నా ప్రియమైన స్నేహితులారా, అనేకసార్లు, మనం గొప్ప ఎదురు చూపులతో ప్రణాళికలు వేసుకుంటాము. అది మన పని, మన కుటుంబం, మన చదువులు లేదా మన భవిష్యత్తు కొరకైన ప్రణాళికలు వేసుకుంటాము. అయినప్పటికిని, నేటి వాగ్దానముగా బైబిల్ నుండి సామెతలు 16:9వ వచనము మనకు గుర్తు చేయుచున్నది. ఆ వచనము, " ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును'' అని చెప్పబడిన ప్రకారము మనం ఎంత జాగ్రత్తగా ప్రణాళిక వేసుకున్నను సరే, దేవుని సంకల్పం మాత్రమే స్థిరంగా నిలిచి ఉంటుంది. అందుకే సామెతలు 16:3 ఇలాగున చెబుతుంది, " నీ పనుల భారము యెహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును'' ప్రకారము దీనికి అర్థం మీరు ఏదైనా ప్రారంభించే ముందు - మీ కుటుంబానికి వంట చేయడం లేదా పని నిమిత్తము బయటకు వెళ్లడం వంటి అతి చిన్న చిన్న కార్యములైనను సరే, - దానిని ముందు ప్రార్థనలో ప్రభువుకు సమర్పించండి, ' ప్రభువా, ఇది నీకు చెందినదే' అని చెప్పండి. మీరు అలాగున చేసినప్పుడు, దేవుడు మీ విజయానికి బాధ్యత వహిస్తాడు. ఆయన మీ ఆలోచనలను, మీ సమయాన్ని మరియు మీ చర్యలను తన దైవిక ప్రణాళికతో ఏకం చేస్తాడు. మరియు ఆయన ఏదైనా స్థాపించినప్పుడు, ఏ వ్యక్తులు లేదా పరిస్థితు
నా ప్రియులారా, మనం మన ప్రణాళికలను నిజంగా దేవునికి అప్పగించినప్పుడు, సమాధానము మన హృదయాలను నింపుతుంది. అందుకు ప్రతిఫలం ఆయన చేతులలో ఉన్నదని మనకు తెలుసు. కాబట్టి, దాని గురించి చింతించడం మానేస్తాము. అందుకే బైబిల్ నుండి యిర్మీయా 29:11 వ వచనములో ఇలాగున చెబుతుంది, " నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు'' ప్రకారము కొన్నిసార్లు, మనం ఆందోళన చెందుతాము - నా ప్రాజెక్ట్ విజయవంతమవుతుందా? నా చదువులు చక్కగా ముందుకు సాగుతాయా? నా ప్రయత్నాలు ఘనపరచబడతాయా? కానీ ప్రభువు ఇలాగున అంటున్నాడు, 'చింతించకండి. నాకు ప్రారంభము నుండి ముగింపు తెలుసు'' కనుకనే, మీరు దేవునికి సమస్తమును సమర్పించినప్పుడు, మీరు వండే ఆహారం, మీరు మాట్లాడే మాటలు, మీరు ఖర్చు చేసే డబ్బు వంటి చిన్న చిన్న కార్యాల వివరాలను కూడా - ఆయన వాటన్నింటిని ఆశీర్వదిస్తాడు. అందుకే బైబిల్ నుండి ప్రసంగి 3:11వ వచనములో ఇలాగున చెబుతుంది, " దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు గాని
కాబట్టి, ప్రియమైన దేవుని బిడ్డాలారా, మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆయనకు సమర్పించడం అలవాటు చేసుకోవాలి. ఇంకను మీరు పని ప్రారంభించే ముందు, ప్రార్థన చేయండి. మీరు చదువుటకు ముందు, ప్రార్థన చేయండి. మీరు ప్రయాణించే ముందు లేదా నిర్ణయాలు తీసుకునే ముందు, 'ప్రభువా, నేను దీనిని నీకు సమర్పించుచున్నాను' అని చెప్పండి. ఆలాగుననే, కీర్తనలు 20:4 లో బైబిలు ఇలా చెబుతుంది: " నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక'' చెప్పబడిన ప్రకారము మీరు ఈ విశ్వాసంతో నడిచినప్పుడు, మీరు దేవుని దృష్టిలో మరియు మానవుల దృష్టిలో దైవిక అనుగ్రహాన్ని పొందుతారు. అందుకే బైబిల్ నుండి సామెతలు 3:4-5వ వచనములలో చూచినట్లయితే, "నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును'' ప్రకారము దేవుడు తానే మీ జీవితం ద్వారా తన నామాన్ని మహిమపరుచునట్లు చేస్తాడు. అందుకే బైబిల్ నుండి కొలొస్సయులకు 3:23వ వచనములో చూచినట్లయితే, ప్రతి ఉద్దేశము వెనుక ఆనందం, సమాధానము మరియు కృతజ్ఞతలను తీసుకొని వస్తుంది అని గుర్తుంచుకోండి. కనుకనే, నా ప్రియులారా, ఆయన
ప్రార్థన:
ప్రేమగల మా పరలోకమందున్న తండ్రీ, నేటి వాగ్దానము నుండి మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు. దేవా, మా ప్రణాళికలన్నింటికి నీవు కర్తగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, మా యొక్క ప్రతి పనిని, ప్రతి ఆలోచనను మరియు ప్రతి కలను నీకు అప్పగించునట్లుగా మాకు నేర్పించుము. దేవా, మా అడుగుజాడలను నియంత్రించి, నీ పరిపూర్ణ చిత్తంలో మమ్మును నడిపించుము. ప్రభువా, మా హృదయములో ఉన్న భయములన్నిటి నుండి ఆందోళనలు మరియు సందేహాలను తొలగించుము. దేవా, మేము చేయు ప్రతి పని నీ నామానికి మహిమ తీసుకొని వచ్చునట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. ప్రభువా, మా పనికి ప్రతిగా ప్రతిఫలం దయచేయుము మరియు మా చేతుల కష్టార్జితమును ఆశీర్వదించుము. దేవా, నీ నీతి మరియు జ్ఞానంలో మా ప్రణాళికలను స్థాపించుము. ప్రభువా, నీ ఆనందము మరియు కృపను మా మీద మరియు మా కుటుంబము మీద ఉండునట్లుగా చేయుము. ఓ ప్రభువా, మా కోరికలన్నిటిని నీ చిత్తంతో సరిచేసి, మా జీవితములో నీ యొక్క ప్రణాళికలను నెరవేర్చుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్.

దేవుని రాజ్యాన్ని నిర్మించుటలో మాతో చేతులు కలపండి
Donate Now


