నా ప్రియమైన స్నేహితులారా, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి ఎఫెసీయులకు 1:3వ వచనమును తీసుకొనబడినది. ఆ వచనము, " మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదము ను మనకనుగ్రహించెను'' అని చెప్పబడిన ప్రకారము ప్రభువు ఇహలోకపరమైన ఆశీర్వాదములను మనకు ఇవ్వడు కానీ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను మనకు ఇచ్చుటలో ఆయన ఎంతో సంతోషపడతాడు. అదియు కూడా పరలోకసంబంధమైన అన్ని ఆశీర్వాదములన్నిటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కనుకనే, శ్రేష్ఠమైన ప్రతి యావియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును; '' అని చెప్పబడిన ప్రకారము ప్రభువు మనకు ఏదైనా ఇచ్చినప్పుడు, అది శ్రేష్టముగాను మరియు సంపూర్ణముగాను ఉంటుంది. ఎందుకనగా, ఆయన సంపూర్ణుడైన దేవుడుగా యున్నాడు. ఆయన లోకపరమైన దీవెనల చేత మాత్రమే కాదు గానీ, మనము సంపూర్ణులమై ఉండునట్లుగా, ఆయన ఆధ్యాత్మిక ఆశీర్వాదములను కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు. మన దేవుడు సమృద్ధి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుకనే, ఆయన సమృద్ధిలో నుండి మనము కృప వెంబడి కృపను పొందుకొనుచున్నాము. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 9:8వ వచనములో చూచినట్లయితే, " మరియు అన్నిటియందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వసమృద్ధిగలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయ గలడు'' అని చెప్పబడిన ప్రకారము ప్రతి మంచి విషయములలోను, అన్ని విషయములలోను, ఇంకను మనకు కావలసిన వాటన్నిటిలోను, ప్రభువు తన మంచితనముతో మనలను నింపుతాడు. మనము ఆయన వలె మారాలనియు మరియు మహిమ నుండి మహిమకు వెళ్లాలని ఆయన మన పట్ల కోరుకుంటున్నాడు.

నా ప్రియులారా, ఆయన మహిమ నుండి మహికు మారుట మాత్రమే కాదు, ఆయన తన స్వరూపములోనికి మనలను రూపాంతరపరచుచున్నాడు. నిత్యము విస్తరించే మహిమలో మనలను రూపాంతరపరుస్తాడు. ఇది కూడా ప్రభువు యొద్ద నుండి మనకు కలుగుతుంది. నా ప్రియులారా, క్రీస్తునందు మాత్రమే మన గుర్తింపు ఉన్నది. మీరు ఒక ఇవాంజెలిన్ వలన మాత్రమే కాదు, గానీ, క్రీస్తులో ఉన్న ఇవాంజెలిన్ వలె మీరు మార్చబడతారు. మీరు ఒంటరిగా లేరు నా ప్రియులారా, మీరు క్రీస్తుతో కూడా ఉన్నారు, మీరు క్రీస్తు సంపూర్ణతలో ఉన్నారు. అందుకే యోహాను 15:5వ వచనములో చూచినట్లయితే, "ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు '' అని ప్రభువైన యేసు అంటున్నాడు. అవును, ఆయన నామమును మన యందు ఉంచుతాడు. అంతమాత్రమే కాదు, మనలను ఆయన ముద్రించుచున్నాడు. అందుకే బైబిల్ నుండి 2 కొరింథీయులకు 1:22వ వచనములో చూచినట్లయితే, "ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు'' అని చెప్పబడిన ప్రకారము మనము ఆయనవారమని ప్రభువు తన ముద్రను మన మీద ఉంచుచున్నాడు. మీ యందు దేవుని నామమును మీరు కలిగి ఉన్నట్లయితే, మీరు సమస్తమును చేయగలుగుతారు. మీరు ఎంతో విజయవంతులుగా జీవించగలుగుతారు.

