నా ప్రియమైన వారలారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 32:41వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, "వారికి మేలు చేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను'' ప్రకారం దేవుడు మీకు మేలు చేయవలెనని మీ పట్ల కోరుచున్నాడు. ఇంకను దేవుడు మీ పట్ల ఎల్లప్పుడు ఆనందించుచున్నాడు అని మీరు జ్ఞాపకముచేసుకోవాలి. మనుష్యులు మీకు శిక్షావిధిని పలికి ఉండవచ్చును. మనుష్యులు ఒకవేళ మిమ్మును నెట్టివేసియుండవచ్చును. ప్రజలు మిమ్మును తప్పుగా నిందారోపణలు చేసి ఉండవచ్చును. ప్రజలు మిమ్మును తప్పుగా అపార్థము చేసుకొని వుండవచ్చును. మీ గురించి మీ స్వంత ఆలోచనలే, 'మీరు తగినవారు కారనియు, మీరు అసమర్థులు' అని చెప్పవచ్చును. కానీ, దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు: 'నా బిడ్డలారా, నేను మిమ్మును బట్టి ఆనందించుచున్నాను. మీరు నన్ను వెదకుతూ వచ్చారు. మాకు సహాయం చేయమని మీరు నన్ను అడిగారు. ఇంకను మీరు మీ జీవితాన్ని నా చేతులలోనికి అప్పగించారు. ప్రభువైన నన్ను వెంబడించాలని నీవు ఎన్నుకున్నావు. కనుకనే, నేను మీ యందు ఆనందించుచున్నాను. అవును, నా బిడ్డలారా, మీరు ఎల్లప్పుడూ నేను అనుగ్రహించు మేలును అనుభవించెదరు, మీరు నిత్యము నా యొక్క మంచితనమును కలిగియుండెదరు,' అని ప్రభువు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. కనుకనే, మీరు ధైర్యంగా ఉండండి.

కానీ నా ప్రియ స్నేహితులారా, మీరు ఇలాగున చెప్పవచ్చును: 'మేము యేసయ్య యెదుట యోగ్యులము కాను. మాలో తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. మేము అపరాధ భావనలు కలిగి ఉన్నాము, మేము తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాము. మేము ప్రభువును అడగకుండా కొన్ని పనులు చేశాము. మేము తగిన రీతిలో ఇతరుల పట్ల జాగ్రత్త వహించలేదు, శ్రద్ధ చూపలేదు' అని మీరు చెప్పవచ్చును. అవును, దేవుని యెదుట మనము పరిపూర్ణులముగా కావాలంటే, మనము ఇలాంటి భయము కలిగి ఉండటం మంచిదే. ఎందుకంటే, ప్రభువు ఇలాగున చెప్పుచున్నాడు: 'పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా ఉండును గాక.' మన వైపు నుండి, మనం ఎప్పుడు కూడా మన బలహీనతలను విశ్లేషించుకుంటూ మరియు ఎల్లప్పుడూ పరిపూర్ణతలోనికి నడవవలసినవారమై ఉన్నాము. మరియు దేవుడు మనకు పరిపూర్ణ జీవితంలోనికి నడవడానికి తన కృపను అనుగ్రహిస్తాడు. కానీ, మనలో లోపాలు ఉన్నప్పుడు లేదా మనలో తగినంత విధానలు లేవని మనము భావించినప్పుడు, తగిన రీతిలో మనము చేయలేమని మనకు అనిపించినప్పుడు, దేవుడు మనలను గురించి ఆనందించడములేదని అర్థం కాదు.

