నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి యిర్మీయా 32:27వ వచనమును ధ్యానించబోవుచున్నాము. ఆ వచనము, "నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదేదైన నుండునా?'' అని చెప్పబడినట్లుగానే, ప్రభువు, మిమ్మును చూచి, " నాకు అసాధ్యమైనదేదైన ఉండునా? '' అని ఈ ప్రశ్న అడుగుచున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, బైబిల్ నుండి యిర్మీయా 32:17వ వచనములో కూడా ఈలాగున అడుగుచున్నాడు, "యెహోవా, ప్రభువా సైన్యములకధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహా దేవా, నీ యధికబలముచేతను చాచిన బాహువుచేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు'' అని చెప్పబడిన ప్రకారము ఆయన వాటిని ఏ విధంగా సృజించాడు? అని మనము చూచినట్లయితే, యధికబలముచేతను చాచిన బాహువుచేతను ఆయన దానిని సృజించియున్నాడు. కనుకనే, నా ప్రియులారా, ఆయనకు అసాధ్యమంటూ ఏదియు కూడా లేదు. అందుకనే, బైబిల్ నుండి యోబు గ్రంధము నుండి 42:2వ వచనములో చూచినట్లయితే, " నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని'' అని యోబు భక్తుడు చెప్పియున్నట్లుగానే, దేవుడు ఉద్దేశించినది ఏదియు కూడా నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకున్నాను అని భక్తుడు అంటున్నాడు. ఆలాగుననే, ' మా జీవితములో అస్సలు ఈ కార్యము జరుగుతుందా? ' అని తలంచవచ్చును. ఇది జరగదు, ఇది అస్సలు అసాధ్యము అని అనవచ్చును. ఈ మనిషి చాలా మొండిగా మరి యు ఎంతో మూర్ఖముగా ఉన్నాడు అని చెప్పవచ్చును. ఈ దురాత్మ ఎంతో బలముగా ఉన్నది అని మీరు అనవచ్చును. ఈ దురాత్మ ఎంతో బలముగా మా మీదికి వచ్చి, మమ్మును ఎంతో వేదించుచూ కష్టపెట్టుచున్నది? అని చెప్పవచ్చును. ఈ కార్యము మా జీవితములో ఇక సాధ్యము కాదు అని చెప్పవచ్చును. మా జీవితములో ఇక ఎప్పటికి అసాధ్యపడదు అని అంటుండవచ్చును. అయితే, ప్రభువు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు: " నేను చేయడానికి మరీ కష్టమైనది ఏమైనా ఉండునా?'' అని అంటున్నాడు.
అందుకే బైబిల్ నుండి మార్కు 10:27వ వచనములో చూచినట్లయితే, "యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను'' అని యేసు ప్రభువు ఈలాగున సెలవిచ్చియున్నాడు. అయితే, మనుష్యుల వలన ఇది అసాధ్యము. అయితే, దేవునికి సమస్తమును సాధ్యమే. అవును, దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పెను. మనము మనుష్యులము మాత్రమే. మనకు అది నమ్మడము అసాధ్యము అనిపించవచ్చును. అందుకు ఆయన, 'మనుష్యులకు ఇది అసాధ్యము కానీ, నేను దేవుడనై యున్నాను. ఈ భూమిపైన మరియు పరలోకమందు, పరలోకమందును మరియు ఈ భూమి క్రింద నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది, నేను సమస్తమును చేయగలను' అని వాగ్దానము చేసియున్నాడు. అవును, నా ప్రియ స్నేహితులారా, మా తల్లిగారు 40 సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు తాను గర్భము ధరించెను. ఆలాగున జరుగుట వలన తనను తాను అస్సలు నమ్మలేకపోయెను. తనలో తాను ఎంతగానో నవ్వుకున్నారు, ఇది బిడ్డకాదు అని తనలో తాను తలంచుకున్నారు. అయితే, వైద్యుల యొద్దకు వెళ్లి పరీక్ష చేయించుకున్నప్పుడు, వైద్యులు కూడా నమ్మలేకపోయారు. వారు పరీక్షించి ఈలాగున చెప్పారు, 'మీ గర్భ సంచిలో ఏదో ఒక కణితివలె ఉన్నది' అన్నారు. కానీ, ఒక నెల గడిచిపోయినది. ఇంకను రెండు నెలల గడిచిపోయిన తర్వాత, 3వ నెలలో చూచినట్లయితే, తన గర్భము పెద్దదిగా పెరుగుచుండెను. ఆమె మరల హాస్పిటల్‌కు వెళ్లి వైద్యుల యొద్ద వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అందరికి ఆశ్చర్యము కలిగించునంతగా, 'మీరు గర్భము ధరించారు' అని చెప్పారు. మా తల్లిగారు దానిని జీర్ణించుకోలేకపోయారు. కానీ, మా తల్లిగారు, అందును బట్టి, దేవుని స్తుతించి, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశా రు. అప్పుడు నాకు 12 సంవత్సరముల వయస్సు, నాకు ఒక చిన్న తమ్ముడు కానీ, లేక చెల్లి పుట్టబోవుచున్నారు అని ఎంతో సంతోషముగా చెప్పాను. ఆ రాత్రి మేమందరము కుటుంబముగా కలిసి దేవుని స్తుతించా ము. ఇప్పుడు మా చిన్న తమ్ముడు మాతో కూడా పరిచర్యలో పాల్గొనుచున్నాడు. ఇది ఎంత ఆశీర్వాదకరముగా ఉన్నది కదా!
