నా ప్రియమైన స్నేహితులారా, మీతో కలిసి నేటి దినమున వాగ్దానము స్వీకరించడము నాకు ఎంతో సంతోషముగా ఉన్నది. మనము స్వీకరించి, కలిసి ప్రార్థించుకుందాము. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 16:13వ వచనమును నేడు మనము ధ్యానించుకొనబోవుచున్నాము. ఆ వచనము, "నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు'' అని చెప్పబడినట్లుగానే, మనము నీతిగా జీవించాలని ప్రభువు మన పట్ల కోరుచున్నాడు. మనము ఎల్లప్పుడు నీతిని మాత్రమే పలుకవలెను.

ఒక దేశములో ఉండియున్న మంత్రి ధనార్జనము కోసమై అక్రమమైన విధానములన్నిటిని కూడా అనుసరించుచుండేవాడు. తద్వారా, ప్రజలను ఎంతగానో బాధించి, వారిని ఒత్తిడికి గురిచేసి, వారి యొద్ద నుండి ధనార్జనము చేయుచుండెను. ధనమును సంపాదించుట కొరకు అక్రమమైన విధానములను, వ్యాపారములను అనుసరించేవాడు. నిస్సహాయుల దగ్గర నుండి డబ్బును తీసుకోవడము కోసము, వారిని ఎంతగానో హింసించుచుండేవాడు. ప్రజలను తన పక్షము వైపు ఆకర్షించుకొనుట కొరకు తన యొక్క ప్రభావమును వినియోగించేవాడు. కనుకనే, అందరు అతనికి భయపడి, అందరు అతని పక్షమున చేరారు. తద్వారా, అతడు ఎంతో ప్రఖ్యాతి గడించాడు. అంతమాత్రమే కాదు, అతడు ఎంతో ధనమును సంపాదించుకున్నాడు. ఇంకను, పేరు ప్రఖ్యాతులు గడించాడు. చాలా సంపాదనను కలిగినవాడుగా ఉండెను. అదియుగాక, అతడు రాజుగారి యొక్క స్థానము తాను పొందుకోవాలని సవాళ్లు విసురుటకు ప్రారంభించాడు. రాజు మాటున రాజుగారిని గురించి చెడుగా మాట్లాడడము ప్రారంభించాడు. రాజును క్రిందికి త్రోసివేసి, రాజు స్థానములో ఇతడు ఉండవలెనని తలంచాడు. కానీ, ప్రజల యెదుట రాజుగారిని గురించిన చెడు సంగతులన్నిటిని తెలియజేయుచుండెను. రాజు ఈ సంగతులన్నిటిని విన్న తర్వాత, ఈ మంత్రిగారి యొక్క ఖాతాలన్నిటికి సంబంధించిన లెక్కలన్నిటిని తీసుకొని రమ్మని అధికారులను పంపించాడు. ఈ మనిషి అనుసరించిన అక్రమ మార్గములన్నిటిని తెలుసుకోవాలని వారికి తెలియజేశాడు. అయితే, అధికారులు అతని యొక్క అక్రమ కార్యములన్నిటిని నమోదు చేసుకొని, ఒక పెద్ద పట్టికను తయారు చేసుకొని రాజు యొద్దకు తీసుకొని వచ్చారు. కానీ, ఇందుకు ఫలితంగా, రాజు అతనిని జీవిత ఖారాగార శిక్ష అన్నట్టుగా చెరసాలకు పంపించాడు. ఆలాగుననే, నేడు ప్రభువైన యేసు అత్యంత సమృద్ధితో మిమ్మును ఆశీర్వదించుచున్నాడు. ఆయన మీరు నిరంతరముగా నిలిచి ఉండు కృపను మీకు అనుగ్రహిస్తాడు.

