నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, మీకందరికి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేయుచున్నాను. ఈ రోజు యేసయ్యను సంబరముగా జరుపుకోండి. అందుకే నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కీర్తనలు 87:7వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, ‘‘పాటలు పాడుచు వాద్యములు వాయించుచు, మా ఊటలన్నియు నీయందే యున్నవని వారందురు’’ ప్రకారము ఇశ్రాయేలీయుల దేశములో సంగీతమునకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. ఎందుకనగా, వారు కలిగియున్న దేవుని పట్ల భక్తిని మరియు సంతోషమును వ్యక్తపరచడానికి వారు సంగీతమును ఉపయోగిస్తారు. మేము అక్కడికి వెళ్లినప్పుడు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు పాటలు పాడుచు, నాట్యము చేయుచు, దేవుని స్తుతించడానిని మేము చూచియున్నాము. అక్కడ వారు వివిధ రకముల వాద్యములను ఉపయోగిస్తుంటారు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ ప్రార్థనా గోపురమునకు వచ్చి దేవుని ఆరాధిస్తారు, వారు వాయిద్యము వాయించుచు, నాట్యము చేయుచూ, సంగీతములతో దేవుని స్తుతించెదరు. అక్కడ ప్రార్థన గోపురములో ఐరన్ అను ఒక సహోదరి తన వీణెను తీసుకొని వచ్చి, ఆ వీణె వాయిస్తూ, దేవుని ఆరాధిస్తూ ఉండెను. తను ఆ వీణెను వాయిస్తూ ఉండగా, అనుకోకుండా, మేము ఒక్కసారి ఆ ప్రార్థన గోపురమునకు వెళ్లినప్పుడు నా భర్త ఆ సహోదరి వీణెను వాయించుట చూశారు. ఆమె ఆ వీణెను ఆపివేసినప్పుడు, మీరెందుకు ఆపివేశారు, మరల వాయించండి అని అడిగారు. మీ సంగీతాన్ని వినడము మాకు ఎంతగానో సంతోషాన్ని కలిగించినది అని ఆయన చెప్పారు. మీ సంగీతాన్ని వింటుండగా, మాకు ఎంతో ఆనందాన్ని తీసుకొని వచ్చినది అని ఆయన మరల చెప్పారు. అవును, నా ప్రియ స్నేహితులారా, యెరూషలేములో ప్రజలు పాటలు పాడుచు వాద్యములు వాయించుచు, దేవుని నాట్యముతో స్తుతించుచూ, ‘మా ఊటలన్నియు నీ యందే యున్నవని వారు అన్నారు.’ ఇశ్రాయేలీయులలోని దేవుని ఆలయములో వాయిద్యములు వాయించువారు ఎంతో ప్రాముఖ్యమైన పాత్రను పోషించుచున్నారు.
దావీదు దేవుని మందిరములో వాయిద్యములు వాయించేవారిని ఎంపిక చేసుకొని ప్రతిష్టించాడు. రోజులోని 24 గంటల సేపు దేవుని ఆరాధించాలని అతడు ఆలాగున చేసియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, సంగీతము మన హృదయానికి ఎంతో సంతోషాన్ని చేకూరుస్తుంది. దావీదు రాజైన సౌలు యెదుట తన వీణెను వాయించుచున్నప్పుడు, సౌలు ఆ దుష్టాత్మ నుండి విడుదల నొంది, స్వేచ్ఛను పొందియున్నాడు. సంగీతము ప్రజలను స్వస్థపరచడానికి కూడ వాడబడుతుంది. దేవుని ఆరాధించడానికి సంగీతము ఉపయోగించబడుతుంది. అవును, నా ప్రియస్నేహితులారా, దేవుని స్తుతించుటకు మిమ్మును మీరు సమర్పించుకొనండి, దేవునితో మీకున్న నిజమైన సంబంధము నుండి సంతోషము బయలు వెళ్లుతుంది. అందుకే బైబిల్ నుండి సంఖ్యాకాండము 21:17వ వచనములో చూచినట్లయితే, ‘‘అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి బావీ ఉబుకుము. దాని కీర్తించుడి బావీ; యేలికలు దాని త్రవ్విరి’’ అని ఇశ్రాయేలీయుల ప్రజలు ఈ విధంగా పాట పాడారు. వారు ఆ విధంగా పాట పాడుచుండగా, ప్రభువు వారి మధ్యన ఉదయించెను. ఆనందపు ఊటలు వారి మధ్య నుండి బయలు వెళ్లియున్నవి.