బైబిల్‌లో చూచినట్లయితే, శారా కూడా 90 సంవత్సరముల వయస్సు ఉన్నప్పుడు, తాను కూడా గర్భము దాల్చినది. నీవు గర్భము దాల్చబోవుచున్నావు అని దేవుని వాక్కు తన యొద్దకు వచ్చినప్పుడు, తనను తాను అస్సలు నమ్మలేకపోయినది. నవ్వుతూ ఆలాగున చెప్పెను. అందుకే బైబిల్ నుండి ఆదికాండము 18:13వ వచనములో చూచినట్లయితే, " శారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా? అని తనలో తాను అనుకొనెను.' కానీ, ఆ తదుపరి వచనములో, అనగా, ఆదికాండము 18:14వ వచనములో చూచినట్లయితే, దేవదూత, ' శారా నవ్వనేల? యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును'' అని సెలవిచ్చెను. ఆ విధంగానే జరిగియున్నది. సంవత్సరము తర్వాత శారా, ఇస్సాకు అను ఒక కుమారునికి జన్మనిచ్చెను. నా ప్రియులారా, అవును, 'దేవునికి అసాధ్యమైనదంటూ ఏదియు లేదు. మన దేవుడు లేనివాటి సహితము ఉన్నవాటినిగా పిలుచు గొప్ప దేవుడై యున్నాడు. ఒకవేళ మీరు, 'నాకు ఇక ఇది జరగనే జరగదు' అని చెప్పకండి. మీరు ఎదురు చూచుచున్న అద్భుతములన్నియు కూడా నిశ్చయముగా జరుగుతాయి. ఆలాగుననే, యేసయ్యా, లాజరును మరణము నుండి తిరిగి బ్రతికించడానికి ముందుగా, మరియ మార్తలు వారి సహోదరుడైన లాజరు తిరిగి జీవిస్తాడు అని వారిద్దరు నమ్మకలేపోయారు. అయితే, యేసు ప్రభువు మార్తతో ఈలాగున చెప్పియున్నాడు, "అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును'' అని చెప్పెను. అవును నా ప్రియ స్నేహితులారా, మనము దేవుని నమ్మడము ప్రారంభిద్దామా? 'ప్రభువా, మా జీవితములో నీవు అన్నిటిని చేయగలవని మేము నమ్ముచున్నాము' అని చెప్పినప్పుడు, మీరు ప్రభువును ఏదైతే, అడుగుతారో, అవి నిశ్చయముగా జరుగుతాయి. నా ప్రియ స్నేహితులారా, ప్రభువుతో ఈ విధంగా చెప్పినప్పుడు, ప్రభువు మీకు సహాయము చేసి, మీలో ఉన్న అప్పనమ్మకమంతటిని తొలగిస్తాడు. 'నాకు అసాధ్యమైనదేదైన నుండునా?' అని ప్రభువు మరల మిమ్మును అదే ప్రశ్న అడుగుచున్నాడు. అయితే, ప్రభువు మీరు ఏదైతే, అడుగుచున్నారో అది నిశ్చయముగా జరుగుతుంది, మీరు విశ్వసించుచూనే ఉండండి. పరలోకపు తలుపులను తడుతూనే ఉండండి. అప్పుడు ద్వారములు మీకు తెరచుకుంటాయి. పరలోకపు ద్వారములు తెరచుకుంటాయి. నా ప్రియులారా, ఈ రోజే అది మీకు జరుగబోవుచున్నది. కనుకనే, ప్రభువు అడుగుదామా? ప్రభువును మీరు మహిమపరచినట్లయితే, ఆయన మిమ్మును ఘనపరచును గాక. కనుకనే, నేటి వాగ్దానము నుండి ప్రభువు మిమ్మును ఆశీర్వదించును గాక.
ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. ప్రభువా, మా జీవితములో అన్నిటిని చేయగలవలని నమ్ముచున్నాము. తండ్రీ, నీవు ఇచ్చిన మాట చొప్పున మా జీవితములో అది జరుగునట్లుగా చేయుము. దేవా, మనుష్యుల వలన ఇది అసాధ్యము కానీ, నీ వలన సమస్తము సాధ్యము అని నమ్ముచున్నాము. ప్రభువా, మేము ఏదైతే, అడుగుచున్నామో, వాటన్నిటిని ఇప్పుడే మాకు దయచేయుము. పరలోకపు తండ్రీ, నీవు సకల మానవాళికి దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీయు లేదు. కాబట్టి, మా సందేహాలను, మరియు ఇది అసాధ్యం అని మేము అనుకున్న ప్రతి క్షణమును మమ్మును క్షమించి, మా పట్ల అద్భుత కార్యములను జరిగించుము. ప్రభువా, ఈ రోజు, మా జీవితంలోని సమస్తాన్ని నీవు చేయగలవని నమ్మాలని మేము ఎంచుకొనుటకు మాకు నీ కృపను దయచేయుము. యేసయ్యా, మా విశ్వాసాన్ని బలపరచి, మాలోని ప్రతి భయమును తొలగించుము. ప్రభువా, నీ చిత్తానుసారంగా మూయబడిన ప్రతి తలుపు తెరుచుకొనునట్లుగా మాకు సహాయము చేయుము. ఇంకను దేవా, మాకు అద్భుతమైన భవిష్యత్తు దయచేసి మేము ఎదురుచూస్తున్న కార్యములను మా పట్ల జరిగించి, మాకు సంబంధించిన వాటన్నిటిని పరిపూర్ణం చేయుము. యేసయ్యా, మాకు అసాధ్యం అనిపించుచున్న ప్రతి కార్యము నీ ద్వారా సాధ్యమవుతుందని మేము నమ్మునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుమని ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