అదే రీతిగా, కారుణ్య విశ్వవిద్యాలయములో చదివినటువంటి వారు పూర్వపు విద్యార్థులు ఈ విధంగా సాక్ష్యమును చెబుతుంటారు. వారు ఎక్కడకు వెళ్లినను గానీ, ప్రజలు వారిని చూచినప్పుడు, మీలో ఏదో విశిష్టత ఉన్నదని చెబుతూ ఉంటారు. ఇంకను మీ మీద ఒక విశేషమైన కృప ఉన్నట్లుగా మేము చూడగలుగుచున్నాము అని అంటుంటారు. మరి ముఖ్యముగా వారి పని స్థలములలో వారి పై అధికారులు ఈ విధంగా సాక్ష్యము వారిని గురించి చెబుతూ ఉంటారు, 'మీరు ఏ పని చేసినను, ప్రభువు దానిని ఆశీర్వదించుచున్నాడు, మీలో ఏదో ఒక విశిష్టత ఉన్నది. ఆ ప్రాముఖ్యత ఏమిటి? అని చెప్పేవారు.' ఆ ప్రాముఖ్యత ఏమిటి? అని మనము చూచినట్లయితే, అది క్రీస్తునందు వారు కలిగియుంటున్న ఒక గుర్తింపు. కారుణ్య విశ్వవిద్యాలయములో చదువుచున్న విద్యార్థులను గురించి మా తండ్రిగారైన డాక్టర్. డి.జి.యస్. దినకరన్‌గారు, ఈ విధంగా ప్రార్థన చేసేవారు. వారు ఉత్తర్ణీత పొంది బయటకు వెళ్లిపోయే నాల్గవ సంవత్సరపు విద్యార్థులను గురించి ఆయన ప్రార్థించిన ప్రతి సారి కూడా ఆయన ఈ విధంగా ప్రార్థించేవారు, ' ప్రభువా, ఈ బిడ్డలందరిని కూడా ఒక ప్రత్యేకమైన కృపతో దీవించమని అడుగుచున్నాను, వారు ఈ లోకపరంగా ఆశీర్వదింపబడుట మాత్రమే కాదు, వారు ఆధ్యాత్మికంగా కూడా ఆశీర్వదింపబడాలనియు, ప్రభువా, ఈ విద్యార్థిని మరియు విద్యార్థులందరిని కూడా ప్రత్యేకమైన కృపలతో నింపుము' అని మా తండ్రిగారు ఆ విధంగా వారందరి కొరకు ప్రార్థించేవారు. మన తండ్రిగారు చేసినటువంటి ఆ ప్రార్థనల మూలముగా ఈ విద్యార్థులందరు అదేవిధముగా ఈ రోజు ఆశీర్వదింపబడియున్నారు. అవును, నా ప్రియులారా, మన దేవుని హృదయము కూడా అదేనండి. ఆయన, 'నా బిడ్డలందరిని, పరలోకపరమైన ఆశీర్వదములన్నిటితో నేను దీవించెదను ' అని అంటున్నాడు. అవును, మన పరలోకపు తండ్రి యొక్క హృదయము ఇదియే అయి యున్నది. ఆయన, ' పరలోకపు దీవెనలతోను మరియు ఇహలోకసంబంధమైన దీవెనలతో నా బిడ్డలనందరిని కూడా దీవిస్తానని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.' యాకోబు తన కుమారుడైన యోసేపును దీవించినప్పుడు, ఒక చక్కని ప్రార్థన చేశాడు. ఆలాగుననే, లోకపరమైన ఆశీర్వాదములు మరియు పరలోకపరమైన ఆశీర్వాదములు ఈ రోజు మీ మీదికి దిగివచ్చును గాక. ఇంకను ప్రభువు యొక్క సమృద్ధియైన ఆశీర్వాదములు మీ మీదికి వచ్చినవని నేను నమ్ముచున్నాను. ఆలాగుననే, ఇతరులకు మీరు సాక్షులుగా జీవించునట్లుగాను, ప్రభువు మిమ్మును బలంగా వాడుకొనును గాక. నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించును గాక.

ప్రార్థన:
కృపగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడినందుకై నీకు వందనములు. దేవా, మా మీదికి అట్టి ఆశీర్వాదములు వచ్చునట్లుగా చేయుము. ప్రభువా, పరలోకపరమైన దీవెనలన్నియు కూడా మా మీదికి దిగివచ్చునుట్లగా చేయుము. దేవా, పరలోక స్థలములో మమ్మును కూర్చుండబెట్టుము. యేసయ్యా, నిన్ను మరియు నీ యొక్క పునరుత్థానపు శక్తిని నేను తెలుసుకోవాలి అని పౌలు భక్తుడు ప్రార్థించినట్లుగానే, నిన్ను గురించి మేము సమస్తమును తెలుసుకొనుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, క్రీస్తులో ప్రతి ఆధ్యాత్మిక ఆశీర్వాదంతో మమ్మును ఆశీర్వదించినందుకై నీకు వందనము. దేవా, మమ్మును నీ సమృద్ధితో నింపుము మరియు ఒకదాని తర్వాత ఒకటి కృపను అనుగ్రహించుము. ప్రభువా, నీ నామమును మరియు నీ యాజమాన్య ముద్రను మా మీద ఉంచుము. దేవా, నీ ప్రత్యేక కృప మా జీవితంలో ప్రత్యక్షపరచుము. తండ్రీ, పరలోక మరియు భూసంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మును ఆశీర్వదించి, ప్రతి మంచి పనిలో మేము సమృద్ధిగా ఉండుటకు మాకు సహాయం చేయుము. దేవా, పరలోకసంబంధమైన మర్మములను మాకు బయలుపరచి, నీ కొరకు ప్రవక్తిని ప్రవక్తలు వాడబడునట్లుగా మమ్మును మేము నీకు సమర్పించుకొనుచున్నాము. దేవా, మేము మాట్లాడు ప్రతి మాట ఇతరులకు జీవమును తీసుకొని వచ్చునట్లుగా కృపను దయచేయుము. దేవా, ఈ లోకములో మాకున్న గుర్తింపును మార్చివేయుము. ప్రభువైన యేసుక్రీస్తునందు మాకు నిజమైన గుర్తింపును మాకు దయచేయుము. దేవా, నీ యొక్క సమృద్ధియైన ఆశీర్వాదములతో మమ్మును ఆశీర్వదించుము, మహిమ వెంబడి మహిమతో మమ్మును దీవించుము. ప్రభువా, పరలోక సంబంధమైన ఐశ్వర్యము మా మీద కుమ్మరించబడునట్లుగా చేయుమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.