నా ప్రియ స్నేహితులారా, నేడు బైబిల్ నుండి యిర్మీయా 15:20వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇచ్చుచున్నాడు. ఆ వచనములో, "అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించెదను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు'' అని చెప్పబడిన ప్రకారముగా నా ప్రియమైన స్నేహితులారా, ఇశ్రాయేలీయుల దేశమునకు ప్రాకారము ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రాకారము చుట్టూర ఒక బలమైన ప్రాకారమును వారు నిర్మించుకుంటారు. యుద్ధము చేయుట కొరకై వస్తున్నటువంటి శత్రువు సైన్యము నుండి కాపాడుకొనుట కొరకు ఒక చక్కటి ప్రాకారమును వారు నిర్మిస్తారు. ఇక్కడ ప్రభువు అంటున్నాడు కదా, 'యిత్తడి ప్రాకారముగా నేను నియమించెదను' అని చెప్పబడినట్లుగానే, సాధారణముగా, రాళ్లతో లేక ఇటుకలతో ఆ ప్రాకారమును వారు నిర్మిస్తారు. కానీ, యిత్తడితో ప్రాకారమును నిర్మించాలంటే, అది ఎంతో ధనముతో కూడుకొనియున్నది. అది సాధ్యపడదు కూడా. ఇక్కడ ప్రభువు ఆధ్యాత్మికమైన ధోరణిలో మాట్లాడుచున్నాడు. ప్రభువు, 'నీవు యిత్తడి ప్రాకారము వలె ఉండెదవు' అని అంటున్నాడు. అవును, నా ప్రియులారా, యిత్తడి ప్రాకారమును ఎవ్వరు కూడా బ్రద్ధలు చేయలేరు. 'మీరు ఎంతో బలమైనవారుగా ఉంటారు, నీకు వ్యతిరేకముగా ఎవ్వరు కూడా నిలువజాలరు' అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కనుకనే, మీరు ధైర్యముగా ఉండండి.

యిర్మీయా భక్తుడుని విలపించే ప్రవక్త అని పిలుస్తుంటారు. ఇశ్రాయేలీయుల ప్రజలు చేసిన పాపములను బట్టి ఆయన విలపించుచుండెను. ఆయన నాశనకరమైన ప్రవచనములను చెబుతుండెను. ప్రజలు అతనిపై ఎంతో కోపముగా ఉండెను. అందుకనే, బైబిల్ నుండి యిర్మీయా 15:18వ వచనములో ఈలాగున మొఱ్ఱపెట్టియున్నాడు, " నా బాధ యేల యెడతెగని దాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందక పోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావులవవుదువా? నిలువని జలములవవుదువా?'' అని అతని ఎంతో బాధను మరియు గాయమును అనుభవించాడు. అతడు ఒక చెరసాలలో పడద్రోయబడియున్నాడు. అతనికి సరైన ఆహారము కూడా ఇవ్వబడలేదు. కారణము, అతడు దేవుని పరిచర్య ను చేయుచున్నాడను ఒక్క కారణము చేత అతడు అనేకమైన శ్రమలను ఎదుర్కొన్నాడు. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 15:6వ వచనములో చూచినట్లయితే, "యెహోవా వాక్కు ఇదే నీవు నన్ను విసర్జించి యున్నావు వెనుక తీసియున్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను; సంతాపపడి పడి నేను విసికియున్నాను'' అని చెప్పబడిన ప్రకారము ఇశ్రాయేలీయుల ప్రజలు వెను తిరుగుతూనే ఉన్నారు. అందుకే ప్రభువు ఇలాగున అంటున్నాడు, " నేను మీ పాపములను బట్టి మిమ్మును నశింపజేయుదును. నేను మిమ్మును వెనుక త్రిప్పడములో అలసిపోయి ఉన్నాను.'' అవును, ఇటువంటి ప్రజలను బట్టి, దేవుడు యిర్మీయాను కూడా శపించియున్నాడు. యిర్మీయా భక్తుడు, 'ప్రభువా, ఇది ఇక చాల య్యా, నేను ముందుకు సాగలేను ' అని చెప్పియున్నాడు. అందుకే దేవుడుం టున్నాడు, "యిత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించెదను;'' అని సెలవిచ్చుచున్నాడు.