అదేవిధముగా, నేడు మన యేసు ప్రభువు, మన యొక్క స్వంత ఆనందపు ఊటకు ఆధారమై యున్నాడు. బైబిల్ నుండి యోహాను 4:14వ వచనములో చూచినట్లయితే, యేసు ప్రభువు, ‘‘నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పి గొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను.’’ ఈ వచనము ప్రకారము దేవుని కొరకు ఒకరు కలిగియున్నటువంటి దప్పికను జీవజలములు తృప్తిపరుస్తాయి. ప్రభువైన యేసయ్య ఇచ్చు ఈ జీవజలములు మనలో ఉబుకుతాయి. అవి ఎల్లప్పుడు ప్రవహించుచునే ఉంటాయి. అంతమాత్రమే కాదు, అవి మనలో ఎల్లప్పుడు నుండి ఊరెడు నీటి బుగ్గగా ఉంటాయి. నిత్యజీవమునకై మనలో ఊరెడి నీటి బుగ్గగా అవి ఉంటాయి. అవును, నా ప్రియ స్నేహితులారా, యేసులో నుండి జీవము ప్రవహిస్తుంది. యేసయ్య, నిత్యజీవపు ఊటయై యున్నాడు. యేసయ్యలోనే మనము జీవిస్తాము, చలిస్తాము, ఉనికిని కలిగియుంటాము. యేసులోనే మనము ఉండియున్నాము. యేసులోనే నిత్యజీవమును కలిగించు సంతోషపు ఊటలు కలవు. మన ఆశీర్వాదములన్నిటికిని కారణము ఆయనే అయి ఉన్నాడు. ఈ రోజు ప్రభువు మీ యందు మాత్రమే నిత్యజీవపు ఊటగా ఉండును గాక. జీవపు ఊటలు మీలో నుండి ప్రవహించును గాక. ఈ రోజు దేవుడు మీకు క్రిస్మస్ యొక్క సంతోషమును అనుగ్రహించబోవుచున్నాడు. ఇప్పుడు కూడా ప్రభువు అదే ఆనందముతో మిమ్మును నింపునట్లుగా దేవునిలో సంతోషించండి. ఆయనను మీ హృదయములోనికి ఆహ్వానించండి, అప్పుడు సంపూర్ణ సంతోషముతో ప్రభువైన యేసు మీ హృదయములో జన్మించును గాక. నేటి వాగ్దానము నుండి దేవుడు మిమ్మును దీవించును గాక.
ప్రార్థన:
కృపాకనికరము గల మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. యేసు ప్రభువా, మాకు ఆనందాన్ని మరియు సమృద్ధిగల జీవమును ఇవ్వడానికి ఈ లోకంలోనికి వచ్చినందుకై నీకు వందనములు. దేవా, మాకు నీ యొక్క సంపూర్ణ సంతోషమును, జీవమును మరియు సమృద్ధిగల జీవమును కలిగించుటకై నీకు స్తుతులు చెల్లించుచున్మా. ప్రభువా, ఇప్పుడు కూడా, నీ జీవజలపు ఊటను మా మీద కుమ్మరించుము. ప్రభువా, మేము నీ పట్ల దాహము కలిగియుండునట్లుగాను మరియు జీవజలపు ఊటలు మాలో ప్రవహించునట్లుగాను మరియు అవి మాలో నుండి పొంగిపొర్లు కృపను దయచేయుము. ప్రభువైన యేసు, మమ్మును నీ యొక్క అభిషేకంతో నింపునట్లుగాను, తద్వారా మేము నీలో ఆనందించునట్లుగాను చేయుము. ప్రభువా, ఇప్పుడు దప్పికగల మాపై నీ యొక్క జీవజలములను కుమ్మరించుము. అవి మా మీద పొంగిపొర్లి ప్రవహించునట్లు చేయుము. దేవా, నీ యొక్క ఆనందపు ఊట మాలో ప్రవహించునట్లుగాను, మాలో నుండి ఉబుకునట్లుగా చేయుము. ప్రభువా, మేము నీ యందు సంతోషించునట్లుగా చేయుము. దేవా, మేము నిత్యము నీలో పాడునట్లుగాను మరియు ఆనందించునట్లుగా చేయుము. ప్రభువా,ఈ క్రిస్మస్ యొక్క నిజమైన ఆనందంతో మమ్మును ఆశీర్వదించి, మా జీవితంలోని మృతమైనవాటన్నిటి నీ శక్తి ద్వారా జీవింపజేయుము మరియు మమ్మును వృద్ధిపరచుము. ప్రభువా, నీ యొక్క ఆనందం మా ద్వారా ఇతరులకు కూడా ప్రవహించునట్లుగా చేయుమని సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుచు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