నా ప్రియులారా, అందుకు బదులుగా బైబిలు ఇలాగున చెబుతుంది, "ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించుచూ గానము చేయుచున్నాడు '' ప్రకారం అని తెలియజేయుచున్నది. కనుకనే, ఆయన నిన్నటికి మాత్రమే దేవుడు కాదు. ఆయన ఈనాటికిని దేవుడు. మరియు దేవుడు ఎన్నటికిని మార్పు చెందనివాడు. మీరు మీ ఆత్మను యేసుతో అనుసంధానించిన క్షణం నుండి ఆయన మీ యందు ఆనందించడం ప్రారంభిస్తాడు. మరియు మీ పట్ల ప్రభువు ఎల్లప్పుడు ఆనందించడము మాత్రమే కాకుండా ఆయన బలం ద్వారా మీ బలహీనతలన్నిటి నుండి మిమ్మల్ని బయటకు తీసుకువస్తాడు. మీ యందలి ప్రభువు ఆనందించడం ద్వారా ఆయన తన శక్తితో మీ బంధకముల నుండి మిమ్మును విడిపించి, బయటకు తీసుకుకొని వస్తాడు మరియు మీకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఇంకను మీ యొక్క ప్రతి బలహీనతను అధిగమించే శక్తి మీకు కలుగుతుంది, ఇదంతయు, మీ బలం ద్వారా మాత్రము కాదు, కానీ మీ యందు యేసు ఆనందించడం ద్వారానే ఇదంతయు జరుగుతుంది. మీరు మీ బలహీనత నుండి బయటపడి అన్నిటికంటె అత్యధికముగా విజయమును పొందుకున్నవారుగా ఉంటారు. నా ప్రియులారా, దేవుడు ఈరోజు మీకు అటువంటి కృపను అనుగ్రహించును గాక. మీరు కూడా దేవుని ఆశీర్వాదాలతో నిత్యము ఆనందించెదరు. యేసు మీ యందు ఆనందించుచున్నప్పుడు, ఆయన మీకు మేలు చేయడం ఎన్నటికిని మానడు అని యిర్మీయా 32:40 వ వచనములో సెలవిచ్చుచున్నాడు. మరియు యోహాను 1:16వ వచనములను మనము చదివినట్లయితే, ఒకదాని తర్వాత ఒకటి ఆశీర్వాదాలు మిమ్మును వెంబడిస్తూ ఉంటాయి. అవి మీ యొద్దకు ఈ రోజు వచ్చును గాక. ఈ రోజే ఇటువంటి ఆశీర్వాదం మీ మీదికి కూడా దిగివచ్చి, మిమ్మును ఆనందింపజేయును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
మహాఘనుడవైన మా ప్రియ పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మేము అనర్హులము మరియు బలహీనులము అని భావించినప్పుడు కూడా నీవు మా పట్ల ఆనందించినందుకు మేము నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ప్రభువా, మా వైఫల్యాలను దాటి మమ్మును ప్రేమించినందుకు, మా విరిగిన స్థితిలో అందాన్ని చూసినందుకు మరియు మా జీవితంలో నీ మంచితనాన్ని కుమ్మరించినందుకు నీకు వేలాది వందనాలు చెల్లించుచున్నాము. తండ్రీ, మా అసమర్థతలను, మా విచారాలను మరియు మా లోపాలను నేడు మేము నీ హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. దేవా, నీ యొక్క ఆనందం ద్వారా మమ్మును బలపరచుము. ప్రభువా, మా పట్ల సంతోషించుము మరియు మా పట్ల హర్షించుము. తద్వారా, మేము మా బలహీనతలను అధిగమించి నీ కృప యొక్క సంపూర్ణతలో నడుచుటకు మాకు నీ కనికరమును చూపుము. దేవా, నీవు మా పట్ల వాగ్దానం చేసినట్లుగానే, నీ ఆశీర్వాదాలు ఒకదాని వెంబడి ఒకటి ఎల్లప్పుడు ప్రవహిస్తూనే ఉండునట్లుగా సహాయము చేయుము. ప్రభువా, ఈ రోజు, మేము నీ ప్రేమను పొందుకొనుటకును, మేము నీ యొక్క బలాన్ని పొందుకొనుటకు మరియు నీవు మా పట్ల సంతోషించి ఆనందిస్తావని మేము నమ్ముచూ యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.