అందుకే దేవుడుంటున్నాడు, "యిత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించెదను; నీ మీద యుద్ధము చేయడానికి వారు శత్రువు సైన్యము వలె వస్తారు. కానీ, రక్షణ కలిగియున్న ఒక యిత్తడి ప్రాకారముగా నేను నిన్ను కాపాడుతాను'' అని అంటున్నాడు. యిర్మీయా ప్రవక్తకు ఇది ఒక రక్షణను గురించిన సూచనయై ఉండెను. ఎక్కడికి వెళ్లినను ప్రభువు నాకు తోడుగా ఉంటాడు అని అప్పటి నుండి యిర్మీయా భక్తుడు ధైర్యమును పొందుకున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధియెవరు? ఒకవేళ నా ప్రియులారా, మీరు కూడా అనేక సవాళ్లను మరియు శ్రమలను ఎదుర్కొంటున్నారేమో? దాడుల వెంబడి దాడులను ఎదుర్కొంటున్నారేమో? ప్రజలు మిమ్మును అణగద్రొక్కాలని ప్రయత్నించుచున్నారేమో? మీరు ఎందుకు పనికిరానివారు అని అంటున్నారేమో? ప్రజలు మిమ్మును నిరుత్సాహపరుస్తున్నారేమో? అయితే, ధైర్యమునొంది, బలముగా నిలిచి ఉండండి. నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు ప్రభువు వాక్యము మీ యొద్దకు వచ్చుచున్నది. ప్రభువు మిమ్మును యిత్తడి ప్రాకారముగా చేయబోవుచున్నాడు. ప్రజలు మీకు వ్యతిరేకంగా పోరాడుచున్నారేమో? కానీ, మిమ్మును ఏదియు కూడా తాకజాలదు. ధైర్యముగా ఉండండి, ప్రభువే మిమ్మును కాపాడుతాడు, ప్రభువే మిమ్మును విడిపించి, రక్షిస్తాడు. కనుకనే, నా ప్రియులారా, మీరు ధైర్యముగా ఉండండి, ముందుకు సాగండి. ప్రభువు మిమ్మును నేటి వాగ్దానము ద్వారా దీవించును గాక.

ప్రార్థన:
ప్రేమగల పరలోకమందున్న మా తండ్రీ, ఈరోజు నేను నీ వాగ్దానాన్ని నమ్మి నీ ముందుకు వస్తున్నాను. ప్రభువైన యేసయ్యా, మా బాధ యేల యెడతెగని దాయెను? మా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందక పోనేల? నిశ్చయముగా నీవు మాకు ఎండమావులవవుదువా? నిలువని జలములవవుదువా? అని భక్తుని వలె మొఱ్ఱపెట్టుచున్న మా బాధను మేము భరించలేకపోవుచున్నాము. దేవా, మా మొఱ్ఱను నేడు నీవు ఆలకించి, నీ బలమైన ఆత్మ శక్తి మా మీదికి బలముగా దిగివచ్చునట్లుగా చేయుము. దేవా, మమ్మును ఏదియు కూడా అణగద్రొక్కకుండా చేయుము. ప్రభువా, మా జీవితములో నిరుత్సాహము మరియు ఓటమి, నిరాశ ఇక ఉండకుండ చేయము. దేవా, నీ బిడ్డలైన మమ్మును ఏదియు కూడా బాధపరచకుండా, నీవు మా చుట్టు యిత్తడి ప్రాకారముగా ఉండి, మమ్మును బలపరచుము. ప్రభువా, నీ సన్నిధిలో మేము ఎంతో భద్రముగా ఉన్నావన్న నమ్మకమును మాకు అనుగ్రహించుము. దేవా, మా పక్షమున నీవు నిలబడి, మాకు తోడుగా ఉండి పోరాడుము. ప్రభువా, నీ మా పక్షముగా ఉండి, విజయము వెంబడి విజయమును మాకు అనుగ్రహించుము. దేవా, మేము ఎదుర్కొంటున్న అవమానమునంతటిని మాకు ఘనతగా మార్చి, మేము ఎంత మాత్రము నిరుత్సాహము చెందకుండా, రెండంతలుగా ఘనతను మరియు విజయమును అనుగ్రహించుము. దేవా, మా మీద మహిమయును, ఘనతను ఒక కిరీటముగా ఉంచుము. ప్రభువా, యుద్ధాలు మా మీద దాడి చేయుచు సైన్యంలా తలెత్తినప్పుడు, మమ్మును యిత్తడి ప్రాకారమువలె బలంగా చేయుము. దేవా, ప్రజలు మమ్మును నిరుత్సాహపరచినప్పుడు మరియు మాకు విరోధముగా మాట్లాడినప్పుడు మాకు ధైర్యమును అనుగ్రహించుము. ప్రభువా, మేము బలహీనంగా, అలసిపోయినప్పుడు లేదా విసర్జించబడినప్పుడు మా హృదయాన్ని బలపరచుము. దేవా, యిర్మీయాను అతని బాధలో నీవు బలపరచినట్లుగానే, ఈరోజు మమ్మును బలపరచుము. ప్రభువా, మేము స్థిరంగా నిలబడటానికి మరియు నీవు ఎల్లప్పుడూ మాతో ఉన్నావని నమ్మడానికి మాకు సహాయం చేయుము. దేవా, మేము ఎదుర్కొంటున్న ప్రతి దాడి నుండి మమ్మును కాపాడి, ప్రతి బాధ నుండి మమ్మును రక్షించుమని యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.