ప ప్రణాళికలను కలిగియున్నాడు. సరైన సమయములో వాటిని ఆయన జరిగిస్తాడు. కనుకనే, ఆయనకు వందనములు చెల్లించి మీ కార్యములను కొనసాగించండి. దేవుడు నేటి వాగ్దానము నుండి మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగలిగిన మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, నీ యొక్క అద్భుతమైన వాగ్దానమును బట్టి నీకు వందనములు. ప్రభువా, నీ బిడ్డలమైన మేము నీ నామమునందు నిరీక్షణ కలిగియుండగా మేము ఎన్నటికిని సిగ్గుపరచబడకుండా మమ్మును కాపాడుము. యేసయ్యా, మా పరిస్థితులు మేము ఊహించినదానికి భిన్నంగా ఉన్నప్పటికీ, నీ ప్రణాళికలను మరియు నీ పరిపూర్ణ సమయాన్ని విశ్వసించడానికి మాకు సహాయం చేయుము. దేవా, మా యొక్క ప్రయత్నములన్నిటిని ఆశీర్వదించుము. ప్రభువా, నీవు మాకు చూపెట్టుచున్న నిర్దేశములన్నిటి మేము విధేయత చూపునట్లుగాను, నీ యందు మాత్రమే మేము విశ్వసించునట్లుగా నీ యొక్క ప్రేమతో మమ్మును నింపుము. దేవా, మా యొక్క ప్రతి బాధను మరియు ప్రతి విరిగిపోయిన స్థితిని మా నుండి తొలగించుము. ప్రభువా, మా యొక్క ప్రతి ఒంటరితనమును మరియు ప్రతి నిరాశను తొలగించుము. యేసయ్యా, మా హృదయమును నీ యొక్క దైవీకమైన ప్రేమతో మరియు షరతులు లేని ప్రేమతో నింపబడునట్లుగా చేయుము. దేవా, మా ప్రతి విషయమును నీ కృపతోను మరియు నీ యొక్క జ్ఞానముతో మేము చేయునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మా జీవితములో నీ ప్రణాళికలు జరుగబోవుచుండగా, నీకే మేము సమస్త మహిమను చెల్లించునట్లుగా మేము దీనత్వమును కలిగియుంటూ, ఇతరులైన అనేకులకు మేము ఆశీర్వాదకారకులుగా ఉండునట్లుగా మాకు కృపను దయచేయుము. దేవా, మేము నీ యొక్క ఆజ్ఞలను వెంబడించుచూ, నిన్ను సంపూర్ణంగా విశ్వసించే మా ప్రయత్నాలన్నింటిని ఆశీర్వదించుము. యేసయ్యా, నీ నామమునందు నిరీక్షణ కలిగియుండగా, మేము నీ యందు విశ్వసించుచున్న మమ్మును నీవు ఘనపరచుమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.