నా ప్రియమైన స్నేహితులారా, మనకు కూడా ఇలాగున జరుగుతుంది. అవినీతిపరమైన అక్రమార్జనము ఎల్లకాలము అత్త్యున్నతమైన స్థితిలో ఉంచడబదడు. మనము ఎల్లకాలము అక్కడ కూడా నిలిచి ఉండలేము. చాలా గొప్పపాటు అన్నట్టుగా మనము అక్కడి నుండి పడిపోతాము. మనము నిజాయితీలో ఏదైతే, సంపాదించియున్నామో, అదే నిరంతరము నిలిచి ఉంటుంది. అందుకే ఈ వచనము చెబుతుంది, 'రాజులు దానికి ప్రియముగా ఉంటారు.' ఉన్నతాధికారులు మీ కంపెనీలో అందును బట్టి మిమ్మును ప్రేమిస్తారు. సమాజములో ప్రజలు కూడా ఇదిగో ఇతడు కూడా నమ్మదగిన వ్యక్తి అన్నట్టుగా మిమ్మును భావిస్తారు. కనుకనే, ధైర్యముగా ఉండండి.

నా ప్రియులారా, అన్నిటికంటె మిన్నగా నిజాయితీగల మీ పెదవులను బట్టి రాజులకు రాజైనవాడు మిమ్మును ఘనపరుస్తాడు. మీరు రాజు యొక్క ఆశీర్వాదములను సంపాదించుకుంటారు. ప్రభువైన యేసు మిమ్మును అత్యంత సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. ఆయన మిమ్మును నిరంతరము నిలిచియుండు అత్యున్నతమైన స్థానమునకు హెచ్చిస్తాడు. దేవుడు ఇచ్చు మహిమ మరియు బహుమానమను ఆశీర్వాదము నిరంతరము నిలిచి ఉంటుంది. అది మీకు ఆయనతో కూడా నిలిచి ఉండు గొప్ప సంతోషమును ఇచ్చుచున్నాడు. కనుకనే, నా ప్రియులారా, నిజాయితీగల హృదయమును మరియు పెదవులను కలిగియుండునట్లుగా మనలను మనము సమర్పించుకుందాము. నిజాయితీ గల గొప్ప రాజు మిమ్మును బట్టి సంతోషించుచున్నాడు. కనుకనే, నేటి వాగ్దానమును బట్టి దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువైన యేసయ్య, నీ దృష్టిలో యథార్థత అమూల్యమైనదని మాకు గుర్తు చేసినందుకు నీకు వందనములు. ప్రియమైన ప్రభువా, మా జీవితములో యథార్థతగల పెదవులను మరియు హృదయాలను కలిగి ఉండుటకు మాకు సహాయము చేయుము. దేవా, మేము ఉన్న చిన్న స్థానములో కూడా మరియు చిన్న కార్యములలో కూడా, ఎవ్వరు మమ్మును చూడకపోయినప్పటికిని, మేము నీ యెదుట భయభక్తులు కలిగి జీవించుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మేము ఎటువంటి తప్పు చేసినను, దేవుని ఆశీర్వాదములను పొందుకొనలేమన్న భావనను మేము గుర్తెరుగునట్లుగా మాకు సహాయము చేయుము. ప్రభువా, మాకు సత్యవంతమైన మరియు నిజాయితీగల ఆత్మను మాకు అనుగ్రహించుము. ప్రభువా, నీ నిమిత్తము యథార్థముగా ప్రవరించిన మమ్మును ఈ లోకము అన్యాయపు చూపు చూచినప్పటికిని, వారి చూపుల నుండి నీవు మమ్మును తప్పించుము. దేవా, ఏ నరుని యొక్క ఆంక్షలు మమ్మును ఆపుచేయకుండా చేయుము. ప్రభువా, రాజు ఇచ్చు బహుమానము ఈ రోజు మా యొద్దకు దిగివచ్చునట్లుగా మరియు నిత్యము నిలిచియుండు బహుమానము మా మీదికి వచ్చునట్లుగా చేయుము. దేవా, ప్రజలందరి యెదుట మమ్మును ఘనపరచుము. ప్రభువా, మా జీవితంలోని ప్రతి విషయంలో, బహిరంగంగా గానీ లేదా ఒంటరిగా గానీ, మేము యథార్థంగా నడుచుకోవడానికి సహాయం చేయుము. దేవా, ప్రతి అబద్ధపు ఆలోచన, మాట మరియు క్రియ నుండి మమ్మును కాపాడుము. ప్రభువా, ఎవరూ చూడనప్పుడు కూడా, నీ యందు మేము భయభక్తులతో జీవించునట్లుగా మాకు కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.